NMMS MODEL GUESS PAPER 01 NMMS MODEL GUESS PAPER 01 HOW TO ATTEMPT AP NMMS…
*♦️ప్రశ్నపత్రంలో నాలుగు ఆప్షన్లు*
*♦️ఓఎంఆర్ షీట్‌లో ఐదు…*
*♦️విద్యార్థుల్లో అయోమయం*
*♦️విద్యాశాఖ తీరుపై టీచర్లు మండిపాటు*
🔺ఫార్మెటివ్-1 పరీక్షల నిర్వహణ తొలిరోజు గందరగోళంగా సాగింది. పరీక్ష విద్యార్థులకు కాకుండా తమకు నిర్వహించినట్టుందని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.
బుధవారం తొలిరోజు తెలుగు, గణితం పరీక్షలు నిర్వ హించారు. ఈ పరీక్షలలో తొలిసారి ఓఎంఆర్ విధానం అమలుచేశారు. ప్రతి సబ్జక్టులో 15 మార్కులకు ఆబ్జక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. వాటికి సమాధానాలు జవాబుపత్రంలో రాయాలి. అదే సమయంలో ఓఎంఆర్ షీట్‌లో బబ్లింగ్ చేయాలి. అయితే ప్రశ్నపత్రంలో ప్రతి ప్రశ్నకు నాలుగు ఆప్షన్లు ఇచ్చిన నిర్వాహకులు, ఓఎంఆర్ షీట్‌లో ఐదు ఇచ్చారు. దీంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు.
*🌻విశాఖపట్నం, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి):*
ఫార్మెటివ్-1 పరీక్షల నిర్వహణ తొలిరోజు గందరగోళంగా సాగింది. పరీక్ష విద్యార్థులకు కాకుండా తమకు నిర్వహించి నట్టుందని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. బుధవారం తొలిరోజు తెలుగు, గణితం పరీక్షలు నిర్వ హించారు. ఈ పరీక్షలలో తొలిసారి ఓఎంఆర్ విధానం అమలుచేశారు. ప్రతి సబ్జక్టులో 15 మార్కులకు ఆబ్జక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. వాటికి సమాధానాలు జవాబుపత్రంలో రాయాలి. అదే సమయంలో ఓఎంఆర్ షీట్‌లో బబ్లింగ్ చేయాలి. అయితే ప్రశ్నపత్రంలో ప్రతి ప్రశ్నకు నాలుగు ఆప్షన్లు ఇచ్చిన నిర్వాహకులు, ఓఎంఆర్ షీట్‌లో ఐదు ఇచ్చారు. దీంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో ఏదైనా ప్రశ్నకు విద్యార్థి ఓఎంఆర్ షీట్‌లో బబ్లింగ్ చేయని పక్షంలో…సంబంధిత క్లాస్ టీచర్ ‘ఈ’ను ఎంపిక చేసి బబ్లింగ్ చేయాలని విద్యా శాఖ ఆదేశించింది. ప్రశ్నపత్రంలో నాలుగు, ఓఎంఆర్ షీటులో ఐదు ఆప్షన్లు ఇవ్వడంపై విద్యార్థులు సందేహం వ్యక్తంచేయడంతో ఉపాధ్యాయులే ‘ఈ’ను బబ్లింగ్ చేశారు. అలాగే ఓఎంఆర్ షీటుపై ఆరు సబ్జక్టుల (తెలుగు, హిందీ, ఇంగ్లీష్, గణితం, సైన్స్, సోషల్) కు సంబంధించి వేర్వేరుగా 15 ప్రశ్నలు వంతున ముద్రించారు. బుధవారం తొలిరోజు తెలుగు, గణితం పరీక్షలు నిర్వహించగా…కొందరు గణితానికి బదులుగా ఓఎంఆర్ షీట్‌లో హిందీ పరీక్షకు కేటాయించినచోట బబ్లింగ్ చేశారు. ఉపాధ్యాయులు గుర్తించి…విద్యార్థులకు మళ్లీ ఓఎంఆర్ షీట్లను సరఫరా చేసి తెలుగు, తరువాత గణితం పరీక్షలకు సంబంధించి ప్రశ్నలకు జవాబులు బబ్లింగ్ చేయించారు. పరీక్షలు విద్యార్థులకు కాకుండా టీచర్లకు నిర్వహించినట్టుందని ఉపాధ్యాయ సంఘ నేత ఒకరు