TODAY EDUCATION/TEACHERS TOP NEWS 18/10/2022

WhatsApp Group       Join Now
Telegram Group Join Now
TODAY EDUCATION/TEACHERS TOP NEWS 18/10/2022


Related Post

ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణపై సమీక్ష


*🌻చిలకలపూడి (మచిలీపట్నం):* జిల్లాలో ఈ నెల 18 నుంచి 21వ తేదీ వరకు జరిగే ఏపీపీఎస్సీ ఆన్లైన్ పరీ క్షల నిర్వహణపై అధికారులతో ఏపీపీఎస్సీ డెప్యూటీ సెక్రటరీ జి.కేజియా, అసిస్టెంట్ సెక్రటరీ ఎ. కృష్ణవేణి అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్లోని సమావేశపుహాలులో జరిగిన ఈ సమీ క్షలో వారు మాట్లాడుతూ జిల్లాలోని కానూరులో రెండు సెంటర్లు, ఉంగుటూరు మండలం తేలప్రో లులో ఒక సెంటర్లో ఆన్లైన్ పరీక్షలు జరుగుతా యన్నారు. హార్టీకల్చర్ అధికారి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్, ఫిషరీస్ డెవలప్ మెంట్ ఆఫీసర్, సెరీకల్చర్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్ ఆఫ్ ఆటో మొబైల్ ఇంజినీర్, అగ్రికల్చర్ డైరెక్టర్ ఆఫ్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగాల్లో పరీక్షలు జరుగుతాయని వివరించారు. జిల్లాలో మొత్తం 5,087 మంది అభ్య ర్థులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద తగిన సిబ్బందిని నియమించి 144 సెక్ష నన్ను అమలు చేయాలని, ఇంటర్నెట్, జిరాక్స్ సెం టర్లు మూసి ఉంచేలా చర్యలు తీసుకోవాలని పోలీసు లకు సూచించారు. పరీక్ష కేంద్రాల్లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలన్నారు. కలెక్టరేట్ సూపరింటెండెంట్ ఎం.హరినాథ్ పాల్గొన్నారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

ప్రభుత్వ విద్యా సలహాదారుగా ఆలూరు సాంబశివారెడ్డి


*🌻సాక్షి, అమరావతి*: ప్రభుత్వ విద్యా సల హాదారుగా ఆలూరు సాంబశివారెడ్డి నియ మితులయ్యారు. ఈ మేరకు సాధారణ పరి పాలన శాఖ సోమవారం జీవో విడుదల చేసింది. కేబినెట్ ర్యాంకు హోదాతో సాంబ శివారెడ్డిని ప్రభుత్వ సలహాదారు (విద్య) గా నియమిస్తున్నట్లు అందులో పేర్కొంది. ఆయన ప్రస్తుతం పాఠశాల విద్య నియంత్ర ణ, పర్యవేక్షణ కమిషన్ సీఈవోగా, ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. సాంబశివా రెడ్డి స్పందిస్తూ.. తనపై నమ్మకం ఉంచి, మరింత బాధ్యత అప్పగించినందుకు సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

ఓపెన్ స్కూల్స్ అడ్మిషన్ల గడువు పెంపు


*🌻మచిలీపట్నం*: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించే పదో తరగతి, ఇం టర్మీడియెట్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 25 వరకు గడువు పెంచినట్లు కృష్ణా డీఈఓ తాహెరా సుల్తానా, ఉమ్మడి కృష్ణా జిల్లా ఓపెన్ స్కూల్స్ కో-ఆర్డినేటర్ నక్క బాబురావు సోమవారం తెలి పారు. ఎటువంటి అపరాధ రుసుం లేకుండా ఫీజు చెల్లించి, కోర్సుల్లో అడ్మిషన్లు పొందొచ్చని. సూచించారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఇదే చివరి అవకాశమని, ఈ నెల 25వ తేదీ దాటితే అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుందని. స్పష్టంచేశారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

