NMMS MODEL GUESS PAPER 01 NMMS MODEL GUESS PAPER 01 HOW TO ATTEMPT AP NMMS…
*📚✍️వేతనాలకు నెలనెలా*
*యాతనేనా✍️📚*
*♦️ఉద్యోగుల సంఘం నేత బొప్పరాజు ఆవేదన*
*🌻కర్నూలు కలెక్టరేట్, న్యూస్‌టుడే:* ఎనిమిదో తేదీ దాటినా వేతనాల కోసం ఉద్యోగులు ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొందని ఏపీఆర్‌ఎస్‌ఏ, ఏపీ ఐకాస అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలులో రెవెన్యూ ఉద్యోగుల సంఘం కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులకు రూ.వెయ్యి కోట్ల మేర వేతనాలు, రూ.800 కోట్ల పింఛన్లు, రూ.200 కోట్ల గ్రాంట్ ఇన్ ఎయిడ్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించాల్సి ఉందన్నారు. ఉద్యోగులు ఒక నెల, రెండు, మూడు నెలలు ఓపికతో భరిస్తున్నారని.. ఇది అలవాటుగా మారిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఒకటో తేదీ ఏముంది.. ఏ తేదీనైనా తీసుకోవచ్చు’ అని ఓ ఉన్నతాధికారి అనడం సరికాదన్నారు. తమ కుటుంబ అవసరాల కోసం దాచుకున్న సొమ్మును కూడా తాము తీసుకోలేకపోతున్నామని ఉద్యోగులు బాధపడుతున్నారని చెప్పారు. ఉద్యోగ విరమణ చేసినవారికి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలూ అందడం లేదని.. ఏళ్లు గడుస్తున్నా ఎదురుచూపులే మిగిలాయని అన్నారు.8-9 మాసాల నుంచి డీఏ బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వం ఇచ్చిన జీవోల కాలపరిమితి గడువు ముగిసిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.
*♦️ఫిబ్రవరి 5న కర్నూలులో మహాసభ*
సీపీఎస్ రద్దు చేసి పాత పింఛను విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేకుండాపోయిందని బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడ్డారు.ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఫిబ్రవరి 5న కర్నూలులో పెద్దఎత్తున మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️బోగస్ ఓట్లు*
*తొలగించండి: ఏపీటీఎఫ్✍️📚*
*🌻ఈనాడు, అమరావతి*: పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గంలో నమోదైన బోగస్ ఓట్లను తొలగించాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య (ఏపీటీఎఫ్) అభ్యర్థి అనిల్ వెంకట ప్రసాద్‌రెడ్డి, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హృదయరాజు, చిరంజీవి వినతిపత్రం సమర్పించారు. 2017 ఎమ్మెల్సీ ఎన్నికలకు కంటే 8,000 అధికంగా ప్రైవేటు ఉపాధ్యాయుల ఓట్లు నమోదయ్యాయని తెలిపారు. కొన్నిచోట్ల ప్రైవేటు పాఠశాలలు మూతపడినా ఓట్లు నమోదయ్యాయని, నర్సరీ, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పని చేస్తున్న వారి పేర్లు ఓటర్ల జాబితాలో చేర్చారని తెలిపారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️సీఎం సమీక్షిస్తేనే ఉద్యోగుల సమస్యలు పరిష్కారo✍️📚*
*♦️అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు*
*🌻కర్నూలుప్రతినిధి,ప్రభన్యూస్:* రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల శాశ్వత సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి సమీక్షించినప్పుడే వందశాతం న్యాయం జరుగుతుందని ఏపి రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, ఏపి ఐకాస అమరావతి రాష్ట్రఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఉద్యోగుల అత్య ంత ముఖ్యమైన సీపీఎస్ రద్దు కోసం త్వరలో ఆందోళన కార్యక్రమాలను మరింత ఉదృతం చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. అంతకుముందు ఏపి ఐకాస అమరావతి కార్యవర్గ సమావేశం నిర్వహించారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️IIన ఎస్ఏసీ నియామక*
