HDFC Bank Parivartan’s ECS Scholarship 2022-23 – Details Here
హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ పరివర్తన్ ఈసీఎస్ స్కాలర్షిప్ – 1వ తరగతి నుండి PG ప్రోగ్రామ్ వరకు – స్కాలర్షిప్: రూ.15000 – రూ.75000 వరకు.
హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ 2022-23 విద్యా సంవత్సరానికిగాను అర్హులైన విద్యార్థుల నుంచి కింది స్కాలర్ షిప్ కోసం దరఖాస్తులు కోరుతోంది.
1. హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ పరివర్తన్ స్కాలర్షిప్ స్కూల్ ప్రోగ్రాం.
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో 1-12 తరగతి ఉత్తీర్ణత.
స్కాలర్షిప్: 1-8వ తరగతి వరకు రూ.15000, 7-12వ తరగతి వరకు రూ.18000 చెల్లిస్తారు.
2. హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ పరివర్తన్ స్కాలర్షిప్ అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాం.
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ చదువుతున్న వారు అర్హులు.
* 10, 12వ తరగతి, డిప్లొమా చేస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
స్కాలర్ షిప్: డిప్లొమా వారికి రూ.20000, అండర్ గ్రాడ్యుయేషన్-రూ.30000, ప్రొఫెషనల్ కోర్సులురూ.50000 చెల్లిస్తారు.
3. హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ పరివర్తన్ స్కాలర్షిప్ పీజీ ప్రోగ్రాం.
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ/ పీజీ చదువుతున్న వారు అర్హులు.
స్కాలర్షిప్: పీజీ కోర్సులు చేస్తున్న వారికి రూ.35000, ప్రొఫెషనల్ పీజీ కోర్సులు-రూ.75000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అభ్యర్థుల కుటుంబ ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకుని, సంస్థ నిబంధనల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేది: 31.08.2022.