NMMS MODEL GUESS PAPER 01 NMMS MODEL GUESS PAPER 01 HOW TO ATTEMPT AP NMMS…
*🌻అమరావతి, ఆంధ్రప్రభ:* గ్రంథాలయాల పూర్వవైభ వానికి గ్రంధాలయాల చైర్మన్లు పూర్తి అంకిత భావంతో -పనిచేయాలని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. చైర్మన్లుగా వచ్చిన అవకాశాన్ని సద్వినియీగం చేసుకుని గ్రంధాలయాల బాద్యత నాది అనుకుని పనిచేస్తే ఫలితాలు వస్తాయని ఉద్భోదించారు. ఇంటర్మీడియట్ ‘బోర్డు కార్యాలయంలో జిల్లా గ్రంథాలయాల ఛైర్మన్లు.. కార్యదర్శులతో బుధవారం మంత్రి సమీక్ష నిర్వహించారు.. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గ్రంధలయాలను అభివృద్ధి రేయడం తోపాటు, మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ అందుబాటులోకి తేవాలన్న సంకల్పంతో ఉన్నారని ఈ దిశలో చైర్మన్లందరూ పనిచేయాలని అన్నారు. విద్యార్ధులకు అందుబాటు లో ఉండేలా లైబ్రరీల రూపురే ఖలు త్వరలో దాదాపు 4 వేల డిజిటల్ లైబ్రరీలు అందుబాటు లోకి రానున్నాయన్నారు. ప్రతి గ్రామ,వార్డు సచివాలయానికి అనుసంధానంగా ఒక గ్రంధాలయం ఉండాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన అని ఈదిశగా తగిన కార్యాచరణను రూపొందించుకోవాలని జిల్లా ఛైర్మన్లను కోరారు. గ్రంథాలయాల చైర్మన్ పోస్టును రాజకీయ పునరా వాసంగా కాకుండా, ఒక మంచి అవకాశంగా మలుచుకుని పనిచేస్తే ఛైర్మన్లకు మంచి పేరు వస్తుంద న్నారు. గ్రంథాలయాల అప్ గ్రేడేషన్ తో పాటు, మరమ్మత్తులు తదితర అంశాలకు సంబంధించిన ప్రతిపాద నలను ప్రభుత్వానికి పంపించాలని సూచించారు. లైబ్రరీల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతామని, చైర్మన్లు, కార్యదర్శులు పూర్తి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ మాట్లాడుతూ ప్రజల్లో ప్రధానంగా విద్యార్ధుల్లో చదివే జిజ్ఞాస పెరిగేలా గ్రంధాలయాల చైర్మన్లు చొరవ చూపాలన్నారు. పిలల్లు పోటీ ప్రపంచంలో నిలదొక్కుకునేలా చూడటంలో లైబ్రరీలు తొలి సాధనం. కావాలని ఆయన సూచించారు.. సమీక్షా సమావేశంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ కె.శేషగిరిరావు. గ్రంథాలయ విభాగపు డైరక్టర్ ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు.