NMMS MODEL GUESS PAPER 01 NMMS MODEL GUESS PAPER 01 HOW TO ATTEMPT AP NMMS…
*📚✍️విద్యలో అగ్రగామి ఏపీ✍️📚*
*♦️తొలిసారి ‘లెవల్-2’ సాధించిన ఆంధ్రప్రదేశ్*
*♦️ఏపీ, కేరళతో పాటు మరో 5 రాష్ట్రాలకు లెవల్-2*
*♦️దేశంలో ఏ ఒక్క రాష్ట్రానికీ దక్కని లెవల్-1*
*♦️2020-21కి రాష్ట్రాల పనితీరు గ్రేడింగ్ విడుదల చేసిన కేంద్రం*
*♦️2017 నుంచి 2019 వరకూ లెవల్ 6లో ఏపీ*
*♦️చిత్తశుద్ధితో విద్యారంగాన్ని సంస్కరిస్తూ వస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్*
*♦️ఫలితంగా నాలుగు స్థాయిలు ఎగబాకి ఏకంగా లెవల్-2కు*
*🌻సాక్షి, న్యూఢిల్లీ*: ‘పిల్లలకు మనమిచ్చే ఆస్తి చదువే’ అని మనసా వాచా నమ్మి… విద్యా రంగంలో ఊహించని మార్పులు తెస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషి సత్ఫలితాలనిస్తోంది. విద్యా రంగంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న అగ్రశ్రేణి రాష్ట్రాల సరసన ఆంధ్రప్రదేశ్ సగర్వంగా నిలిచింది. 2019లో రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టేనాటికి విద్యారంగంలో లెవల్-6లో ఉన్న ఆంధ్రప్రదేశ్… ఆ తరువాత రెండేళ్లకే ఏకంగా లెవల్-2కు చేరుకుంది.
విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను వివిధ పథకాల్లో భాగస్వాములను చేస్తూ… స్కూళ్ల రూపురేఖలు మార్చటం దగ్గర నుంచి విద్యార్థుల పుస్తకాలు, భోజనం, స్కూలు బ్యాగులు, షూ, యూనిఫారాలు అన్నింటా నాణ్యతకు ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వారిని చేయి పట్టుకుని నడిపిస్తున్న తీరు… కేంద్ర విద్యా శాఖ తాజాగా విడుదల చేసిన పెర్‌ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్‌లో ప్రస్ఫుటమయ్యింది.
కార్పొరేట్ స్కూళ్లలో సైతం కొన్నింటికి మాత్రమే అందుబాటులో ఉన్న ఎడ్యుటెక్ విద్యను 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అందరికీ అందుబాటులోకి తీసుకొస్తూ, ద్విభాషా పాఠ్యపుస్తకాలను పరిచయం చేస్తూ తీసుకున్న చర్యలతో పాఠశాల విద్యలో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. 2020-21 విద్యా సంవత్సరంలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు విద్యారంగంలో కనబరిచిన పనితీరుకు సంబంధించిన ఈ సూచికల గ్రేడింగ్‌ను (పీజీఐ) కేంద్ర విద్యా శాఖలోని పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం గురువారం విడుదల చేసింది.
2020-21 పెర్‌ఫార్మెన్సు గ్రేడింగ్ ఇండెక్సులో ఆంధ్రప్రదేశ్ లెవెల్-2లో నిలిచింది. లెవెల్-1ను మాత్రం ఈ విద్యా సంవత్సరంలో దేశంలోని ఏ రాష్ట్రమూ సాధించలేకపోయింది. లెవెల్-2లో మన రాష్ట్రంతో పాటు కేరళ, పంజాబ్, చండీఘడ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్‌లు నిలిచాయి. పెర్‌ఫార్మెన్సు గ్రేడింగ్ ఇండెక్సును వివిధ అంశాల వారీగా 1000 పాయింట్లను ప్రామాణికంగా తీసుకొని కేంద్రం ఆయా రాష్ట్రాలకు లెవెల్ స్థాయిలను ప్రకటిస్తుంటుంది.
ఇందులో 901 నుంచి 950 మధ్య పాయింట్లను సాధించిన రాష్ట్రాలు లెవెల్ 2లో నిలుస్తాయి. 2017-18, 2018-19 సంవత్సరాల్లో వరసగా లెవల్-6కు పరిమితమైన ఆంధ్రప్రదేశ్… ఇప్పుడు ఏకంగా నాలుగు స్థాయిలు మెరుగుపరుచుకుని అగ్ర రాష్ట్రాల సరసన లెవల్-2లో నిలవటం విశేషం.
*♦️విద్యారంగ ప్రమాణాల పెంపునకు వీలుగా పీజీఐ*
14.9 లక్షల పాఠశాలలు, వివిధ సామాజిక, ఆర్థిక రంగాలకు చెందిన సుమారు 26.5 కోట్ల విద్యార్థులు, 95 లక్షల మందిఉపాధ్యాయులతో భారత విద్యా వ్యవస్థకు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యావ్యవస్థగా పేరుంది. విభిన్నమైన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులున్న మన దేశంలో… విద్యా రంగంలో ఉన్నతమైన ప్రమాణాలు సాధించడం, అందరికీ ఉత్తమ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి వీలైన ప్రణాళికలను రూపొందించడం వంటి లక్ష్యాలతో కేంద్రం ఏటా ఈ పెర్‌ఫార్మెన్సు గ్రేడింగ్ ఇండెక్సులను ప్రకటిస్తోంది.
దీనికోసం ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని విద్యా రంగ పరిస్థితులను మదింపుచేసి ఈ పీజీఐ స్థాయిలను నిర్ణయిస్తోంది. 1000 పాయింట్ల పీజీఐలో… ఆయా రాష్ట్రాలు సాధించిన అభ్యసన ఫలితాలు, పాఠశాలల అందుబాటు, పాఠశాలల్లో ప్రాధమిక సదుపాయాల కల్పన, అందరికీ సమాన విద్య అందుబాటు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని పాయింట్లను కేటాయిస్తూ… దాని ఆధారంగా ఆయా రాష్ట్రాల లెవల్‌ను ప్రకటిస్తున్నారు.
*♦️ఏపీకి ఏయే అంశాల్లో ఎన్నెన్ని పాయింట్లు*
ఆంధ్రప్రదేశ్‌కు లెర్నింగ్ అవుట్‌కమ్, క్వాలిటీలో 180గానూ 154 పాయింట్లు , విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ రేషియో 80గానూ 77, మౌలికసదుపాయాల్లో 150గానూ 127, సమానత్వంలో 230కి గానూ 210, పాలన యాజమాన్యంలో 360కిగానూ 334 పాయింట్లు దక్కాయని కేంద్రం తెలిపింది.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️దేశవ్యాప్తంగా 20 వేల*
*స్కూళ్ల మూత✍️📚*
*♦️టీచర్ల సంఖ్యలో 1.95% తగ్గుదల*
*♦️కేంద్ర విద్యాశాఖ 2021-22 నివేదిక*
*🌻ఢిల్లీ*: దేశంలో ఒక ఏడాది కాలానికి 20,000కు పైగా స్కూళ్లు మూతపడ్డాయని, ఉపాధ్యాయుల సంఖ్యలోనూ 195 శాతం తగ్గుదల నమోదైనట్లు కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది. పాఠశాల విద్య తీరుతెన్నులపై 2021-22 కాలానికిగాను ఏకీకృత జిల్లా విద్యాసమాచార విధానం (యూడైస్ )’పై విడు దల చేసిన ఈ నివేదిక 44.85 శాతం స్కూళ్లకు మాత్రమే కంప్యూటర్ సౌకర్యం ఉన్నట్లు తెలిపింది. దాదాపు 34% స్కూళ్లకు ఇంటర్నెట్ వసతి ఉంది. ‘2020-21లో మొత్తం పాఠశాలల సంఖ్య 15:03 లక్షలు ఉండగా, 2021-22 నాటికి ఇది 14.89 లక్షలకు తగ్గింది. ఎక్కువగా ప్రయివేటు యాజమాన్యాల పరిధిలోని స్కూళ్లు మూతపడ్డాయి’ అని గురువారం విడుదల చేసిన నివేదిక పేర్కొంది. విద్యార్థుల చేరికపై కొవిడ్ ప్రభావం గురించి వివరిస్తూ.. ఈ మహమ్మారి ప్రభావం బాగా ఉంది. ఎక్కువగా యువత, ప్రీ ప్రైమరీ తరగతులకు చెందిన దుర్బల చిన్నారుల పై దీని ప్రభావం మెండు’ అని వివరించింది. కోవిడ్-19 కారణంగా ప్రవేశాలను వాయిదా వేయడం ఈ క్షీణతకు కారణంగా అంచనా వేశారు. 2021-22లో ప్రాథమిక స్థాయి నుంచి ప్రాథమికోన్నత పాఠశాలల్లోకి ప్రవేశాలు దాదాపు 25.57 కోట్ల మేర ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన తరగతుల విద్యార్థుల నమోదులో పెరుగు చల ఆశాజనక అంశంగా చెప్పవచ్చు. ప్రైమరీ నుంచి హయ్యర్ సెకండరీ విద్యకు వెళ్లిన బాలికల సంఖ్య 12. 20 కోట్లు, 2020-21తో పోల్చితే 9,10 లక్షలు పెరిగారు.
దేశంలో 2020-21 ఏడాదిలో ఉపాధ్యాయుల సంఖ్య 97.87 లక్షలు ఉండగా.. 2021-22 నాటికి ఈ సంఖ్య 35,07 లక్షలకు తగ్గింది. ఈ తగ్గుదల ప్రభుత్వం పాఠశాలల్లో 0.9 శాతం, ప్రభుత్వ ఎయిడెడ్ స్కూళ్లలో 1.15 శాతంగా ఉంది. ప్రయివేటు పాఠశాలల్లో 294 శాతం టీచర్లు తగ్గారు. ఇతరత్రా స్కూళ్లలో ఇది 88% ఉంది. 2021-22లో విద్యార్థులు ఉపాధ్యాయ నిష్పత్తి ప్రాథమిక స్థాయిలో 28 ఉండగా, ప్రాథమికోన్నత పార శాలల్లో 19, సెరుడరీ స్కూళ్లలో 18, హయ్యర్ సెకం డరీ స్కూళ్లలో 27గా ఉంది.
▪️ప్రత్యేక అవసరాల విద్యార్థుల కోసం 27 శాతం స్కూళ్లలో మాత్రమే ప్రత్యేక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ఇందులో 45 శాతానికి పైగా పాఠశాలలకు రెయిలింగుతో కూడిన ర్యాంపులు ఉన్నాయి. నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా ఈ నివేదిక అధ్య యనంలో పాఠశాలల గ్రంథాలయాల్లో పుస్తక లభ్యత. సహ అభ్యాసం తదితర అంశాల ఆదనపు సమాచారం కూడా సేకరించారు.
*♦️ఉన్నత ప్రదర్శన రాష్ట్రాల్లో ఏపీ*
కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ ప్రకటించిన పెర్పా ర్మైన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ (పీజీఐ)లో 6 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతం లెవల్-2 దశకు చేరుకు న్నాయి. లెవల్-1 స్థాయిలో ఒక్క రాష్ట్రం కూడా లేకపోవడం గమనార్హం. ఎల్-2 స్థాయికి చేరుకొ న్నవాటిలో ఆంధ్రప్రదేశ్ సహా కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలు, చండి గఢ్ ఉన్నాయి…
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️‘నాడు-నేడు’ పాఠశాలలకు సీబీఎస్ఈ గుర్తింపు సాధించాలి✍️📚*
*♦️పాఠశాల విద్య సమీక్షలో సీఎం జగన్*
*🌻ఈనాడు, అమరావతి*: ‘నాడు – నేడు’ పనులు చేసిన ప్రతి పాఠశాలకు సీబీఎస్ఈ అనుబంధ గుర్తింపు సాధించాలని, అధికారులు ఈ దిశగా మరింత కృషి చేయాలని సీఎం జగన్ ఆదేశిం చారు. నాణ్యమైన విద్య కోసం విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొస్తున్నామని, 3 10వ తరగతి వరకు సబ్జెక్టు టీచర్స్ విధానాన్ని సమర్థంగా అమలు చేయాలని సూచించారు. 2024-25లో సీబీఎస్ఈ పదోతరగతి పరీక్షలు రాసే విద్యార్థుల బోధనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన పాఠశాల విద్యాశాఖ సమీక్షలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో 45వేల స్కూళ్లను బాగు చేయాలంటే కనీసం 34 ఏళ్లు పడుతుంది. ఈ సంవత్సరం ‘నాడు- నేడు’ కార్యక్రమం కింద 22వేల బడుల్లో పనులు చేపడుతున్నాం. ఈ కార్య క్రమాలన్నింటినీ జాగ్రత్తగా చేపట్టాలి. పనులన్నీ పూర్తయితే ప్రభుత్వ బడుల్లో నాణ్యత పెరుగు తుంది. ‘నాడు – నేడు’లో చివరి ప్రక్రియ తరగతి గదిని డిజిటలైజేషన్ చేయడమే. ప్రభుత్వ పాఠశా లల్లో చదువుతున్న పేద పిల్లలకు భవిష్యత్తు అందించాలన్నదే మన లక్ష్యం. మధ్యాహ్న భోజనం అమలు ప్రక్రియ పక్కాగా ఉండాలి. పాఠశాల, మరుగుదొడ్ల నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. 2018-19లో ప్రభుత్వ బడుల్లో 37లక్షల మంది విద్యార్థులు ఉంటే ఇప్పుడు 42 లక్షల మంది ఉన్నారు’ అని వెల్లడించారు.
