*®️అమరావతి, ఆంధ్రప్రభ*: ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు ఐదు నెలలు కావస్తున్నా ఉపాధ్యాయుల బదిలీలపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. పాఠశాల విద్యా శాఖ అధికారులు ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ప్రతి ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి ఉపాధ్యాయ బదిలీలు పూర్తయ్యేవి. కానీ ఈ ఏడాది నవంబర్ మాసం సగానికి చేరుకున్నా ఎప్పుడు బదిలీలు జరుగుతాయనేది స్పష్టం కావడం లేదు. సాధారణంగా ఉపాధ్యాయులకు పదోన్నతలు ఇచ్చిన వెంటనే బదిలీలు చేపడతారు. ఈ ఏడాది ఆరున్నర వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతలు ఇచ్చి నెల రోజులు దాటి పోయింది. వారికి కాగితాలపైనే పదోన్నతలు ఇచ్చారు తప్ప పాఠశాల ఏదనేది చూపించలేదు. బదిలీలు జరిగితే తప్ప వీరికి పాఠశాలల కేటాయింపు సాధ్యం కాదు. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా పాఠశాల విద్యా శాఖ ప్రయత్నాలు చేయడం లేదు. దీంతో విద్యార్థుల చదువుపై తీవ్ర ప్రభావం పడుతోంది. నూతన విద్యా విధానంలో భాగంగా స్కూళ్లను మ్యాపింగ్ చేసి 3,4,5 తరగతులను హైస్కూళ్లలో కలిపేశారు. దీంతో చాలా స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉంది.అందుకు తగ్గట్లుగా టీచర్ల సంఖ్య లేదు. బదిలీలు జరిపితే ఈ సమస్య కొంత తీరే అవకాశముంది. కానీ పాఠశాల విద్యా శాఖ మాత్రం తనకేం పట్టనట్లు వ్యవహరిస్తుంది.
*®️ఎందుకీ ఆలస్యం..?*
®️వాస్తవానికి టీచర్ల బదిలీకి సంబంధించి ఫైల్ నెల రోజుల క్రితమే రెడీ అయ్యింది. దానిపై విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ సంతకం పెట్టి 20 రోజుల కూడా గడిచిపోయినట్లు సమాచారం. కానీ పాఠశాల విద్యా శాఖ అధికారు లు మాత్రం షెడ్యూల్ విడుదల చేయడం లేదు. దీనికి కారణం కొంత మంది టీచర్లకు సిఫార్సులు ఆధారంగా బదిలీలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఉన్నతా ధికారులు భావిస్తున్నారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. నిబంధన లకు విరుద్ధంగా తమకు నచ్చిన వారికి మంచి స్థానాల్లోకి బదిలీ చేయబోతు న్నారని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. దీనికి సంభంధించిన ఫైల్ పాఠశా ల విద్యా శాఖ ఉన్నతాధికారి వద్ద ఉందని, ముందుగా ఆ బదిలీలు చేసేందుకే మొత్తం బదిలీల ప్రక్రియను ఆపుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. గతంలో 200 మందికి పైగా సిఫార్సు బదిలీలు చేయాలని ప్రయత్నించగా ఉపాధ్యాయ సంఘాలు నిరసన తెలపడంతో ఆగిపోయారు. కానీ ఇప్పుడు మళ్లా దాదాపు 150 మంది జాబితాతో సిఫార్సు బదిలీలు చేయబోతున్నారని సమాచారం.
*®️బదిలీల కోడ్ అవసరం*
®️ఉపాధ్యాయుల బదిలీలు ప్రభుత్వ ఇష్టానుసారం కాకుండా ఒక పకడ్బందీగా, విద్యార్ధులకు నష్టం కలగని రీతిలో నిర్వహించాలని సంఘాలు కోరుతు న్నాయి. ఇందుకోసం బదిలీల కోడ్ అంటే ఒక ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని కోరుతున్నాయి. కేరళ, ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి కోడ్లు ఉన్నాయని, మన రాష్ట్రంలోనూ పాఠశాల విద్యా శాఖ కమిషనర్ సంధ్యారాణి ఉన్న కాలంలో డ్రాఫ్ట్ బిల్లును రూపొందించారని, ఆమెను బదిలీ చేసిన తర్వాత దాన్ని ఊసే పట్టించుకోలేదని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. బదిలీలు ప్రతి ఏడాది వేసవి సెలవుల్లోనే జరగలాని, అప్పుడే విద్యార్దులకు ఎటువంటి నష్టం వాటిల్లదని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి.
*®️✍️ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష*
*ఫీజు గడువు పొడిగింపు✍️📚*
*®️ఈనాడు, అమరావతి*: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ ఉపకార వేతన పరీక్ష (ఎన్‌ఎంఎంఎస్) ఫీజు చెల్లింపు గడువును ఈనెల 25 వరకు పొడిగించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి తెలిపారు. పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచామని వెల్లడించారు.
*®️హాజరు మినహాయింపు ఫీజు గడువు 30 వరకు*
ఇంటర్ ప్రైవేటు విద్యార్థులు హాజరు నుంచి మినహాయింపు కోసం ఈనెల 30లోపు రూ.1,300 ఫీజు చెల్లించాలని ఇంటర్ విద్యామండలి ఆదేశాలు జారీ చేసింది. అపరాధ రుసుం రూ.200తో డిసెంబరు 15 వరకు అవకాశం కల్పించినట్లు వెల్లడించింది.
రాష్ట్రంలో 25 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ఉదోగ్యులు తమ సర్వీసు రిజిస్టర్లను ఏజీతో తనిఖీ చేయించుకోవాలని ట్రెజరీ, అకౌంట్స్ విభాగం ఆదేశాలు జారీ చేసింది. డీడీవోలు ఈనెల 22 పంపించే పేబిల్లులతోపాటు సంబంధిత ధ్రువీకరణ పత్రాన్ని జత చేయాలని సూచించింది.
డీఈడీ కాలేజీలకు హైకోర్టులో ఊరట
*®️అమరావతి, నవంబరు 15(ఆంధ్రజ్యోతి)*: రాష్ట్రంలోని పలు డీఈడీ కాలేజీ లకు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కాలేజీల గుర్తింపును రద్దు చేస్తూ గతేడాది అక్టోబరులో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. ఈ నిర్ణయం వెల్లడికి ముందు ఎన్సీటీఈ చట్ట నిబంధనల మేరకు నడుచుకోలేదని అభిప్రాయడింది. కాలే జీల్లో ఉన్న లోపాలను ఎత్తిచూపుతూ తాజాగా నోటీసులు ఇచ్చేందుకు కౌన్సి ల్కు వెసులుబాటు ఇచ్చింది. వాటిపై కాలేజీ యాజమాన్యాలు సకాలంలో వివరణ ఇవ్వాలని స్పష్టంచేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కె. సురేష్ రెడ్డి మంగళవారం తీర్పు ఇచ్చారు. రాష్ట్రంలోని పలు డీఈడీ కాలేజీలు నిబం ధనలకు విరుద్ధంగా ప్రవేశాలు కల్పించాయని పాఠశాల విద్య కమిషనర్ రాసిన లేఖ ఆధారంగా 318 కాలేజీల గుర్తింపును ఎన్సీటీఈ రద్దు చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ 69 కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి.
*®️✍️బైజూస్ పై బురద*
*రాతలు✍️📚*
*®️ఆంగ్లంలోనే పాఠాలున్నాయంటూ ‘ఈనాడు’ అసత్యాలు*
*®️విద్యార్థులు తెలుగు భాషనూ ఎంపిక చేసుకునేలా ఏర్పాట్లు*
*®️సందేహాలు నివృత్తి చేసుకునే సదుపాయం ఉంది*
*®️సాక్షి, అమరావతి*: ఆధునిక నైపుణ్యాలను సంతరించుకుని ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేలా బైజూస్ పాఠ్యాంశాలతో విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దుతుంటే ‘ఈనాడు’ వక్ర భాష్యాలు చెబుతోంది. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు చేపట్టి వివిధ పథకాల ద్వారా విద్యార్థుల చదువులకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తున్న విషయం తెలిసిందే. గత సర్కారు హయాంలో అస్తవ్యస్థమైన విద్యా రంగాన్ని వివిధ పథకాలతో సీఎం జగన్ ముందుకు తీసుకువెళ్తున్నారు. బైజూస్ భాగస్వామ్యం ద్వారా అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను విద్యార్థులకు ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వానికి మంచిపేరు వస్తుండడంతో సహించలేక’ఈనాడు ‘విషం చిమ్ముతోంది.
