రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ (ఆర్ఐఎంసీ)లో జులై- 2024 టర్మ్ ఎనిమిదో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఉత్తరాఖండ్ రాష్ట్రం డిహ్రాదూన్‌లోని RIMC నోటిఫికేషన్ విడుదల చేసింది. 8వ తరగతిలో ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బాలురు, బాలికల నుంచి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) దరఖాస్తులు కోరుతోంది.
ఆర్ఐఎంసీలో ఎనిమిదో తరగతి ప్రవేశాలు జులై- 2024 టర్మ్ ప్రవేశ పరీక్ష ( రాత పరీక్ష), ఇంటర్వ్యూ, వైద్య ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు.
ఆర్ఐఎంసీ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గుర్తింపు పొందిన ఏదైనా పాఠశాల నుంచి 2024 జులై నాటికి ఏడో తరగతి చదువుతోన్న లేదా ఎడో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అలాగే విద్యార్ధుల వయసు తప్పనిసరిగా జులై 01, 2024వ తేదీ నాటికి పదకొండున్నర సంవత్సరాలకు తగ్గకుండా 13 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. అంటే విద్యార్ధులు తప్పనిసరిగా జులై 02, 2011 నుంచి జనవరి 01, 2013 మధ్య జన్మించి ఉండాలి. దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులను రాత పరీక్ష, వైవా ఆధారంగా ఎంపిక చేస్తారు.
అర్హులైన విద్యార్ధుల తల్లిదండ్రులు ఆఫ్‌లైన్ విధానంలో అక్టోబర్ 15, 2023వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు మాత్రం ఆన్‌లైన్‌లో చెల్లించాలి. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.555 తప్పనిసరిగా చెల్లించావల్సి ఉంటుంది.
వెబ్‌సైట్ నుంచి ఆర్ఐఎంసీ దరఖాస్తు ఫారంను డౌన్‌లోడ్ చేసుకుని, విద్యార్ధికి సంబంధించిన వివరాలతో నింపిన తర్వాత అవసరమైన ధ్రువతపత్రాలు జతచేయాలి
అసిస్టెంట్ సెక్రటరీ (ఎగ్జామ్స్), ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్, న్యూ హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్‌మెంట్స్ బిల్డింగ్, రెండో అంతస్తు, ఆర్టీఏ కార్యాలయం దగ్గర, ఎంజీ రోడ్డు, విజయవాడ అడ్రస్‌కు పోస్టు ద్వారా పంపించాలి. ప్రవేశ పరీక్ష డిసెబర్ 02, 2023వ తేదీన నిర్వహిస్తారు.
రాత పరీక్ష మొత్తం మూడు పేపర్లకు ఉంటుంది. మ్యాథమేటిక్స్ 200 మార్కులకు, జనరల్ నాలెడ్జ్ 75 మార్కులకు, ఇంగ్లిష్ 125 మార్కులకు ఉంటుంది. రాత పరీక్షలో అర్హత సాధించిన విద్యార్ధులకు 50 మార్కులకు వైవా వోస్ ఉంటుంది. రాత పరీక్ష 400 మార్కులు, వైవా 50 మార్కులతో కలిపి మొత్తం 450 మార్కులకు ప్రవేశ పరీక్ష ఉంటుంది. కనీసం 50 శాతం ఉత్తీర్ణత పొందాలి. ఈ రెండింటిలో అర్హత సాధించిన విద్యార్ధులకు చివరిగా వైద్య పరీక్షలు నిర్వహించి ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
NMMS MODEL GUESS PAPER 03NMMS MODEL GUESS PAPER 03HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More
NMMS MODEL GUESS PAPER 02NMMS MODEL GUESS PAPER 02HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More
NMMS MODEL GUESS PAPER 01 NMMS MODEL GUESS PAPER 01 HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 10NMMS MODEL GRAND TEST - 10HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 9NMMS MODEL GRAND TEST - 9HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 8NMMS MODEL GRAND TEST - 8HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 7NMMS MODEL GRAND TEST - 7HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 6NMMS MODEL GRAND TEST - 6HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 5NMMS MODEL GRAND TEST - 5HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 4NMMS MODEL GRAND TEST - 4HOW TO ATTEMPT AP NMMS… Read More