TODAY EDUCATION TEACHERS TOP NEWS 13/10/2022

WhatsApp Group       Join Now
Telegram Group Join Now

TODAY EDUCATION TEACHERS TOP NEWS 13/10/2022


కొనసాగుతున్న ఉద్యోగోన్నతుల ప్రక్రియ


*🌻మచిలీపట్నం (గొడుగుపేట), న్యూస్టుడే*: ఉమ్మడి జిల్లాలో అర్హత కలిగిన ఉపాధ్యాయులకు కేటగిరీల వారీగా నిర్వహిస్తున్న ఉద్యోగోన్నతుల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూలు ప్రకారం బుధవారం స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులకు సంబంధించి గణితం, పీఎస్, పీడీ ఉపాధ్యాయుల అంగీకారాన్ని తెలుసుకున్నారు. వివిధ ప్రాంతాలనుంచి. ఉపాధ్యాయులు డీఈవో కార్యాలయానికి వచ్చి తమ అభిప్రాయాలను వెల్లడించారు. గురువారం కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న 1998 డీఎస్సీ అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ ముగిసిందని చెప్పారు.


Related Post
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

స్మార్ట్ ఫోన్లు ఎందరికిఉన్నాయి?:బైజూస్ యాప్ ను 21 నుంచి ఇన్స్టాల్ చేయాలి


*♦️ప్రధానోపాధ్యాయులకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు*

*🌻ఈనాడు, అమరావతి*: బైజూస్ ఒప్పంద నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 4-10 తరగతి చదువుతున్న విద్యార్థుల్లో ఎంత మందికి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయో తెలుసుకునేందుకు పాఠశాల విద్యాశాఖ వివరాలు సేకరిస్తోంది. ఆన్లైన్లో విద్యార్థుల వివరాలను ప్రధానోపాధ్యాయులకు పంపించింది. ఇందులో స్మార్ట్ ఫోను ఉందా? లేదా? సెల్ఫోన్ నంబరు తప్పుగా ఉంటే సరి చేయడం.. లేకపోతే కొత్తగా నమోదు చేసేలా ఐచ్చి కాలు ఇచ్చింది. బైజూస్ యాప్ డౌన్లోడ్కు సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని ఆదేశిం చింది. విడతలవారీగా విద్యార్థులు సెల్ఫోన్లను పాఠశాలకు తీసుకువచ్చేలా చూడాలని, ఫోన్లలో యాప్ను డౌన్ లోడ్ చేసి ఇవ్వాలని పేర్కొంది. యాప్లను డౌన్లోడ్ చేసుకునేందుకు ఇంటర్ నెట్ సదుపాయాన్ని కల్పించాలని సూచించింది. ఈనెల 21, 22న నాలుగైదు తరగతులు, 24న ఆరోతరగతి, 26-28వరకు ఏడు, తొమ్మిది, పది తరగతుల విద్యార్థులకు యాప్ను విద్యార్థుల సెల్ఫోన్లలో డౌన్లోడ్ చేయాలని పేర్కొంది.

*♦️స్మార్ట్ ఫోన్లు ఎలా?*

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 50శాతం మంది కిపైగా విద్యార్థులకు స్మార్ట్ఫోన్లు లేవని కరోనా సమయంలో వెల్లడైంది. స్మార్ట్ ఫోన్లు లేకపోవడం వల్ల ఆ సమయంలో చాలామంది అభ్యసించలేకపోయారు. ఇప్పుడు బైజూస్ కోసం స్మార్ట్ఫోన్లు ఎక్కడి నుంచి వస్తాయని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఇంటి వద్ద తల్లిదండ్రులు వినియోగించే ఫోన్లలో యాప్ను డౌన్లోడ్ చేసి ఇస్తే ఇంటర్నెట్ డేటా ఖర్చు భరించడం ఇబ్బందిగా మారుతుందని, కొంతమంది స్మార్ట్ ఫోన్లను పిల్లలకు ఇచ్చేందుకు అంగీకరించరని చెబుతున్నారు. ఎనిమిదో తరగతి వారికి ఇస్తున్నట్లే పిల్లలందరికీ ట్యాబ్లు ఇస్తే ఇబ్బంది ఉండదని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

అన్వేషణలతోనే పాఠ్యాంశాల బోధన జరగాలి: పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్


