NEET UG COUNSELLING 2022 SCHEDULE RELEASED
నీట్ యూజీ (NEET UG) 2022 కౌన్సెలింగ్ ప్రక్రియ అక్టోబరు 11 నుంచి ప్రారంభంకానుంది. కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించిన షెడ్యూలును మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) అక్టోబరు 4న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో షెడ్యూలును అందుబాటులో ఉంచింది. నీట్ యూజీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు కౌన్సెలింగ్ తేదీలను చూసుకోవచ్చు. నీట్ యూజీ కౌన్సెలింగ్ ద్వారా దేశంలోనిప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్(కేంద్రయూనివర్సిటీల్లో) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్స్, సెంట్రల్ యూనివర్శిటీలు, డీమ్డ్ యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్/డెంటల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం 15శాతం ఆలిండియా కోటా సీట్లు, 85 శాతం స్టేట్ కోటా సీట్లతో కలిపి100 శాతం సీట్లకు ఎంసీసీ/DGHS కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
సీట్ల వివరాలు..
నీట్ అడ్మిషన్ ప్రక్రియలో వివిధ కేటగిరీల సీట్లు ఉంటాయి. ఈ జాబితాలో ఆల్ ఇండియా కోటా సీట్లు, రాష్ట్ర ప్రభుత్వ కోటా సీట్లు, కేంద్రీయ సంస్థలు/యూనివర్సిటీలు/డీమ్డ్ యూనివర్సిటీ సీట్లు, ప్రైవేట్ మెడికల్/డెంటల్ కాలేజీలు లేదా ఏదైనా ప్రైవేట్ యూనివర్సిటీలో స్టేట్/మేనేజ్‌మెంట్/ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లు, సెంట్రల్ పూల్ కోటా సీట్లు, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్/ఎయిడెడ్ మైనారిటీ/నాన్-మైనారిటీ మెడికల్ కాలేజీల్లో ఎన్‌ఆర్‌ఐ కోటా అలాగే మేనేజ్‌మెంట్ సీట్లు, దేశ వ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ సంస్థలు/జిప్‌మర్ కోటా సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
నీట్ యూజీ 2022 కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా…
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబరు 11న నీట్ మొదటివిడత కౌన్సెలింగ్ మొదలుకానుంది. సెంట్రల్ కౌన్సెలింగ్‌లో భాగంగా అక్టోబరు 11 నుంచి 20 వరకు ఆల్ ఇండియా కోటాలో, అక్టోబరు 10 నుంచి 20 వరకు డీమ్డ్, సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ పరిధిలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఇక అక్టోబరు 17 నుంచి 28 వరకు మొదటి విడత స్టేట్ కౌన్సెలింగ్ జరుగనుంది. సెంట్రల్ కౌన్సెలింగ్ ద్వారా సీట్లు పొందినవారు అక్టోబరు 28లోగా, స్టేట్ కౌన్సెలింగ్ ద్వారా సీట్లు పొందినవారు నవంబరు 4లోగా సంబంధిత కళాశాలలో చేరాల్సి ఉంటుంది.
నవంబరు మొదటివారంలో రెండో విడత కౌన్సెలింగ్..
నీట్ యూజీ 20222 రెండో విడత కౌన్సెలింగ్ నవంబరు 2 నుంచి ప్రారంభంకానుంది. సెంట్రల్ కౌన్సెలింగ్‌లో భాగంగా నవంబరు 2 నుంచి 10 వరకు ఆల్ ఇండియా కోటాలో, ఇక నవంబరు 7 నుంచి 18 వరకు స్టేట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. సెంట్రల్ కౌన్సెలింగ్ ద్వారా సీట్లు పొందినవారు నవంబరు 18లోగా, స్టేట్ కౌన్సెలింగ్ ద్వారా సీట్లు పొందినవారు నవంబరు 21లోగా సంబంధిత కళాశాలలో చేరాల్సి ఉంటుంది.
నవంబరు 23 నుంచి చివరి విడత (మాపప్ రౌండ్) కౌన్సెలింగ్..
నీట్ యూజీ 2022 మొదటి, రెండో విడతల్లో సీట్లు పొందలేని విద్యార్థులు చివరి విడత కౌన్సెలింగ్ ద్వారా ప్రయత్నంచేయవచ్చు. నవంబరు 23 నుంచి డిసెంబరు 1 వరకు సెంట్రల్ కౌన్సెలింగ్.. అలాగే డిసెంబరు 6 నుంచి 12 వరకు స్టేట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. సెంట్రల్ కౌన్సెలింగ్ ద్వారా సీట్లు పొందినవారు డిసెంబరు 10 లోగా, స్టేట్ కౌన్సెలింగ్ ద్వారా సీట్లు పొందినవారు డిసెంబరు 16 లోగా సంబంధిత కళాశాలలో చేరాల్సి ఉంటుంది.
మిగిలిపోయిన సీట్లకు…
మూడువిడతల కౌన్సెలింగ్ అనంతరం మిగిలినపోయిన సీట్లను సెంట్రల్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీచేస్తారు. డిసెంబరు 12 నుంచి 14 వరకు ఆల్ ఇండియా కోటాలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబరు 20లోగా కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది.
నవంబరు 15 నుంచే తరగతులు..
నీట్ యూజీ 2022 కౌన్సెలింగ్ ద్వారా సీట్లు పొందిన విద్యార్థులకు నవంబరు 15 నుంచే తరగతులు ప్రారంభంకానున్నాయి. అయితే బీడీఎస్/బీఎస్సీ నర్సింగ్ కోర్సులకు సంబంధించి రెండో విడత మాపప్ కౌన్సెలింగ్ కూడా నిర్వహించనున్నారు. ఈ షెడ్యూలును వెబ్‌సైట్ ద్వారా తెలియజేస్తారు. విద్యార్థులు శని, ఆదివారాల్లోనూ సంబంధింత కళాశాల్లో రిపోర్టింగ్ చేయవచ్చు.
నీట్ యూజీ 2022 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) సెప్టెంబరు 7న విడుదల చేసిన సంగతి తెలిసిందే. నీట్ పరీక్షకు మొత్తం 18,72,343 మంది రిజిష్టర్ చేసుకోగా.. 17,64,571 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 9,93,069 లక్షల మంది అర్హత సాధించారు. నీట్ పరీక్షలో అర్హత సాధించినవారిలో 4,29,160 మంది మహిళలు; 5,63,902 మంది పురుషులు, ఏడుగురు ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. అంటే 56.27 శాతం ఉత్తీర్ణులయ్యారు.
NMMS MODEL GRAND TEST - 9NMMS MODEL GRAND TEST - 9HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 8NMMS MODEL GRAND TEST - 8HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 7NMMS MODEL GRAND TEST - 7HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 6NMMS MODEL GRAND TEST - 6HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 5NMMS MODEL GRAND TEST - 5HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 4NMMS MODEL GRAND TEST - 4HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 3NMMS MODEL GRAND TEST - 3HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 2NMMS MODEL GRAND TEST - 2HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 1 NMMS MODEL GRAND TEST - 1 HOW TO ATTEMPT… Read More
'PAPER CUTTING' NMMS MENTAL ABILITY ONLINE TESTS re you preparing for the NMMS exam? Do… Read More