*పరీక్ష✍️📚*
*♦️మూడేళ్ల తర్వాత ఏర్పాట్లు*
*🌻అంగలూరు(గుడ్లవల్లేరు), న్యూస్టుడే*: రాష్ట్రస్థాయి ఎస్ఏసీ నియామక పరీక్షను కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలోని అంగ లూరు జిల్లా విద్యా శిక్షణ సంస్థ(డైట్)లో ఆదివారం నిర్వహించను న్నట్లు ప్రిన్సిపల్ కె. లక్ష్మీనారాయణ తెలిపారు. రాష్ట్రంలోని ప్రాథ మిక నుంచి ఉన్నత విద్య వరకూ విద్య, పరీక్షల నిర్వహణ పర్య వేక్షించే రాష్ట్ర విద్యా, పరిశోధన శిక్షణ సంస్థ (ఎస్ సీ ఈఆర్టీ)కి అను బంధంగా పరీక్షల నిర్వహణ, ప్రశ్నపత్రాల తయారీ, మదింపుల కోసం రాష్ట్ర మదింపు విభాగం (ఎస్ఏసీ) ఉంటుంది. ఇందులో దాదాపు 30-35 మంది సభ్యులుంటారు. వారు రాష్ట్రంలోని 1 నుంచి 10 తరగతులకు సంబంధించిన పరీక్షల ప్రశ్నపత్రాల రూపకల్పన, మదింపులు నిర్వహిస్తుంటారు. మూడేళ్లుగా ఎస్సీఈఆర్ టీలో ఎస్ ఏసీ ఏర్పాటు కాలేదు. దీంతో ప్రస్తుతం ఎస్సీఏ ఏర్పాటుకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ఉపాధ్యాయుల నుంచి అధికారులు దరఖా స్తులు ఆహ్వానించారు. ఉమ్మడి రాష్ట్ర జిల్లాల ప్రకారం మొత్తం 534 మంది, ఉమ్మడి కృష్ణాలో 42 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. వారికి ఆయా జిల్లా డైట్ కళాశాలల్లో ఆదివారం ఉదయం 10 నుంచి 1.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ప్రశ్నపత్రాలను విజయవాడ ఎస్సీఈఆర్టీ కేంద్ర కార్యాలయానికి చేర్చనున్నారు. అభ్యర్థులకు హాల్ టికెట్లను సంబంధిత మండల విద్యాశాఖ కార్యాలయాలకు పంపామని, ఎంఈవోలు వాటిని డౌన్లోడ్ చేసి ఉపాధ్యాయులకు అందజేయాలని ఉన్నతా ధికారులు సూచించారు. అభ్యర్థులు ఉదయం 8.30కే పరీక్ష కేంద్రంలో ఉండాలని స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణ కోసం ఎస్ సీఈఆర్టీ ప్రత్యేక పరిశీలకులను నియమించిందని, డీఈవో కార్యా లయాల నుంచి ఇన్విజిలేటర్ల నియామకం చేపట్టామని తెలిపారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️రాష్ట్ర స్థాయి కౌశల్ క్విజ్*
*పోటీలు✍️📚*
*🌻ఈనాడు, అమరావతి*: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లోని నైపుణ్యాలను వెలికి తీసేందుకు భారతీయ విజ్ఞాన మండలి (బీవీఎం), ఏపీ శాస్త్ర సాంకేతిక మండలి (ఏపీసీవోఎస్టి) సంయుక్త ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే రాష్ట్ర స్థాయి క్విజ్ పోటీలు విజయవాడలో శుక్రవారం జరగనున్నాయి. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ ప్రాంగణంలో కౌశల్- 2022 పేరుతో ఈ పోటీలు జరగనున్నాయి. విజేతలకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచం దన్ చేతులమీదుగా నేడు బహుమతి ప్రదాన కార్యక్రమం కూడా జరగబోతోందని పోటీల కృష్ణా జిల్లా కోఆర్డినేటర్ సిహెచ్.బి. వి. పద్మావతి తెలియజేశారు. 26 జిల్లాల నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొం టున్నారు. ఇప్పటికే జిల్లా స్థాయిలో నిర్వహిం చిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులు నేడు రాష్ట్రస్థాయిలో తలపడనున్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️సిపిఎస్ రద్దు కోసం 2కే వాక్✍️📚*
