NMMS MODEL GUESS PAPER 01 NMMS MODEL GUESS PAPER 01 HOW TO ATTEMPT AP NMMS…
*♦️టీచర్లకు వర్క్ అడ్జస్ట్‌మెంట్ వేదింపులు*
*♦️ఒత్తిళ్లు తేవద్దంటున్న విద్యాధికారులు*
*♦️వీటికంటే బదిలీలే బెటరంటున్న ఉపాధ్యాయులు*
*🌻ఏలూరు ఎడ్యుకేషన్, డిసెంబరు 6 :* బోధ నేతర విధులు, పలు యాప్‌లు, సకా లంలో జీతాలు ఇవ్వకుండా ఇప్పటికే టీచ ర్లను ప్రభుత్వం వేధిస్తోందంటూ క్షేత్రస్థాయిలో అభ్యంతరాలు తీవ్రమవుతున్న వేళ విద్యాశాఖ చేపట్టిన వర్క్ అడ్జస్ట్‌మెంట్ (పని సర్దుబాటు) తీరు ఉపాధ్యాయులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. నెలలకాలంగా బదిలీల గురించి ఎదురు చూస్తోన్న వేళ వాటిని పక్కనబెట్టి వర్క్ అడ్జస్ట్‌మెంట్ చేపట్టి, అశాస్త్రీయంగా టీచర్లను సుదూర ప్రాంతాలకు బలవంతంగా పంపించడంపై ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తొలుత జిల్లాల పునర్విభజన ప్రాతిపదికన నిర్వహించిన పని సర్దుబాటును, మంగళవారం జిల్లాలకు పంపిన సమాచారం ప్రకారం పాత ఉమ్మడి జిల్లాను ప్రామాణికంగా తీసుకుని వర్క్ అడ్జస్ట్‌మెంట్‌ను చేపట్టాలని సూచించడంతో అంతా గందరగోళంగా తయారైంది. ఇంతకుముందు చేపట్టిన వర్క్ అడ్జస్ట్‌మెంట్ ప్రకారం ఏలూరు జిల్లాలో అన్నికేడర్లలో మొత్తం 312 మంది ఉపాధ్యాయులను సర్‌ప్లస్ (మిగులు)గా గుర్తించి, కొరత వున్న పాఠశాలలకు సర్దుబాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. వీరిలో 188 మంది ఎస్జీటీలు ఉన్నారు. వీరిలో పలువురు ఇప్పటికే తమకు కేటాయించిన స్థానాల్లో డిప్యూటేషన్లపై విధుల్లో చేరిపోగా, ఇపుడు వెలువడిన నిర్ణయం మేరకు ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన సర్దుబాటు చేస్తే వీరిస్థానాలు మళ్లీ మారిపోయే అవకాశాలున్నట్టు చెబుతున్నారు, ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకే వర్క్ అడ్జస్ట్‌మెంట్ చేసినట్టు విద్యాశాఖ వర్గాలు చెబుతుండగా, సర్వీస్ రూల్స్ నియమాలకు విరుద్దంగా టీచర్లను అడ్డగోలుగా సుదూర ప్రాంతాలకు, యాజ మాన్యాలను మార్చి సైతం చేసేశారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ సమస్య ఇప్పటికీ పరిష్కారం కాకుండానే కొత్తగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాను ప్రామాణికంగా తీసుకుని సర్‌ప్లస్ టీచర్లను గుర్తించి నూతన విద్యావిదానం నిబంధనల మేరకు ఏర్పాటైన పాఠశాలలకు ఈ నెల 8వ తేదీలోగా సర్దుబాటు చేయాలని సూచనలు వెలు వడ్డాయి. ఈ మొత్తం ప్రక్రియను పూర్తిచేసేకంటే బదిలీలు నిర్వ హించడమే మేలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏలూరు జిల్లాలో వర్క్ అడ్జస్ట్‌మెంట్ అశాస్త్రీయంగా నిర్వహిం చారంటూ సోమవారం యూటీఎఫ్ ఆధ్వర్యంలో డీఈవో కార్యా లయం వద్ద మెరుపు ముట్టడి, ధర్నాలను నిర్వహించగా, అదే కోవలో ఇపుడు ఎస్టీయూ ఉపాధా్యాయ సంఘం కూడా ఆందోళనను చేపట్టనుంది.
*♦️పదోన్నతులు తీసుకున్నవారికి స్థానాలు కేటాయిస్తే పరిష్కారమైనట్టే*
*▪️ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ*
రెండు నెలలక్రితం టీచర్లకు పదోన్నతులు ఇచ్చేందుకు అంగీకార పత్రాలను విద్యాశాఖ తీసుకుంది. వారికి ఇంతవరకు బదిలీ స్థానాలను కేటాయించలేదు. ఇపుడు వారందరికీ స్థానాలను కేటాయిస్తే వర్క్ అడ్జస్ట్‌మెంట్ అవసరమే ఉండదు. అలాగే రేషనలైజేషన్ జీవో 117కు సవరణ చేసి అమలు చేసినట్టయితే పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత సమస్య తలెత్తదు. వర్క్ అడ్జస్ట్‌మెంట్‌ను ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన చేయాలని నిర్ణయించడం ఆహ్వానించతగినదే.
*♦️బాధ్యతల నుంచి తప్పుకుంటా..*
‘టీచర్ల వర్క్ అడ్జస్ట్‌మెంట్ జీవోలు ఇచ్చేది మీ ప్రభుత్వమే. వాటిని అమలు చేస్తుంటే ఫలానా వారిని అక్కడే ఉంచండి. కదపొద్దు..అని చెప్పేదీ మీరే. ఇలాగైతే ఎలా ముందుకు సాగేది ?’ అంటూ జిల్లాకు చెందిన ఓ విద్యాధికారి తన ఆవేదన వెళ్లగక్కారు. అందరికీ వర్క్ అడ్జస్ట్ మెంట్ వద్దంటే ఎలా ? ఇటువంటి చిన్న విషయాలకు కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక పదవుల్లో వున్న అధికార పార్టీ నేతల నుంచి రికమండేషన్ లేఖలు తేవడం, మాపై ఒత్తిడి తేవడం ఎందుకు ? అసలు వర్క్ అడ్జస్ట్ మెంటే ఆపేస్తే పోలా? వీటిని ఆమోదించి ఉన్న తాధికారుల నుంచి చీవాట్లు, అక్షింతలు వేయించు కునేకంటే జిల్లా నుంచి వెళ్ళిపోవడం మంచిదేమోననిపిస్తోంది..అంటూ తన బాధ వెళ్లగక్కారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️పాఠశాల విద్య@*
*సోషల్ మీడియా!✍️📚*
*♦️టాపర్‌తో సెల్ఫీ దిగి ట్విటర్, ఇన్‌స్టాలో పెట్టాలి!*
*♦️ఆ ఖాతాలు లేకుంటే వాట్సా్‌పలోనైనా..*
*♦️ఇలాంటి పోస్టులతో విద్యార్థుల్లో పోటీ*
*♦️ఉపాధ్యాయుల్లో భిన్నాభిప్రాయాలు*
*🌻అమరావతి, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి)*: మొన్న వాట్సా్‌పలో ప్రశ్నపత్రాలు.. నేడు టాపర్లతో సెల్ఫీలు దిగి వాటిని ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో పోస్టు చేయడాలు.. వంటి కార్యక్రమాలతో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సోషల్ మీడియా బాట పడుతోంది! తాజాగా ముగిసిన ఫార్మేటివ్ అసె్‌సమెంట్-2 పరీక్షల ప్రశ్నపత్రాల సరఫరాకు పూర్తిగా వాట్సా్‌పపైనే ఆధారపడగా.. ఇప్పుడు విద్యార్థులను ప్రోత్సహించేందుకు ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సా్‌పలను వినియోగించుకోవాలని సరికొత్త ఆదేశాలు జారీచేసింది. సోమవారం ఎఫ్‌ఏ-2 పరీక్షలు ముగిశాయి. దిద్దిన పత్రాలను ఉపాధ్యాయులు మంగళవారం నుంచి విద్యార్థులకు అందజేస్తున్నారు. అయితే అలా సింపుల్‌గా ఇచ్చి వదిలేయకుం డా తరగతిలో టాపర్‌గా నిలిచిన విద్యార్థితో టీచర్ సెల్ఫీ తీసుకుని వాటిని విద్యార్థికి చెందిన ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో పోస్టు చేయాలని పాఠశాల విద్య ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. ఒకవేళ విద్యార్థులకు ఆ అకౌంట్లు లేకపోతే వాట్సాప్ ద్వారా సెల్ఫీలను ఫార్వర్డ్ చేయాలని సూచించారు. అయితే ఎవరి వాట్సా్‌పకు ఫార్వర్డ్ చేయాలనేది మాత్రం స్పష్టం చేయలేదు. టీచర్లతో పాటు పర్యవేక్షణకు పాఠశాలలకు వెళ్లే అధికారులు కూడా విద్యార్థులతో సెల్ఫీలు తీసుకుని ఇలాగే పోస్టులు పెట్టాలని సూచించారు. దీంతో మంగళవారం అనేక పాఠశాలల్లో ఉపాధ్యాయులు సోషల్ మీడియాలో పోస్టింగులు చేశారు. దాదాపుగా విద్యార్థులెవరికీ ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఖాతాలు లేకపోవడంతో ఫేస్‌బుక్‌లో ఈ పోస్టులు పెట్టారు. అయితే దీనిపై పాఠశాల విద్యలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఇప్పటికే యాప్‌ల గోలతో సతమతమవుతుంటే ఈ అదనపు పనులేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల వాట్సా్‌పలో ప్రశ్నపత్రాలు పంపిన వ్యవహారం వివాదానికి దారితీసింది.