భోజనంలో నాణ్యత లోపిస్తే చర్యలు: డీవై ఈవో


*🌻మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్టుడే:* మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటామని డీవైఈవో యూవీ సుబ్బారావు హెచ్చరించారు. సోమవారం ఆయన నగరంలోని రుస్తుబాద బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథక నిర్వహణ తీరును పరిశీలించడంతోపాటు విద్యా ర్థినులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా పప్పుచారు, ఇతర వంటకాల్లో నాణ్యత లోపించినట్లు గుర్తించిన ఆయన భోజన పథక నిర్వాహకులతోపాటు ఉపాధ్యాయులను హెచ్చ రించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నా నాణ్యతతో ఉండాలని, ఆ దిశగా ఉపాధ్యాయులు కూడా పర్యవేక్షించాలని అన్నారు. పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు.అనంతరం  ఆయన పాఠశాల ప్రాంగణంలో బందరు మండల ఉపాధ్యాయులకు బోధనపై నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల్లో పాల్గొని వివిధ అంశాలపై అవగాహన కల్పించారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

నేటి నుంచి ఆడిట్ శాఖ ఉద్యోగుల ఆందోళనలు


*🌻ఈనాడు, అమరావతి:* ఏపీ స్టేట్ ఆడిట్ ఉద్యోగులు మంగళవారం నుంచి ఆందోళనకు సిద్ధమయ్యారు. తమ డిమాండ్లు, శాఖాపరమైన సంస్కరణలపై కొన్నాళ్లుగా చర్చలు జరుపుతున్నప్పటికీ విఫలం కావడంతో విజయవాడ ధర్నా చౌక్ ధర్నా చేపట్టనున్నట్లు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రవిశంకర్, అబ్రహం ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు తరలిరావాలని కోరారు. ప్రభుత్వ ఆదే శాలు లేనప్పటికీ ఇన్ఛార్జి స్టేట్ డైరెక్టర్ పదవిలో ఉన్న హరిప్రకాశ్ ఇష్టాను సారం శాఖ స్వరూపాన్ని మార్చేస్తున్నారని విమర్శించారు. తాము ఆందోళన లకు దిగుతామని ఈనెల 12న నోటీసు ఇవ్వగా చర్చలకు ఆహ్వానించారని, సోమవారం నాటి చర్చల్లో ఎలాంటి సానుకూల హామీ దక్కలేదని తెలిపారు. తమ సంఘం ఐక్యవేదిక సభ్యత్వం కలిగి ఉన్నందున ఆందోళనలకు మద్దతి వ్వాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని కోరారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

ఈఏపీసెట్ కౌన్సిలింగ్ 19నుంచి


*🌻ఈనాడు, అమరావతి:* ఇంజినీరింగ్, వ్యవసాయ,ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్ రెండో విడత కౌన్సెలింగ్ 19 నుంచి ప్రారంభించనున్నట్లు కన్వీనర్ నాగరాణి తెలిపారు. ఆన్లైన్ ప్రాసెసింగ్ ఫీజు, ధ్రువపత్రాల పరిశీలన 19-21, కోర్సులు, కళాశాలల ఎంపి కకు ఐచ్ఛికాల నమోదు 19-22, ఐచ్ఛికాల మార్పు 23న, సీట్ల కేటాయింపు 26న ఉంటుంది. కళాశాలల్లో 26 నుంచి 31 వరకు రిపోర్టు చేయాలని సూచించారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

ఆర్మీ అభ్యర్థులకు గుంటూరులో రాత పరీక్ష


*🌻కలెక్టరేట్(గుంటూరు), న్యూస్టుడే:* అగ్నివీర్ ద్వారా ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ఫిజికల్ టెస్టులో అర్హత సాధించిన వారికి నవంబరు 13న గుంటూ రులో రాత పరీక్ష నిర్వహించనున్నారు. గుంటూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో పరీక్ష నిర్వహించనున్నట్లు ఆర్మీ రిక్రూట్మెంట్ కమిటీ డైరెక్టర్ షహజాద్ కోహ్లి తెలిపారు. రాష్ట్రంలోని గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం, వైయస్ఆర్, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, పొట్టిశ్రీరాములు నెల్లూరు, సత్యసాయి జిల్లాల అభ్యర్థులకు గుంటూ రులో రాత పరీక్ష జరుగుతుందన్నారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

