ప్రాథమిక కీలో ఒప్పు..ఫైనల్లో తప్పు!…తప్పులతడకగా టెట్ ఫలితాలు..అర్హత కోల్పోతామని అభ్యర్థుల ఆందోళన
*📚✍️ప్రాథమిక కీలో ఒప్పు..*
*ఫైనల్లో తప్పు!✍️📚*
*♦️తప్పులతడకగా టెట్ ఫలితాలు..*
*♦️అర్హత కోల్పోతామని అభ్యర్థుల ఆందోళన*
*🌻అమరావతి, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి):* టెట్లో గందరగోళం కొనసాగు తోంది. ఫైనల్ కీలోనూ తప్పులుండటంపై అభ్యర్థులో ఆందోళనను పెంచుతోంది. టెట్ ఫైనల్ కీ బుధవారం విడుదలైంది. 13వ తేదీ ఉదయం సెషన్ పేపర్లో అడి గిన ప్రాజెక్టు పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు?’ అనే ప్రశ్నకు ‘కిల్పాట్రిక్ సమా ధానం కాగా ‘స్టీవెన్సన్’ అనే సమాధానం సరైనదిగా కీలో చూపించారు. కాగా, ఇదే ప్రశ్నకు ప్రాథమిక కీలో సరైన సమాధానం ఇచ్చిన పాఠశాల విద్యాశాఖ తుది కీలో దాన్ని మార్చి తప్పు సమాధానాన్ని సరైనదిగా పేర్కొనడం దారుణం. వీటితో పాటు ఇంకా పలు పేపర్లలో తప్పు సమాధానాలను సరైనవిగా చూపిస్తున్నారని అభ్య ర్థులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా ప్రాథమిక కీలో తప్పులుంటే వాటిని అభ్యంత రాలు స్వీకరించి తుది కీలో సరిదిద్దుతారు. కానీ తుది కీలోనే తప్పులుంటే ఏంచే యాలని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఒకట్రెండు మార్కులతో అర్హతను కోల్పోయే ప్రమాదం ఉందని, దీనికి పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