*📚✍️వార్డెన్ విధులు*
*బలవంతంగా అప్పగించొద్దు✍️📚*
*♦️పీజీటీ, టీజీటీలపై చర్యలు తీసుకోవద్దు: హైకోర్టు*
*🌻అమరావతి, ఆంధ్రప్రభ:* రాష్ట్రవ్యాప్తంగా మోడల్ స్కూల్స్‌కు అనుబంధం గా ఉన్న బాలికల హాస్టళ్లలో వార్డెన్ బాధ్యతలను నిర్వర్తించాల్సిందిగా పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీ), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ)లపై ఎలాంటి ఒత్తిడి తేరాదని వారు విధులు నిర్వర్తించలేదని కఠిన చర్యలు తీసుకోరాదని హైకోర్టు పాఠశాల విద్యాశాఖను ఆదేశించింది. మోడల్ స్కూల్స్‌కు అనుబంధ బాలికల హాస్టళ్ల వార్డెన్లు వారాంతపు సెలవు తీసుకున్న రోజున ఆ బాధ్యతలను రొటేషన్ పద్దతిపై ప్రతి ఆదివారం పీజీటీ, టీజీటీలకు అప్పగిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. దీన్ని సవాల్ చేస్తూ విశాఖపట్నం, విజయనగరానికి చెందిన 79 మంది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే మన్మథరావు విచారణ జరిపారు. పిటిషనర్ల తరుపు న్యాయవాది పీ రాజేష్ బాబు వాదనలు వినిపించారు. ఉపాధ్యాయులుగా ఓ వైపు బాధ్యతలు నిర్వహిస్తూ ఆదివారం ఉదయం 9 నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు 24 గంటలు డ్యూటీ చేయాలంటూ ఇచ్చిన ప్రొసీడింగ్స్ చట్ట విరుద్ధమన్నారు. పాఠశాల విద్యాశాఖ తరుపు న్యాయవాది కేవీ రఘువీర్ జోక్యం చేసుకుంటూ వారమంతా 24 గంటలు డ్యూటీ నిర్వహిస్తున్న వార్డెన్లు తమకు వారాంతపు సెలవు మంజూరు చేయాలని కోరారని ఈ నేపథ్యంలో రొటేషన్ పద్ధతిన పీజీటీ, టీజీటీలకు బాధ్యతలు అప్పగించారన్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