*🔊CUET UG Results: సీయూఈటీ-యూజీ ఫలితాలపై యూజీసీ కీలక అప్‌డేట్*
*🍥దిల్లీ: ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష(సీయూఈటీ)-యూజీ ఫలితాలకు సంబంధించి యూజీసీ(UGC) కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఈ రోజు (గురువారం) రాత్రి 10గంటలకు ఈ ఫలితాలను విడుదల చేయనున్నట్టు యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘సీయూఈటీ-యూజీ ఫలితాలను జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) ఈరోజు రాత్రి 10గంటలకు విడుదల చేస్తుంది. విద్యార్థులందరికీ శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు.*
*🌀మరోవైపు, దేశంలోని 99 యూనివర్సిటీల్లో డిగ్రీ (అండర్ గ్రాడ్యుయేట్) కోర్సులకు తొలిసారిగా నిర్వహించిన ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు జులైలో ప్రారంభమై ఆగస్టు 30న ముగిసిన విషయం తెలిసిందే. రెండు విడతలుగా నిర్వహించిన ఈ పరీక్షలకు దాదాపు 14.9లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. 44 సెంట్రల్ యూనివర్సిటీలు, 12 స్టేట్ యూనివర్సిటీలు 11 డీమ్డ్ యూనివర్సిటీలు, 19 ప్రయివేటు వర్సిటీలతో కలిపి దేశవ్యాప్తంగా 99 విశ్వవిద్యాలయాల్లో గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహించారు.*
🔲🔘♨️®️♨️🔘🔲