ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని పీజీ కోర్సుల పరీక్షా తేదీలను అధికారులు ఖరారు చేశారు. ఈ మేరకు పరీక్షల తాజా షెడ్యూలును అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు వెబ్‌సైట్ ద్వారా పరీక్ష తేదీలను తెలుసుకోవచ్చు.
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. ఎంఏ, ఎంకామ్, ఎంకామ్ (ఐఎస్), ఎంఎస్‌డబ్ల్యూ, ఎమ్మెస్సీ, ఎంలిబ్‌ఐఎస్సీ, ఎంజేఅండ్‌ఎంసీ కోర్సుల రెండు, నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలను సెప్టెంబరు 2 నుంచి నిర్వహించనున్నట్లు తెలిపారు.
అలాగే ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ) రెండు, నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలను సెప్టెంబరు 7 నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని సూచించారు.