ఏపీ పీసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు


*🌻గుంటూరు (ఏఎన్ యూ క్యాంపస్) ప్రభ న్యూస్:* రాష్ట్రంలోని వ్యాయామ కళాశాలల్లో ఉన్న బీపీఈడీ, యూజీ డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధిం చిన ఏపీ పీసెట్-2022 కౌన్సిలింగ్ షెడ్యూల్ ను సోమవారం ఖరార చేశామని ఆచార్య పిజాన్సన్ తెలిపారు. పీసెట్ ప్రవేశాలకు సంబంధించిన కమిటీ సమావేశం సోమవారం ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య హేమచంద్రా రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఆన్లైన్లో ఈనెల 20 నుంచి 22 వరకు రిజిస్ట్రేషన్ సదు పాయం, ఈనెల 21 నుంచి 23 వరకు ఆన్లైన్ విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేయనున్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం లోని హెల్సైన్ కేంద్రంలో ఈ నెల 22న ఎన్సిసి, క్యాప్ కేటగిరి విద్యార్థులకు సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారు. అలాగే ఈనెల 25 నుంచి 26 వరకు వెబ్ ఆప్షన్స్, ఈ నెల 27న వెబ్ ఆప్షన్స్ లో మార్పులకు అవకాశం కల్పించనున్నారు. ఈ నెల 29న సాయంత్రం ఆరు గంటల తర్వాత వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకున్న విద్యార్థులకు ప్రవేశాలను కేటాయిస్తారు. ప్రవేశాలు < పొందిన విద్యార్థులు ఈ నెల 31 నుంచి నవంబర్ 4వ తేదీ లోపు వారికి కేటాయిం చిన కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని కమిటీ నిర్ణయించింది. సమావేశంలో చైర్మన్ హేమచంద్రారెడ్డి తో పాటు పీసెట్ కన్వీనర్ ఆచార్య పి. జాన్సన్, ఉన్నత విద్యా మండలికార్యదర్శి ఆచార్య నజీర్ అహ్మద్, ప్రత్యేక అధికారి డాక్టర్ ఎం సుధీర్ రెడ్డి, విశ్వవిద్యాలయం ప్రతినిధులు ఆచార్య విజయమోహన్, ఎం శివ శంకర్ రెడ్డి, డాక్టర్ రవిశంకర్, డాక్టర్ సుధాకర్, డాక్టర్ వెంకటరావు పాల్గొన్నారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

డిగ్రీలో 32 శాతమే సీట్ల భర్తీ ప్రభుత్వ కళాశాలల్లో 61% సీట్లు ఖాళీ


*🌻ఈనాడు,అమరావతి:*
రాష్ట్రంలోనిడిగ్రీ కళాశాలల్లోకన్వీనర్ కోటాలో31.83శాతం సీట్లు మాత్రమే నిండాయి. మొదటి విడత కన్వీనర్ కోటా సీట్ల భర్తీని ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. అన్ని యాజమాన్యాల్లో కలిపి మొత్తం 3,40,953 సీట్లు ఉండగా.. 1,08,550 సీట్లు భర్తీ అయ్యాయి. ప్రభుత్వ కళాశాలల్లో 39 శాతం మంది మాత్రమే చేరారు. 56,901 సీట్లు ఉండగా.. 22,231 మంది ప్రవేశాలు పొందారు. రెండో విడత కౌన్సిలింగ్ నిర్వహించినా ఈ సీట్ల భర్తీ కావడం కష్టమే. కౌన్సిలిం గ్లో తీవ్ర జాప్యం కారణంగా విద్యార్థులు ఇంజినీరింగ్, ఇతర ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు వెళ్లిపోయారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

ఫోన్లతో చదువులా?:త్వరలో బైజూస్ యాప్ ద్వారా బోధన


*♦️4 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా అమలు*

*♦️ఇప్పటికే స్మార్ట్ఫోన్ల వివరాల సేకరణ*

*♦️ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరాలు*

*🌻(శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి):*
విద్యా విధానంలో మార్పులతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి వరకు జాతీయ విద్యావిధానం పేరిట ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను సమీప ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసింది. దీనివల్ల చాలా మంది విద్యార్థులు అవస్థలు పడుతూనే ఉన్నారు. తాజాగా ప్రభుత్వం ఆన్‌లైన్‌ బోధనకు సన్నద్ధమవుతోంది. నాలుగు నుంచి పదో తరగతి విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్లలో బైజూస్‌ యాప్‌ ద్వారా బోధించేందుకు చర్యలు చేపడుతోంది. ఈ మేరకు విద్యార్థులు ఇంటి నుంచే స్మార్ట్‌ ఫోన్లు తెచ్చుకోవాలని విద్యాశాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విధానంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. స్మార్ట్‌ఫోన్ల కొనుగోలు కారణంగా తమపై ఆర్థిక భారం తప్పదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు విద్యార్థుల చేతికి ఫోన్‌ ఇస్తే.. వారు చదువుతారా? లేదోనన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు సక్రమంగా వినియోగిస్తే పర్వాలేదు కానీ గాడి తప్పితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు.

*♦️జిల్లాలో ఇదీ పరిస్థితి*

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 2,16,047 మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యాశాఖ ఆదేశాల మేరకు వీరందరికీ త్వరలో బైజూస్‌ యాప్‌ ద్వారా బోధనకు ఉపాధ్యాయులు చర్యలు చేపడుతున్నారు. నవంబరు ఒకటో తేదీ నుంచి కొన్ని పరిమితులతో బోధన, స్టడీ అవర్స్‌ ఉంటాయని భావిస్తున్నారు. విద్యార్థులకు బైజూస్‌ కంటెంట్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు విద్యార్థి తల్లిదండ్రుల వద్ద ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను పాఠశాలకు తీసుకెళ్లాలి. తొలుత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తరగతుల వారీగా విద్యార్థుల నుంచి స్మార్ట్‌ ఫోన్‌ ఉన్నదీ, లేనిదీ సమాచారాన్ని సేకరిస్తారు. ఆ వివరాలను యూ-డైస్‌ లాగిన్‌లో స్మార్ట్‌ ఫోన్‌ నంబర్‌తో సహా డేటాను క్యాప్చరింగ్‌ చేసి ఎంటర్‌ చేస్తారు. ఈ నెల 14 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించారు. 20వ తేదీ నాటికి ముగిస్తారు. తర్వాత విద్యార్థుల స్మార్ట్‌ ఫోన్లలో యాప్‌ను ఇన్‌స్టలేషన్‌ చేయడానికి ఈ నెల 21 నుంచి రోజుకి ఒక తరగతి చొప్పున 28 వరకు షెడ్యూల్‌ను నిర్దేశించారు. ఈ మేరకు విద్యార్థుల స్మార్ట్‌ఫోన్‌లో బైజూస్‌ యాప్‌ డౌన్‌లోడ్‌తో పాటు పాఠ్యాంశాల కంటెంట్‌ను అప్‌లోడ్‌ చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియలో సంబంధిత మండలాల క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్‌లు(సీఆర్పీలు) ప్రధానోపాధ్యాయులకు సహకరించనున్నారు. కాగా 8వ తరగతి విద్యార్థులకు, వారికి బోధిస్తున్న ఉపాధ్యాయులకు నవంబరులో ట్యాబ్‌లను ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో 30,272 మంది 8వ తరగతి విద్యార్థులకు విడతలవారీగా ట్యాబ్‌లు పంపిణీ చేస్తారని సమాచారం. ఇదే మాదిరి మిగతా తరగతుల విద్యార్థులకు కూడా ట్యాబ్‌లు పంపిణీ చేస్తే.. తల్లిదండ్రులపై ఆర్థిక భారం తప్పుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

*♦️సర్వత్రా ఆందోళన*

పుస్తకాలు పట్టుకునే చేతికి స్మార్ట్‌ ఫోన్లు ఇవ్వడం వల్ల ఏర్పడే దుష్పరిణామాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పేద కుటుంబాల విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతమంది తల్లిదండ్రులకు స్మార్ట్‌ఫోన్లు ఉంటాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొందరికి స్మార్ట్‌ ఫోన్లు ఉన్నా వాటిని పిల్లలకు ఇచ్చేందుకు తల్లిదండ్రులు ఇష్టపడక పొవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్మార్ట్‌ ఫోన్‌ ఓపెన్‌ చేస్తే బోధనకు సంబంధించిన బైజూస్‌ కంటెంట్‌తో పాటే ఇతర సైట్‌ల వైపు కూడా విద్యార్థులు ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. తరగతి గది బోధన వల్ల సత్ఫలితాలు ఉంటాయి తప్ప.. ఇటువంటి ధోరణులు విద్యార్థులను పెడదోవ పట్టించే అవకాశం లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