*♦️అందరూ బూట్లు ధరించాలి*
జగనన్న విద్యా కానుక కింద ఇచ్చిన ప్రతి వస్తువునూ విద్యార్థులు వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఆదేశాలు జారీచేశారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️బకాయిలు ఒకేసారి*
*ఇవ్వలేం!✍️📚*
*♦️జనవరి నుంచి దశల వారీగా చెల్లింపు*
*♦️అందరికీ ’62 ఏళ్ల రిటైర్మెంట్’ వర్తింపు*
*♦️ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించం*
*♦️మంత్రివర్గ ఉపసంఘం భేటీలో బొత్స*
*♦️చర్చలపై ఉద్యోగుల తీవ్ర అసంతృప్తి*
*🌻అమరావతి, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి)*: ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను ఒకేసారి ఇవ్వలేమని ప్రభుత్వం తేల్చేసింది. జనవరి నుంచి దశల వారీగా చెల్లిస్తామని, అది కూడా పండగ కానుకగా భావించాలని పేర్కొంది. ఈ మేరకు మంగళవారం ఉద్యోగ సంఘాలతో పెండింగ్ సమస్యలపై చర్చించిన మంత్రివర్గ ఉపసంఘంలో మంత్రి బొత్స సత్యనారాయణ తేల్చిచెప్పారు. తాజా సమావేశం.. సీపీఎస్ కోసం కాదని కమ్యూనికేషన్ గ్యాప్‌వల్ల ‘సీపీఎ్‌సపై సమావేశం’ అని ఆహ్వానం పంపారని వివరణ ఇచ్చారు. ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై చర్చించడానికి పిలిచామని చెప్పారు. అయితే, ‘సీపీఎ్‌సపై సమావేశం అని పిలిచారు కదా’ అని సంఘాల నేతలు ప్రస్తావించగా.. కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే ఇలా జరిగిందని, పింఛన్ విధానంపై త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని బొత్స స్పష్టం చేశారు. మంగళవారం అమరావతి సచివాలయంలో సీపీఎస్, ఉద్యోగుల పెండింగ్ అంశాలపై మంత్రివర్గ ఉపసంఘం ఆయా ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ అయింది. మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేశ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సాధారణ పరిపాలనశాఖ, ఆర్థికశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీజేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ, కార్యదర్శి ఆస్కారరావు, ఎస్టీయూ అధ్యక్షులు సాయిశ్రీనివాస్, పీఆర్టీయూ అధ్యక్షులు గిరిప్రసాద్, యూటీఎఫ్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, తదితర ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు.