వ్యాఖ్యానించారు. పాఠశాల విద్యా శాఖలో పరీక్షల నిర్వహణ విభాగం అవగాహన రాహిత్యం మరోమారు బహిర్గతమైందని విమర్శించారు. దీనికితోడు ఉదయం పాఠశాల ప్రారంభంలో విద్యార్థులు హాజరును ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన తరువాత పరీక్షలు ఎంతమంది రాస్తున్నారని మరోసారి హాజరు నమోదుచేయాలని ఆదేశించడం చూస్తే…టీచర్లను కావాలనే ప్రభుత్వం వేధిస్తున్నట్టు కనిపిస్తోందని అనకాపల్లి జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు ఒకరు వ్యాఖ్యానించారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
తప్పులు.. తిప్పలు సంక్లిష్టంగా మదింపు పరీక్షలు
*🌻గుడివాడ గ్రామీణం, న్యూస్టుడే:* రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నుంచి ప్రారంభించిన తరగతి గది ఆధారిత మదింపు పరీక్షలు విద్యార్థులు, ఉపాధ్యా యులకు తిప్పలు తెచ్చాయి. విద్యాశాఖ ప్రవేశ పెట్టిన పరీక్షలో వివరణాత్మక, బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. వాటిలో 20 మార్కులకు సమాధానాలు ఓఎమ్మార్ షీట్ లో బబ్లింగ్ (వృత్తాన్ని నలుపుచేయడం) చేయాలి. విద్యార్థులస్థాయికి మించి ప్రశ్నలు అడగడంతో ఏమి చేయాలో తెలియక దిక్కులు చూశారు. ఏడో తరగతి తెలుగులో అపరిచిత గద్యంలో ఏకంగా ఏడు పేరాలు ఇచ్చారు. అది చదవడానికి విద్యా ర్థులు ఇబ్బంది పడ్డారు. 6వ తరగతి లెక్కల పరీక్ష ఉద్యోగాలకు నిర్వహించే స్థాయిలో ఉంది. ఒక చిన్న బిట్కు సమాధానం రాయడానికి ఓ పెద్ద లెక్క చేయాల్సి వచ్చింది. ఇలాంటి ప్రశ్నలతో విద్యార్థులు తీవ్ర గందర గోళానికి గురయ్యారు. ఓఎమ్ఆర్ షీట్ వినియోగించడం ఇదే మొదటిసారి కావడంతో ప్రాథమిక నుంచి ఉన్నత పాఠశాల వరకూ విద్యార్థులందరూ అయోమయానికి గురయ్యారు. షీట్లో ఒక ప్రశ్నకు సమాధానంగా ఒక వృత్తమే రుద్దాలి. పిల్లలకు అవగాహన లేక చాలామంది ఒక ప్రశ్నకు నాలుగు సమాధానాలూ రుద్దారు. మొదటి రోజు పరీక్ష తెలుగు కానీ, ఓఎన్ఆర్ షీట్లో ఇంగ్లిషు పట్టిక ముందు ముద్రించి ఉండటంలో విద్యా ర్థులు ఆ కాలమ్ లో బబ్లింగ్ చేశారు. ఓ ఎమ్ఆర్ షీట్లలో పొరపాట్లు దొర్లకుండా. ఉపాధ్యాయులు ఎన్ని జాగ్రత్తలు తీసు కున్నా చిన్నారులు కంగారులో తప్పులు చేశారు. షీట్లు పాడు చేశారు. ఆ తప్పులు జరిగిన షీటు మార్చి మరొకటి ఇవ్వడానికి కేవలం స్వల్ప సంఖ్యలో మాత్రమే అద నపు పత్రాలు ఇవ్వడంతో కొందరివి తప్పు లతోనే ఉంచాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఓఎమ్హర్ షీట్ను నింపడానికి 1, 2 తరగతుల వారికి సరిగా పెన్ను పట్టుకోవడం కూడా రాక ఇబ్బందులు పడి తప్పులు చేశారు. అయితే 1, 2 తరగతుల పిల్లలు ప్రశ్న పత్రం మీద రాసిన సమాధానాల ఆధారంగా ఉపాధ్యా యులే బబ్లింగ్ చేశారు. ఓ పక్క చిన్నారులకు అవగా హన కల్పించడం, మరో పక్క వారు చేసిన తప్పులు ఎలా సరిచేయాలో తెలియక ఉపాధ్యాయులు నానా అవ స్థలు పడ్డారు. ఈ తరగతి గది ఆధారిత మదింపులో గైర్హాజరైన విద్యార్థికి ఓఎమ్ ఆర్ షీటు ఇచ్చి తిరిగి మరో సారి పరీక్ష రాయించే అవకాశం లేదని తెలుస్తోంది.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
డిసెంబరు నుంచి రెండో సెమిస్టర్
*♦️10లోపు పుస్తకాల సరఫరాకు విద్యాశాఖ ఆదేశాలు*
*🌻ఈనాడు, అమరావతి*: పాఠశాలల్లో రెండో సెమిస్టర్ డిసెంబరు నుంచి ప్రారంభమవుతుందని పాఠశాల విద్య శాఖ ప్రకటించింది. అప్పటికి పాఠ్యపుస్తకాల సర ఫరా పూర్తవుతుందని వెల్లడించింది. 6, 7 తరగతులకు రెండో సెమిస్టర్గా గణితం, సామాన్యశాస్త్రం, సాంఘిక శాస్త్రం, 8వ తరగతి తెలుగు విద్యార్థులకు సామాన్య శాస్త్రం, గణితం, ఆంగ్ల మాధ్యమం వారికి గణితం పాఠ్య పుస్తకాలను అందిస్తున్నట్లు తెలిపింది. 1-5తరగతుల విద్యార్థులకు గణితం, పరిసరాల విజ్ఞానం పాఠ్య పుస్తకాలు మూడు సెమిస్టర్లుగా ఇస్తున్నామని వివరిం చింది. ఇప్పటికే రెండు, మూడు సెమిస్టర్ల పుస్తకాలను జిల్లాలకు అందించినట్లు వెల్లడించింది. ఈనెల 10లోపు విద్యార్థులకు అందించాలని జిల్లా పాఠ్య పుస్తకాల మేనే జర్లను ఆదేశించినట్లు తెలిపింది. పాఠ్యపుస్తకాలకు డబ్బులు చెల్లించిన ప్రైవేటు యాజమాన్యాలకు ఒకేసారి రెండు, మూడు సెమిస్టర్ పుస్తకాలను అందించాలని సూచించింది. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా అందించే పుస్తకాలను అక్టోబరు 31 నాటికే జిల్లా గోదాములకు తరలించినందున జిల్లాల మేనేజర్లు వీటిని పాఠశాలలకు అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. విద్యార్థులకు పుస్తకాలు అందించ డంలో ఎక్కడ ఇబ్బందులు వచ్చినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
14న ట్రిపుల్ ఐటీ సీట్లకు కౌన్సెలింగ్
*🌻వేంపల్లె, న్యూస్టుడే :* ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో ఖాళీగా ఉన్న 266 సీట్ల భర్తీకి ఈ నెల 14న నూజివీడు ట్రిపుల్ ఐటీలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు వర్సిటీ కులపతి ఆచార్య కేసీరెడ్డి తెలిపారు. నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ఎన్సీసీ కోటా కింద 40, క్రీడల కోట కింద 20 సీట్లు, రెండు విడతల కౌన్సెలింగ్ అనంతరం 206 సీట్లు మిగిలిపోయాయన్నారు. వీటి కోసం 6వ తేదీలోగా www.rgukt.in వెబ్సైట్లో ద్రువపత్రాలతో పేర్లు నమోదు చేసుకోవా లని విద్యార్థులకు సూచించారు. 9న ఎంపికైన వారి జాబితా ప్రకటించి, 14న కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. అదేరోజు ఎన్సీసీ, క్రీడల కోటా సీట్లను భర్తీ చేస్తామ న్నారు. క్యాంపస్ ల మార్పు కోసం కూడా ఈ వెబ్సైట్ లోనే పేర్లు నమోదు చేసుకోవచ్చని సూచించారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
