TODAY EDUCATION/TEACHERS TOP NEWS 15/11/2022
TODAY EDUCATION/TEACHERS TOP NEWS 15/11/2022
*📚✍️పది పరీక్షలపై..*
*సన్నద్ధత ఏదీ?✍️📚*
🔺ఓ వైపు ఆలస్యంగా ప్రారంభమైన పాఠశాలలు, మరోవైపు వేధిస్తున్న ఉపాధ్యాయుల కొరత, ఇంకోవైపు బదిలీలు, పదోన్నతుల్లో ఇంకా తొలగని సందిగ్ధత, అధికారుల పర్యవేక్షణాలోపం..వెరసి పదో తరగతి విద్యార్థులపై ప్రభావం చూపుతోంది.
*🌻గుంటూరు(విద్య), నవంబరు14:* ఓ వైపు ఆలస్యంగా ప్రారంభమైన పాఠశాలలు, మరోవైపు వేధిస్తున్న ఉపాధ్యాయుల కొరత, ఇంకోవైపు బదిలీలు, పదోన్నతుల్లో ఇంకా తొలగని సందిగ్ధత, అధికారుల పర్యవేక్షణాలోపం.. వెరసి పదో తరగతి విద్యార్థులపై ప్రభావం చూపుతోంది. పది విద్యార్థులను సన్నద్ధం చేసే ప్రక్రియ ఉమ్మడి జిల్లాలో ఎక్కడా కనిపించడం లేదు. అత్యధిక పాఠశాలల్లో 50శాతం నుంచి 60శాతం కూడా సిలబస్ పూర్తికాలేదంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
విభజిత గుంటూరు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ యాజమాన్యాల ఆధ్వర్యంలో 490 ఉన్నత పాఠశాలలు ఉండగా ఆయా పాఠశాలల్లో 29,961 మంది పదో తరగతి చదువుతున్నారు. పల్నాడు జిల్లాలో 476 పాఠశాలల్లో 26,827 మంది, బాపట్ల జిల్లాలో 215 పాఠశాలల్లో 12,466 మంది టెన్త్ చదువుతున్నారు. కొవిడ్ నేపథ్యంలో ఈఏడాది దాదాపు నెలరోజుల ఆలస్యంగా అంటే జూలై 5న పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. కొన్నిరోజులు ఆన్‌లైన్ క్లాసులు అంటూ హడావిడి చేసిన అధికారులు తరువాత ఆగస్టులో పూర్తిస్థాయిలో తరగతులు నిర్వహించారు. ఫలితంగా దాదాపు రెండునెలలు సిలబస్ ఆలస్యం అయింది. దీంతో నవంబరు మొదటివారం వరకు దాదాపు 90శాతం పాఠశాలల్లో 50 నుంచి 60శాతం కూడా సిలబస్ పూర్తికాని పరిస్థితి నెలకొంది.
*♦️ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తి*
ఉమ్మడి జిల్లాలో బదిలీలు, పదోన్నతుల విషయంలో ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పదోన్నతలు ఇటీవల తూతూమంత్రంగా ముగిసినా పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులు పాఠశాలకు రాలేదు. ప్రతిసారి వేసవిలో ముగించే బదిలీల ప్రక్రియ ఈసారి ఎప్పుడు నిర్వహిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఉపాధ్యాయులు తీవ్ర నిర్లిప్తతలో ఉన్నారు. బదిలీలు జరిగిన తరువాత వెళ్లే పాఠశాలలపైనే దృష్టిపెడుతూ ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలల్లో సిలబస్‌ను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇంకోవైపు మున్సిపల్ స్కూల్స్‌లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. ఒక్క మంగళగిరి కార్పొరేషన్‌లోని ఉన్నత పాఠశాలలో 1,150 మంది విద్యార్థులకు కేవలం 11 మంది ఉపాధ్యాయులు ఉన్నారని, అంతమందికి ఎలా పాఠాలు చెబుతారని మున్సిపల్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకులు ఎస్.రామకృష్ణ పేర్కొన్నారు. దాదాపు అన్ని మున్సిపాల్టీల్లో, కార్పొరేషన్స్‌లో పరిస్థితి ఇలానే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
*♦️సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనలు నిల్..*
పది విద్యార్థుల్ని పరీక్షలకు సన్నద్ధం చేసే ప్రక్రియలో భాగంగా ఇంతవరకు ఒక్క సమీక్ష కూడా జిల్లాల్లో నిర్వహించలేదు. మరోవైపు క్షేత్రస్థాయిలో పర్యటనలు కూడా తూతూమంత్రంగా నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మండలస్థాయిలో ఎంఈవోలు సగటున రోజుకు కనీసం ఒక్క పాఠశాలను కూడా సందర్శించడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. మరోవైపు ప్రత్యేక తరగతుల నిర్వహణ, స్టడీ మెటీరియల్ పంపిణీ, విద్యార్థులకు అల్పాహారం.. అనే విషయాలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️ఉన్నత చదువులకు*
*22వేల మంది దూరం✍️📚*
*♦️మంత్రి బొత్స*
*🌻ఈనాడు, అమరావతి*: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారిలో 22 వేల మంది ఉన్నత చదువులకు ప్రవేశాలు పొందలేదని, మరో 10 వేల మంది ఇతర రాష్ట్రాలకు తరలిపోయారని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఇంటర్‌లో 3,37,987 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తే 3,15,600 మంది ఉన్నత విద్యలో ప్రవేశాలు పొందారని తెలిపారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఉన్నత విద్యపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ… ‘డిగ్రీ కోర్సుల్లో 1.48 లక్షల మంది ప్రవేశాలు పొందారు. ఇంటర్ ఉత్తీర్ణులైన వారిలో ఎక్కువ మంది ఉన్నత చదువులకు ప్రవేశాలు పొందడం మంచి పరిణామం. బీఈడీ కళాశాలల నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడొద్దు. కళాశాలల్లో వీలైనంత త్వరగా తనిఖీలు పూర్తిచేసి, కౌన్సెలింగ్ నిర్వహించాలి. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి సూచించిన ప్రమాణాలను బీఈడీ కళాశాలలు అమలు చేస్తున్నాయో లేదో పరిశీలించి, అనుమతులను పునరుద్ధరించాలి. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు నిర్దేశిత నాణ్యత ప్రమాణాలు ఉండేలా చర్యలు తీసుకోవాలి’ అని ఆదేశించారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️పాఠశాలల్లో ఆర్థిక*
*పాఠాలు: ఆర్బీఐ✍️📚*
*🌻దిల్లీ*: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), ఇతర నియంత్రణ సంస్థలు కలిసి రూపొందించిన ఆర్ధిక అక్షరాస్యత కార్యక్రమాన్ని ఫైనాన్షి యల్ లిటరసీ ప్రోగ్రామ్) తమ పాఠ్యాంశాల్లో చేర్చేందుకు వివిధ రాష్ట్రాల పాఠశాల విద్యా బోర్డులు అంగీకారం తెలిపాయని ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ కుమార్ శర్మ వెల్లడించారు. 6-10 తరగతుల విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే ఆర్థిక అంశాలపై అవగాహన కల్పించాలన్న ఉద్దే శంతోనే ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లు ఫైనాన్షియల్ ఇనూజన్పై నిర్వహించిన సా-ధన్ జాతీయ సదస్సులో ఆయన వెల్లడించారు. 3 రాష్ట్రాలు మినహా దేశం మొత్తం ఈ ప్రోగ్రాము తమ పాఠ్యాంశాల్లో చేర్చుకునేందుకు అంగీకారం తెలిపాయని పేర్కొన్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️జనవరి, ఏప్రిల్‌లలో*
*జేఈఈ మెయిన్!✍️📚*
*🌻ఈనాడు,న్యూస్*: జేఈఈ మెయిన్ తొలి విడత వచ్చే జనవరి, తుది విడతను ఏప్రిల్‌లో జరిపేందుకు జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) సమాయత్తమవుతున్నట్లు సమాచారం. ఈ పరీక్షను రెండు విడతల్లో జరుగుతాయన్న విషయం తెలిసిందే. తొలి విడతకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుందని సమాచారం. దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు సుమారు 10 లక్షల మంది హాజరవుతారు. అందులో ఉత్తీర్ణులైన 2.50 లక్షల మందికే జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసే అర్హత ఉంటుంది.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️ఉన్నత విద్యాకోర్సుల్లో*
*అత్యధిక ప్రవేశాలు✍️📚*
*♦️విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ*
*🌻ప్రజాశక్తి-అమరావతి బ్యూరో*
రాష్ట్రంలో ఉన్నత విద్యాకోర్సుల్లో రికార్డు స్థాయిలో విద్యార్థుల అడ్మిషన్లు జరిగాయని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ విద్యాసంవత్సరం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం 3,37,987 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తే వారిలో దాదాపు 3,15,600 మంది వివిధ కోర్సుల్లో ఉన్నత విద్యలో ప్రవేశాలు పొందారని తెలిపారు. డిగ్రీ కోర్సుల అడ్మిషన్ల ప్రక్రియపై ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, ఉన్నత విద్యామండలి చైర్మన్ కె హేమచంద్రారెడ్డిలతో కలిసి విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. గతంలో కంటే డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు పడిపోయాయంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారిలో కేవలం 22వేల పైచిలుకు విద్యార్థులు మాత్రమే ఉన్నత చదువుల్లో ప్రవేశం పొందలేదని వివరించారు. ఇప్పటి వరకు ఇంజనీరింగ్ కోర్సుల్లో 1.20లక్షల మంది, ఫార్మసీలో 12వేల మంది, వ్యవసాయం-ఆక్వా కల్చర్లో 5 వేల మంది, మెడికల్, నర్సింగ్ కోర్సుల్లో 15వేల మంది అడ్మిషన్లు పొందారని అధికారులు మంత్రికి తెలిపారు. డిగ్రీ కోర్సుల్లో 1.48లక్షల మంది ఐఐఐటీ, ఎస్ఐటి వంటి కోర్సుల్లో 5,600 మంది, ఇతర రాష్ట్రాల్లో మరో 10వేల మంది ప్రవేశాలు పొందారని చెప్పారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️నిబంధనల మేరకు బదిలీలు వెంటనే చేపట్టాలి✍️📚*
*♦️టీఎన్ యూఎస్*
*🌻అమరావతి,ఆంధ్రప్రభ:* బదిలీలను వెంటనే నిర్వహించి పాఠశాలలలో ఉపాధ్యాయుల కొరతని తీర్చాలని, అనేక పాఠశాలలు సరిఅయిన సంఖ్య లో ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి అని తెలుగునాడు ఉపాధ్యాయ సం ఘం తెలిపింది.కౌన్సెలింగ్కు నిబంధనలకు విరుద్ధంగా ఉపాధ్యాయుల బదిలీలను చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దొడ్డిదారిన బదిలీలు చేయడానికి చూస్తున్నారని ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్, శ్రీరా మశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లాల విభజన నేపథ్యంలో సొంత జిల్లాలకు వెళ్లా లని అనుకుంటున్న ఉపాధ్యాయులకు ఈ చర్యలు తీవ్ర నిరాశకు గురిచేస్తోందని, రాజకీయ నాయకుల సిఫార్సులతో సీనియర్ ఉపాధ్యాయులు, మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న వారు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ బదిలీలు నిలిపివేయాలని బదిలీల షెడ్యూల్ వెంటనే ఇవ్వాలని.. పదోన్న తులు పొందిన ఉపాధ్యాయులు నిజమైన పదోన్నతి పొందాలంటే ముందుగా బదిలీలు చేయాలని అప్పుడే వారికి ప్రమోషన్ ఇచ్చినట్టు అవుతుందని తెలిపారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️ట్రిపుల్ ఐటీ కౌన్సెలింగ్లో*
*144 మందికి ప్రవేశాలు✍️📚*
*🌻నూజివీడు*: రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీ ల్లో ఖాళీల భర్తీకి ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో సోమవారం నిర్వహించిన మూడో విడత కౌన్సెలింగ్లో 144 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు. ట్రిపుల్ ఐటీ ఆవరణలో స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ లో నిర్వహించిన ఈ కౌన్సెలింగ్కు 263 మంది అభ్యర్థులకు గాను 144 మంది హాజరై ప్రవేశాలను పొందారు. ఈ కౌన్సెలింగ్ ప్రక్రి యను ఆర్జీయూకేటీ చాన్సలర్ ఆచార్య కేసీ రెడ్డి పరిశీలించారు. మిగిలిన సీట్లు, స్పోర్ట్స్ కోటా సీట్లకు త్వరలోనే మరో విడత కౌన్సె లింగ్ నిర్వహించనున్నట్టు అడ్మిషన్ల కన్వీనర్ ఆచార్య గోపాలరాజు తెలిపారు. అడ్మిషన్లు పొందినవారు వెంటనే వారికి సీటు వచ్చిన క్యాంపన్కు వెళ్లాలని సూచించారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
You might also check these ralated posts.....