*♦️ప్రభుత్వమే ఇవ్వాలి*

టీచర్ల సంఖ్యను కుదించేందుకే ప్రభుత్వం స్మార్ట్‌ ఫోన్లతో ఆన్‌లైన్‌ పాఠ్యాంశాల బోధనను తెరపైకి తెచ్చింది. తరగతి గదిలో టీచర్లు ప్రత్యక్షంగా బోధిస్తేనే ఫలితాలు అంతంత మాత్రంగా వస్తున్నాయి. ఇక విద్యార్థులకు స్మార్ట్‌ ఫోన్లు ఇస్తే మరీ ప్రమాదకరం. స్మార్ట్‌ ఫోన్‌లకు బదులుగా రాష్ట్ర ప్రభుత్వమే విద్యార్థులందరికీ ట్యాబ్‌లను బైజూస్‌ కంటెంట్‌తో అందింస్తే పాఠ్యాంశాల వరకే అవి పరిమితమవుతాయి. కనుక ఇబ్బంది ఉండదు. పిల్లల చేతికి స్మార్ట్‌ ఫోన్ల వల్ల పాఠాలు చదవడం లేదని, పాడవుతున్నారని పలు సందర్భాల్లో రుజువైంది.

*▪️- కిషోర్‌కుమార్‌,యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి*

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

ఉద్యోగాల భర్తీకి భారీ కసరత్తు!


*♦️ప్రభుత్వరంగ సంస్థల్లో ఖాళీల సమాచారం కోరిన కేంద్రం*

*🌻దిల్లీ*: నిరుద్యోగులకు త్వరలోనే భారీ ఊరట లభించే అవకాశముంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి కేంద్రం కసరత్తు ఆరంభించింది. ఖాళీల వివరా లను తెలియజేయాలంటూ అన్ని ప్రభు త్వరంగ సంస్థల నుంచి కేంద్రం సమా చారం కోరినట్టు సీనియర్ అధికారి ఒకరు సోమవారం తెలిపారు. దేశంలో నిరు ద్యోగం పెరుగుతోందంటూ విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశంపై గత జూన్ లో సమీక్షించి, యుద్ధ ప్రాతిపదికన 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. నియామకాలను దీంతో పర్యవేక్షించేందుకు కేంద్ర సిబ్బంది, శిక్షణశాఖ ప్రత్యేకంగా కార్యదళాన్ని ఏర్పాటుచేసింది. వచ్చే ఎన్ని కల నాటికి ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఖాళీలన్నింటినీ భర్తీచేసే అవకాశముం దని విశ్లేషకులు అభిప్రాయపడుతు న్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ ఏడాది డిసెంబరు వరకూ ఖాళీగా ఉన్న ప్రవేశస్థాయి ఉద్యోగాలను వచ్చే ఏడాది ఆగస్టు-సెప్టెంబరు నాటికి భర్తీ చేయనున్నట్టు తెలుస్తోంది. 2020, మార్చి నాటికి వివిధ విభాగాల్లో 8.72 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు కేంద్రం పార్లమెంటుకు తెలిపింది. ఇందులో ఒక్క రైల్వేలోనే 2.3 లక్షల
పోస్టులు ఖాళీగా ఉన్నట్టు సమాచారం.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

విలీన ఎయిడెడ్ సిబ్బందికి OlO పద్దు కింద జీతాలు


*🌻ఈనాడు, అమరావతి*: ఆస్తులతో సహా ప్రభుత్వానికి అప్పగించిన ఎయి డెడ్ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు, ఎయిడెడ్ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో విలీనమైన వారికి 010 పద్దు కింద జీతాలు చెల్లించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 83 ఎయిడెడ్ పాఠశాలలను ప్రభు త్వానికి ఆస్తులతో సహా యాజమాన్యాలు అప్పగించాయి. 722 ఎయిడెడ్ పాఠ శాలల నుంచి 2,188 మంది సిబ్బంది ప్రభుత్వ పాఠశాలల్లో విలీనమయ్యారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