*♦️వేతనాల కోసం వెయిటింగ్ తగదు*
సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు తమ సమస్యలను ఏకరువుపెట్టారు. భవిష్యత్తులో ఓపీఎ్‌సపై మాత్రమే తమను చర్చలకు పిలవాలని కోరారు. ప్రతి నెల జీతాలు, పింఛన్లు 1వ తేదీనే అందేలా చర్యలు తీసుకోవాలని, గత కొన్నాళ్లుగా ఇవి ఎప్పుడు ఇస్తున్నారో తెలియక ఉద్యోగులు నిరీక్షించే పరిస్థితి వచ్చిందని ప్రస్తావించారు. ఇప్పటికీ పలువురు ఉద్యోగులకు ఈ నెల జీతాలు పడలేదన్నారు. దీనిపై స్పందించిన బొత్స.. తొలుత ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమంపై దృష్టి పెడుతున్నామని, ఉద్యోగులకు రెండో ప్రాధాన్యంగా వేతనాలు ఇస్తున్నామని అన్నట్లు తెలిసింది. డీఏ ఎరియర్స్, ఏపీజీఎల్‌ఐ లోన్లు, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ సకాలంలో రావడంలేదని బకాయిలన్నీ చెల్లించాలని సంఘాల నేతలు కోరారు. అయితే, బకాయిలను ఒకేసారి చెల్లించలేమని.. సంక్రాంతి కానుకగా జనవరి నుంచి దశల వారీగా ఇస్తామని బొత్స చెప్పినట్లు తెలిసింది. తదుపరి సమావేశం నాటికి కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు రోడ్ మ్యాప్ ఇస్తామని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. అదేవిధంగా పబ్లిక్ సెక్టార్, గురుకులాలు, యూనివర్సిటీ ఉద్యోగులకు 62 ఏళ్ల వయోపరిమితికి సంబంధించి త్వరలో జీవో విడుదల చేస్తామని తెలిపింది. వచ్చే ఏప్రిల్‌లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు షెడ్యూల్ ఇవ్వనున్నట్లు కమిటీ పేర్కొంది. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను ఎవ్వరినీ తొలగించడంలేదని బొత్స స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్యశాఖలో ఫీల్డ్ ఉద్యోగులకు ఫేస్ అటెండెన్స్ తొలగింపు అంశాన్ని పరిశీలిస్తామని,వచ్చే మార్చిలో మరోసారి సమావేశం ఏర్పాటుచేసి సమస్యలు పరిష్కరిస్తామని కమిటీ హామీ ఇచ్చింది.
*♦️బదిలీలపై పెదవి విరుపు*
వచ్చే సంక్రాంతికి ఉపాధ్యాయుల బదిలీలు చేస్తామని మంత్రి బొత్స సమావేశంలో హామీ ఇచ్చారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాల నేతలు భేటీలోనే పెదవి విరిచారు. సంక్రాంతి సమయానికి బదిలీలు చేపడితే పదోతరగతి విద్యార్థులపై ప్రభావం చూపే అవకాశం ఉందని, అందువల్ల సంక్రాంతికి కూడా ప్రభుత్వం బదిలీలు చేపట్టే అవకాశం లేదని నేతలు తేల్చి చెప్పారు. కేవలం ఉపాధ్యాయుల ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నమేనని వ్యాఖ్యానించినట్టు తెలిసింది.
*♦️అన్నిటినీ పరిష్కరిస్తాం: బొత్స*
సీపీఎస్ అంశంపై ఉద్యోగ సంఘాలను మరోసారి చర్చలకు పిలుస్తామని మంత్రి బొత్స చెప్పారు. ఉద్యోగ సంఘాలతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62ఏళ్లకు పెంచాలనే ప్రభుత్వ విధానం విషయంలో విశ్వవిద్యాలయ, గురుకుల విద్యాసంస్థల ఉపాధ్యాయుల కోరుతున్న విధంగా న్యాయపరంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఉద్యోగుల సమస్యల్లో ప్రతి అంశాన్ని సున్నితంగా తీసుకుని, ప్రభుత్వం పరిష్కరిస్తుందని స్పష్టం చేశారు.
*♦️పెన్షన్ విధానంపై చర్చ: బొప్పరాజు*
ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై చర్చలు జరుపుతామని చెప్పడం వల్లే తాము భేటీకి హాజరైనట్లు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పారు. చర్చల అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్‌లో పాత పెన్షన్ పథకంపై మాత్రమే చర్చలు జరపాలని కోరినట్లు తెలిపారు.
పాత పెన్షన్, సీపీఎస్ అనేవి కాకుండా ఈసారి పెన్షన్ విధానంపై చర్చిస్తామని మంత్రులు హామీ ఇచ్చినట్లు చెప్పారు. అలాగే 11వ పీఆర్సీ ఆమోదించిన పే స్కేల్స్‌ను శాఖల వారీగా ఆర్థిక శాఖ నేటికీ పంపలేదని, ప్రతి నెలా జీతాలు, పెన్షన్లు ఒకటో తారీకున రానందున ముందుగా జీతాలు, పెన్షన్లు ఉద్యోగులందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశామని చెప్పారు. బకాయిలు తక్షణమే చెల్లించాలని కోరామన్నారు.
*♦️ఔట్‌సోర్సింగ్‌ను తొలగించబోమన్నారు: బండి*
కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ సిబ్బందిని తొలగించబోమని మంత్రివర్గ ఉపసంఘం హామీ ఇచ్చినట్లు ఏపీ ఎన్జీవో సంఘ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు చెప్పారు. ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశామన్నారు. ఎన్జీవో సొసైటీలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు.
