TRENDING

ENGINEERING DAY 2023: Why it is celebrated on September 15

WhatsApp Group       Join Now
Telegram Group Join Now

ENGINEERING DAY 2023: Every year on September 15, India celebrates Engineers’ Day to honor M. Visvesvaraya’s birthday and commemorate his contributions to science and technology. His full name is Moksha Gundam Visvesvaraya, however he is most commonly referred to as M Visvesvaraya. On September 15, engineers are also honored in Tanzania and Sri Lanka.

engineering day2023

Engineers’ Day 2023: Interesting facts on M Visvesvaraya

M. Visvesvaraya was born in a Telugu family in the year 1861 in the Karnataka town of Chikkaballapur, around 60 kilometers away from Bengaluru.

Visvesvaraya left his birthplace after completing his formal education to pursue a BA at the University of Madras.

Later on, he changed his course and enrolled in the College of Science in Pune to obtain a diploma in civil engineering.
– M. Visvesvaraya excelled in

ENGINEERING DAY 2023: MOKSHA GUNDAM VISVESWARAYYA BIO GRAPHY IN TELUGU

‘భారతరత్న’ మోక్షగుండం విశ్వేశ్వరయ్య

సెప్టెంబర్ 15
ఇంజనీర్ దినోత్సవం సందర్భంగా గా..

“ప్రజల సంపాదనాశక్తిని, కార్యదక్షతను నైపుణ్యాన్ని వివిధములైన చేతిపనుల ద్వారా పెంపొందించాలి. చేతనైన వారందరూ కష్టించి పని చేసే వీలు కల్పించాలి. యాంత్రిక శక్తిని ఉపయోగించుకుని దేశ పారిశ్రామిక ప్రగతికి ముందంజ వేయాలి. భారతీయులలో ప్రబలంగా ఉన్న ‘అంతా తలరాత’ అన్న అలస భావం రూపుమాపి నిరంతర కృషి ద్వారా సంపదను సాధించే దీక్షను, కర్తవ్య పాలనను ప్రజలలో రేకెత్తించుట ప్రభుత్వం కర్తవ్యం.”

1912 మైసూరు సంస్థాన దివానుగా అధికారాన్ని చేపడుతూ శ్రీ విశ్వేశ్వరయ్య చేసిన ప్రసంగం నుండి పై వాక్యాలు ఉటంకింపబడినాయి. విశ్వవిఖ్యాత ఇంజనీర్‌గా, పాలనాదక్షుడుగా, రాజనీతిజ్ఞుడుగా, నిష్కామ దేశభక్తుడిగా అఖండ కీర్తిని ఆర్జించిన మహనీయుడు శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య.

Related Post

విశ్వేశ్వరయ్య పూర్వీకులు నేటి ప్రకాశం జిల్లాలోని మోక్షగుండం గ్రామం నుండి సుమారు రెండు శతాబ్దాల క్రితం, కర్ణాటక రాష్ట్రం (అప్పట్లో మైసూరు) లోని, చిక్క బళ్ళాపుర సమీపంలోని ముద్దేనహళ్ళిలో స్థిరపడినారు. అక్కడే విశ్వేశ్వరయ్య 1861 సెప్టెంబర్ 15వ తేదీన జన్మించారు. తండ్రి శ్రీనివాస శాస్త్రి. తల్లి వెంకట లక్ష్మమ్మ. వారిదో సామాన్య కుటుంబం. బాల్యంలోనే తండ్రి మరణించాడు. మేన మామ రామయ్య బాలుడైన విశ్వేశ్వరయ్యను చేరదీసి బెంగుళూరు సెంట్రల్ కాలేజీలో చదువుకునే ఏర్పాటు చేశాడు.