*♦️అధికారులకు ప్రశంసలు*
కేంద్రం విడుదల చేసిన పనితీరు గ్రేడింగ్ ఇండెక్స్ (పీజీఐ)-2020-21లో చండీగఢ్, గుజరాత్, కేరళ, మహారాష్ట్రతోపాటు ఏపీ రెండో స్థాయిలో నిలిచినందుకు అధికారులను సీఎం జగన్ అభినం దించారు. విద్యారంగంలో చేపడుతున్న సంస్కర ణలు, విప్లవాత్మక మార్పుల ఫలితంగా ఈ స్థానం దక్కిందని అధికారులు వెల్లడించారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️16% మంది ‘బడి’*
*మానేస్తున్నారు✍️📚*
*♦️పదో తరగతి వరకు వస్తున్నది 83.7 శాతమే*
*♦️యూడైస్ ప్లస్-2021-22 నివేదిక విడుదల*
*🌻ఈనాడు, అమరావతి*: రాష్ట్రంలో పాఠశాల స్థాయి లోనే 16.3 శాతం మంది విద్యార్థులు చదువుకు స్వస్తి చెప్పేస్తున్నారు. దేశవ్యాప్తంగా మధ్యలోనే బడి మానే స్తున్న వారి జాబితాలో రాష్ట్రం 9 స్థానంలో ఉంది. ఒడిశాలో అత్యధికంగా 27.3 శాతం ఉండగా.. ఆ తర్వాత 21.7 శాతంతో మేఘాలయ రెండో స్థానంలో నిలిచింది. మన రాష్ట్రంలో ఒకటో తరగతిలో చేరిన పిల్లలు ఐదో తరగతి వరకు బడిలో ఉంటుండగా… తర్వాత క్రమంగా బడి మానేసే వారి సంఖ్య పెరుగు తోంది. చదువుకు స్వస్తి చెబుతున్న వారిలో బాలికల కంటే బాలురే ఎక్కువగా ఉండటం విశేషం. కేంద్ర విద్యాశాఖ గురువారం యూడైస్ ప్లస్-2021-22 నివేది కను విడుదల చేసింది. పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య, ప్రవేశాలు, మౌలిక సదుపాయాలు, బోధన విధానాలు, బడి మానేస్తున్న వారి వివరాలను వెల్ల డించింది.
*⭕అందులోని ముఖ్యాంశాలివి…👇👇👇*
• 1-5 తరగతుల్లో 100 మంది పిల్లలు ఉంటే 6 8 తరగతులకు వచ్చేసరికి 98.3 శాతం మందే ఉంటు న్నారు. అంటే 1.7 శాతం మంది చదువు ఆపేస్తు న్నారు. 9, 10 తరగతులకు వచ్చేసరికి ఇది మరింత పెరిగి 16.3 శాతానికి చేరింది. ఒకటో తరగతిలో చేరిన వారిలో 83.7 శాతం పిల్లలు మాత్రమే 9, 10 తరగతులకు వస్తున్నారు. 9, 10 తరగతుల్లో 17.5 శాతం బాలురు, 15 శాతం బాలికలు చదువు ఆపేస్తు న్నారు. ఐదో తరగతి నుంచి ఆరో తరగతికి 98.4 శాతం, 8 నుంచి 9 తరగతికి 96.9 శాతం, 10 నుంచి ఇంటర్కు 71.7 శాతం మంది వస్తున్నారు.
• ప్రభుత్వ పాఠశాలల్లో బాలురకు మరుగుదొడ్ల సదుపాయం 83.5 శాతం ఉండగా.. వాటిలో 80,8 శాతమే పని చేస్తున్నాయి. ఎయిడెడ్ బాలురకు 78.9 శాతం మరుగుదొడ్ల సదుపాయం ఉండగా.. వాటిలో పని చేస్తున్నవి 77.7 శాతం. బాలికల మరు గుదొడ్లు ప్రభుత్వ బడుల్లో 96.9 శాతం, ఎయిడెడ్ 96.4 శాతం ఉండగా.. పని చేస్తున్నవి వరుసగా 95.
6 శాతం, 95.2 శాతంగా ఉన్నాయి. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు 61,948 ఉండగా.. 82,44,647 మంది విద్యార్థులు ఉన్నారు.
• ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి 3,20,724 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️గురుకులాల్లో విద్యార్థులకు వినూత్న పథకాలు✍️📚*
*♦️ఆధునిక పద్ధతుల్లో విద్యాబోధనలు*
*♦️ఆరోగ్య పరిరక్షణకు నీట్ పరీక్షలకు శిక్షణ*
*♦️మంత్రి మేరుగు నాగార్జున*
*🌻అమరావతి, ఆంధ్రప్రభ:* దేశంలోనే ఆదర్శం గా ఇతర రాష్ట్రాల్లో గురుకులాల్లో లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ ఎస్సీ గురుకులాల్లో విద్యా ర్థుల సమగ్రాభివృద్ధికి పలు విన్నూత్న పథ కాలను అమలు చేస్తున్నట్లు సాంఘిక సంక్షే మశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడిం చారు. విద్యార్థులకు ప్రధానంగా విద్య, వై ద్యం, ఆరోగ్యాల మెరుగుదల కోసం ప్రత్యే కమైన కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అలాగే విద్యార్థులతో పాటుగా అధ్యాపకుల వికాసానికి అవసరమైన ప్రత్యేకమైన చర్యలు కూడా చేపట్టామని తెలిపారు. ఎస్సీ గురుకు లాల్లో ప్రత్యేకంగా చేపడుతున్న కార్యక్రమాలను గురువారం నాగార్జున వివరిం చారు. విద్యార్ధులలో దాగిన ప్రతిభను వెలికి తీయడానికి ‘విద్యార్థి విద్యాన్ మంత న్’ అనే కార్యక్రమాన్ని ఎన్.సి.ఆర్.టి సహకారంతో అమలు చేస్తున్నామని నాగా ర్జున వెల్లడించారు. అ జీం ప్రేమ్ యూనివర్సిటీ, టీసీఎస్, టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, టీసీఎస్, ఈ విద్యాలోక్, వాయిస్ ఫర్ గర్ల్స్ లాంటి ప్రముఖ సంస్థల ఆధ్వర్యంలో శిక్షణా కార్య క్రమాలను చేపడుతున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే విద్యాభివృద్ధిలో భాగంగా సూక్ష్మస్థాయి పరిశీలన కోసం వారాంత పు పరీక్షలను నిర్వహించే ప్రక్రియను గత నెలలో ప్రారంభించామని చెప్పారు. 5 నుంచి 10వ తరగతి వరకూ చదివే విద్యార్థులకు మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్లో వాలంటీర్ల ద్వారా వీడియో క్లాసులు, లైవ్ క్లాసులను నిర్వహిస్తున్నామ న్నారు. ఎస్సీ గురుకులానికి చెందిన పూర్వ విద్యార్థులలో ఐఐటి, మెడికల్ విద్యలను అభ్య సించిన వారితో స్వచ్ఛందంగా జేఇఇ, నీట్ పరీక్షలకు సంబం ధించిన అంశాల బోధన చేయిస్తున్నామన్నారు. నేషనల్ స్టూడెంట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్(ఎన్ఎస్ ఐసి) పథకం ద్వారా 8వ తరగతి విద్యార్థులతో సమాజంలోని సమ స్యల పరిష్కా రాన్ని సూచించే ప్రయోగాలను చేయించడం జరుగుతోందన్నారు. . టీసీఎస్ సహకారంతో 5 నుంచి 8వ తరగతి విద్యార్థులలో సామర్థ్యాల పెంపుదల (కెపాసిటీ బిల్డింగ్) కార్యక్రమాలను 50 గురు కులాల్లో చేపట్టడం జరిగిందని తెలిపారు.. వైయస్సార్ కంటి వెలుగు, ఎన్సీసీబీ బృందాల ద్వారా మిగిలిన గురుకులాల్లోనూ నేత్ర పరీక్షలు కొనసాగుతున్నా యని అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ప్రస్తుతం గురుకులాల్లో అమలు చేస్తున్న సీబీఎస్ఇ విద్యా విధానంపై టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని వివరించారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️’మధ్యాహ్న భోజనం’..*
*తిన్నది ముగ్గురే!✍️📚*
