నేడో, రేపో ప్రభుత్వానికి టీచర్ పోస్టుల అప్‌గ్రేడేషన్, కన్వర్షన్ ఫైలు
*🌻ఏలూరు ఎడ్యుకేషన్, సెప్టెంబరు 13 :* ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన టీచర్ల ఉద్యోగోన్నతులు, పోస్టుల కన్వర్షన్‌కు సంబంధించిన ఫైలును ప్రభుత్వానికి బుధ,గురువారాల్లో పంపేందుకు రంగం సిద్ధమైంది. జిల్లాలో 310 పోస్టులను సబ్జెక్టు కన్వర్షన్ చేసేందుకు, 33 పోస్టులను అప్‌గ్రేడ్ చేసేందుకు ఉద్దేశించిన ఫైలుపై పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లా కలెక్టర్లు ఆమోదముద్ర వేశారు. ఇక తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ సంతకం కూడా తీసుకుని బుధ లేదా గురువా రాల్లో ఫైలును ప్రభుత్వానికి పంపించే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ పూర్త యితే పాఠశాలలవారీగా రేషనలైజేషన్ ఖరారు చేసి బదిలీలకు షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం టీచర్ల బదిలీలను దసరాసెలవుల్లో పూర్తిచేసే అవకాశం ఉంది.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