*♦️ఒరిగిందేమీలేదు: ఉద్యోగులు*
మంత్రుల కమిటీ సమావేశం వల్ల తమకు కొత్తగా ఒరిగిందేమీలేదని.. సంవత్సరం నుంచి చెప్పిన మాటలే చెప్పారని ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పీఆర్సీ ప్రకటించి సంవత్సరం అయినా పెండింగ్ అంశాలు అంటూ చర్చలు చేపట్టి పొద్దుపోయేదాకా మాట్లాడి చూద్దాం.. చేద్దాం అని సాచివేత ధోరణిని ప్రదర్శించారని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘాల నేతలకు మరోసారి చాయ్.. బిస్కెట్ తప్ప ఒరిగిందేమీ లేదని ఉద్యోగులు వ్యాఖ్యానించారు.
*♦️సీపీఎస్ రద్దయ్యే వరకు పోరాడతాం!*
సీపీఎస్ రద్దుపై చర్చించేందుకు ప్రభుత్వం ఎన్ని సార్లు పిలిచినా వెళ్తామని, తమ వైఖరి చెప్తామని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఆస్కార్‌రావు చెప్పారు. సీపీఎ్‌సపై ప్రత్యేకంగా మరోసారి చర్చిస్తామని మంత్రి బొత్స హామీ ఇచ్చినట్లు తెలిపారు. కేసులు పెట్టినా సీపీఎస్ రద్దయ్యే వరకు తాము పోరాడతామని ఏపీసీపీఎస్ ఉద్యోగుల సంఘ నేత బాజీ పటాన్ స్పష్టం చేశారు. గతంలో ప్రస్తావించిన సమస్యలపైనే చర్చించారని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఉపాధ్యాయుల సర్దుబాటు ఇతర అంశాలను పరిష్కరిస్తామని బొత్స హామీ ఇచ్చారని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్‌పీ మన్నా చెప్పారు. ఇప్పటి వరకు అందరికీ జీతాలు పడకపోవడంపై బుధవారం అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేయనున్నట్లు తెలిపారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️ఉద్యోగుల సమస్యలపై*
*చర్చలకు సిద్ధం: మంత్రి బొత్స✍️📚*
*🌻అమరావతి*: ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఉద్యోగుల ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని వెల్లడించారు. పీఆర్సీ పెండింగ్ సమస్యలు, సీపీఎస్ అంశంపై సచివాలయంలో ఉద్యోగులతో మంత్రుల కమిటీ చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేవలం సమాచార లోపం వల్లే సీపీఎస్‌పై సమావేశం అని ఆర్థికశాఖ అధికారులు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సభ్యులకు సమాచారం ఇచ్చారని వెల్లడించారు. మరికొన్ని ప్రభుత్వ విభాగాల్లో 62 ఏళ్ల వయోపరిమితి పెంచాల్సిందిగా ఉద్యోగులు కోరినట్టు ఆయన వివరించారు. దీనిపై ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఉద్యోగుల ప్రతీ సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తుందని మంత్రి తెలిపారు. అంతకు ముందు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో ప్రధాన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో మంత్రులు బొత్స, ఆదిమూలపు సురేష్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. దాదాపు 3గంటల పాటు ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించారు. తొలుత సీపీఎస్ అంశంపై చర్చించాలని నిర్ణయించినా సంబంధిత ఉద్యోగ సంఘాల నేతలు ఎవరూ హాజరుకాకపోవడంతో ఆఖరు నిమిషంలో పీఆర్సీ పెండింగ్ సమస్యలు చర్చిద్దామని మంత్రుల కమిటీ సమాచారం పంపింది.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️గ్రూప్-1 పరీక్షా*
*విధానంలో స్వల్ప మార్పులు✍️📚*