*🌻అమరావతి,ఆంద్రప్రభ:* విద్యార్థులకు పాఠ్యాంశాల బోధన అన్వేషణ మార్గంలో ఉండాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ అన్నారు. బుధవారం విజయవాడలో పాఠ శాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా, యునిసెఫ్, విజ్ఞానాశ్రమ్, అటల్ ఇన్నోవేషన్ మిషన్ సంయుక్త ఆధ్వర్యంలో 3 రోజులు పాటు ‘కల్పన డ్రీమ్ విజన్ 2023’ పేరిట నిర్వహిస్తున్న ‘అటల్ టింకరింగ్ ల్యాబ్స్ పునఃశ్చరణ’ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తొలి రోజు ప్రారంభ సభలో కమీషనర్ ఎస్. సురేష్ కుమార్ గారు మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థులు కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారని, ఉపాధ్యాయులు కాస్త శ్రద్ధ పెట్టి వారిలో దృగ్విషయాలను, శ్రాస్త్రీయతలను రగలించగలిగితే విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా రూపొందగల్గుతారని అన్నారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

‘పది’ టీచర్లకు పోస్టింగ్లు


*🌻ఏలూరు ఎడ్యుకేషన్, అక్టోబరు 12*: పదోతరగతి పరీక్షల సందర్భంగా పలు అభియోగాలపై సస్పెండ్ అయిన 8 మంది స్కూల్ అసిస్టెంట్ కేడర్ ఉపాధ్యాయులకు కోర్టు ఆదేశాలు, ఉన్న తాధికారుల సూచనల మేరకు బుధవారం పోస్టింగ్లు ఇచ్చారు. ఇప్పటికే ఇద్దరు హెచ్‌ఎంలకు కాకినాడ ఆర్జేడీ మదుసూదనరావు పోస్టింగ్‌లు ఇచ్చిన విషయం విధితమే. వీరంతా ఈ ఏడాది ఏప్రిల్‌/మే నెలల్లో టెన్త్‌ పరీక్షల సందర్భంగా ప్రశ్నాపత్రం లీక్‌, మాల్‌ప్రాక్టీస్‌ తదితర అభియోగాలపై సస్పెండ్‌ అయ్యారు. సస్పెన్షన్‌ ఉత్తర్వులపై కోర్టును ఆశ్రయించగా, వాటిని రద్దుచేస్తూ కోర్టు మద్యంతర ఆదేశాలను ఇచ్చింది. ఏలూరు జిల్లాలో ఇద్దరు హెచ్‌ఎంలు, 9 మంది స్కూల్‌ అసిస్టెంట్లు సస్పెండయ్యారు.

వీరిలో ఒక స్కూల్‌ అసిస్టెంట్‌ మినహా మిగతావారంతా కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టునుంచి సస్పెన్షన్‌ రద్దు ఆదేశాలను తెచ్చుకున్న వారందరికీ తాజాగా అవే స్కూళ్ళకు పోస్టింగ్‌లు ఇచ్చారు. కాగా కృష్ణాజిల్లా నుంచి ఏలూరు జిల్లాలోకి విలీనమైన ముదినేపల్లి మండలంలోని కొన్ని పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపా ధ్యాయులు కూడా సస్పెండ్‌ కాగా, వీరు కోర్టును ఆశ్రయించక పోవడంతో పోస్టింగ్‌ల విషయమై ఒకింత డైలమా నెలకొంది. ఒకవేళ వీరు కోర్టుకు వెళ్ళినా ఇంతకుమునుపు ఉపాధ్యాయుల మాదిరిగానే సస్పెన్షన్‌ రద్దు ఆదేశాలను తెచ్చుకునే అవకాశాలు ఉండటంతో కోర్టుతో నిమిత్తం లేకుండా పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే దీనిపై ఇంతవరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువరించలేదు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

విద్యార్థులకు.. పరీక్షే!: ‘ఎఫ్ఎ-1’లో ఓఎంఆర్ షీట్లు


*♦️ప్రభుత్వ నూతన ప్రయోగం*

*♦️ఆందోళనలో ఉపాధ్యాయులు*

*🌻(ఇచ్ఛాపురం రూరల్)*
విద్యార్థుల జీవితాలపై రాష్ట్ర ప్రభుత్వం కొత్త కొత్త ప్రయోగాలు చేస్తోంది. మునుపెన్నడూ లేనివిధంగా తొలిసారి ఫార్మేటివ్‌ అసెస్మెంటు-1 (ఎఫ్‌ఏ) పరీక్షల్లోనూ ఓఎంఆర్‌ షీట్లను ప్రవేశపెడుతోంది. ఈ విధానంలో మూడు నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులు ఓఎంఆర్‌ షీట్‌లో పరీక్షలు రాయాల్సి ఉంటుంది. పిల్లలకు సాంకేతిక పరిజ్ఞానం పరిచయం చేస్తే భవిష్యత్తులో పోటీ పరీక్షల్లో రాణిస్తారన్నది ప్రభుత్వ యోచన. ప్రాథమిక తరగతులకు సాధారణ పరీక్షలతోనే ఆశించిన ఫలితాలు వస్తాయని విద్యావేత్తల అభిప్రాయం. ఈ తరహా పరీక్షలను రాయగల సమర్థత, సత్తా ప్రాథమిక విద్యార్థులకు ఉందా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఎఫ్‌ఏ-1 పరీక్షలకు సంబంధించి ఓఎంఆర్‌ షీట్ల ప్రశ్నాపత్రాల మోడల్‌ పేపర్లు కానీ, ఎన్ని మార్కులకు పెడతారు.. ఎప్పటి నుంచి నిర్వహిస్తారు.. అన్న అంశాలపై ఇప్పటివరకు అధికారులు తెలపలేదు. పరీక్షల షెడ్యూలు గురించి కూడా స్పష్టత లేదు. దీంతో పరీక్షలపై ప్రభుత్వం చేస్తున్న ప్రయోగాలు విద్యార్థులపై ప్రభావం చూపే అవకాశం ఉందంటూ ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

*♦️కొత్త షెడ్యూలు :*

ఎఫ్‌ఏ-1 పరీక్షల షెడ్యూల్‌ను గతంలో నిర్ణయించారు. ఈ మేరకు సెప్టెంబరు 2వ వారంలో పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. 15వ తేదీలోగా ఆ పరీక్షల మార్కులను విద్యార్థుల వారీగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలి. అయితే ఓఎంఆర్‌ షీట్ల ముద్రణ ఆలస్యమవుతున్నందున విద్యాశాఖ ఏకంగా పరీక్షల షెడ్యూల్‌నే మార్చేసిందనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే పరీక్షలు లేకుండా మూడు నెలలు గడిచిపోయింది. కొత్త షెడ్యూలు ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు పరీక్షలు నిర్వహిస్తారన్న అంశంపై విద్యాశాఖ నుంచి స్పష్టత లేదు. దీంతో విద్యార్థులపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని, పదో తరగతి విద్యార్థులపై మరింత ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.

*♦️మొదటిసారి ఓఎంఆర్‌ షీట్లు..*

జిల్లాలో 2,657 ప్రభుత్వ పాఠశాలల్లో 2,88,351 మంది విద్యార్థులు చదువుతున్నారు. అందులో 3 నుంచి 8వ తరగతి వరకు 1,28,260 మంది విద్యార్థులు ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత మొదటిసారి ఈ ఏడాది ఎఫ్‌ఏ-1 పరీక్షలపై కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. దీనిపై తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పోటీ పరీక్షలు, ఇతర ఉన్నత విద్యా పరీక్షల్లో పెట్టే ఓఎంఆర్‌ విధానాన్ని పాఠశాల విద్యలో ప్రవేశ పెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఎంఈవో కురమాన అప్పారావును వివరణ కోరగా ఇప్పటి వరకు దీనిపై స్పష్టమైన ఆదేశాలు రాలేదన్నారు. ఈ విధానం అమలైతే ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి వారి ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు.

*♦️ఓఎంఆర్‌ పద్ధతి కష్టమై*

పరీక్షల విధానంలో మార్పు చేశారు. గతంలో ఉన్న ఈసీఈ పద్ధతిలో అర, ఒకటి, రెండు, నాలుగు మార్కుల ప్రశ్నలిచ్చి సమాధానాలు రాయాలి. ఇందులో విద్యార్థి రాత దోషాలు, బొమ్మలు గీయడం వంటి నైపుణ్యాలు గుర్తించవచ్చు. ఓఎంఆర్‌ పద్ధతి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కష్టమైంది. ఇప్పటి వరకు దీనిపై ఉపాధ్యాయలకు ఎలాంటి శిక్షణ, అవగాహన కల్పించలేదు.

– ఆర్‌వీ. అనంతాచార్యులు, ఏపీటీఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు.

విద్యార్థులకు ఇబ్బందే

ఓఎంఆర్‌ షీట్‌లో జవాబులు రాయాలని చెప్పడం విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తుంది. ఈ విధానంతో వారిలో జిజ్ఞాస, భావ వ్యక్తీకరణకు అవకాశం ఉండదు. ప్రైవేటుకు మినహాయించి, ప్రభుత్వ పాఠశాలలపై రుద్దడం సరికాదు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.

*▪️- బి.శంకరం, ఆపస్‌, మండల అధ్యక్షుడు.*

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

గురుకులాల్లో ప్రత్యేక విద్యా ప్రణాళిక


*🌻పెడన గ్రామీణం, న్యూస్టుడే*: జిల్లా లోని సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ప్రత్యేక వార్షిక ప్రణాళికను గురువారం నుంచి అమలు చేయనున్నారు. విద్యా ర్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు. 9, 10 తరగతులకు రోజూ వారీ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. డిసెంబరు నెల నుంచి వారం వారం పరీక్షలు నిర్వ హించాలని ఉన్నతాధికారులు సూచించినట్లు డీసీవో పద్మజ తెలిపారు. వారం రోజుల్లో ఇదే విధానాన్ని ఇంటర్మీడియట్ విద్యార్థులకు అమలు చేస్తామని పేర్కొ న్నారు. 2022-23 విద్యా సంవత్సరంలో సాంఘిక గురుకులాల్లో మెరుగైన ఫలితాల సాధనకు ఇప్పటి నుంచే ప్రయ త్నాలు ప్రారంభించినట్లు తెలిపారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి సీఎస్ కు జేఏసీ నేతల వినతి


*🌻అమరావతి, ఆంధ్రప్రభ* : మూడు సంవత్సరాలుగా పెండింగ్ వున్న డీఏలు,రెండు కొత్త డీఎలు, పీఆర్సీ బకాయిలు తక్షణమే చెల్లించాలని ఏపీ అమరావతి జేఏసీ నేతలు బొప్పరాజు, వైవీ రావు బుధవారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మను కలిసి కోరారు. కనీసం జీతాలు, పెన్షన్లు కూడా ప్రతి నెల సకాలంలో ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం డీఏ, అరియర్స్ చెల్లించక పోగా అరియర్స్ చెల్లించినట్లే భావించి 2020-21, 21-22 రెండు సంవత్సరాలలో వరుసగా తమ నుండి ఆదాయపు పన్ను వసూళ్లు చేయడం బాధాకరమన్నారు. రెండు సంవత్సరాల క్రితం ఇచ్చిన జీఓలు తక్షణమే అమలు చేసి సీప్రీస్ పెన్షనర్లకు క్యాష్ చెల్లించాలని, ఓపీఎస్ ఉద్యోగులకు వారి వారి జీపీఎస్ అకౌంట్లకు జమ చేయాలని విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలపై సీఎస్కు జెఎసీ నేతలు వినతి ప్రతాలు అందజేశారు. సీఎస్ స్పందిస్తూ ఉద్యోగుల సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టీ ఆర్ధిక శాఖ అధికారులకు పంపి వీలైనంత త్వరలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

ట్రిపుల్ ఐటీ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రారంభం


*🌻నూజివీడు, న్యూస్టుడే:* ఆర్జీయూకేటీ పరిధిలోని ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపు లఐటీలో 2022-23 విద్యా సంవత్సర ప్రవేశాల ప్రక్రియను ఆర్జీయూకేటీ కులపతి ఆచార్య కేసీ రెడ్డి, ఉప కులపతి ఆచార్య హేమచంద్రారెడ్డి బుధవారం ప్రారంభించారు. ప్రవేశాల కన్వీనర్ ఆచార్య గోపాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. తొలి రోజు మొత్తం 524 మంది విద్యార్థులను కౌన్సెలింగ్కు పిలవగా 495 మంది హాజ రయ్యారన్నారు. ఈ ప్రక్రియ రాత్రి కూడా కొనసాగింది. ప్రవేశాలు పొందిన కొందరు విద్యార్థులకు ఆయా పత్రాలను కులపతి అందజేశారు. ఏదేని కారణాలతో బుధవారం కౌన్సెలింగ్కు రాలేని వారు గురువారం హాజరు కావచ్చని పేర్కొన్నారు. కౌన్సెలింగ్ ప్రక్రియను ట్రిపుల్టీ డైరెక్టర్ ఆచార్య జీవీఆర్ శ్రీనివాసరావు పర్యవేక్షించారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్


*🌻ఈనాడు, అమరావతి*: ఉద్యోగ నియామకాలు, పదో న్నతుల్లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ అమలుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రిజర్వేషన్ మినహాయింపు అవసరమని ఏదైనా విభాగం భావిస్తే ఆ విషయానికి సంబంధించిన వివరాలను అంతర విభాగాల కమిటీ ముందు ఉంచాలని ఆదేశించారు. సబార్డినేట్ సర్వీస్ రూల్స్-1996కి అవసర మైన సవరణలను విడిగా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

అన్వేషణలతో పాఠాల బోధన సాగాలి: కమిషనర్


*🌻ఈనాడు, అమరావతి:* విద్యార్థులకు బోధన అన్వేషణ మార్గంలో ఉండా లని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. పాఠశాల విద్య, సమగ్రశిక్ష అభియాన్, యూనిసెఫ్, విజ్ఞానాశ్రమ్, అటల్ ఇన్నోవేషన్ మిషన్ సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజులపాటు ‘కల్పన డ్రీమ్ విజన్ 2023’ పేరిట నిర్వహిస్తున్న అటల్ టింకరింగ్ ల్యాబ్స్ పునశ్చరణ కార్యక్ర మంలో ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు విద్యార్థుల్లో శాస్త్రీయాంశా లను పెంపొందిస్తే భావి శాస్త్రవేత్తలుగా రూపొందుతారని తెలిపారు. యూనిసెఫ్ విద్యా విభాగం ప్రత్యేక అధికారి శేషగిరి మధుసూదన్ మాట్లా డుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో సైతం విద్యార్థులు విజ్ఞానశాస్త్ర అంశాల పట్ల ఆసక్తితో ఉంటున్నారని, వారిలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించవచ్చని సూచించారు. విజ్ఞానాశ్రమ్ డైరెక్టర్ యోగేష్ కులకర్ణి, నీతి అయోగ్ కార్యక్రమ డైరెక్టర్ దీపాలి ఉపాధ్యాయ్ మాట్లాడుతూ.. ప్రాథమిక స్థాయి నుంచే చిన్నచిన్న ప్రయోగాలను విద్యార్థులకు నేర్పడం ద్వారా వారిలో మేథో సంపత్తి పెరుగుతుందని వెల్లడించారు. పిల్లలకు ఇంటి నుంచే సైన్సు పట్ల ఆసక్తి కల్పించాలని, కొత్త విషయాలు, మెలకువలను నేర్పిం చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీడీ బి. శ్రీనివాసరావు, ఎస్ సీఈఆర్టీ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

సచివాలయ ఉద్యోగులకు ఆరోగ్య కార్డులు ఇవ్వాలని వినతి


*🌻ఈనాడు, అమరావతి*: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆరోగ్య కార్డులు ఇవ్వాలని, ఏపీజీఎల్ఎస్ఐ బాండ్లు ఇవ్వాలని ఆ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్య దర్శి షేక్ అబ్దుల్ రజాక్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్య దర్శి అజయ్ జైన్కు వినతిపత్రం సమర్పించారు. ఉద్యో గుల కుటుంబాలకు కారుణ్య నియామకాల ద్వారా ఉపాధి కల్పించాలని, బదిలీలు చేపట్టాలని కోరారు. రెండో ప్రకటన ద్వారా విధుల్లో చేరిన వారికి ప్రొబెషన్ డిక్లరేషన్ ప్రక్రియ ప్రారంభించాలని విన్నవించారు. అన్నింటిని పరిష్కరిస్తామని అజయ్ జైన్ హామీ ఇచ్చా రని అబ్దుల్ రజాక్ వెల్లడించారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

బోధనా విధానంపై సర్వే టీచర్ల నుంచి అభిప్రాయాల సేకరణ


*♦️”సాల్ట్’ పథకం అమలులో భాగంగా ప్రభుత్వం ఏర్పాట్లు.*

*🌻సాక్షి, అమరావతి:* ఉపాధ్యాయులకు వృత్తిపరంగా నైపుణ్యాలను మరింత పెంపొందించే ప్రణాళికలో భాగంగా పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక సర్వే చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం వారి నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టింది. అనంతరం శిక్షణ ప్రాజెక్టును అమల్లోకి తేనుంది. ఆంధ్రప్రదేశ్ అభ్యసన, పరివర్తన సహాయక పథకం (సాల్ట్) అమలులో భాగంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ బి.ప్రతాప్రెడ్డి జిల్లాల అధికారులకు సర్క్యులర్ ద్వారా సూచనలు చేశారు. ఉపాధ్యాయుల వృత్తిపరమైన అభివృద్ధి అవసరాలను అంచనా వేయడానికి వారి అవసరాల ఆధారంగా తగిన శిక్షణ అందించేందుకు ఆన్లైన్ సర్వే నిర్వహిస్తున్నట్లు అందులో పేర్కొ న్నారు. పాఠశాల విద్య ప్రాంతీయ జాయింట్ డైరె క్టర్లు, డీఈవోలకు సంబంధిత సమాచారం పంపారు. ప్రభుత్వ యాజమాన్యంలోని పాఠశా లల ఉపాధ్యాయులంతా విధిగా ఆన్లైన్ సర్వేను పూరించాలన్నారు. బుధవారం నుంచి ఈ సర్వే ఆన్ లైన్ పోర్టల్ ప్రారంభమైందని, ఇది అక్టోబర్ 16వ తేదీ సాయంత్రం వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఉపాధ్యాయులంతా వారి సబ్జెక్టులతో సంబంధం లేకుండా 1నుంచి 10 తరగ తులు బోధించేలా అవసరమైన సూచనలు జారీ చేయాలని పేర్కొన్నారు. ఉపాధ్యాయులంతా ఆన్ రైన్ సర్వే పూరించడం తప్పనిసరి అని పేర్కొ న్నారు. హెచ్ఎంలంతా తమ పాఠశాలల్లోని ఉపా ధ్యాయులను నిర్ణీత సమయంలోగా సర్వే పూర్తి చేసేలా చూడాలని కోరారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