*®️ఇందులో నిజానిజాలివీ..👇👇*
®️బైజూస్‌తో బోలెడు ప్రయోజనాలు
బట్టీ చదువుల స్థానంలో ఆహ్లాదంగా చదువుకునేలా తరగతి గదిని రూపొందించాలని జాతీయ విద్యా విధానం 2020 సూచించింది. ఈ తరహా విధానాన్ని ప్రవేశపెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం బైజూస్ కంటెంట్‌ను స్మార్ట్ ఫోన్ల ద్వారా విద్యార్థులకు అందిస్తోంది. బైజూస్ కంటెంట్ టీచర్లు, పిల్లలకు ఉపయోగపడేలా ప్రపంచ స్థాయి నాణ్యతతో రూపొందించారు. దీనివల్ల తరగతి గది బోధనలో నాణ్యత పెరగటంతో పాటు బడిలో నేర్చుకున్న అంశాలు ఇంటి వద్ద పునఃశ్చరణ చేయడానికి అవకాశం కలుగుతోంది.
®️పిల్లలు ఎప్పుడైనా పాఠశాలకు హాజరు కాలేకపోతే వీలైన సమయంలో నేర్చుకునేందుకు డిజిటల్ కంటెంట్ ఉపయోగపడుతుంది. ఇందులో ఉపయోగించిన చిత్రాలు, వీడియోలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు నేర్చుకునేలా దోహదం చేస్తాయి.పాఠ్య పుస్తకాలలో ఇచ్చిన సమాచారాన్ని చిన్న విభాగాలుగా రూపొందించడం వల్ల సంక్లిష్ట అంశాలను సులువుగా నేర్చుకుంటారు. 471కి పైగా వీడియోలతో నేర్చుకునేందుకు అనువుగా ఉన్నాయి.
®️గొప్ప వరం..
బైజూస్ ద్వారా ఉచితంగా పాఠాలు అందించడం పేద పిల్లలకు గొప్ప వరం. ఈ లెర్నింగ్ కోసం పిల్లలందరికీ, ఉపాధ్యాయులకు కూడా ఉచితంగా ట్యాబ్‌లను సమకూరుస్తుండడం సాహసోపేత నిర్ణయం.
– ఎన్.మహేంద్రరెడ్డి, టీచర్, తంగేగుకుంట, శ్రీసత్యసాయి జిల్లా
®️రెండు భాషల్లో చక్కగా..
బైజూస్ వీడియో పాఠాలను అన్ని తరగతుల వారు వింటున్నారు. తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాల్లో చక్కటి ఉదాహరణలతో స్థాయికి తగ్గట్లు వీడియో అంశాలున్నాయి.
– కె.పుష్పవతి, సైన్స్ టీచర్, ఎంసీయూపీ స్కూల్, ఏలూరు
®️చాలా బాగుంది..
బైజూస్ కంటెంట్ చాలా బాగుంది. విద్యార్థులకు, టీచర్లకు ఎంతో సహాయపడుతుంది. వీడియోలు పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా అద్భుత అనుభూతి
కలిగిస్తున్నాయి.
– సంధ్య, ప్రిన్సిపాల్, ఏపీఎమ్మెస్, అక్కివరం, విజయనగరం
®️అద్భుతంగా నేర్చుకుంటున్నారు…
బైజూస్ యాప్ ద్వారా పిల్లలకు వీడియో పాఠాలు చెబుతున్నాం. కంటెంట్ చాలా బాగుంది. పిల్లలు అద్భుతంగా నేర్చుకుంటున్నారు. అన్ని సబ్జెక్టులు అర్థవంతంగా, ఉపయోగకరంగా ఉన్నాయి. పిల్లలు బడికి హాజరు కాని సందర్భాల్లో ఇది చాలా సహాయపడుతుంది. సెలవు రోజుల్లో కూడా ఇంటి వద్ద పాఠ్యాంశ బోధన జరగడం అద్భుతంగా ఉంది.
– ఎం.నరసింహారెడ్డి, హెచ్.ఎమ్, జెడ్పీ హైస్కూల్ సంబేపల్లి మండలం, అన్నమయ్య జిల్లా
®️అబద్ధం 1
బైజూస్ కంటెంట్ కేవలం ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే ఉంది
ఇది పూర్తి అవాస్తవం. పిల్లలు తెలుగు, ఇంగ్లీషులో నేర్చుకోవడానికి వీలుగా కంటెంట్ ఉంది. భాషను ఎంపిక చేసుకునే అవకాశం విద్యార్థులకు కల్పించారు.
®️అబద్ధం 2
పిల్లల సందేహాల నివృత్తికి అవకాశం లేదు
పాఠశాలలో ఉపాధ్యాయుడు పాఠం బోధించాక సంబంధిత వీడియోను విద్యార్థులు పరిశీలించిన అనంతరం ఇంకా సందేహాలుంటే మరుసటి రోజు నివృత్తి చేస్తున్నారు. వలస వెళ్లిన పిల్లలు కూడా కంటెంట్‌ను ఫోన్‌లో చూసుకొని తర్వాత స్కూలుకు వచ్చి టీచర్ ద్వారా సందేహాలు నివృత్తి చేసుకునే వెసులుబాటు ఉంది.
®️అబద్ధం 3
టీచర్లకు రూ.500 చాలదు
ఈ ప్రస్తావన సరికాదు. కంటెంట్ ఉన్న వీడియోలు ప్రయోగాలకు సంబంధించినవి మాత్రమే కాకుండా ఆ సబ్జెక్టుకు సంబంధించినవైనందున విషయ పరిజ్ఞానార్జనకు మరింత ఉపయుక్తం. టీచర్లకు వీడియోలు అర్థం కావనడం వారిని అవమానించడమే.
*®️✍️ప్రత్యేక అవసరాలపిల్లల అభివృద్ధికి కృషి✍️📚*
*®️పాఠశాల విద్యాశాఖకమిషనర్ ఎస్. సురేష్ కుమార్*
*®️సాక్షి అమరావతి*: పాఠశాలల్లో ప్రత్యేక అవస రాలు కలిగిన పిల్లల సర్వతోముఖాభివృద్ధికి పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా వివిధ కార్య క్రమాలు చేపడుతున్నాయని పాఠశాల విద్యా శాఖ కమిషనర్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు ఎస్.సురేష్ కుమార్ చెప్పారు. మంగళవారం విజయవాడలో జరిగిన సహిత విద్యకు సంబంధించి ఒక రోజు కార్యశాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని మండ లాల్లో దివ్యాంగ విద్యార్థులకు భవిత కేంద్రాల ద్వారా విద్యను అందిస్తున్నామని తెలిపారు. సమగ్ర శిక్షా ఎస్ఏపీడీ బి.శ్రీనివాసరావు, ఏఎస్పీడీ డాక్టర్ కె.వి.శ్రీనివాసులు, ప్రభుత్వ
పాఠ్య పుస్తకాల ప్రచురణ సంచాలకులు రవీంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
✍️26న మూకుమ్మడి*
*రాజ్యాంగ ‘ప్రస్తావన’ పఠనం✍️📚*
*®️సాక్షి, అమరావతి*: రాజ్యాంగ దినోత్సవాన్ని పుర స్కరించుకుని ప్రభుత్వ రంగ సంస్థల ఆఫీసులు, విద్యాసంస్థల్లో ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు మూకుమ్మడి రాజ్యాంగ పఠన కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది. దీనిపై కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా ఈ నెల 7నే అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాశారు. ఈ క్రమంలో రాష్ట్రంలోనూ కార్యక్ర మాలు నిర్వహించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) ముఖ్య కారద్యర్శి రేవు ముత్యాలరాజు అన్ని ప్రభుత్వ శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లకు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.
NMMS MODEL GUESS PAPER 01 NMMS MODEL GUESS PAPER 01 HOW TO ATTEMPT AP NMMS…
®️✍️జీతాల బిల్లుకు సర్వీసు*
*సర్టిఫికెట్లు జత చేయాలి✍️📚*
*®️సాక్షి, అమరావతి*: 25 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులందరూ సర్వీసు సర్టిఫికె ట్లు జీతాల బిల్లుకు జత చేయాలని ఖజానా శాఖ మంగళవారం ఉత్తర్వులిచ్చింది. తమ ఎస్ఆర్అను ఏజీతో వెరిఫై చేయించుకోవాల్సి ఉన్నందున డీడీవోలందరూ తమ పరిధిలో 25 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగుల వివరాలను తెలుపుతూ సర్టిఫికెట్లను నవంబర్ జీతాల బిల్లులకు జతపరచాలని పేర్కొంది
ఇంటర్ మార్కుల*
*ధ్రువపత్రాలొచ్చాయ్✍️📚*
*®️మద్దిలపాలెం, న్యూస్టుడే*: ఇంటర్ ద్వితీయ పరీక్షలు రాసి ఉత్తీర్ణులైన విద్యార్థుల మార్కుల అసలు ధ్రువపత్రాలు అందుబాటులో ఉన్నాయని ఆర్.ఐ.ఒ. ఆర్. సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత కళాశాలల ప్రిన్సిపల్స్ పిఠాపురంకాలనీలో ఉన్న ఇంటర్ బోర్డు కార్యాలయానికి వచ్చి విద్యార్థుల ఒరిజనల్ ధ్రువపత్రాలను తీసుకెళ్లాలని కోరారు. ప్రస్తుతం ఇంటర్ చదువుతున్న విద్యార్థుల హాజరు వివరాలను ప్రతిరోజు ఉదయం 11 గంటలలోపు జ్ఞాన భూమి వెబ్సైట్లో పొందుపర్చాలన్నారు.
✍️భవిత కేంద్రాల ద్వారా దివ్యాంగ విద్యార్థులకు విద్య✍️📚*
*®️ఈనాడు, అమరావతి*: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల సర్వతోముఖాభివృద్ధికి కార్యక్రమాలు చేపడుతున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. విజయవాడలో సహిత విద్యపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘అన్ని మండలాల్లో దివ్యాంగ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన భవిత కేంద్రాల ద్వారా విద్యను అందిస్తున్నాం’ అని తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీడీలు శ్రీనివాసరావు, శ్రీనివాసులరెడ్డి, ఏడీ రవీంద్రనాథ్‌రెడ్డి పాల్గొన్నారు.
®️✍️పాఠశాల విద్య కమిషన్ చైర్పర్సన్గా జస్టిస్ రామలింగేశ్వరరావు✍️📚*
*®️అమరావతి, నవంబరు 15(ఆంధ్రజ్యోతి):* పాఠశాల విద్య రెగ్యులేటరీ, మానిటరింగ్ కమిషన్ చైర్పర్సన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ. రా మలింగేశ్వరరావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అయితే కమిషన్ పదవీకాలం, ఇతర నిబంధ నలను అందులో పేర్కొనలేదు.®️👆
*®️✍️ఉన్నత పాఠశాలల్లో*
*డిజిటల్ తరగతులు✍️📚*
*®️వచ్చే ఏడాది నాటికి అందుబాటులోకి: మంత్రి బొత్స*
*®️గరివిడి, న్యూస్‌టుడే*: వచ్చే విద్యా సంవత్సరం నాటికి 3 నుంచి పదో తరగతి వరకు డిజిటల్ తరగతులను అందుబాటులోకి తెస్తామని, ఇందులో భాగంగా ఉన్నత పాఠశాలలను డిజిటలైజేషన్ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విజయనగరం జిల్లా గరివిడిలో మంగళవారం మండల పరిషత్తు సర్వసభ్య సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘డిజిటల్ పరికరాల భద్రత కోసం అన్ని బడులకు ప్రహరీలు నిర్మిస్తాం. రాత్రి కాపలాదారులతో పాటు సీసీ కెమెరాలనూ ఏర్పాటు చేస్తాం. 1, 2 తరగతులున్న ప్రాథమిక పాఠశాలల్లో స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లోని 5 లక్షల మంది ఎనిమిదో తరగతి విద్యార్థులకు రానున్న సంక్రాంతి కల్లా ట్యాబ్‌లు ఇస్తాం. ‘అమ్మఒడి’ పథకాన్ని ప్రైవేటు బడుల విద్యార్థులకూ వర్తింపజేయడంవల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు తగ్గుతుందన్న భావన సరికాదు’ అని పేర్కొన్నారు. సమావేశంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.®️👆
✍️బడుల్లో బోధన ఎలా*
*సాగుతోంది..?✍️📚*
*®️వెలుగు ఏపీఎంలకు పథకాల పరిశీలన బాధ్యత*
*®️విశాఖపట్నంలో శిక్షణకు హాజరైన ఏపీఎంలు*
*®️- న్యూస్‌టుడే, రణస్థలం*
ప్రభుత్వ పాఠశాలల పరిధిలో జరిగే అభివృద్ధి పనులు, పథకాల అమలు తీరును పరిశీలించేందుకు వెలుగు ఏపీఎం(అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజరు)లకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు వారం కిందటే జీవో జారీ చేసింది. ఇప్పటికే ప్రభుత్వం వారికి శిక్షణ అందించింది. దాదాపు పిల్లలందరి తల్లులు మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు నిత్యం పాఠశాలలకు వెళ్తున్నారా.. లేదా, ఎలా చదువుతున్నారు, ఎవరైనా బడి మానేశారా, మధ్యాహ్న భోజనం అమలు, విద్యాబోధన వంటి అంశాలను తల్లుల ద్వారా తెలుసుకోనున్నారు. పాఠశాలల్లో నిర్వహించే తల్లిదండ్రుల సమావేశాల గురించి ముందుగా తెలియజేస్తే అందరూ హాజరయ్యేలా ఏపీఎంలు చర్యలు తీసుకుంటారు.
*®️ఎంఈవోలకు సూచనలు..*
పిల్లల్లో లోపాలున్నా, సక్రమంగా బడికి వెళ్లకపోయినా, విషయం విద్యార్థుల తల్లులకు తెలియజేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. పాఠశాలల్లో నాడు-నేడు పనులను వేగవంతంగా, పారదర్శకంగా చేపట్టడానికి, మధ్యాహ్న భోజన నాణË్యత, అర్హులైన విద్యార్థులకు జగనన్న విద్యా కానుక అందుతుందా అనే అంశాలను ఏపీఎంలు పరిశీలించనున్నారు. వీటిపై ఎంఈవోలకు సూచనలు అందిస్తారు. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, కేజీబీవీ, ఆదర్శ పాఠశాలలన్నీ కలిపి 2,655 ఉన్నాయి. ఇప్పటికే తొలివిడత నాడు-నేడు పనులు పూర్తి కాగా, రెండో విడత పనులు జరుగుతున్నాయి. ఆయా పనుల పురోగతి, బిల్లులు పరిస్థితిని ఏపీఎంలు పరిశీలించనున్నారు. ఏమైనా సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయనున్నారు.
*®️పరిశీలించి నివేదిక ఇవ్వాలి..*
మండలాల్లోని ఏపీఎంలు పాఠశాలల్లో కొన్ని పనులను పరిశీలించాలని ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇప్పటికే వారికి ప్రభుత్వం శిక్షణనిచ్చింది. ఏపీఎంలు పాఠశాలలకు వెళ్లి వారికి నిర్ధేశించిన అంశాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలి. అదనంగా ఏమైనా సూచనలు, సలహాలుంటే మండల విద్యాధికారులకు తెలియజేయాలి.
*▪️- పగడాలమ్మ, డీఈవో, శ్రీకాకుళం*
✍️బైజూస్ సందేహాలను*
*నివృత్తి చేస్తున్నారు✍️📚*
*®️ఎస్‌సీఈఆర్టీ*
*®️ఈనాడు, అమరావతి*: బైజూస్ వీడియో పాఠాలపై విద్యార్థులకు వచ్చే సందేహాలను తరగతి గదిలో ఉపాధ్యాయులు నివృత్తి చేస్తున్నారని, వీడియో పాఠాలపై ఉపాధ్యాయులకు పూర్తి అవగాహన ఉందని రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్టీ) డైరెక్టర్ ప్రతాప్‌రెడ్డి వెల్లడించారు. యాప్‌ను ఎంత మంది విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకున్నారు.. వాళ్లు వినియోగిస్తున్నారా? అనే సమాచారం విద్యాశాఖ అధికారులకు తెలియజేసేలా ఇంటిగ్రేషన్ చేశామని పేర్కొన్నారు. ‘ఈనాడు’లో మంగళవారం ప్రచురితమైన ‘బైజూస్ బాలారిష్టాలు’ కథనంపై ఆయన స్పందించారు. పిల్లలు తెలుగు, ఆంగ్లంలో నేర్చుకోవడానికి వీలుగా కంటెంట్ ఉందని, ఇది పిల్లలకు పూర్తిస్థాయిలో ఉపయోగపడుతుందని తెలిపారు. బడిలో నేర్చుకున్న అంశాలను ఇంటివద్ద పునశ్చరణ చేసుకోవడానికి ఈ కంటెంట్ మంచి అవకాశంగా ఉందని, వివిధ స్థాయిల విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని రూపకల్పన చేసినట్లు తెలిపారు. బైజూస్ కంటెంట్ తరగతి బోధనా సమస్యలకు చక్కని పరిష్కారంగా ఉంటుందని ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.®️👆