*🌻గొల్లప్రోలు, న్యూస్టుడే:* కాకినాడ జిల్లా గొల్లప్రోలు జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ముగ్గురు విద్యార్థులే గురువారం ‘మధ్యాహ్న భోజనం’ చేయడం చర్చనీ యాంశమైంది. 470 మంది విద్యార్థులకు 468 మంది హాజరుకాగా వారిలో 155 మంది భోజనాలు చేసేం దుకు సంసిద్ధత తెలిపినట్లు ఉపాధ్యాయులు నమోదు చేశారు. తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పిల్లా చంద్రం మధ్యాహ్నం ఈ పాఠశాలను సందర్శించి పరి శీలించగా.. ముగ్గురు విద్యార్థులే భోజనం చేయడం చూసి ఆశ్చర్యపోయారు. నాణ్యత లేకే పిల్లలు తినడం లేదని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం పరీక్షలు జరు గుతున్నందున అధిక సంఖ్యలో విద్యార్థులు పాఠశా లలో భోజనాలు చేయకుండా ఇళ్లకు వెళ్లిపోతున్నారని ప్రధానోపాధ్యాయుడు ఎ. రాంబాబు తెలిపారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️పాఠశాలలకు రూ.2.04*
*కోట్లు గ్రాంటు విడుదల✍️📚*
*🌻ఒంగోలు(విద్య), నవంబరు 3:* జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు 2022-23 విద్యా సంవత్సరానికి కాంపొజిట్ గ్రాంటు కింద సమగ్రశిక్ష జిల్లా ప్రాజెక్టు ద్వారా రూ.2.04 కోట్లు విడుదల చేసినట్లు అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ బి. విజయభాస్కర్ తెలిపారు. పాఠశా లల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఈ నిధులు కేటాయించినట్లు తెలి పారు. 1 నుంచి 30 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలకు రూ.10 వేలు, 31 నుంచి 100 మంది ఉంటే రూ.25వేలు, 101 నుంచి 250 మంది వరకు ఉంటే రూ.50వేలు, 251 నుంచి వెయ్యి మంది వరకు పిల్లలు ఉంటే రూ.75వేలు, వెయ్యి కంటే అదనంగా విద్యార్థులు ఉన్న పాఠశాలలకు రూ.లక్ష చొప్పున గ్రాంటు విడుదల చేశారు. ఈ నిధు లను పాఠశాలల విద్యుత్ బిల్లులు, స్టేషనరీ, వాటర్ బిల్లులు, మైనర్ రి పేర్లు తదితర అవసరాలకు వినియోగించాలి. జిల్లాలోని 342 పాఠశా లల సముదాయాలకు ఒక్కొక్క దానికి రూ.20వేల చొప్పున రూ.68.40 లక్షలు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు ఈ మొత్తంలో కంటిజె న్సీకి రూ.10 వేలు, మీటింగ్ టీఏకు రూ.2వేలు, టీఎల్ఎం గ్రాంటుకు రూ.2 వేలు, కాంప్లెక్స్ నిర్వహణకు రూ.5 వేలు, సీఆర్సీ మొబైల్కు రూ. వెయ్యి వినియోగించాలి. మండల విద్యావనరుల కేంద్రాల నిర్వహణకు రూ.39.20 లక్షలు విడుదల చేసినట్లు డీఈఓ తెలిపారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️కర్ణాటకలో విద్యా*
*సంస్థల్లో ఉదయం ధ్యానం✍️📚*
*🌻బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్టుడే*: కర్ణాటకలోని ప్రాథమిక, ప్రాథమి కోన్నత పాఠశాలలు, మాధ్యమిక కళాశాలల్లో నిత్యం ఉదయం పది నిమిషాలు ధ్యానం చేయించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు విద్యాశాఖ మంత్రి బి.సి. నాగేశ్ గురువారం ప్రకటించారు. విద్యార్థుల్లో ఏకా గ్రత పెంచేందుకు, ఆరోగ్య వృద్ధికి, మంచి విషయాలపై అవగాహన కల్పిం చేందుకు, ఒత్తిడిని అధిగమించేందుకు ధ్యానం అవసరమని పేర్కొన్నారు. ధ్యానంతో వ్యక్తిత్వం వికసిస్తుందని ట్వీట్ చేశారు. ఇప్పటికే విద్యను కాషా యీకరణ చేసేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం.. ధ్యానం పేరిట తమ రహస్య కార్యాచరణను దశలవారీగా అమలు చేస్తోందని విపక్ష కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య విద్యాశాఖ తీరును దుయ్యబట్టారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️ఎస్సీ గురుకులాల్లో ‘కార్పొరేట్’ శిక్షణ: మంత్రి మేరుగు✍️📚*
*🌻ఈనాడు డిజిటల్, అమరావతి:* విద్యార్థుల విద్యాభి వృద్ధికి ఎస్సీ గురుకులాల్లో అజీం ప్రేమ్జీ యూనివర్శిటీ, టీసీఎస్, టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఇ విద్యాలోక్, వాయిస్ ఫర్ గర్ల్స్ తదితర ప్రముఖ సంస్థల ఆధ్వర్యంలో శిక్షణ ఇప్పిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. పిల్లల్లో దాగున్న ప్రతిభను వెలికితీయడానికి ‘విద్యార్థి విద్యానా మంతన్ అనే కార్యక్రమాన్ని ఎన్సీఈఆర్టీ సహకారంతో నిర్వహి స్తున్నట్లు వెల్లడించారు. గురుకులాల పనితీరుపై సచి వాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️తడ’బడి’✍️📚*
*♦️తెలియక అన్ని బబుల్స్ దిద్దేసిన చాలామంది*
*♦️3, 4 పరీక్షలో సిలబస్‌లో లేని ప్రశ్నలే ఎక్కువ*
*♦️తలలు పట్టుకున్న ఉపాధ్యాయులు*
🔺ఓఎమ్మార్ షీట్‌పై అవగాహన లేదు.. బబుల్స్ ఎలా చేయాలో తెలియదు.. అయినా ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు క్లాస్ రూమ్ బేస్‌డ్ అసెస్‌మెంట్ పరీక్షలు జరపాలన్న ప్రభుత్వ నిర్ణయానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. తొలిరోజే పరీక్షలు రాయడంలో విద్యార్థులు తడబడ్డారు.
*🌻(ఆంధ్రజ్యోతి, విజయవాడ) :* పాత విద్యావిధానంలో అయితే, ఇది క్వార్టర్లీ పరీక్షలు పూర్తవ్వాల్సిన సమయం. కానీ, విద్యార్థుల తరగతి ప్రమాణాలు తెలుసుకోవడానికి క్లాస్ రూం బేస్‌డ్ అసెస్‌మెంట్ పరీక్షలు పెట్టి వారిని గందరగోళంలోకి నెట్టింది ప్రభుత్వం. ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో క్లాస్ రూమ్ బేస్‌డ్ అసెస్‌మెంట్ పరీక్షలు జరుగుతున్నాయి. వీటి ఆధారంగా విద్యార్థి విద్యా ప్రమాణాలు అంచనా వేయొచ్చని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన కీని ఈ నెల 6న ఆయా పాఠశాలలకు అందజేస్తారు. వాటి ఆధారంగా ప్రశ్నాపత్రాలను ఉపాధ్యాయులు సరిచూస్తారు.
*♦️ఓఎమ్మార్ షీట్లతో తడబడిన విద్యార్థులు*
ఈ కొత్త పరీక్షల్లో విద్యాశాఖ అధికారులు ఓఎమ్మార్ షీట్లను ప్రవేశపెట్టారు. ఒకటి నుంచి మూడో తరగతి పిల్లలకు మాస్టార్లే బబుల్స్ చేయాల్సి ఉంది. ప్రతి సబ్జెక్టుకు 15 అబ్జెక్టివ్ ప్రశ్నలు ఇచ్చారు. అవే ప్రశ్నలకు సమాధానాన్ని ప్రశ్నాపత్రంపై కూడా నింపాలి. ఓఎమ్మార్ షీట్లు మాత్రం అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం కనీస అవగాహన లేని విద్యార్థులు ఓఎమ్మార్ షీట్లను ఇష్టమొచ్చినట్టు బబుల్స్ చేశారు. ఒక ప్రశ్నకు కొంతమంది మూడింటికీ, మరికొంతమంది నాలుగింటికీ బబుల్స్ చేశారు. దీంతో మాస్టార్లు తలలు పట్టుకుంటున్నారు. తమ విద్యార్థులు వెనకపడకూడదనే కారణంతో కొన్నిచోట్ల ఉపాధ్యాయులే బబుల్స్ చేశారు.
*♦️పాఠ్యపుస్తకాల్లో లేని ప్రశ్నలే ఎక్కువ*
పాఠ్యపుస్తకాల్లో లేని ప్రశ్నలు ప్రశ్నాపత్రాల్లో ఉన్నాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. 3, 4 తరగతి ప్రశ్నపత్రాల్లో ఎక్కువగా సిలబస్‌కు సంబంధంలేని ప్రశ్నలు వచ్చినట్లు గుర్తించారు. దీంతో విద్యార్థులు కంగారు పడ్డారు. క్లాస్‌లో బాగా చదివే విద్యార్థులు కూడా వీటికి సమాధానాలు గుర్తించడంలో తడబడ్డారు.