ఉపాధ్యాయుల పదోన్నతుల పరిశీలనకు ప్రత్యేక అధికారులు


*🌻ఈనాడు, అమరావతి*: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల హేతు బద్ధీకరణ, సబ్జెక్టు పోస్టుల మార్పు, పాఠశాలల ఉన్నతీకరణ, తరగతుల విలీనం, ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు సంబంధించిన ప్రక్రియలను పరిశీలించేందుకు జిల్లాకో ఇన్ఛార్జి అధికారిని నియమిస్తూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి 13జిల్లాల ప్రాతిపదికన నియమించారు. శ్రీకా కుళం జిల్లాకు విశాఖ ఆర్జేడీ జ్యోతి కుమారి, విజయనగరం జిల్లాకు జేడీ. నాగమణి, విశాఖపట్నం జిల్లాకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి, తూర్పుగోదావరి జిల్లాకు ఆర్జేడీ మధుసూదన్, పశ్చిమగోదావరి జిల్లాకు ఎస్ సీఈఆర్టీ డైరెక్టర్ ప్రతాప్రెడ్డి, కృష్ణా జిల్లాకు ప్రజా గ్రంథాలయాల శాఖ డైరెక్టర్ ప్రసన్నకుమార్, గుంటూరు జిల్లాకు సమన్వయ డైరెక్టర్ పార్వతి, ప్రకాశం జిల్లాకు జేడీ మేరీ చంద్రిక, నెల్లూరు జిల్లాకు గుంటూరు. ఆర్జేడీ సుబ్బారావు, చిత్తూరు జిల్లాకు పాఠ్యపుస్తకాల డైరెక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి, కడప జిల్లాకు ఆర్జేడీ వెంకట కృష్ణారెడ్డి, అనంతపురం జిల్లాకు సార్వత్రిక విద్యాపీఠం డైరెక్టర్ శ్రీనివాసులరెడ్డి, కర్నూలు జిల్లాకు ఏపీఆర్ఐఎస్ కార్య దర్శి నరసింహారావును నియమించారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
sikkoluteachers.com

Recent Posts

‘EMBEDDED FIGURES’ NMMS MENTAL ABILITY ONLINE TESTS

'EMBEDDED FIGURES' NMMS MENTAL ABILITY ONLINE TESTS re you preparing for the NMMS exam? Do… Read More

November 7, 2024

‘MIRROR IMAGES’ NMMS MENTAL ABILITY ONLINE TESTS

'MIRROR IMAGES' NMMS MENTAL ABILITY ONLINE TESTS re you preparing for the NMMS exam? Do… Read More

November 6, 2024

‘COMPLETING FIGURES 2 ‘ NMMS MENTAL ABILITY ONLINE TESTS

'COMPLETING FIGURES 2' NMMS MENTAL ABILITY ONLINE TESTS re you preparing for the NMMS exam?… Read More

November 5, 2024

‘DOT SITUATION 2’ NMMS MENTAL ABILITY ONLINE TESTS

'DOT SITUATION 2' NMMS MENTAL ABILITY ONLINE TESTS re you preparing for the NMMS exam?… Read More

November 4, 2024

‘LETTERS/WORDS – ANALOGY’ NMMS MENTAL ABILITY ONLINE TESTS

'LETTERS/WORDS - ANALOGY' NMMS MENTAL ABILITY ONLINE TESTS re you preparing for the NMMS exam?… Read More

November 3, 2024

‘LETTERS/WORDS – ODD MAN OUT ‘ NMMS MENTAL ABILITY ONLINE TESTS

'LETTERS/WORDS - ODD MAN OUT' NMMS MENTAL ABILITY ONLINE TESTS re you preparing for the… Read More

November 2, 2024

‘MATHEMATICAL OPERATIONS’ NMMS MENTAL ABILITY ONLINE TESTS

'MATHEMATICAL OPERATIONS' NMMS MENTAL ABILITY ONLINE TESTS re you preparing for the NMMS exam? Do… Read More

November 1, 2024

‘COMPLETING FIGURES ‘ NMMS MENTAL ABILITY ONLINE TESTS

'COMPLETING FIGURES' NMMS MENTAL ABILITY ONLINE TESTS re you preparing for the NMMS exam? Do… Read More

October 31, 2024

‘ANALOGY’ NMMS MENTAL ABILITY ONLINE TESTS

'ANALOGY' NMMS MENTAL ABILITY ONLINE TESTS re you preparing for the NMMS exam? Do you… Read More

October 30, 2024

‘DOT SITUATION’ NMMS MENTAL ABILITY ONLINE TESTS

'DOT SITUATION' NMMS MENTAL ABILITY ONLINE TESTS re you preparing for the NMMS exam? Do… Read More

October 29, 2024