పాఠశాలల నిర్వహణకు హెచ్ఎంల పాట్లు: స్కూళ్లు తెరిచి మూడు నెలలైనా విడుదలకాని కాంపోజిట్ గ్రాంట్


*♦️కరెంటు బిల్లుల చెల్లింపు, వస్తువుల కొనుగోళ్లకు నిధుల కొరత*

*♦️సొంత సొమ్ము ఖర్చు చేయాల్సి వస్తున్నదని ఆవేదన*

*♦️కరోనా నెపంతో ఉపాధ్యాయుల వ్యక్తిగత నిధి కట్‌*

*🌻(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)*

మనబడి నాడు-నేడు కార్యక్రమం కింద పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరుస్తున్నట్టు గొప్పగా చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం… పాఠశాలల నిర్వహణను మాత్రం గాలికొదిలేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పాఠశాలలు తెరిచి మూడు నెలలు దాటినా కాంపోజిట్‌ గ్రాంట్‌ను విడుదల చేయలేదు. ఇదిగో నిధుల వచ్చేశాయి… అవిగో విడుదలయ్యాయని విద్యాశాఖ అధికారులు చెబుతుండగా, పాఠశాలల ఖాతాలకు చేరడంలేదు. దీంతో స్కూళ్లలో చిన్నచిన్న మరమ్మతు పనులు, క్రీడా సామగ్రి, ల్యాబ్‌ పరికరాలు, లైట్లు, సుద్దముక్కలు, రిజిస్టర్లు, కంప్యూటర్‌ విడిభాగాల కొనుగోలుకు డబ్బులు లేక ప్రధానోపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని పాఠశాలల్లో హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు సొంత సొమ్ముతో పనులు చేయిస్తున్నారు.

అనకాపల్లి జిల్లా విద్యా శాఖ పరిధిలో మొత్తం 1,924 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 1,152 ప్రాథమిక, 341 ప్రాథమికోన్నత, 431 ఉన్నత పాఠశాలలు. విద్యార్థుల సంఖ్యనుబట్టి ప్రతి ఏటా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, మండల్‌ రిసోర్స్‌ పర్సన్స్‌ ద్వారా ‘పాఠశాల సమగ్ర నిర్వహణ సంయుక్త నిధి’ని ప్రభుత్వం విడుదల చేస్తుంది. 30 మంది కన్నా తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలకు రూ.10 వేలు, 31 నుంచి 100 మంది వరకు విద్యార్థులున్న స్కూళ్లకు రూ.25 వేలు, 101 నుంచి 250 మంది వరకు విద్యార్థులు వుంటే రూ.50 వేలు, 251కి మించి ఎంత మంది విద్యార్థులు వున్నా రూ.75 వేలు కేటాయిస్తున్నది. ఈ నిధులతో విద్యుత్‌, ఇంటర్నెట్‌ బిల్లు చెల్లించాలి. ఫ్యాన్లు, వాష్‌రూమ్‌లలో ట్యాప్‌లు, పైపులు, కంప్యూటర్లు మరమ్మతులు, కాలిపోయిన లైట్లు స్థానంలో కొత్తవి ఏర్పాటు, స్టేషనరీ కోసం ఈ నిధులు వినియోగించుకోవాలి. పాఠశాలలతోపాటు స్కూల్‌ కాంప్లెక్స్‌లు, మండల రిసోర్స్‌ సెంటర్లకు కూడా నిర్ణీత మొత్తంలో నిధులు విడుదల చేయాలి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పాఠశాలలు తెరిచి మూడు నెలలు దాటింది. దసరా సెలవులు కూడా ముగిశాయి. కానీ ఇంతవరకు పాఠశాలలకు నిర్వహణ నిధులు అందలేదు. జిల్లాలో కొన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గత మూడు నెలల్లో నిర్వహణ పనుల కోసం చేసిన ఖర్చులు, వస్తువుల కొనుగోళ్లకు సంబంధించి బిల్లులను ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేస్తున్నారు. నిధులు మాత్రం విడుదల కావడంలేదు.

