శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ 3వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు ఆగస్టు 2న ఉపకులపతి రామకృష్ణారెడ్డి విడుదల చేశారు. మార్చిలో పరీక్షలు జరిగాయి. మొత్తం 16,435 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 5,454 మంది ఉత్తీర్ణులయ్యారు. 33.19 శాతం మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. 17వ తేదీలోపు రీవాల్యూషన్‌కి దరఖాస్తు చేసుకోవచ్చు. కార్యక్రమంలో రెక్టార్ మల్లికార్జునరెడ్డి, ప్రిన్సిపాళ్లు జీవన్‌కుమార్, సోమశేఖర్, పరీక్షల విభాగం సంచాలకులు జీవీ రమణ, పరీక్షల నియంత్రణ అధికారి శ్రీరాములునాయక్ తదితరులు పాల్గొన్నారు.
SKDU DEGREE SEMISTER 3 RESULTS 2022
You might also check these ralated posts.....