*🌻ప్రజాశక్తి-అమరావతి బ్యూరో* రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఏడాది సెప్టంబర్ 30విడుదల చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్లో మెయిన్ పరీక్షకు సంబంధించి జనరల ఎస్సే పేపర్-1 పరీక్ష విధానాన్ని మార్చారు. ఈ మేరకు ఎపిపిఎస్సి కమిషన్ కార్యాలయం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మెయిన్ పరీక్షకు సంబంధించి ఏడు అంశాలు కలిపి వుండేవి. ఇప్పుడు ఆ ఏడు అంశాలను మూడు విభాగాలుగా విభజించారు. ఒకటో విభాగంలో కరెంట్ అఫైర్స్, రెండో విభాగంలో సామాజిక రాజకీయ అంశాలు, సామాజిక ఆర్థిక అంశాలు, సామాజిక పర్యావరణ అంశాలు ఉన్నాయి. మూడో విభాగంలో సాంస్కృతిక, చారిత్రాత్మక అంశాలు, పౌర అవగాహన అంశాలతో పరీక్షలు రాయాలి. అభ్యర్థులు ఒక్కొక్క అంశాన్ని 800 పదాలతో మూడు సెక్షన్ల నుండి ఒక్కో అంశాన్ని తీసుకుని పరీక్షను రాయాల్సి ఉంటుంది. ఒక్కో అంశానికి 50 మార్కులు వుంటాయి. పరీక్ష రాసే కాలవ్యవధి మూడు గంటలు వుంటుందని ఎపిపిఎస్సి తెలిపింది.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు✍️📚*
*🌻ఆత్మకూరు(మంగళగిరి), న్యూస్‌టుడే:* మంగళగిరి పరిధిలోని ఆత్మకూరులో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్ మంగళవారం ఉదయం పరిశీలించారు. దాదాపు గంటపాటు పాఠశాలలో గడిపారు. ఎఫ్‌ఏ-2 పరీక్షల్లో మార్కుల వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. వారితో బృంద చిత్రాన్ని తీసుకున్నారు. అనంతరం ఏడో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. జగనన్న విద్యాకానుకలపై ఆరా తీశారు. పాఠశాల ఆవరణలో నీటిశుద్ధి పరికరాలను తనిఖీ చేశారు. డీఈవో శైలజ, డిప్యూటీ డీఈవో నిర్మల తదితరులు పాల్గొన్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️గ్రూప్ 1లో 3 సెక్షన్లుగా*
*వ్యాసరూప ప్రశ్నలు✍️📚*
*♦️ప్యాట్రన్ లో ఏపీపీఎస్సీ మార్పులు*
*🌻అమరావతి, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి)*: ఇటీవల విడుదల చేసిన గ్రూప్-1 నోటిఫికేషన్కు సంబంధించి పేపర్-1 పరీక్షలో సాధారణ వ్యాస రూప ప్రశ్నలపై ఏపీపీఎస్సీ వివరణ ఇచ్చింది. కరెంట్ అఫైర్స్, సోషియో-పొ లిటికల్, సోషియో-ఎకనమిక్, సోషియో-పర్యావరణం, సాంస్కృతిక చారిత్రా త్మక సంఘటనలు, పౌర అవగాహన, రెఫ్లెక్టివ్ అంశాలు.. ఇలా 7 అంశా లుంటాయని తెలిపింది. అయితే ఇప్పుడు వీటిని మూడు సెక్షన్ల కింద విభ జించారు. కరెంట్ అఫైర్స్ ఒక సెక్షన్లో, తర్వాత ఆరు అంశాలు రెండు సెక్ష న్లలో ఉంటాయని ఏపీపీఎస్సీ తెలిపింది. అభ్యర్థులు ప్రతి సెక్షన్ నుంచి ఒక్కో ప్రశ్నకు సమాధానం రాయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఒక్కో ప్రశ్న 50 మార్కులు, 180 నిమిషాల సమయం ఉంటుందని వివరించింది.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️6 దాటినా నిరీక్షణే!✍️📚*
*♦️40%మంది ఉద్యోగులకు, 80% మంది పెన్షనర్లకు అందని వేతనం*
*🌻అమరావతి, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి*): ఈ నెల 6వ తేదీ దాటిపోయినా రాష్ట్రంలో సర్కారీ ఉద్యోగులు జీతాల కోసం, పింఛన్ దారులు తమ పెన్షన్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇప్పటికీ 40%మంది ఉద్యోగులకువేతనాలు చెల్లించలేదు. 80 శాతం మంది పింఛనుదారులకు పెన్షన్ కూడా ఇవ్వలేదు. దీంతో వారంతా సర్కారు కరుణకోసం ఎదురు చూసే పరిస్థితి వచ్చిందని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఎస్ సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం అమరావతి సచివాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. 1936 ఇండియన్ వేజెస్ యాక్టు ప్రకారం 7వతేదీలోగా జీతాలివ్వకపోతే యాజమాన్యంపై చర్య తీసుకోవచ్చని చట్టంలో పేర్కొన్నట్టు తెలిపారు. అదేసమయంలో, ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలివ్వాలని నిబంధన ఉన్నా, చెల్లించకపోతే ఏం చేయాలో స్పష్టత లేదన్నారు. ఇప్పుడు చట్టం చేసేలా డిమాండ్ లేవనెత్తే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సకాలంలో వేతనాలు ఇవ్వాలని టీఎన్‌యూఎస్ అధ్యక్షుడు మన్నం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ప్రతినెలా జీతాల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️ఉద్యోగుల సమస్యలు*
*పరిష్కరిస్తాం✍️📚*
*♦️ఉద్యోగ సంఘాల నేతలతో సజ్జల, మంత్రులు బొత్స, ఆదిమూలపు సమావేశం*
*🌻సాక్షి, అమరావతి*: ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కరి స్తుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారా యణ చెప్పారు. ఉద్యోగుల పెండింగ్ అంశాలు, సీపీఎస్పై మంగళవారం వెలగపూడి సచివాలయం లో ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రుల కమిటీ సమావేశమైంది. అనంతరం మంత్రి బొత్స మాట్లాడుతూ ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై చర్చించినట్లు తెలిపారు. సీపీఎస్పై ప్రత్యేకంగా మరో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. సమా చారలోపం వల్ల సీపీఎస్పై సమావేశం అని ఆహ్వా నం పంపారని తెలిపారు. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సీపీ ఎస్కు సంబంధించిన సమావేశం అని చెప్పడంతో హాజరవకూడదని నిర్ణయించామని తెలిపారు. కానీ తర్వాత ఉద్యోగుల అన్ని సమస్యలపై చర్చిద్దామని సమాచారం ఇవ్వడంతో హాజరైనట్లు చెప్పారు. కా ట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై వచ్చే సమావే శంలో సీఎంతో చర్చించిన అనంతరం మాట్లాడ తామని మంత్రులు చెప్పారని తెలిపారు. ఎంప్లా యీస్ హెల్త్ స్కీంపైనా చర్చించాలని కోరామ న్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ, మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహా దారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి (హెర్ఆర్), చిరంజీవి చౌదరి, ఆర్థిక శాఖ కార్యదర్శి గుల్జార్, సర్వీసెస్ అండ్ హెచ్ ఆర్ శాఖ కార్యదర్శి పి.భాస్కర్, ప్రభుత్వ సలహా దారు (ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్రెడ్డి, ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్య క్షుడు కె. సూర్యనారాయణ, ఎస్టీయూ అధ్యక్షుడు ఎల్.సాయి శ్రీనివాస్, పీఆర్టీయూ అధ్యక్షుడు ఎం గిరిప్రసాద్, యూటీఎఫ్ అధ్యక్షుడు ఎన్. వెంక టేశ్వర్లు, ఏపీటీఎఫ్ అధ్యక్షుడు జి.హృదయరాజు ఇతర ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️గిరిజన గురుకులాల్లోని*
*ఖాళీల భర్తీకి గ్రీన్సిగ్నల్✍️📚*
*♦️మొత్తం 317 టీచింగ్ పోస్టులు ఖాళీ*
*♦️జిల్లా స్థాయి కమిటీల ఆధ్వర్యంలో ఎంపిక*
*🌻సీతంపేట:* రాష్ట్ర గిరిజన గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలోని పాఠశాలలు, కళాశాలల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు గురుకులాల జేఎస్ హేమలతారాణి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ కేడర్లలో 317 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఐటీడీఏలు ఉన్న జిల్లాల్లో అయితే ప్రాజెక్టు అధికారుల ఆధ్వర్యంలో, నాన్ ఐటీడీఏల పరిధిలో జేసీల ఆధ్వర్యంలో ఈ పోస్టుల భర్తీ జరగాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రిన్సిపాళ్లు కన్వీన ర్లుగా వ్యవహరించి పారదర్శకంగా పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థికి ఇంగ్లిష్ ప్రావీణ్యం తప్పనిసరి. లాంగ్వేజ్ టీచర్లు తప్ప మిగిలిన అన్ని సబ్జెక్టులకు అభ్యర్థులు రెండు చోట్ల ఇంగ్లిష్ మీడియంలో చదివి ఉండాలి. ఏపీ టెట్ తప్పనిసరిగా క్వాలిఫై కావాలి. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం పోస్టుల భర్తీ జరుగు తుంది. డెమో, టీచింగ్ సామర్థ్యం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పీఈటీ, పీడీ లకు ఫిజికల్ టెస్ట్ను డీఎస్ఓఓ నిర్వహిస్తారు. దరఖాస్తుల స్వీకరణ, డెమో నిర్వహణ, ఇం టర్వ్యూ తేదీలను ఆయా జిల్లాల జేసీలు, ఐటీడీఏ పీఓలు జారీ చేస్తారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలం✍️📚*
