TS PECET RESULTS 2022 RELEASED DOWNLOAD RANK CARD
TS PECET Results: టీఎస్ పీఈసెట్-2022 ఫలితాలు విడుదల
తెలంగాణ రాష్ట్రంలోని వ్యాయామ విద్య- యూజీడీపీఈడీ, బీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం సెప్టెంబరు 21న నిర్వహించిన పీఈసెట్ పోటీల ఫలితాలు సెప్టెంబరు 24న విడుదలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి విడుదల చేసినట్లు కన్వీనర్ సత్యనారాయణ తెలిపారు. పరీక్షలకు మొత్తం 3,659 మంది దరఖాస్తు చేసుకోగా 2,340 మంది హాజరయ్యారు. ఫలితాలను వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చన్నారు.