*🌻కర్నూలు (కలెక్టరేట్), నవంబరు 10:* ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం కర్నూలులో మొట్టమొదటిసారిగా పెన్షన్, జీపీఎఫ్ అదాలత్ నిర్వంచారు. గురువారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో నిర్వహించిన పెన్షన్, జీపీఎఫ్ అదాలత్ కార్యక్రమంలో ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ చంద్రమౌళి సింగ్ మాట్లాడారు. పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగులకు సంబంధించిన పెన్షన్ దరఖాస్తులను సకాలంలో తమకు పంపాలని డీడీవోలకు సూచించారు. పెన్షనర్లకు సంబంధించిన అన్ని సమస్యలను ఈ నెలాఖరులోపు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉద్యోగులకు సంబంధించిన జీపీఎఫ్ నామినీ, మిస్సింగ్ క్రెడిట్స్ తదితర సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరిస్తామని చెప్పారు.
కలెక్టర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ.. ఉద్యోగులు భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా జీపీఎఫ్ ఖాతాలకు నామినీలను తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలని సూచించారు. జిల్లాలో దాదాపు 88వేల మంది ఉద్యోగులు ఉండగా మూడు వేల మంది మాత్రమే జీపీఎఫ్ ఖాతాలకు నామినీలను ప్రతిపాదించారని తెలిపారు. విశ్రాంత ఉద్యోగులు, పనిచేస్తున్న ఉద్యోగులకు ఎంతగానో ఉపయోగపడే ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటగా కర్నూలులో ఏర్పాటు చేసినందుకు ప్రిన్సిపాల్ అకౌంటెంట్ జనరల్, ఇతర అధికారులకు కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ చంద్రమౌళి సింగ్, సీనియర్ డిఎజి సాయి గాంధీతో కలిసి పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు పెన్షన్ మంజూరు పత్రాలను అందజేశారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్*
*మొబైల్ క్యాంపులు✍️📚*
*♦️ఈ నెల మూడో వారంలో పాఠశాలలు,సచివాలయాలు కేంద్రంగా నిర్వహణ*
*♦️నూరుశాతం ఆధార్కు బయోమెట్రిక్ చేయడమే లక్ష్యం*
*🌻సాక్షి, అమరావతి:* ఆధార్కు బయోమెట్రిక్ నమోదు ప్రక్రియ నూరు శాతం పూర్తి చేసేందుకు ఈ నెల మూడో వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ మొబైల్ క్యాంపులను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిం ది. పాఠశాలలు, గ్రామ, వార్డు సచివాలయాలు కేంద్రంగా డిజిటల్ అసిస్టెంట్ ద్వారా ఈ క్యాంపులను నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో కోటి మంది ఆధార్కు బయోమెట్రిక్ నమోదు కాలేదని, డిసెంబర్ నెలాఖరులోపు వారందరి బయోమెట్రిక్ను సేకరించాలని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 1,950 ఆధార్ సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఈ కేంద్రాల ద్వారా డిసెంబర్ నెలాఖరుకు నూరు శాతం ఆధార్కు బయోమెట్రిక్ సేకరిం చడం సాధ్యం కాదని, పాఠశాలలు, గ్రామ, వార్డు సచివాలయాలు కేంద్రంగా మొబైల్ క్యాంపులను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. ఆధార్ మొబైల్ క్యాంపుల సమాచారాన్ని ముందుగా వలంటీర్ల ద్వారా ఆయా ప్రాంతాల ప్రజలకు తెలియజేయాలని సూచించింది. విద్యా శాఖ భాగస్వామ్యంతో పాఠశాలల పిల్లల ఆధార్ బయోమెట్రి కన్ను సేకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రత్యేక క్యాంపుల్లో భాగంగా ఒక్కో కేంద్రం ద్వారా కనీసం 200 బయోమెట్రిక్ను సేకరించాలని స్పష్టం చేసింది. ప్రత్యేక క్యాంపుల నిర్వహణ, పర్యవే క్షణకు మండల, డివిజన్ వారీగా అధికారులను ఇన్చార్జిలుగా నియ మించాలని తెలిపింది. పాఠశాలలు, సచివాలయాల్లో రోజు వారీగా ఆధార్ బయోమెట్రిక్ మ్యాపింగ్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్లకు సూచించింది.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️ఆధార్ తీసుకుని పదేళ్లు దాటిందా..?అప్డేట్ చేయండి✍️📚*
*♦️నిబంధనలను సవరించిన కేంద్రం*
*🌻న్యూఢిల్లీ, నవంబరు 10:* మీరు ఆధార్ కార్డు తీసు కుని పదేళ్లు దాటిందా? ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చిరునామా, ఇతర వివరాలను అప్డేట్ చేయలేదా? అయితే.. మీరు వెంటనే ఆయా ఆధారాలను సమర్పిం చాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ గురువారం గెజిట్ జారీ చేసింది. దీని ప్రకారం.. ఆధార్ తీసుకున్న తేదీ నుంచి పదేళ్లు దాటితే.. ఫొటో గుర్తింపు కార్డు, చిరునామా ఉన్న ఫొటో గుర్తింపు కార్డులను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. పౌరులు ఈ ప్రక్రియను నేరుగా ఆధార్ పోర్టల్ లేదా ‘మై ఆధార్ యాప్లో పూర్తిచేయ వచ్చని కేంద్రం సూచించింది. ఈ సేవలు అందుబా టులో లేనివారు ఆధార్ ఎన్రోల్మెంట్ కేంద్రాలను సందర్శించి, డాక్యుమెంట్లను అప్డేట్ చేసుకోవాలని పేర్కొంది. దీని వల్ల ‘నిరంతర కచ్చితత్వం’ ఉంటుందని కేంద్రం అభిప్రాయపడింది. కాగా.. గత నెలలో కూడా ఇదే అంశంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీశాఖ ఓ ప్రకటన విడుదల చేయగా.. దానిపై స్పందన లేకపోవడంతో గెజిట్ను విడుదల చేసినట్లు తెలుస్తోంది.
*🌻ఈనాడు, అమరావతి*: రాజీవ్ గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వ విద్యాలయం (ఆర్జీయూకేటీ)లో పని చేస్తున్న ఒప్పంద సహాయ ఆచార్యులకు జీతాలు పెంచాలని, యూజీసీ ప్రకారం మినిమం టైం స్కేల్ అమలు చేయాలని ఒప్పంద సహాయ ఆచార్యుల సంఘం అధ్యక్షుడు అశ్వర్థ నారాయణ డిమాండ్ చేశారు. 2017, 2018లలో నియమితులైన వారికి జీతాలు పెంచకపోవడంతో తీవ్రం నష్టపోతున్నామని వాపోయారు. అక్టోబరులో 29 రోజులపాటు నిరసనలు తెలిపామని, అధికారులకు వినతులు సమర్పించినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఉత్తర్వులు 110 మినహాయించి, ఉత్తర్వులు-5 ప్రకారం జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు.