NMMS MODEL GRAND TEST - 5NMMS MODEL GRAND TEST - 5HOW TO ATTEMPT AP NMMS…
*🌻ఈనాడు, అమరావతి:* ఉపాధ్యాయుల రాజకీయ పైరవీ బదిలీలకు ప్రభుత్వం తెరతీసినట్లు విమర్శలు వ్యక్త మవుతున్నాయి. ప్రభుత్వ విచక్షణాధికారంతో బదిలీలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తు న్నాయి. పైరవీ బదిలీల కోసమే సాధారణ బదిలీలను వాయిదా వేస్తూ వస్తున్నారని ఉపాధ్యాయులు మండిపడు తున్నారు. ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్దీకరణ, పదోన్న తుల ప్రక్రియను పూర్తి చేశారు. వీరిని సర్దుబాటు చేసేం దకు బదిలీలు నిర్వహించాల్సి ఉంది. గత ఆగస్టు నెల నుంచి బదిలీలను వాయిదా వేస్తూ వస్తున్నారు. గత జులైలో రాజకీయ పైరవీ బదిలీలు చేసేందుకు చర్యలు చేపట్టగా.. ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్త మైంది. దీంతో అప్పట్లో ఈ దస్త్రాన్ని నిలిపివేశారు. తాజాగా ఈ దస్త్రాన్ని ఆమోదించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నేతల సిఫార్సులతో బదిలీలకు సుమారు 250. మంది దరఖాస్తు చేశారు. వీరిలో 230మంది బదిలీలకు సీఎం కార్యాలయం నుంచి ప్రయత్నాలు సాగుతున్నట్లు ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ‘పైరవీల బదిలీలు జరిగితే ప్రధానమైన స్థానాలు భర్తీ అయిపో తాయి. ఆ తర్వాత ఉపాధ్యాయులకు సాధారణ బదిలీల్లో కోరుకునేందుకు మంచి స్థానాలు ఉండవు. 2020లో సాధా రణ బదిలీలు చేసినప్పుడు 15వేల ఉపాధ్యాయ పోస్టులను బ్లాక్ చేశారు. ఇవన్నీ పట్టణాలు, నగరాలు, మండల కేంద్రాలకు సమీపంలో ఉన్నవే. దీంతో చాలా మంది మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు గతంలో బ్లాక్ చేసిన స్థానాలను పైరవీ వాళ్లతో నింపేస్తే మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న వారి పరిస్థితి ఏంటి?’ అని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
మళ్లీ అడ్డగోలు బదిలీలు?
*♦️200 మంది టీచర్లకు నేతల సిఫారసులు*
*♦️కోరుకున్న చోట పోస్టింగ్లకు ప్రయత్నాలు*
*♦️కిందిస్థాయి నుంచి మంత్రుల వరకూ పైరవీలు*
*♦️బదిలీల ఉత్తర్వుల్లో జాప్యానికి కారణమిదే*
*♦️గతంలో 399 మంది బదిలీకి సిఫారసు*
*♦️విషయం బయటకు రావడంతో నిలిపివేత*
*🌻(అమరావతి-ఆంధ్రజ్యోతి)*
అడ్డదారిలో ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టేం దుకు ప్రభుత్వం మరోసారి ప్రయత్నిస్తోంది. తమకు కావాల్సిన వారి కోసం కిందిస్థాయి నేతల నుంచి మంత్రుల వరకూ సిఫారసు చేస్తున్నారు. దాదాపు 200 మంది టీచర్లకు వారు కోరుకున్న స్థానాల్లో పోస్టింగ్లు ఇప్పించేందుకు పావులు కదుపుతు న్నారు. గతంలో చేసిన ప్రయత్నం బయటకు రావ డంతో బ్రేక్ పడింది. తాజాగా మళ్లీ ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. అందువల్లే ఉపాధ్యాయుల సాధా రణ బదిలీలను ప్రభుత్వం వాయిదా వేస్తూ వస్తోం దనే వాదన వినిపిస్తోంది. బదిలీల ఫైలు అన్ని స్థాయిల్లో ఆమోదం పొందినా… పాఠశాల విద్యా శాఖ పదే పదే వాయిదాలు వేస్తుండటం ఈ వాద నకు బలం చేకూరుస్తోంది. కొద్ది నెలల కిందట ఇలాంటి ప్రయత్నమే చేయడంతో ఈ ప్రభుత్వంలో ఏమైనా జరగొచ్చని ఉపాధ్యాయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అడ్డదారి బదిలీల కోసం రెండు విడతలుగా ఉత్తర్వులు ఇచ్చే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలిసింది. అధికార పార్టీ నేతల సిఫారసు ఉన్న టీచర్లకు డిమాండ్ ఉన్న చోట పోస్టింగ్ ఇచ్చి, మిగిలిపోయిన స్థానాలను సాధారణ బదిలీల్లో చూపిస్తారు. దీనివల్ల ఆయా చోట్ల అర్హులుగా భావిస్తున్న టీచర్లకు అన్యాయం జరుగుతుంది. ఈ అడ్డదారి బదిలీలపై ఒకట్రెండు రోజుల్లో ఆదేశాలు ఇచ్చి, అనంతరం సాధారణ బదిలీల ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం. బదిలీల వ్యవహారంపై వివరణ కోరేందుకు పాఠశాల విద్యా శాఖ అధికారులను ‘ఆంధ్రజ్యోతి’ సంప్రదించే ప్రయత్నం చేయగా అందుబాటులోకి రాలేదు.
*♦️గతంలో ప్రయత్నించి వెనక్కు…*
జూన్లోనూ 399 మంది టీచర్ల జాబితాను పాఠశాల విద్యా శాఖ తయారు చేసి డీఈవో కార్యాలయాలకు పంపింది. వారు అడిగిన స్థానాల వివరాలు వెంటనే పంపాలని ఆదేశించింది. అప్పట్లో ‘బరితెగింపు బదిలీలు’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ కథ నాన్ని ప్రచురించడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. స్వయంగా విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఈ అడ్డగోలు బదిలీలకు సిఫారసు చేశారు. చివరకు ఓ సర్పంచ్ చేసిన సిఫారసును కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఈ విషయంపై ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమనడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. బదిలీలను నిలిపివేసినట్లు విద్యా శాఖ మంత్రి సంఘాలకు తెలియజేశారు.
*♦️2 నెలలుగా హడావుడి…*
500 పాఠశాలల్లో తరగతుల విలీనంతో చాలామందికి తాత్కాలిక స్థానచలనం కలిగింది. తాజాగా సుమారు 4 వేలమందికి పదోన్నతులు కల్పించారు. దీంతో వీరికి రెగ్యులర్ స్థానాల్లో పోస్టింగ్లు ఇచ్చేందుకైనా బదిలీలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. గత రెండు నెలలుగా బదిలీలంటూ పాఠశాల విద్యా శాఖ హడావుడి మొదలు పెట్టింది. గత మూడు వారాలుగా ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రతిరోజూ చెబుతున్నా ఇవ్వడం లేదు. బదిలీలకు కనీస సర్వీసును 2 సంవత్సరాల నుంచి జీరోకు తగ్గించారు. ఆమోదం కోసం ఆర్థిక శాఖకు ఫైలు పంపామని పాఠశాల విద్యా శాఖ చెబుతోంది. అయితే దీనివల్ల ఎలాంటి ఆర్థిక భారం ఉండదని, ఆర్థిక శాఖ అనుమతే అక్కర్లేదని ఉపాధ్యాయులు అంటున్నారు.
*♦️అక్రమ బదిలీలు చేయొద్దు: ఏపీటీఎఫ్*
బదిలీల కోసం టీచర్లు ఎదురు చూస్తున్న సమయంలో కౌన్సెలింగ్ లేకుండా కొందరిని బదిలీలు చేస్తారనే ప్రచారం సాగుతోందని, ప్రభుత్వం దానికి అడ్డుకట్ట వేసి కౌన్సెలింగ్ ద్వారానే బదిలీలు చేపట్టాలని ఏపీటీఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు జి.హృదయరాజు, ఎస్. చిరంజీవి డిమాండ్ చేశారు. అక్రమ బదిలీల వల్ల రాజకీయ పలుకుబడి లేని సీనియర్ టీచర్లకు అన్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే బదిలీల జీవోలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
*♦️ఇలాగైతే కౌన్సెలింగ్ ఎందుకు?: టీఎన్ యూఎస్*
ప్రభుత్వం దొడ్డిదారిన కొందరు ఉపాధ్యాయులను బదిలీ చేస్తే, కౌన్సెలింగ్ విధానం ఎందుకని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యద రులు మన్నం శ్రీనివాస్, శ్రీరామశెట్టి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. బదిలీలు నేరుగా చేపట్టడం వల్ల అర్హులకు అన్యాయం జరుగుతుందన్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
ఎన్ఎంఎంఎస్ దరఖాస్తుల స్వీకరణ గడువు పెంపు
*🌻మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్టుడే*: జాతీయ ఉపకారవేతన పరీక్షకు దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి తాహెరా సుల్తానా ఒక ప్రకటనలో తెలి పారు. వచ్చేనెల 15వ తేదీ వరకు గడువు పొడిగించినందున అర్హత కలిగిన విద్యార్థులు దరూ ఈ అవకాశాన్నివినియోగించుకోవాలని కోరారు. ఉపాధ్యాయులు కూడా చొరవ తీసు కుని ఎక్కువమంది దరఖాస్తు చేసుకునేలా చూడాలని ఆదేశించారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
డీఈవో బదిలీపై కమిషనర్ ఆదేశాలు బేఖాతరు
*♦️మంత్రి చెబితేనే చేర్చుకుంటామన్న జిల్లా ఉన్నతాధికారి*
*♦️చర్చనీయాంశంగా చిత్తూరు డీఈవో పోస్టు వ్యవహారం*
*🌻ఈనాడు, అమరావతి*: చిత్తూరు జిల్లా విద్యాధికారి (డీఈవో) పురుషోత్తంను ఇన్ఛార్జి పోస్టు నుంచి తొలగించేందుకు పాఠశాల విద్యాశాఖ కమిష నర్ సురేశ్కుమార్ జారీచేసిన ఆదేశాలు బేఖాతరయ్యాయి. కీలక మంత్రి ఒకరు అడ్డుపడడంతో ఈ ఆదేశాలు అమల్లోకి రావడం లేదు. డీఈవోగా పని చేస్తున్న పురుషోత్తం నిబంధనలకు విరుద్ధంగా జిల్లాలో ఉపాధ్యాయులకు డిప్యూటేషన్లు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. గ్రామాల నుంచి పట్టణాలకు, పిల్లలు లేని పాఠశాలలకు ఉపాధ్యాయులను పంపినట్లు ఫిర్యాదులు రాగా, కడప ఆర్జేడీ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీంతో పురుషోత్తంను ఆ పోస్టు నుంచి తొలగించి, అక్కడ సహాయ డైరెక్టర్ (సర్వీ సెస్ విజయేంద్రరావును ఇన్ఛార్జిగా నియమిస్తూ కమిషనర్ అక్టోబరు 14న ఆదేశాలిచ్చారు. ఇప్పటి వరకు ఇవి అమల్లోకి రాలేదు. కొత్త అధికారికి బాధ్య తలు ఇచ్చేందుకు పురుషోత్తం నిరాకరిస్తున్నట్లు తెలిసింది. విజయేంద్రరావు దీనిపై జిల్లా ఉన్నతాధికారిని కలవగా.. ఓ మంత్రితో ఫోన్ చేయించాలని సూచించడం ఆశ్చర్యపరిచింది. దీంతో ఆయన బాధ్యతలు తీసుకోవడం లేదు. కమిషనర్ ఆదేశాలకే దిక్కులేకపోతే, ఇతరులు పరిస్థితి ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పురుషోత్తం చేసిన డిప్యూటేషన్లో అక్ర మాలు జరిగినట్లు గుర్తించి, వాటన్నింటినీ రద్దు చేయడం గమనార్హం.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
సీనియర్ ఉపాధ్యాయులకు న్యాయం జరగాలి:ఎస్టీయు
*🌻అమరావతి, ఆంధ్రప్రభ*:రాష్ట్రవ్యాప్తంగా త్వరలో జరగనున్న ఉపాధ్యా యుల బదిలీలలో సీనియర్ ఉపాధ్యాయులకు న్యాయం జరిగే విధంగా నిబంధనలు పొందుపరచాలని రాష్ట్రా పధ్యాయ సంఘం (ఎన్టియుఎపి) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్.సాయి శ్రీనివాస్ మరియు హెచ్. తిమ్మన్న లు ప్రభు త్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేస్తూ ప్రత్యేకించి కర్నూలు జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు, హిందీ, వ్యాయామ విద్యకు సంబంధించిసీనియర్స్, జూనియర్స్ కోర్టుకు వెళ్లడం ద్వారా 2020 బదిలీ కౌన్సెలింగ్ పెండింగ్ పడిన విషయం తెలిసినదే. అయితే వారికి ఇప్పుడు ఉన్న ఫు లంగా సీనియర్లకు స్పీకింగ్ ఆర్డర్స్ ఇచ్చి రిలీవ్ చేయడం వలన నష్టం వాటిల్లుతుందని, దీనివల్ల సహజ న్యాయ సూత్రాలకు భంగం కలుగుతుందని విమర్శిం చారు.
సీనియర్లకు న్యాయం జరగాలంటే ప్రస్తుతం 2022 బదిలీ కొన్సెలింగ్లో వారికి < అవకాశం కల్పించిపాతస్కూలు, సర్వీస్ పాయింట్లు కలపాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా మిగిలిన జిల్లాలలో కూడా ఎక్కడైనా కోర్టు కేసుల వల్ల సమస్యలు ఉంటే అటువంటి చోట సీనియర్ ఉపాధ్యాయులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం బదిలీ నిబంధనలు రూపొందించాలని విజ్ఞప్తి చేశారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
ఉపాధ్యాయ అక్రమ బదిలీలు చేయొద్దు: టీఎన్ యుఎస్
*🌻అమరావతి, ఆంధ్రప్రభ:* ఉపాధ్యాయ బదిలీల షెడ్యుల్ వస్తుందని గత కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్న తరుణంలో బదిలీల షెడ్యూల్ ఇవ్వకుండా వందల సంఖ్యలో ఉపాధ్యాయులు ను నిబంధనలకి విరుద్దంగా కౌన్సెలింగ్తో సంబంధం లేకుండా వారు కోరుకున్న ప్రాంతాలకు బదిలీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైందని వార్తలు వస్తున్నాయని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం (టీఎన్ యూఎస్) ఆందోళన వ్యక్తం చేసింది. మంచి స్థానాలు ఇలా దొడ్డిదారిన అయిపోతే ఇక ఉపాధ్యాయబదిలీల కౌన్సెలింగ్, నియమాలు దేనికని, అలాంటి అక్రమ బదిలీలు చేయవద్దని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్, శ్రీరామ శెట్టి వెంకటేశ్వర్లు సోమవారం ఒక ప్రకటన లో డిమాండ్ చేశారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు
*🌻అమరావతి,ఆంధ్రప్రభ*: రాష్ట్రంలో వైద్యవిద్యను పర్యవేక్షించే ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును ఎన్టీయార్ హెల్త్ యూనివర్శిటీ నుండి డాక్టర్ వైఎస్ఎఆర్ హెల్త్ యూనివర్శిటీగా మారుస్తూ రాష్ట్రప్రభుత్వం చట్టసవరణ చేసిన సంగతి తెలిసిందే. గత అసెంబ్లీ సమావేశాల్లో ఈ చట్టసవరణను చేశారు. దీనికి అనుగుణంగా యూనివర్శిటీ పేరును డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వ విద్యాల యంగా మార్చుతూ సోమవారం నాడు గెజిట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరపున ప్రిన్సిపల్ సెక్రటరీ ఎ.టి.కృష్ణబాబు ఈ గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేశారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రామచంద్రారెడ్డి
*🌻అమరావతి, ఆంధ్రప్రభ:* మార్చి 2023లో జరగబోవు పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలలో మిట్టా వెంకటగారి రామచంద్రారెడ్డిని పి ఆర్టియు,ఇతర ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసు న్నారు. ఈమేరకు ఆ రాష్ట్ర కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని రాష్ట్ర అధ్య క్ష ప్రధాన కార్యదర్శులు మిట్టా కృష్ణయ్య, వైష్ణవ కరుణానిధి మూర్తి మరియు డా గాదె శ్రీనివాసులు నాయుడు మాజీ ఎమ్మెల్సీ ప్రకటించారు. అభ్యర్థి గెలుపునకు కర్నూలు, కడప, అనంతపురము జిల్లాల పిఆర్ టియు శ్రేణులు కృషి చేయాలని వారు కోరారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
పింఛన్ పథకం నుంచీ డబ్బులు వెనక్కి
*♦️ఈపీఎఫ్ఎ నిబంధనల సడలింపు*
*🌻దిల్లీ*: ఆరు నెలల కంటే తక్కువ సర్వీసు మాత్రమే మిగిలిఉన్న ఖాతాదా రులను తమ ‘ఉద్యోగుల పింఛన్ పథకం 1995’ (ఈపీఎస్-95) నుంచి డబ్బులుఉపసంహరించుకునేందుకు అనుమతించాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఎ) నిర్ణయించింది. ప్రస్తుతం 6 నెలల కంటే తక్కువ సర్వీసు మిగిలి ఉన్నవారు తమ భవిష్య నిధి(పీఎఫ్) ఖాతా నుంచి మాత్రమే డబ్బులు వెనక్కి తీసుకోవడానికి అనుమతులున్నాయి. ఈపీఎస్ ఖాతాదారులకూ ఈ వెసులుబాటు ఇవ్వాలని సోమవారం కేంద్ర కార్మిక మంత్రి భూపేందర్ ఆధ్వ ర్యంలో జరిగిన ఈపీఎఫ్ఓ నిర్ణయాధికార సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) 232వ సమావేశం సిఫారసు చేసినట్లు కార్మికశాఖ వెల్లడించింది.
*🌻వీరికి అధిక పింఛన్ వస్తుంది!*
34 ఏళ్ల కంటే ఎక్కువ కాలంపాటు పథకంలో ఉన్నవారికి అందుకు తగ్గ ట్లుగా పింఛన్ ప్రయోజనాలను ఇవ్వడానికీ బోర్డు సిఫారసు చేసింది. దీని వల్ల పదవీ విరమణ ప్రయోజనాలను నిర్ణయించే సమయంలో అధిక పింఛన్ పొందడానికి వీలవుతుంది. ఈటీఎఫ్ యూనిట్లలో ఉన్న పెట్టుబడులను ఉప సంహరించుకునే రిడన్షన్ పాలసీకి సైతం అనుమతినిచ్చారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
అక్రమ ఓట్ల నమోదును అరికట్టాలి: ఏపీటీఎఫ్
*🌻ఈనాడు, అమరావతి:* ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్ని కల ఓటర్ల నమోదు మందకొడిగా సాగుతున్నందున పాఠశాలల పని వేళల్లోనూ నమోదుకు అవకాశం కల్పిం చాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ముఖే షుమార్కు ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హృదయరాజు, చిరంజీవి వినతిపత్రం సమర్పించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు, కార్పొరేట్ సంస్థల నుంచి నమోదవుతున్న అక్రమ ఓట్లను అరికట్టాలని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
20 వేల ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయాలి
*♦️’ఈటీవీ- ప్రతిధ్వని’ చర్చలో వక్తలు*
*🌻ఈటీవీ, అమరావతి:* క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ విద్యావ్యవస్థను ధ్వంసం చేస్తున్నాయి. ‘జాతీయ విద్యా విధానం 2020’లో భాగంగా చేపట్టిన సంస్కరణలు ప్రతికూల మైన పరిస్థితుల్ని సృష్టిస్తున్నాయి. గందరగోళ పరిస్థి తుల మధ్యే విద్యార్థుల బోధన సాగుతోంది. సీబీఎస్ఈ విధానంలో పరీక్షలు రాయాలో.. లేక రాష్ట్ర బోర్డు విధా నంలో పరీక్షలు రాయాలో తెలియని దుస్థితి విద్యార్థులది. సంక్షేమ పథకాల్లో బటన్ నొక్కితే నిధులు పడు తున్నాయని చెప్పే ముఖ్యమంత్రి జగన్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారన్న ఆక్షేపణ వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో 5,250 పాఠశాలలు విలీనమైనా ఇంకా గందరగోళ పరిస్థితులే ఉన్నాయని ‘ఈటీవీ – ప్రతిధ్వని’ చర్చా కార్యక్రమంలో నిపుణులు అభిప్రాయపడ్డారు. విలీనం పేరిట విద్యార్థులందరినీ ఉన్నత పాఠశాలలకు పంపినా చాలాచోట్ల తరగతి గదులు లేక.. ఉపాధ్యాయులు లేక ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు. సీబీఎస్ఈ విధానమైనా ఆంగ్లమాధ్య మమైనా దశలవారీగా ప్రవేశపెడితే ఫలితాలు వచ్చే వీలు ఉండేదని చర్చలో నిపుణులు పేర్కొన్నారు. ప్రభుత్వ తొందరపాటుతనం వల్ల విద్యార్థులకు, ఉపాధ్యాయులకూ ఇబ్బందులు తప్పడం లేదన్న ఆక్షేపణలు వ్యక్తం అవుతున్నాయి. పాఠశాల విద్యాశాఖ నిర్వహిం చిన బేస్ లైన్ పరీక్షలోనే ఆంగ్లమాధ్యమంలో బోధన వాస్తవాన్ని బట్టబయలు చేసింది. 8వ తరగతి చదువు తున్న విద్యార్థుల్లో ఒక్కరు కూడా వాక్యనిర్మాణాన్ని చేయలేకపోవటం ప్రభుత్వ నిర్ణయంలోని తొందరపాటు తనాన్ని సూచిస్తోంది. కేవలం మౌఖికంగా మాత్రమే ఆదేశాలు ఇచ్చి 1-8 తరగతి వరకూ ఆంగ్ల మాధ్యమం లోకి మార్చేశారని ఉపాధ్యాయ సంఘాలు గగ్గోలు పెడు తున్నాయి. ఫౌండేషన్తో పాటు ఆరు రకాల పాఠశా లల గురించీ తల్లిదండ్రులకు పూర్తిస్థాయిలో అవగాహన లేకుండాపోయింది. ప్రభుత్వ వైఖరి కారణంగా ఈ విద్యా సంవత్సరంలోనే 4 లక్షల వరకూ విద్యార్థులు ప్రై వేటు పాఠశాలలకు వెళ్లిపోయిన పరిస్థితి. అసలు ఎన్ ఈపీ ప్రమాదకరమైన విద్యావిధానమని ‘ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ అభిప్రాయపడుతోంది. 2023 నాటికి అసలు ప్రాథమిక పాఠశాలల ఉనికే కనిపించ కుండా పోయే పరిస్థితి ఉందని చర్చలో నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
గిరిజన విద్యారంగసమస్యలు పరిష్కరించాలి: యుటిఎఫ్
*🌻అమరావతి, ఆంధ్రప్రభ*:గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని విద్యార్థుల, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని యుటియఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్. వెంకటేశ్వర్లు, కె.ఎస్.ఎన్.ప్రసాద్, పిడిఎఫ్ ఎమ్మెల్సీలు వి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.లక్ష్మణరావు, షేక్ సాబ్జీ కోరారు. సోమవాఉరం గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ఎం. జాహ్నవిని గిరిజన సంక్షేమ శాఖ కార్యాల యంలో కలిసి గత 2 సం॥లుగా గిరిజన ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎదుర్కొం టున్న సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు.. డిఇఓ, డీవైఇఓ, ఎంఇఓ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. జిఓ 3ని పునరుద్దరించడానికి చర్యలు తీసుకో వాలని సిఆర్ లను రెగ్యులర్ చేయాలని, బాషా వాలంటీర్లను నియామకం తదితర సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఇప్పటికే ఉపాధ్యాయుల బోధనే తర పనులు చేస్తున్నారని, అదనంగా రాత్రి బసచేయాలనే ఉత్తర్వులు ఇవ్వడం సరైనది కాదని తెలిపారు. బస చేయాలనే ఉతర్వులు ఉపసంహరించుకోవాలని కోరారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
ఇక డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉత్తర్వులు జారీచేసిన వైద్య శాఖ
*🌻సాక్షి, అమరావతి:* ఆరోగ్య విశ్వవిద్యాలయం డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెందింది. ఇటీవల ఆరోగ్య విశ్వ విద్యాలయం చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ ఆమోదించిన ముసాయిదాకు గవర్నర్ ఆమోదం కూడా లభించడంతో చట్ట సవరణ పూర్తయింది. దీంతో సవరించిన చట్టాన్ని సోమవారం నుంచి అమలుచేస్తూ వైద్య, ఆరోగ్య శాఖ ము ఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులిచ్చారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
సిపెట్ లోఉచిత నైపుణ్య శిక్షణ
*♦️పదో తరగతి పాసైన ఎస్టీ, ఎస్సీ యువతకు అవకాశం*
*♦️ఉచిత వసతి, భోజన సదుపాయం*
*🌻సాక్షి, అమరావతి:* విజయవాడ సమీపంలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (సిపెట్)లో ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతకు ‘మెషీన్ ఆప రేటర్-ప్లాస్టిక్స్ ప్రాసెసింగ్ కోర్సులో ఉచితం గా శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ జాయింట్ డైరెక్టర్ సీహెచ్ శేఖర్ సోమవారం ఒక ప్రక టనలో తెలిపారు. ఎంఎస్ఎంఈ, ఎన్ఎస్ఎస్ఐసీ సహకారంతో 30 మందికి ‘మెషీన్ ఆపరేటర్ -ప్లాస్టిక్స్ ప్రాసెసింగ్ కోర్సులో ఆరు నెలల పాటు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. విజ యవంతంగా కోర్సు పూర్తి చేసుకున్నవారికి సర్టిఫికెట్తోపాటు అనంతపురం, హైదరా బాద్, బెంగళూరు, హోసూర్, చెన్నై ప్రాంతా ల్లోని ప్రముఖ ప్లాస్టిక్స్, అనుబంధ సంస్థల్లో ఉద్యోగ అవకాశం కల్పించనున్నట్లు వివరిం చారు. అవకాశం ఉన్నవారు సొంతగా సంస్థ ను ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధి కూడా పొందవచ్చని తెలిపారు. శిక్షణాకాలంలో అభ్యర్థులకు ఉచిత భోజన, వసతి సదుపా యాలను కల్పిస్తామని, 18 ఏళ్లు నిండిన పదో తరగతి ఉత్తీర్ణులైనవారు అర్హులని పేర్కొ న్నారు. ఆసక్తి గల ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు దర ఖాస్తు చేసుకునేందుకు 7893586494 నంబర్ లో సంప్రదించి నవంబర్ నాలుగో తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
ట్రిపుల్ ఐటీల్లో రెండో విడత 256 మందికి అడ్మిషన్లు
*🌻నూజివీడు*: రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో రెండో విడత కౌన్సెలింగ్లో 256 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. ట్రిపుల్ ఐటీల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం సోమవారం నూజివీడు ట్రిపుల్ ఐటీలో రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కౌన్సెలింగ్కు 460 మంది అభ్యర్థులు రావాల్సి ఉండగా, 256 మంది హాజరుకాగా, అధికారులు వీరికి సీట్లను ఖరారు చేశారు. కౌన్సెలింగ్ ప్రక్రి యను చాన్సలర్ ఆచార్య కేసీ రెడ్డి, నూజివీడు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఆచార్య జీవీఆర్ శ్రీనివాసరావు పరిశీలించారు. కౌన్సెలింగ్ ముగిసిన అనంతరం మరో 204 సీట్లు మిగిలాయి. ఎన్సీసీ, స్పోర్ట్స్ కోటా కౌన్సె లింగ్ సమయంలో ఇప్పుడు మిగిలిన సీట్లకు కలిపి మూడో విడత కౌన్సెలింగ్ను త్వరలోనే నిర్వహిస్తామని అడ్మిషన్స్ కన్వీనర్ ఆచార్య గోపాలరాజు తెలిపారు.
*🌻అమరావతి* : ఎమ్మెల్సీ ఓటర్ల నమో దు ప్రక్రియ మందకొడిగా సాగుతున్నం దున పాఠశాలల పనివేళ్లల్లో కూడా న మోదుకు అవకాశం ఇవ్వాలని ఏపీటీఎ ఫ్ రాష్ట్ర అధ్యక్షుడు హృదయరాజు కోరా రు. సోమవారం ఈ మేరకు రాష్ట్ర ఎన్ని కల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీ నాను కలిసి వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా ప్రైవేటు, కార్పొరేట్ సంస్థల నుంచి నమోదవుతున్న అక్రమ ఓట్లను అరికట్టాలని, నిబంధనలు పాటించకుం డా అక్రమ ఎన్రోల్మెంట్కు పాల్పడు తున్న అధికారులపై చర్యలు తీసుకోవా లని డిమాండ్ చేశారు. సరిహద్దు జిల్లా ల్లో పనిచేస్తూ పక్క రాష్ట్రాల్లో నివాసం ఉంటున్న వారి ఆధార్, నివాస ప్రాంతా ల ఆధారంగా కాకుండా ఉద్యోగం చేసే సంస్థ ఆధారంగా ఓటు నమోదుకు అవకాశం ఇవ్వాలన్నారు. ఓ నమోదు తేదీ పొడిగించాలని ప్రధాన ఎన్నికల అధికారిని కోరారు.