*🌻అమరావతి,ఆంధ్రప్రభ*: ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలం గా వుందని, వారి సమస్యలపై చర్చలకు ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మంగళవారం రాత్రి సచివాలయం లో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై సంఘాల నేతలతో చర్చించిన ఆనంతరం మంత్రి మాట్లా డుతూ సమాచారలోపం వల్ల సీపీఎస్పై సమా వేశం అని ఆహ్వానంపెట్టారనీ, సీపీఎస్ ప్రత్యేకం గా త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు. సమావేశంలో ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై చర్చించామన్నారు. ఉద్యోగుల ప్రతి సమస్య పరిష్కరించడంలో ప్రభుత్వం చిత్త శుద్ధితో ఉందన్నారు. 62 ఏళ్ల వయో పరిమితి < పై కొంతమందికి పెంచాలని కోరారనీ త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటు ందన్నారు. ఉద్యోగులుప్రభుత్వంలో అంతర్భాగం అన్నారు. తమది ఫెండ్లే ప్రభుత్వం అన్నారు కొన్ని సమస్యలకు సంభందించి న్యాయ పరమైన సలహాలు తీసుకుని పరిష్కరిస్తామన్నారు. నేటి చర్చల్లో ఉద్యోగులు సంతృప్తి చెందారా. న్నారు. మంత్రి బొత్సతో పాటు మున్సిపల్ శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️అందరూ బూట్లు*
*ధరించాల్సిందే..!✍️📚*
*♦️విద్యార్థుల్లో అలవాటును పెంచాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే*
*♦️పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు*
*🌻ఈనాడు, అమరావతి*: విద్యా కానుక కింద ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించిన బూట్లను అందరూ ప్రతిరోజూ వేసుకొని వచ్చేలా చూడాల్సిన బాధ్యత తరగతి ఉపాధ్యాయులదేనని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. నాణ్యత లేకపోవడంతో కొన్నిచోట్ల బూట్లు చిరిగిపోయాయి. మరికొన్నిచోట్ల సైజులు సరిగా ఇవ్వలేదు. దీంతో విద్యార్థులు పాఠశాలలకు బూట్లు వేసుకొని రావడం లేదు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు ఉన్నత పాఠశాలలో ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఏడో తరగతిలో ఒక్కరూ బూట్లు ధరించలేదు. దీంతో బూట్లు, సాక్సులు ధరించే అలవాటును పెంపొందించాల్సిన బాధ్యత తరగతి ఉపాధ్యాయుడిదేనని ఆయన ఆదేశించారు. చిరిగిపోయిన, సైజులు లేని బూట్లు వేసుకురావాలని ఎలా చెప్పాలి? అని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. విద్యా కానుక కింద అందించిన సామగ్రిని వినియోగించేలా జిల్లా విద్యాధికారులు చర్యలు తీసుకోవాలని ముఖ్యకార్యదర్శి ఆదేశించారు.
*♦️ధర పెరిగినా అదే సమస్య..*
జత బూట్లు, రెండు జతల సాక్సులకు ఈ ఏడాది గుత్తేదారుకు రూ.51 ఎక్కువగా చెల్లించారు. ధర పెరిగినా నాణ్యత మాత్రం పెరగలేదని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. విద్యాకానుక కిట్లలో బ్యాగ్, బెల్ట్, బూట్లు, సాక్సులు, ఏకరూప దుస్తులు కలిపి దాదాపు రూ.1,996 చొప్పున వ్యయం చేశారు. 40.31లక్షల కిట్లు కొనుగోలు చేసినప్పటికీ ఎక్కువ ధరలకే కొనడంపై ఆరోపణలు వ్యక్తమయ్యాయి. బ్యాగ్‌లు సైతం సరఫరా చేసిన 15రోజులకే చిరిగిపోయాయి. దాదాపు 9లక్షల బ్యాగ్‌లను మార్పు చేశారు. ఇందులో సమగ్ర శిక్షలో పని చేస్తున్న ముగ్గురు సిబ్బంది చక్రం తిప్పినట్లు ఆరోపణలు వచ్చినా వీరిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనుకంజ వేస్తున్నారు.