TELANGANA STATE CO- OPERATIVE OPEX BANK LTD RECRUITMENT 2022
హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శాఖల్లో ఖాళీగా ఉన్న మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రెండు దశల రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య 40
1. మేనేజర్(స్కేల్-1): 27 పోస్టులు
అర్హత: 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా 55 శాతం మార్కులతో కామర్స్ డిగ్రీ ఉండాలి.
వయోపరిమితి: 01.09.2022 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు కేటగిరీల వారీగా 10-15 సంవత్సరాల వరకు వయోసడలింపు ఉంటుంది.
జీత భత్యాలు: రూ.36000-రూ.63840
ఎంపిక విధానం: ప్రిలిమినరీ ఎగ్జామినేషన్(ఆబ్జెక్టివ్), మెయిన్ ఎగ్జామినేషన్(ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్) ఆధారంగా.
2) స్టాఫ్ అసిస్టెంట్: 13 పోస్టులు
అర్హత: 55% మొత్తం మార్కులతో ఏదైనా డిగ్రీ/ డిగ్రీ(కామర్స్) ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర స్థానికతతో పాటు తెలుగు భాషలో ప్రావీణ్యం
అవసరం.
వయోపరిమితి: 01.09.2022 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు: రూ.17,900 – రూ.47,920 ఉంటుంది.
ఎంపిక విధానం: స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్(ఆబ్జెక్టివ్), మెయిన్ ఎగ్జామినేషన్(ఆబ్జెక్టివ్) ఆధారంగా నియమిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు రుసుము: రూ.950 (ఎస్సీ, ఎస్టీ, పీసీ అభ్యర్థులకు రూ.250).
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్.
ముఖ్యమైన తేదీలు..
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 28.09.2022.
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 16.10.2022.
* దరఖాస్తు ఫీజు చెల్లింపు తేదీలు: 28.09.2022 నుంచి 16.10.2022 వరకు.
Notification for Appointment to the posts of Manager (Scale-I) in TSCAB
Notification for Appointment to the posts of Staff Assistant in TSCAB
Online Application for the posts of Manager (Scale-I) & Staff Assistant in TSCAB