*📚✍️కళాశాలల్లో అమల్లోకి*
*ఫేస్ రికగ్నేజేషన్ యాప్✍️📚*
*♦️నెట్ లేకుండా అప్లోడ్*
*♦️ఒకేసారి 8 మంది విద్యార్థులు క్యాప్చర్*
*🌻ప్రజాశక్తి – అమరావతి బ్యూరో* పాఠశాలల్లో ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులకు ఫేస్ రికగ్నేజేషన్ యాప్ను ప్రభుత్వం లోపాయికారిగా జూనియర్ కళాశాలల్లో అమల్లోకి తీసుకొచ్చింది. త్వరలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఇదే తరహా యాప్ను ప్రభుత్వం తీసుకురానుంది. ఫేస్ రికగ్నేజేషన్ యాప్కు సంబంధించిన బిల్లును ఈ అసెంబ్లీ సమావేశాల్లో తీసుకురానున్నట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలో 16 కళాశాలల్లో యాప్ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిసింది. ఇప్పటి వరకు సుమారు ఐదువేల మంది విద్యార్థుల వరకూ యాప్లో లో మ్యాపింగ్ అయ్యారు. ఇంటర్నెట్ లేకుండానే యాప్ ద్వారానే అప్లోడ్ చేసుకునే అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు సమాచారం. ఒకసారి ఏకకాలంలో ఎనిమిది మంది విద్యార్థులను క్యాప్చర్ చేయడం ఈ యాప్ ప్రత్యేకత. యాప్లో అప్లోడ్ చేయాలంటే తొలుత ఆ కళాశాల లెక్చరర్ తన ఫొటోతోపాటు, బయోమెట్రిక్, ఉద్యోగి ఐడి నెంబరును లోడ్ చేయాల్సి ఉంటుంది. అదే తరహాలో విద్యార్థి ఫొటో, చదువుతున్న తరగతి వివరాలను అప్లోడ్ చేయాలి. ఫొటో రికగ్నేజేషన్ యాప్లో కళాశాల పనివేళల్లో అటెండెన్స్ కోసం ఉపాధ్యాయుడు లేదా విద్యార్థి వైపు కెమెరా తిప్పగానే ఆటోమెటిక్ గా వారి అటెండెన్స్ అప్లోడ్ అవుతుందని ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