TS POLICE CONSTABLES PRILIMS EXAM INSTRUCTIONS
TS POLICE అభ్యర్థులకు ముఖ్య సూచనలు
TS Police: కానిస్టేబుల్ పరీక్ష హాల్‌టికెట్లు డౌన్‌లోడ్
అర్హత మార్కులు కుదింపు:
కానిస్టేబుల్ ప్రాథమిక రాతపరీక్షలో ఈసారి కనీస అర్హత మార్కుల్ని కుదించారు. ఇప్పటివరకు జరిగిన పరీక్షల్లో ఎస్సీ/ఎస్టీలు 30శాతం.. బీసీలు 35శాతం.. ఇతరులు 40శాతం కనీస మార్కులు సాధిస్తేనే అర్హులుగా పరిగణించేవారు. ఈసారి సామాజికవర్గాలతో నిమిత్తం లేకుండా అందరికీ 30శాతం కనీస మార్కులనే అర్హతగా పరిగణిస్తారు. రాతపరీక్షలో మొత్తం 200 ప్రశ్నలుంటాయి. వీటిలో 60 మార్కులు వస్తే సరిపోతుంది. ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు అడుగుతారు. నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి 5 తప్పు సమాధానాలకు ఒక మార్కు కోత విధిస్తారు. ప్రిలిమినరీ రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులే తర్వాత దశలో నిర్వహించే శారీరక సామర్థ్య పరీక్షలకు హాజరువుతారు. ఇందులోనూ అర్హత సాధించిన అభ్యర్థులు తుది రాతపరీక్షకు అర్హత సాధిస్తారు. తుది పరీక్షలో మాత్రం నెగెటివ్ మార్కులుండవు.
- కానిస్టేబుల్ రాతపరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఉదయం 10 గంటలకే పరీక్ష కేంద్రం గేట్లు మూసేస్తారని మండలివర్గాలు స్పష్టం చేశాయి. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు.
- పోలీసు నియామక మండలి అధికారిక వెబ్‌సైట్ tslprb.in నుంచి హాల్‌టికెట్లను ఏ4సైజ్ పేపర్‌లో డౌన్‌లోడ్ చేసుకున్న అనంతరం నిర్దేశిత స్థలంలో తప్పనిసరిగా అభ్యర్థి ఫొటోను గమ్‌తో అతికించుకోవాలి. దరఖాస్తు చేసిన సమయంలో డిజిటల్ కాపీలో ఉంచిన ఫొటోనే తిరిగి వినియోగించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పిన్‌లు కొట్టొద్దు. హాల్‌టికెట్ మీద ఫొటో లేకుంటే పరీక్షకు అనుమతించరు.
- బయోమెట్రిక్ విధానం అనుసరించనున్న నేపథ్యంలో అభ్యర్థుల చేతులకు మెహిందీ, టాటూలు ఉంచుకోకూడదు.
- అభ్యర్థి పరీక్ష గదిలోకి తనవెంట హాల్‌టికెట్‌తో పాటు బ్లూ లేదా బ్లాక్ పాయింట్‌పెన్‌ను మాత్రమే తీసుకెళ్లాలి. సెల్‌ఫోన్, టాబ్లెట్, పెన్‌డ్రైవ్, బ్లూటూత్ డివైజ్, చేతిగడియారం, కాలుక్యులేటర్, లాగ్‌టేబుల్, వాలెట్, పర్స్, నోట్స్, చార్ట్, రికార్డింగ్ పరికరాలు, ఖాళీపేపర్లను వెంట తీసుకెళ్లరాదు.
- మహిళా అభ్యర్థులు బంగారు ఆభరణాలు ధరించి పరీక్షకు వెళ్లకూడదు. విలువైన వస్తువుల్ని భద్రపరిచేందుకు పరీక్ష కేంద్రాల్లో క్లాక్‌రూం సదుపాయం ఉండదు అన్న సంగతి గుర్తించాలి.
- ఓఎంఆర్ షీట్లపై అనవసర రాతలు, గుర్తులు, మతసంబంధ అంశాల్లాంటివి రాస్తే మాల్‌ప్రాక్టీస్‌గా పరిగణిస్తారు.
- పరీక్షపత్రం బుక్లెట్‌లో ఇంగ్లిష్-తెలుగు, ఇంగ్లిష్-ఉర్దూ భాషలలో ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నల్లో ఏవైనా సందేహాలుంటే ఇంగ్లిష్ వెర్షన్‌నే పరిగణనలోకి తీసుకోవాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలా…
★ డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్‌ను ప్రింట్ (కలర్‌లోనే తీసుకోవాలన్న నిబంధన ఏమీ లేదు) తీసుకోవాలి.
★ అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలను కూడా కాగితానికి మరోవైపు ప్రింట్ తీసుకోవాలి.
★ పరీక్షకు ఒకరోజు ముందుగా పరీక్ష కేంద్రం సరిచూసుకోవడం ఉత్తమం. పరీక్ష రోజు నేరుగా కేంద్రానికి వెళ్లవచ్చు. చివరి నిమిషంలో ఆందోళన ఉండదు.
★ దరఖాస్తు సమయంలో అభ్యర్థులు అప్‌లోడ్ చేసిన ఫొటోను హాల్‌టికెట్‌పై అతికించాలి. వేరే దాన్ని అతికించినా, హాల్‌టికెట్ అసమగ్రంగా ఉన్నా పరీక్షకు అనుమతించరు.
★ ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఉండదు.
★ పరీక్ష రాస్తున్నప్పుడు అభ్యర్థుల డిజిటల్ వేలిముద్ర తీసుకుంటారు.
★ పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థులకు సంబంధించిన సామగ్రి భద్రపరుచుకునే సదుపాయం ఏదీ ఉండదు.
★ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 9 గంటలకు పరీక్షా కేంద్రానికి తప్పనిసరిగా చేరుకోవాలి.
★ పరీక్షా సమయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు.
★ ఉదయం 10 గంటల తర్వాత.. నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించరు.
★ హాల్‌టికెట్ తప్పనిసరిగా తెచ్చుకోవాలి. లేకపోతే పరీక్షకు అనుమతించరు.
★ నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకూహాల్‌టికెట్ భద్రపరచుకోవాలి.
★ అభ్యర్థులు తమ ఒరిజినల్ గుర్తింపు కార్డు (ఆధార్ కార్డ్, పాన్ కార్డు, పాస్ పోర్టు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్సు) తీసుకురావాల్సి ఉంటుంది
★ పాస్ పోర్ట్ సైజు ఫోటో కూడా వెంట తీసుకురావా
★ అభ్యర్థులు తమ వెంట బ్లాక్ పెన్, బూల్ పెన్ తేవాలి
★ పరీక్ష కేంద్రంలోకి సెల్‌ఫోన్, కాలిక్యులేట్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు తేరాదు. అలాగే ఎలాంటి పుస్తకాలు, గైడ్లు, స్టడీ మెటిరియల్ పరీక్ష కేంద్రంలోకి తీసుకురాకూడ
★ పరీక్షా సమయం పూర్తయ్యే వరకు అభ్యర్థులు పరీక్ష కేంద్రం బయటకు వెళ్లరాదు
★ పరీక్ష హలులో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన అభ్యర్థులు చట్టప్రకారం శిక్షార్హులుగా పరిగణించబడతారు.