పరీక్షల్లో పొంతనలేని ప్రశ్నలు
*🌻కావలి, న్యూస్ టుడే*: ప్రభుత్వ విద్యావిధానం తీరు గందరగోళంగా మారుతోంది. విద్యా సంవత్సరం ఆరంభమైన 4 నెలల తరువాత తరగతి గది ఆధారిత మూల్యాంకన (క్లాస్ రూమ్ బేస్డ్ డ్ ఎసె సెమెంట్) పరీక్షలు చేపట్టారు. 1 నుంచి 8 తరగతులకు పరీక్షలను బుధవారం ఓఎంఆర్ విధానంలో ప్రారంభించారు. తొలి రోజున తెలుగు, గణితం పరీక్షలు నిర్వహించారు. ప్రాథ మిక విద్యా దశ 3, 4 తరగతుల చిన్నారులకు సిలబస్కు సంబంధం లేని ప్రశ్నలే ఎక్కువగా కనిపించాయి. ఉపాధ్యాయులు చెప్పని, పాఠ్యపుస్తకాల్లో లేని ప్రశ్నలు పరీక్షాపత్రాల్లో ఉన్నాయి. కరెన్సీకి సంబంధించిన ప్రశ్నలో 10 పైసలు, 5 పైసల బొమ్మలున్నాయి. ప్రస్తుతం పాఠ్యపుస్తకంలో ఉండేది కరెన్సీ నోట్లే. అయినా పరీక్షాపత్రంలో 10, ఐదు పైసలంటూ ప్రశ్నలడగటం గమనార్హం.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
సీబీఏ, ఎఫ్ఎ1 ప్రశ్నాపత్రాలను పాఠశాలలకు సీఆర్పీలు చేర్చాలి:ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్ డిమాండ్
*🌻అమరావతి,ఆంధ్రప్రభ:* రాష్ట్రంలో 15 వేలకు పైన పాఠశాలలలో ఒకే టీచర్ పనిచేస్తున్నాడని, ఆ టీచర్ ప్రతిరోజు మండల విద్యాశాఖ అధికారి కార్యాలయానికి వెళ్లి ప్రశ్నాపత్రాలు తెచ్చుకోవాలని డిసిసిబి అధికారులు సూచించండం అన్యాయంగా ఉందని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్ పేర్కొంది. కొన్ని పాఠశాలలు మండల కేంద్రానికి 20 నుంచి 30 కిలోమీటర్ల దూరం కూడా ఉన్నవని, ఉపాధ్యాయుడు విద్యార్థులను వదిలి ప్రతిరోజు రెండు పూటలా ఏ విధంగా ప్రశ్నాపత్రాలు తెచ్చుకోవాలని ప్రశ్నించింది. ఈ విషయాన్ని మండల విద్యాశాఖ అధికారులు గమనించాలని, ప్రతి మండలానికి ప్రభుత్వం నలుగురు లేదా ఐదుగురు సిఆర్పిలను కేటాయించినది కనుక సిఆర్పిలు వారి పరిధిలోని పది పాఠశాలలకు ప్రశ్నాపత్రాలు చేరిస్తే ఏకోపాధ్యాయ పాఠశాలలకు ఇబ్బందులు లేకుండా ఉంటాయని తెలిపింది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్ ప్రతినిధి సిహెచ్ ప్రభాకర్ రెడ్డి బుధవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
గ్రూపు-1 దరఖాస్తుల స్వీకరణ గడువు పెంపు
*🌻ఈనాడు, అమరావతి*: గ్రూపు-1 స్క్రీనింగ్ టెస్టు (ప్రిలిమనరీ) దరఖాస్తుల స్వీకరణ తేదీని ఈ నెల 5వ తేదీ వరకు పొడిగించినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. తొలుత ప్రకటించిన ప్రకారం దరఖాస్తుల స్వీకరణ గడువు బుధవారంతో ముగిసింది. అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు గడువు పెంచినట్లు ఏపీపీఎస్సీ పేర్కొంది. ఇప్ప టివరకు 1,12,000 దరఖాస్తులు వచ్చాయి.అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పోస్టుల భర్తీకి ఈ నెల 9, 10 తేదీల్లో రాతపరీక్షను ఆన్లైన్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఏపీపీఎస్సీ తెలిపింది. హాల్ టికెట్లను వెబ్సైట్లో పెట్టినట్లు వెల్లడించింది.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
జమ్ము పాఠశాలకు జాతీయస్థాయి గుర్తింపు
*♦️తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన ఏకైక విద్యాలయం*
*🌻విజయనగరం విద్యావిభాగం-న్యూస్టుడే,*
ఇక్కడి చిత్రాల్లో కార్పొరేట్ పాఠశాలను తలపిం చేలా.. అన్ని రకాల సొబగులతో ఆకట్టుకుం టుంది విజయనగరం జిల్లా కేంద్రంలోని పరిధి లోని జమ్ము ప్రాథమిక పాఠశాల. మన బడిని మనమే చక్కదిద్దుకుందాం అనే లక్ష్యంతో గ్రామస్థులు, తల్లిదండ్రులు, దాతల సహకారంతో అభి వృద్ధికి సంకల్పించారు. ఆ సంకల్పమే ఇప్పుడు స్వచ్ఛ పురస్కారాన్ని సాధించేలా చేసింది. 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఓవ రాల్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాల నుంచి జాతీ యస్థాయిలో ఉత్తమ పాఠశాలగా ఎంపికైంది. ఈ నెల 19న దిల్లీలో పురస్కార ప్రదాన కార్య క్రమం జరగనుంది. ప్రస్తుతం అయిదు తరగ తుల్లో 72 మంది చదువుతున్నారు. 2014లో వచ్చిన హుద్ హుద్ తుపానుతో తరగతి గదులు.. పచ్చని చెట్లు నేలమట్టమయ్యాయి. ఏడాది పాటు ఒకే గదిలో తరగతులు జరిగేవి. దీంతో గ్రామస్థులు స్పందించారు. దాతలు, ప్రజా ప్రతినిధుల సహకారంలో ‘బడి రుణం తీర్చు కుందాం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రూ. 6 లక్షల వరకు వెచ్చించి మౌలిక సదుపాయాలు కల్పించారు. ప్రభుత్వ పథకాలతో అదనపు సౌక ర్యాలు సమకూరాయి. చిన్నారులు ఆటలు ఆడు కునేందుకు ప్రత్యేక పరికరాలు ఏర్పాటు చేశా మని ప్రధానోపాధ్యాయుడు మంత్రి రామ్మోహన రావు ‘న్యూస్టుడే’కు తెలిపారు. ఈ పాఠశాలకు గతంలోనూ పలు అవార్డులు వచ్చాయి.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
నా ఇష్టం.. నాకేమైనా భయమా..? ఉపాధ్యాయురాలి ప్రవర్తనపై ఫిర్యాదు
*🌻అజిత్సింగ్ నగర్, న్యూస్టుడే :* ఉపాధ్యాయురాలి ప్రవర్తనసరిగా లేదంటూ ఓ విద్యార్థి తల్లి బుధవారం వాంబేకాలనీ ధ్యా దక్షిణా మూర్తి ప్రాథమిక పాఠశాల ప్రధానోపా: ధ్యాయుడికి వినతి పత్రం అందజేశారు. విద్యార్థి తల్లి సుధ తెలిపిన వివరాల మేరకు…. పాఠశా లలో ఎం. దీపక్ (7) రెండో తరగతి చదు వుతున్నాడు. రెండు నెలల క్రితం ఉపాధ్యా యురాలు కె. శాంతి బాలుడిని కొట్టడంతో.. అప్పటి నుంచి పాఠశాలకు వెళ్లడం లేదు. బడికి వెళ్ల మంటే ఉపాధ్యాయురాలు కొడతారని భయపడుతున్నాడు. దీంతో అప్పట్లో తరగతి మార్చాలని విద్యార్థి తల్లి సుధ ప్రధానో పాధ్యాయుడిని కోరగా.. మారుస్తానని చెప్పారు. బుధవారం రాత పరీక్షల నిమిత్తం హాజరైన దీపక్ ను మళ్లీ ఉపాధ్యాయు రాలు శాంతి ఉన్న తరగతిలోనే కూర్చోవాలని చెప్పడంతో బాలుడు భయపడ్డాడు. తల్లి వచ్చి.. కుమారుడిని తరగతి.
మార్చాలని ఉపాధ్యాయురాలిని కోరింది. అందుకు ఉపాధ్యాయురాలు నా ఇష్టం. నా భర్త పోలీస్, ప్రధానో పాధ్యాయుడికి చెబితే నాకు ఏమైనా భయమా?’ మాట్లాడారని అంటూ సుధ తెలిపింది. తన కుమారుడిని. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటంతో ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేసి నట్లు ఆమె వివరించింది.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
తెలంగాణ టెన్త్ లో ఏటా ఆరు పేపర్లే
*♦️ఉత్తర్వులు విడుదల*
*🌻ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో*
పదో తరగతి పరీక్షల విధానంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇక నుంచి ఏటా ఆరు పేపర్లతోనే నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయనీ, వాటిని డిఇఒలు, ఆర్జేడీలతోపాటు మోడల్ స్కూళ్లు, తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (టిఆర్ఐఎస్), తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యాలయాల సంస్థ (టిఎంఆర్ఐఎస్), తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టిఎస్ డబ్ల్యూఆర్ఐఎస్), తెలంగాణ గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ (టిడబ్ల్యూఆర్ ఐఎస్), మహాత్మా జోతిబాఫూలే తెలంగాణ బిసి గురుకుల విద్యాలయాల సంస్థ (ఎంజెపిటిబిసిడబ్ల్యూఆర్ఎస్ఐఎస్), కెజిబివిల హెచ్ డిలు అమలు చేయాలని కోరారు. కరోనా నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను 11 పేపర్లకు బదులుగా ఆరు పేపర్లకు కుదించిన విషయం తెలిసిందే. అయితే కరోనా రెండోవేవ్ విజృంభించడంతో 2020-21 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షలను నిర్వహించలేదు. గత విద్యాసంవత్సరంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో 70 శాతం సిలబస్ తోనే పదో తరగతి పరీక్షలను ఆరు పేపర్లకు కుదించి నిర్వహించారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో వంద శాతం సిలబస్ ను విద్యార్థులకు బోధిస్తున్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి ఏటా 11 పేపర్లకు బదులుగా ఆరు పేపర్లతోనే నిర్వహిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్ఎ-2) పరీక్షలనూ ఆరు పేపర్లతోనే నిర్వహించాలని కోరారు. ఇప్పటి వరకు పదో తరగతి పరీక్షలను 11 పేపర్లతో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మొదటి భాష, ద్వితీయ భాష, తృతీయ భాష, మ్యాథ్స్, సైన్స్ (జనరల్ సైన్స్, బయలాజికల్ సైన్స్), సోషల్ స్టడీస్ సబ్జెక్టులకు ఒక్కో పేపర్ ఉండనుంది. పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఫీజు చెల్లించేందుకు గడువు ఈనెల 15 వరకు ఉన్నది. ఆలస్య రుసుం రూ.50తో వచ్చేనెల 30 వరకు, రూ.200తో డిసెంబర్ 15 వరకు, రూ.500తో అదేనెల 29 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశమున్నది. పదో తరగతి పరీక్షలు, ఇతర సమాచారం కోసం www.bse.telangana.gov.in వెబ్సైట్ను సంప్రదించాల్సి ఉంటుంది.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
10 వరకు ఇగ్నో పరీక్ష ఫీజు గడువు పొడిగింపు
*🌻వన్ టౌన్ (విజయవాడ పశ్చిమ):* ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) డిసెంబర్-2022లో నిర్వహించే టర్మ్ ఎండ్ పరీక్షలకు ఆన్లైన్ ద్వారా చెల్లించే పరీక్ష ఫీజు గడువును 10 వరకు పొడిగించింది. 11 నుంచి 15వ తేదీ వరకు రూ.1,100 ఆలస్య రుసుముతో ఆన్లైన్ ద్వారా చెల్లించవచ్చని విజయవాడ ప్రాంతీయ కేంద్రం ఇన్చార్జ్ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ కె. సుమలత తెలి పారు. డిసెంబర్ సెషన్కు సమర్పించే అసెన్ మెంట్ తేదీని ఈ నెల 30 వరకు పొడి గించినట్లు తెలిపారు. వివరాలకు 0866 2565253లో సంప్రదించాలని సూచించారు.