*♦️బిల్లును పార్లమెంటుకు పంపాలి: యుటిఎఫ్*
*🌻ప్రజాశక్తి – కర్నూలు కలెక్టరేట్* రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి సిపిఎస్ రద్దు బిల పార్లమెంటుకు పంపాలని యుటిఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షులు కె.సురేష్ కుమార్ డిమాండ్ చేశా సిపిఎస్, జిపిఎస్ను రద్దు చేయాలని కోరుతూ యుటిఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువా రాత్రి నగరంలోని జిల్లా పరిషత్ నుంచి కలెక్టరేట్ వరకు 2కే వాక్ నిర్వహించారు. అనంత కలెక్టరేట్ ఎదుట గాంధీ విగ్రహం సమీపంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కె.సు కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి జయరాజు మాట్లాడారు. సిపిఎస్ అంశంపై ఉద్యోగ, ఉపాధ్యా సంఘాలను చర్చలకు ఆహ్వానించి తర్వాత దాట వేసిందని విమర్శించారు. సిపిఎ చర్చిస్తున్నట్లు అజెండాలో పేర్కొని.. ఆ అంశాలపై రాష్ట్ర మంత్రులుగానీ, ప్రభుత్వ సలహాః గానీ చర్చించకుండానే సమావేశం ముగించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జిపిఎస్ కూడా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల జీవితా। చెలగాటమాడకుండా తక్షణమే సిపిఎస్ ను రద్దు చేయాలని, ఒపిఎస్ ను అమలు చేయా కోరారు. యుటిఎఫ్ జిల్లా సహాధ్యక్షులు యుఆర్ఎఎ.రవికుమార్ అధ్యక్షత వహించారు. యుటి జిల్లా ఆర్థిక కార్యదర్శి హేమంత్ కుమార్, జిల్లా నాయకులు మారెప్ప, నవీస్ పాటి పాల్గొన్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️తత్కాల్ లో ఓపెన్*
*టెన్త్, ఇంటర్ ప్రవేశాలు✍️📚*
*🌻ప్రజాశక్తి-అమరావతి బ్యూరో*
ఒపెన్ టెన్త్, ఇంటర్మీడియట్లో తత్కాల్ ప్రవేశాల షెడ్యూల్ను ఎపి ఒపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ కెవి శ్రీనివాసులు రెడ్డి గురువారం విడుదల చేశారు. ఈ నెల 8 నుంచి 11వ తేదీ వరకు అడ్మిషన్లు చేపట్టాలని జిల్లా విద్యాశాఖ అధికారులు, ఒపెన్ స్కూల్ సొసైటీ అధికారులను ఆదేశించారు. రిజిస్ట్రేషన్లను నిర్ధారించి ఫీజులు కట్టించుకోవాలని తెలిపారు. ఎస్ఎస్సి అభ్యర్థుల నుంచి రూ.300, ఇంటర్మీడియట్ అభ్యర్థుల నుంచి రూ.400 చొప్పున ఫీజు వసూలు చేయాలని వెల్లడించారు.
*🌻మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్టుడే*: ఏపీ సార్వత్రిక విద్యా పీఠం ద్వారా 2022- 23 విద్యా సంవత్సరంలో పది, ఇంటర్ ప్రవేశానికి తత్కాల్ పద్ధతిలో దరఖాస్తు చేసు కునేందుకు అవకాశం కల్పించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి తాహెరా సుల్తానా ఒక ప్రక టనలో తెలిపారు. పదో తరగతికి రూ.300, ఇంటర్మీడియట్కు రూ.400 చొప్పున అప రాధ రుసుము చెల్లించి ఈ నెల 11వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. 13వ తేదీ వరకు ప్రవేశ రుసుము చెల్లించవచ్చని అన్నారు. మరిన్ని వివరా లకు 8008403506 నెంబర్లలో సంప్రదించాలన్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️ఈపీఎఫ్ కనీస పింఛను*
*రూ.9 వేలు ఇవ్వాలి✍️📚*
*🌻ఈనాడు, దిల్లీ:* ఈపీఎఫ్ కింద కనీస పింఛను రూ.9 వేలు ఇవ్వాలని అఖిల భారత ఈపీఎస్ పెన్షనర్ల సమన్వయ కమిటీ నేతలు డిమాండ్ చేశారు. కనీస పింఛను పెంపు కోరుతూ కమిటీ ఆధ్వర్యంలో గురువారం దిల్లీలోని జంతర్‌మంతర్‌లో ఆందోళన నిర్వహించారు. వీరి ఆందోళనకు ఆర్‌ఎస్పీ ఎంపీ ప్రేమ్‌చంద్రన్, ఐయూఎంల్ ఎంపీ బషీర్, డీఎంకే, సీపీఎం రాజ్యసభ సభ్యులు షణ్ముగం, ఎలమారం కరీంలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. ఆర్.సి.గుప్తా కేసులో కోర్టు తీర్పు ప్రకారం అత్యధిక పింఛను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆంధప్రదేశ్, తెలంగాణ కమిటీ నాయకులు సుధాకర్, కృష్ణమూర్తి, వివిధ రాష్ట్రాల నాయకులు బ్రహ్మ, ధర్మజన్, అతుల్ ధిగే తదితరులు పాల్గొన్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️టాబ్లు ఇచ్చేదెప్పుడు?✍️📚*
*♦️ఎంఈవో కార్యాలయాల్లోనే నిల్వలు*
*🌻ఏలూరు ఎడ్యుకేషన్, డిసెంబరు 8* : ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు జిల్లాకు వచ్చి చాలా రోజులైనా పంపిణీకి ప్రభుత్వం మీనమేషా లు లెక్కిస్తోంది. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో మొత్తం 18,364 మంది బాలబాలికలు 8వ తరగతి చదువుతున్నారు. వీరందరికీ బైజూస్ కంటెంట్ ద్వారా పాఠ్యాంశాలను అభ్యసించేందుకు వీలుగా ఉచితంగా ట్యాబ్‌లను పంపిణీ చేయాలని ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. ఈ క్రమంలో పాఠశాలలు ప్రారంభమై 6నెలలు గడుస్తున్నాయి. జిల్లాకు రెండు దశల్లో ట్యాబ్‌ల పంపిణీ ఇటీవలే పూర్తయింది. ప్రస్తుతం ఇవి ఎంఈవోల కార్యాలయాల్లో భద్రపరిచారు. ట్యాబ్‌లలో బైజూస్ కంటెంట్‌ను ఇన్‌స్టాల్ చేయాల్సిఉంది.ఇలా కంటెంట్‌ను ఇన్‌స్టాల్ చేసే ప్రక్రియపై జిల్లాలోని అన్ని మండలాల ఎంఐఎస్ ఆప రేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సీఆర్పీలు, నోడల్ టీచర్లకు ఈ నెల 12, 13 తేదీల్లో వర్చువల్ విదానంలో శిక్షణ ఇవ్వనున్నారు. ఆ తర్వాతే క్షేత్రస్థాయిలో ఎంఈవో కార్యాలయాల్లో నిల్వఉంచిన ట్యాబ్‌లలో బైజూస్ కంటెంట్‌ను ఇన్‌స్టాల్ చేసే ప్రక్రియను చేపడతారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయ్యేలోగా సంక్రాంతి సెలవులు ముగిసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. విద్యా ర్థులకు ఇవ్వనున్న ట్యాబ్‌లలో కేవలం బైజూస్ యాప్‌ను మాత్రమే విని యోగించేలా సాంకేతికపరంగా తయారుచేసినట్టు చెబుతున్నారు. ట్యాబ్‌ల ను విద్యార్థులు ఇళ్ళకు తీసుకెళ్ళేలా అనుమతిస్తారా ? లేక తరగతి గదు ల్లోనే బోధనా సమయంలో వినియోగించేందుకు అవకాశం ఉంటుందా ? అనే విషయాలపై డైలమా నెలకొంది. ట్యాబ్‌ను విద్యార్థి పేరునే రిజిస్టర్ చేసే అవకాశం వున్నట్టు తెలిసింది. ఇలా చేయడం వల్ల ఇతరులు ఓపెన్ చేసే అవకాశం ఉండదని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. మరో ముఖ్య మైన విషయం ఏమిటంటే ప్రస్తుతం ఇస్తోన్న ట్యాబ్‌లను వినియోగించే 8వ తరగతి బాల బాలికలు ఉత్తీర్ణులైన తర్వాత వాటిని 9వ తరగతిలో కూడా వినియోగించేందుకు అనుమతిస్తారా ? లేక వాటిని 8వ తరగతి పూర్తి చేసిన తర్వాత స్కూల్ హెచ్‌ఎంలకు అప్పగించాలా ? అనే విషయా లపైనా డైలమా నెలకొంది.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️డిపార్ట్మెంటల్ పరీక్షలకు*
*ఏర్పాట్లు పూర్తి✍️📚*
*♦️కృష్ణా డీఆర్వో వెంకటేశ్వర్లు*
