అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్ను ప్రింట్ (కలర్లోనే తీసుకోవాలన్న నిబంధన ఏమీ లేదు) తీసుకోవాలి.
అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలను కూడా హాల్ టికెట్ మరోవైపు ప్రింట్ తీసుకోవాలి.
దరఖాస్తు సమయంలో అభ్యర్థులు అప్లోడ్ చేసిన ఫొటోను హాల్ టికెట్ పై అతికించాలి.
వేరే అతికించినా,హాల్ టికెట్ అసమగ్రంగా ఉన్నా అనుమతించరు.
ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఉండదు.
పరీక్ష రాస్తున్నప్పుడు అభ్యర్థుల డిజిటల్ వేలిముద్ర తీసుకుంటారు. పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్ధులకు సంబంధించిన సామగ్రి భద్రపరుచుకునే సదుపాయం ఉండదు.
చేతి గడియారాలతో సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలను కేంద్రాల్లోకి అనుమతించరు.
హాల్ టికెట్లను నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకూ భద్రపరచుకోవాలి.