విశ్వేశ్వరయ్య గారి విద్యార్థి జీవితం విద్యాభ్యాసం సాగించే వారందరికీ దిక్సూచి. మేనమామ ఇంట్లోవుంటూ కాలేజీ ఫీజులకోసం ప్రైవేట్ ట్యూషన్ చెబుతూ 1881లో పట్టభద్రులయ్యారు. సెంట్రల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఛార్లెస్ వాటర్స్ విశ్వేశ్వరయ్య నెంతగానో ప్రోత్సహించాడు. గణితంలో అసామాన్య ప్రతిభకల విశ్వేశ్వరయ్య గారి నుండి అధ్యాపకులే తమ సంశయాలను పరిష్కరించుకునేవారు. శిష్యుని కుశాగ్ర బుద్ధికి ముగ్ధుడైన ప్రిన్సిపాల్ తాను ఉపయోగించుకునే వెబ్‌స్టర్ డిక్షనరీని బహుమానంగా ఇచ్చాడు. తన కోటుకున్న బంగారు బొత్తాములను భార్యద్వారా శిష్యుడు విశ్వేశ్వరయ్యకు పంపారు. అదీ ఆనాటి గురుశిష్యుల అనుబంధం – శిష్యవాత్సల్యం.

ఇటువంటి పెద్దలు ఆదరించినందువల్లనే బాలుడైన విశ్వేశ్వరయ్య, ఆ తర్వాత డా. ఎం.వి; సర్. ఎం.వి; భారతరత్న ఎం.వి. అంటూ ప్రస్తుతింపబడినారు. అప్పట్లో మైసూరు సంస్థాన దివానుగా వుండిన దివాన్ రంగాచార్లుగారు విశ్వేశ్వరయ్య విద్యావినయములను గుర్తించి ఇంజనీరింగ్ విద్యాభ్యాసం సాగించేందుకు స్కాలర్‌షిప్ మంజూరు చేసి, పూనేకు పంపారు. ఇంజనీరింగ్ పరీక్షలో బొంబాయి రాష్ట్రంలో సర్వప్రథముడుగా ఉత్తీర్ణులైన విశ్వేశ్వరయ్యగారిని రాష్ట్ర ప్రభుత్వం నేరుగా అసిస్టెంట్ ఇంజనీర్ గా నియమించింది. ఏడాది లోపునే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా నియమించారు. ఆ రోజుల్లో అందులోను ఆంగ్లేయుల పాలనలో అంత త్వరలోనే పదవీ ఉన్నతి పొందడం చాల అరుదు. పూనేలో ఉన్నప్పుడే గోఖలే, తిలక్, రనడే వంటి మహనీయుల సాహచర్యం విశ్వేశ్వరయ్య గారికి లభించింది. గాంధీజీ, నెహ్రూల కంటే వయస్సులో పెద్ద విశ్వేశ్వరయ్య.

ఆంగ్ల పాలకులు విశ్వేశ్వరయ్యగారి కార్యదీక్షను గుర్తించి ప్రపంచ జలాశయాలలో ఒకటిగ పెద్దదైన బరాజ్ (సింధురాష్ట్రం) నిర్మాణానికి ప్రత్యేక ఇంజనీర్ గా నియమించారు. బ్రహ్మాండమైన ఈ జలాశయ నిర్మాణం నాలుగేళ్ళలో పూర్తి అయింది.

1901లో భారత ప్రభుత్వ ప్రతినిధిగ విశ్వేశ్వరయ్యగారు జపాన్ దేశం వెళ్ళి అచట కుటీర పరిశ్రమల తీరుతెన్నులను అవలోకించారు. ఆ పద్ధతిలో కుటీర పరిశ్రమల అభివృద్ధికి బృహత్ పధకాన్ని సిత్థపరచి ప్రభుత్వానికి అందించారు. జపాన్ పర్యటనానంతరం, విశ్వేశ్వరయ్యగారు పూనా నగర నీటి సరఫరా పధకాన్ని రూపొందించారు. ఆ నిర్మాణ కాలంలోనే ఆటోమేటిక్ స్లూస్‌గేట్ రూపొందించారు. ఈ స్లూస్‌గేట్ నిర్మాణం ప్రపంచ ఇంజనీర్ల మన్ననలందుకున్నది. ఈ కొత్త పరిశోధనను తన పేరు మీద పేటెంట్ చేసుకోవలసిందిగ మిత్రులు సూచించారు. తన కార్యనిర్వహణలో భాగంగా సాగినదికాన పేటెంట్ తీసుకోవటం సముచితం కాదన్నాడు. లార్డ్ కిచనర్ స్లూస్‌గేట్ నిర్మాణంలో విశ్వేశ్వరయ్య ప్రతిభను కొనియాడాడు.

