IBPS RRB PO Result 2022: Out Result Link, Scale-1 Prelims

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

IBPS RRB Recruitment: ఆర్‌ఆర్‌బీ ‘పీవో’ ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకోండి!

ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్‌లో పీవో పరీక్ష ఫలితాలను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్, పుట్టిన తేదీ వివరాలను నమోదుచేసి ఫలితాలను చూసుకోవచ్చు.

గ్రామీణ బ్యాంకుల్లో పీవో (గ్రూప్-ఎ ఆఫీసర్ స్కేల్-1) పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీక్ష పరీక్ష ఫలితాలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) సెప్టెంబరు 14న ప్రకటించింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్, పుట్టిన తేదీ వివరాలను నమోదుచేసి ఫలితాలను చూసుకోవచ్చు. సెప్టెంబరు 20 వరకు ఫలితాలు అందబాటులో ఉంటాయి. అభ్యర్థుల స్కోరు వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. 

ఫలితాల కోసం క్లిక్ చేయండి..

దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ జూన్‌లో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 8106 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో ఆఫీస్‌ అసిస్టెంట్‌-4483 పోస్టులు, ఆఫీసర్‌ స్కేల్‌ I -2676 పోస్టులు, ఆఫీసర్‌ స్కేల్‌ II – 867 పోస్టులు, ఆఫీసర్‌ స్కేల్‌ III – 80 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి ఆగస్టు 7, 13, 14, తేదీల్లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ఆఫీస్‌ అసిస్టెంట్‌ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను సెప్టెంబరు 8న విడుదల చేయగా.. ఆఫీసర్ స్కేల్-1 ఫలితాలను సెప్టెంబరు 14న విడుదల చేశారు. ఆఫీసర్ స్కేల్-II, స్కేల్-III ఫలితాలను వెల్లడించాల్సి ఉంది. 

ఫలితాలు ఇలా చేసుకోండి.. 
1) అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. – https://www.ibps.in/

2) అక్కడ హోంపేజీలో కనిపించే ” Officer Scale -I’‘ ఫలితాలకు సంబంధించిన లింక్ మీద క్లిక్ చేయాలి.

3) క్లిక్ చేయగానే కనిపించే ఫలితాల లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు లేదా రూల్ నెంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టినతేది వివరాలను
నమోదుచేయాలి.

4) కంప్యూటర్ తెర మీద పీవో పరీక్షకు సంబంధించిన ఫలితాలు కనిపిస్తాయి.

5) అభ్యర్థులు తమ ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసుకుని భవిష్యత్ అవసరాల కోసం జాగ్రత్తపచుకోవాలి.


ముఖ్యమైన తేదీలు…

  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్- 7 జూన్ 2022 నుంచి 27 జూన్ 2022 వరకు
  • అప్లికేషన్ ఫీజు/ఇంటిమేషన్ ఛార్జీల చెల్లింపు (ఆన్‌లైన్)- 7 జూన్ 2022 నుంచి 27 జూన్ 2022 వరకు
  • ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ కోసం కాల్ లెటర్‌ల డౌన్‌లోడ్- 9 జూలై 2022
  • ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్- 18 జూలై 2022
  • ప్రిలిమ్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్- జూలై/ఆగస్టు 2022
  • ప్రిలిమ్స్ ఎగ్జామ్- ఆగస్టు 2022
  • ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు- సెప్టెంబర్ 2022
  • మెయిన్స్/సింగిల్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్- సెప్టెంబర్ 2022
  • మెయిన్/సింగిల్ ఎగ్జామ్- సెప్టెంబర్ 2022
  • మెయిన్/సింగిల్ ఎగ్జామ్ రిజల్ట్ (ఆఫీసర్స్ స్కేల్ I, II, III)- అక్టోబర్ 2022
  • ఇంటర్వ్యూ అడ్మిట్ కార్డ్ (ఆఫీసర్స్ స్కేల్ I, II, III)- అక్టోబర్/నవంబర్ 2022
  • ఇంటర్వ్యూ (ఆఫీసర్స్ స్కేల్ I, II, III)- అక్టోబర్/నవంబర్ 2022
  • ప్రొవిజనల్ అలాట్‌మెంట్ (ఆఫీసర్స్ స్కేల్ I, II, III & ఆఫీసర్ అసిస్టెంట్ (మల్టీపర్పస్))- జనవరి 2023.

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!