AP DEECET 2024 Hall Tickets: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ నిర్వహించే డిఇఇసెట్ 2024 హాల్ టిక్కెట్లు విడుదల అయ్యాయి. ఆన్‌లైన్‌లో హాల్ టిక్కెట్లను జారీ చేస్తున్నారు. మే 24న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ తెలిపారు.
రాష్ట్రంలోని ప్రాథమిక ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించే డిసెట్ (DEECET-2024) ఈనెల 24న నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ తెలిపారు. ఏప్రిల్ 22న ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ జారీ చేశారు.
అభ్యర్థులు ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన తమ హాల్ టికెట్లను https://cse.ap.gov.in/ వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్న వెంటనే అందులో వివరాలను సరి చూసుకోవాలని సూచించారు. అభ్యర్థి పేరు, తండ్రి పేరు, ఆధార్ నంబరు, మీడియం మొదలైన అంశాల్లో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే కింద తెలిపిన హెల్ప్ లైన్ నెంబర్ లకు (8125046997 మరియు 8121947387) ఫోన్ చేసి సవరించుకోవాలని సూచించారు.
అధికారులు తప్పులను సవరించి హాల్ టికెట్లను తిరిగి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకొని మే 24న జరిగే పరీక్షకు హాజరవ్వాలని సూచించారు.
ఏపీ డిఇఇ సెట్ 2024 హాల్ టిక్కెట్లు విడుదలయ్యాయి. 2024-25 విద్య సంవత్సరాల్లో రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సులో ప్రవేశాల కోసం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. హాల్ టిక్కెట్ కోసం ఈ లింకును అనుసరించండి.. https://apdeecet.apcfss.in/
డిఇఇసెట్ 2024కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులు హాల్ టిక్కెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ విద్యార్హతతో రెండేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అడ్మిషన్ పొందే నాటికి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. ఏ, బి క్యాటగిరీ సీట్లలో ప్రవేశాల కోసం కనీసం ఇంటర్‌లో 50శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
ఎస్సీ ఎస్టీ,దివ్యాంగులకు 45 శాతం సరిపోతుంది.ఇంటర్‌లో మ్యాథ్స్ చదివిన వారికి 25శాతం సీట్లు, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో చదివిన వారికి 25శాతం, బయాలజీ, జువాలజీ చదివిన వారికి 25శాతం, సివిక్స్, ఎకనామిక్స్, హిస్టరీ, జాగ్రఫీ, కామర్స్‌లో ఏదైనా రెండు సబ్జెక్టులు చదివిన వాళ్లకు 25శాతం సీట్లు కేటాయిస్తారు.
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా నిర్వహిస్తారు. 100మార్కులకు ప్రశ్నాపత్రానికి అబ్జెక్టివ్ విధానంలో సమాధానాలు రాయాల్సి ఉంటుంది. పార్ట్ ఏలో 60మార్కులకు, పార్ట్ బిలో 40మార్కులకు ప్రశ్నలు ఉంటాయి.
ఏప్రిల్ 22 నాడు నోటిఫికేషన్ వెలువడింది. ఏప్రిల్ 23 నుంచి మే 8వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఏప్రిల్ 24 నుంచి మే 9వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. మే 15 నుంచి ఆన్‌లైన్ హాల్ టిక్కెట్లు జారీ చేస్తున్నారు.హాల్ టిక్కెట్లను పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మే 24వ తేదీన డిఇఇసెట్ 2024నిర్వహిస్తారు. మే 30వ తేదీన ఫలితాలను విడుదల చేస్తారు.
జూన్ 6వ తేదీ నుంచి జూన్ 8వరకు అభ్యర్థులు తమ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. జూన్ 10న మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు. జూన్ 12 నుంచి 15వ తేదీ ప్రభుత్వ డైట్ కాలేజీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించి అడ్మిషన్ లెటర్లు ఇస్తారు. జూన్ 20 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి. పూర్తి వివరాలకు ఈ లింకును క్లిక్ చేయండి.
'EMBEDDED FIGURES' NMMS MENTAL ABILITY ONLINE TESTS re you preparing for the NMMS exam? Do… Read More
'MIRROR IMAGES' NMMS MENTAL ABILITY ONLINE TESTS re you preparing for the NMMS exam? Do… Read More
'COMPLETING FIGURES 2' NMMS MENTAL ABILITY ONLINE TESTS re you preparing for the NMMS exam?… Read More
'DOT SITUATION 2' NMMS MENTAL ABILITY ONLINE TESTS re you preparing for the NMMS exam?… Read More
'LETTERS/WORDS - ANALOGY' NMMS MENTAL ABILITY ONLINE TESTS re you preparing for the NMMS exam?… Read More
'LETTERS/WORDS - ODD MAN OUT' NMMS MENTAL ABILITY ONLINE TESTS re you preparing for the… Read More
'MATHEMATICAL OPERATIONS' NMMS MENTAL ABILITY ONLINE TESTS re you preparing for the NMMS exam? Do… Read More
'COMPLETING FIGURES' NMMS MENTAL ABILITY ONLINE TESTS re you preparing for the NMMS exam? Do… Read More
'ANALOGY' NMMS MENTAL ABILITY ONLINE TESTS re you preparing for the NMMS exam? Do you… Read More
'DOT SITUATION' NMMS MENTAL ABILITY ONLINE TESTS re you preparing for the NMMS exam? Do… Read More