*♦️ఉపాధ్యాయులదే తప్పుగా చూపే యత్నం*
విద్యార్థుల విద్యా ప్రమాణాలను అంచనా వేయడానికి ఎఫ్‌ఏ1 పరీక్షలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ పరీక్షల్లో విద్యార్థులు అంచనాలను అందుకోలేకపోతే ఆయా పాఠశాలల్లోని ఉపాధ్యాయులపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని కొన్ని సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే యాప్‌ల వల్ల పనిభారం పెరిగిందని, మరింత పనిభారం పెంచడానికి ప్రభుత్వం ఎత్తుగడలు వేస్తోందని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. విద్యార్థులకు కొత్తగా తీసుకొచ్చిన ఓఎమ్మార్ షీట్లపై పూర్తిస్థాయిలో అవగాహన లేదని చెబుతున్నారు. అలాగే, పాఠ్యాంశంలో లేని ప్రశ్నలు వస్తున్నాయని ఆరోపించారు. విద్యార్థుల ప్రమాణాలు సరిగ్గా లేకపోతే ఉపాధ్యాయులదే తప్పుగా చూపించే అవకాశం ఉందని ఆయా సంఘాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️’నాడు-నేడు’ పూర్తికి*
*మరో నాలుగేళ్లు✍️📚*
*♦️విద్యార్థుల సంఖ్య 37 నుంచి 42 లక్షలకి పెరిగింది: సీఎం జగన్*
*🌻అమరావతి, నవంబరు 3(ఆంధ్రజ్యోతి*): పాఠశాలల్లో చేపట్టిన నాడు- నేడు. పనుల పూర్తికి మరో మూడు నాలుగేళ్లు పడుతుంది. ప్రస్తుతం వేల పాఠశా లల్లో పథకం అమలయింది. ఈ ఏడాది మరో 22 వేల పాఠశాలల్లో, మిగిలినవి. వచ్చే సంవత్సరం దశల వారీగా చేపడతాం. ఈ పనులన్నీ పూర్తయితే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత పెరుగుతుంది” అని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అన్నారు. పాఠశాల విద్యాశాఖపై గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. “మా ప్రభుత్వం రాగానే పాఠ్య ప్రణాళికల్లో మార్పులు చేశాం. గతంలో క్లాస్ టీచర్కే అవకాశంలేని పరిస్థి తుల నుంచి సబ్జెక్టు టీచర్ల కాన్సెప్ట్ను తీసుకొచ్చాం. మూడు నుంచి పదో తరగతి వరకు సబ్జెక్టు టీచర్ల కాన్సెప్ట్ను పటిష్టంగా అమలు చేస్తున్నాం. 45 వేల పాఠశాల లను బాగుచేయాలంటే మూడు నాలుగేళ్లు పడుతుంది. మా ప్రభుత్వం అధికారం లోకి రాకముందు ప్రభుత్వ పాఠశాలల్లో 37 లక్షల మంది విద్యార్థులుంటే, ప్రస్తుతం ఆ సంఖ్య 42 లక్షలకు పెరిగింది” అని జగన్ అన్నారు. గత సమీక్షలో తీసుకున్న నిర్ణయాలపై ప్రగతిని అధికారులు సీఎంకు వివరించారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️విద్యా వ్యవస్థ*
*పనితీరులో కేరళ అగ్రగామి✍️📚*
*♦️ఏడో స్థానంలో ఏపి*
*🌻ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో*
విద్యా వ్యవస్థ పనితీరులో కేరళ అగ్రగామిగా నిలిచింది. విద్యా రంగంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 2020-21లో కనబరిచిన పనితీరు గ్రేడింగ్ సూచిక నివేదికను పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం విడుదల చేసింది. ఏడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కేరళ, పంజాబ్, చండీగఢ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ 2020-21లో లెవెల్ -2 (స్కోరు 901 950)ను చేరుకున్నాయి. 2017-18లో నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈస్థాయి సాధించాయి. 928 పాయింట్లతో కేరళ, మహారాష్ట్ర, పంజాబ్ తొలిస్థానంలోనూ, 927 పాయింట్లతో చండీగఢ్ రెండోస్థానంలో, 903 పాయింట్లతో గుజరాత్, రాజస్థాన్ మూడోస్థానంలో, ఆంధ్రప్రదేశ్ 902 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి లెవెల్-2లో నిలిచాయి. తెలంగాణ గ్రేడ్ 2. సాధించింది. ఓవరాల్గా 25వ స్థానంలో నిలిచింది.