*♦️ఉపాధ్యాయుల వ్యక్తిగత నిధి కట్‌*

ప్రతి పాఠశాలకు స్కూల్‌కు విద్యార్థుల సంఖ్య ఆధారంగా కాంపోజిట్‌ గ్రాంట్‌ను విడుదల చేస్తూనే మరోవైపు బోధనోపకరణాల కొనుగోలు (టీఎల్‌ఎం) కోసం పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రతి ఉపాధ్యాయునికి ఏటా రూ.500 చొప్పున ప్రభుత్వం మంజూరు చేసేది. ఈ డబ్బులు ఆయా ఉపాధ్యాయుల వ్యక్తి ఖాతాలకు జమ అయ్యేవి. ఉపాధ్యాయులు తమ సబ్జెక్టుకు సంబంధించిన బోధన సామగ్రిని కొనుగోలు చేసేవారు. అయితే కరోనా నెపంతో రెండేళ్ల నుంచి (2020-21, 2021-22) ఉపాధ్యాయులకు వ్యక్తిగత నిధులు విడుదల చేయడంలేదు. జిల్లాలో ప్రస్తుతం 10,412 మంది ఉపాధ్యాయులు వున్నారు. ఒక్కొక్కరి రూ.500 చొప్పున సుమారు రూ.52 లక్షలు అందాల్సి వుంది. ఈ ఏడాది కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టింది. కానీ నిధులు మాత్రం విడుదల చేయలేదు. కాగా ఉపాధాయుల వ్యక్తిగత నిధి చెల్లింపునకు విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలే పంపలేదని సమాచారం. పాఠశాలలకు విడుదల చేసే కాంపోజిట్‌ గ్రాంట్‌నే వినియోగించుకోవాలని విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు.

*♦️కొద్ది రోజుల్లో నిధులు జమ*

*▪️- లింగేశ్వరరెడ్డి, డీఈవో, అనకాపల్లి*

జిల్లాలోని పాఠశాలలకు నిర్వహణ నిధులు మంజూరు అయ్యాయి. ఆన్‌లైన్‌ చెల్లింపుల ప్రక్రియ మొదైలంది. కొద్ది రోజుల్లో పాఠశాలల ఖాతాలకు నిధులు జమ అవుతాయి.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

రాష్ట్ర ఆర్థికపరిస్థితి పుంజుకుందా?


*♦️మరి సకాలంలో జీతాలు, పింఛన్లు ఎందుకు ఇవ్వట్లేదు?*

*♦️ఇదే కొనసాగితే ఉద్యోగుల నుంచి వ్యతిరేకత తప్పదు*

*♦️బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసరావు*

*🌻ఈనాడు, అమరావతి*: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పుంజు కుందంటున్న ప్రభుత్వం సకాలంలో జీతాలు, పింఛన్లు,ఎందుకు ఇవ్వలేకపోతోందని ఏపీ ఐకాస అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ ఐకాస చైర్మన్ బండి శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఇప్పటికీ 3 వేల మందికి ఈ నెల పింఛన్లు అందలేదన్నారు. బుధ వారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మను కలిసి డీప్ బకాయిలు, బీఎఎఫ్ సొమ్ములు ఇవ్వకపోవడం, సకాలంలో జీతాలు, పింఛన్లు చెల్లించకపోవడం.. తదితరాలపై వినతులు అందజేశారు. అనంతరం బండి శ్రీనివాసరావు విలేక ర్లతో మాట్లాడుతూ ‘పక్క రాష్ట్రాల్లో దసరా కానుకగా ఓ డీఏ ఇచ్చారు. ఇక్కడ డీఏ సంగతి దేవుడెరుగు, కనీసం ఒకటో తేదీన జీతాలు రాలేదు. ఉద్యోగులకు గంట ఆలస్యమైనా పర్వాలేదు. ముందుగా పింఛ ర్లకు పింఛను అందేలా చూడాలని చెప్పినా ప్రయో జనం ఉండటం లేదు. మేం చాచిపెట్టుకున్న జీపీఎఫ్ డబ్బులు వెంటనే చెల్లిస్తామని మార్చిలో జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో చెప్పారు. ఇప్ప టికే వాయిదా వేస్తూనే ఉన్నారు. జీపీఎఫ్ ఖాతాల నుంచి మాయమైన డబ్బులు జులై నాటికి వేస్తామ న్నారు. దానికీ అతీగతీ లేదు. 71 ఆర్థికేతర అంశాలపై గతంలో ఇచ్చిన డిమాండ్లలో ఒక్కటి పరిష్కారం కాలేదు. ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగుల పదవీవిర మణ వయసు 62 ఏళ్లకు పెంచాలని కోరాం. వీరిని కొనసాగించాలని కోర్టు చెప్పింది. ఆర్థికశాఖ ఇచ్చిన జీవోను పెండింగ్ లో పెట్టింది. అయినా దీనిపై నిర్ణయం తీసుకోవడం లేదు. వారికి జీతాల్లేవు. కనీసం సెటిల్మెంట్లు జరగడం లేదు’ అని పేర్కొన్నారు.

*♦️జీతాల సమస్య పరిష్కరించకపోతే వ్యతిరేకత*

బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ‘జీతాలు, పింఛన్లు సకాలంలో అందించేలా ప్రభుత్వం సమస్య పరిష్కరించకపోతే ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరే కత వస్తుంది. దానికి అనుగుణంగా మేం వెళ్లడం తప్ప గత్యంతరం లేదు. 2019 జులై ఒకటికి చెందిన డీఏకి జీవో ఇచ్చి, ఎందుకు రద్దు చేశారో తెలియదు. ఈ ఏడాది కేంద్రం రెండు కొత్త డీఏ లను ఇచ్చింది. మన రాష్ట్రంలో మాత్రం ఇవ్వకుండా పక్కన పెట్టారు. 2019 జులై నుంచి మానిటరీ బెని పిట్ వస్తుందని జీవో పేర్కొన్నా కింది స్థాయి అది కారులు మాత్రం బకాయిలు ఇవ్వరని చెబుతు న్నారు. పీఆర్సీకి సంబంధించి కేడర్ వారీగా స్కేల్స్ ఆయా శాఖలకు ఎందుకు పంపడంలేదో తెలియదు. ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు ఇచ్చుకోలేని స్థితికి చేరుకున్నాం. వీటన్నింటిపై సీఎస్కు లేఖలు ఇచ్చాం. తక్షణమే సమావేశం ఏర్పాటు చేయాలని కోరాం’ అని తెలిపారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
sikkoluteachers.com

Recent Posts

‘EMBEDDED FIGURES’ NMMS MENTAL ABILITY ONLINE TESTS

'EMBEDDED FIGURES' NMMS MENTAL ABILITY ONLINE TESTS re you preparing for the NMMS exam? Do… Read More

November 7, 2024

‘MIRROR IMAGES’ NMMS MENTAL ABILITY ONLINE TESTS

'MIRROR IMAGES' NMMS MENTAL ABILITY ONLINE TESTS re you preparing for the NMMS exam? Do… Read More

November 6, 2024

‘COMPLETING FIGURES 2 ‘ NMMS MENTAL ABILITY ONLINE TESTS

'COMPLETING FIGURES 2' NMMS MENTAL ABILITY ONLINE TESTS re you preparing for the NMMS exam?… Read More

November 5, 2024

‘DOT SITUATION 2’ NMMS MENTAL ABILITY ONLINE TESTS

'DOT SITUATION 2' NMMS MENTAL ABILITY ONLINE TESTS re you preparing for the NMMS exam?… Read More

November 4, 2024

‘LETTERS/WORDS – ANALOGY’ NMMS MENTAL ABILITY ONLINE TESTS

'LETTERS/WORDS - ANALOGY' NMMS MENTAL ABILITY ONLINE TESTS re you preparing for the NMMS exam?… Read More

November 3, 2024

‘LETTERS/WORDS – ODD MAN OUT ‘ NMMS MENTAL ABILITY ONLINE TESTS

'LETTERS/WORDS - ODD MAN OUT' NMMS MENTAL ABILITY ONLINE TESTS re you preparing for the… Read More

November 2, 2024

‘MATHEMATICAL OPERATIONS’ NMMS MENTAL ABILITY ONLINE TESTS

'MATHEMATICAL OPERATIONS' NMMS MENTAL ABILITY ONLINE TESTS re you preparing for the NMMS exam? Do… Read More

November 1, 2024

‘COMPLETING FIGURES ‘ NMMS MENTAL ABILITY ONLINE TESTS

'COMPLETING FIGURES' NMMS MENTAL ABILITY ONLINE TESTS re you preparing for the NMMS exam? Do… Read More

October 31, 2024

‘ANALOGY’ NMMS MENTAL ABILITY ONLINE TESTS

'ANALOGY' NMMS MENTAL ABILITY ONLINE TESTS re you preparing for the NMMS exam? Do you… Read More

October 30, 2024

‘DOT SITUATION’ NMMS MENTAL ABILITY ONLINE TESTS

'DOT SITUATION' NMMS MENTAL ABILITY ONLINE TESTS re you preparing for the NMMS exam? Do… Read More

October 29, 2024