1906లో ఏడెన్ నగరం నీటి, సరఫరా ప్రణాళికను రూపొందించారు. ప్రభుత్వం విశ్వేశ్వరయ్యగారిని సూపరింటెండెంట్ ఇంజనీర్ గా నియమించింది. అప్పుడే కొల్హాపూర్, ధార్వాడ, బిజాపూర్ మొదలగు పట్టణాలలో మంచినీటి పథకాలను సిద్ధపరచారు. బొంబాయి రాష్ట్ర ప్రభుత్వోద్యోగాన్ని స్వయంగా వదులుకున్నారు. రెండు సంస్థానాల నుండి ఛీఫ్ ఇంజనీర్ పదవులు చేపట్టమని ఆహ్వానాలు వచ్చాయి. అన్నిటిని తిరస్కరించి ఇటలీ, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ, మొదలగు దేశాలలోని బృహన్నిర్మాణాలను పరిశీలించి, ఆయాదేశ శాస్త్రవేత్తలతో సంప్రదింపులు జరిపి 1909లో స్వదేశం వచ్చారు.

ఇటలీ పర్యటనలో ఉన్నపుడే హైదరాబాద్ నగర రక్షణా పథకం నిర్మించుటకు స్పెషల్ చీఫ్ ఇంజనీర్ గా ఆహ్వానించాడు నిజాం. విశ్వేశ్వరయ్యగారి నేతృత్వంలో సాగినవే హుసేన్‌సాగర్, హైదరాబాదు నగర విస్తృత పథకాలు.

sikkoluteachers.com

Recent Posts

TG DSC 2024 QUESTION PAPERS WITH KEY DOWNLOAD

Telangana Department of School Education Released TG DSC 2024 QUESTION PAPERS WITH KEY. Here we… Read More

January 19, 2025

NMMS MODEL GUESS PAPER 03

NMMS MODEL GUESS PAPER 03NMMS MODEL GUESS PAPER 03HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More

December 7, 2024

NMMS MODEL GUESS PAPER 02

NMMS MODEL GUESS PAPER 02NMMS MODEL GUESS PAPER 02HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More

December 2, 2024

NMMS MODEL GUESS PAPER 01

NMMS MODEL GUESS PAPER 01 NMMS MODEL GUESS PAPER 01 HOW TO ATTEMPT AP NMMS… Read More

November 28, 2024

NMMS MODEL GRAND TEST – 10

NMMS MODEL GRAND TEST - 10NMMS MODEL GRAND TEST - 10HOW TO ATTEMPT AP NMMS… Read More

November 24, 2024

NMMS MODEL GRAND TEST – 9

NMMS MODEL GRAND TEST - 9NMMS MODEL GRAND TEST - 9HOW TO ATTEMPT AP NMMS… Read More

November 22, 2024

NMMS MODEL GRAND TEST – 8

NMMS MODEL GRAND TEST - 8NMMS MODEL GRAND TEST - 8HOW TO ATTEMPT AP NMMS… Read More

November 22, 2024

NMMS MODEL GRAND TEST – 7

NMMS MODEL GRAND TEST - 7NMMS MODEL GRAND TEST - 7HOW TO ATTEMPT AP NMMS… Read More

November 20, 2024

NMMS MODEL GRAND TEST – 6

NMMS MODEL GRAND TEST - 6NMMS MODEL GRAND TEST - 6HOW TO ATTEMPT AP NMMS… Read More

November 19, 2024

NMMS MODEL GRAND TEST – 5

NMMS MODEL GRAND TEST - 5NMMS MODEL GRAND TEST - 5HOW TO ATTEMPT AP NMMS… Read More

November 17, 2024