*🌻మచిలీపట్నంటౌన్*: ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీ నుంచి నిర్వహించే డిపార్ట్మెంటల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఆర్వో ఎం. వెంకటేశ్వర్లు తెలిపారు. డీఆర్వో గురువారం కలెక్టరేట్లో డిపార్ట్మెంటల్ పరీక్షలకు అవసరమైన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 9 నుంచి 14వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 9 నుంచి 11గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతా యన్నారు. జిల్లాలో 2,895 మంది అభ్యర్థులు డిపా ర్ట్మెంటల్ పరీక్షలకు హాజరుకానున్నారన్నారు. వీరి కోసం మూడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామ న్నారు. ఉంగుటూరు మండలం తేలప్రోలులోని ఉషారామ ఇంజినీరింగ్ కాలేజీ, పెనమలూరు మం డలం కానూరులోని విజయదుర్గ ఐటీ ఇన్ఫో సొల్యూషన్స్, పెడన మండలం నందమూరులోని శ్రీవాసవీ ఇంజినీరింగ్ కళాశాలలో కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షల నిర్వహణ కోసం ముగ్గురు లైజన్ అధికారులు, ముగ్గురు చీఫ్ సూప రింటెండెంట్లను నియమించినట్లు తెలిపారు. అభ్య ర్థులు పరీక్ష సమయం కంటే అరగంట ముందుగా కేంద్రాలకు చేరుకోవాలని డీఆర్వో సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలని, విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️పాత పింఛన్*
*విధానాన్ని పునరుద్ధరించాలి✍️📚*
*♦️కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సదస్సు డిమాండ్*
*🌻ఈనాడు, దిల్లీ*: పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఉమ్మడి జాతీయ సదస్సులో నాయకులు డిమాండ్ చేశారు. పాత పింఛన్ పునరుద్ధరణపై దిల్లీ తాలకటోరా స్టేడియంలో అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏఐఎస్‌జీఈఎఫ్), కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికుల సమాఖ్య (సీసీజీఈడబ్ల్యూ)ల ఆధ్వర్యంలో సంయుక్త జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఒప్పంద ఉద్యోగ వ్యవస్థను రద్దు చేసి శాశ్వత ఉద్యోగులను నియమించాలని, పొరుగు సేవల ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని కోరారు. ఉద్యోగులకు వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలపై 2023 మే, జూన్ నెలల్లో ప్రచారం నిర్వహించాలని, జులై, ఆగస్టుల్లో రాష్ట్ర స్థాయి జాతాలు చేపట్టాలని, సెప్టెంబరులో పార్లమెంట్ మార్చ్ నిర్వహించాలని నిర్ణయించారు. సదస్సులో ఆయా సంఘాల నేతలు సుభాష్ లాంబా, శ్రీకుమార్, రవీంద్రన్ నాయర్, పరాశర్, ఎం.ఏ.అజిత్ కుమార్, శివరాజన్ పాల్గొన్నారు.
*♦️జీతాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం: బండి శ్రీనివాసరావు*
ఉద్యోగులకు నెల మొదటి తేదీన జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉండడం బాధాకరమని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు, జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసరావు అన్నారు. ఏఐఎస్‌జీఈఎఫ్, సీసీజీఈడబ్ల్యూ సంయుక్త జాతీయ సదస్సులో పాల్గొన్న అనంతరం ఏపీ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల చెల్లింపులో ఆలస్యం అవుతోందన్నారు. మంత్రులు, శాసనసభ్యుల జీతాలు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాలో జమ చేస్తుండడం సరికాదన్నారు. కాంట్రిబ్యూటరీ పింఛను విధానం (సీపీఎస్) రద్దు చేయాలని తాము చేస్తున్న డిమాండ్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెడచెవిన పెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జీపీఎస్‌ను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు.