PMBI: Walk-in-Interview for recruitment on various post in PMBI on contract basis new

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

PMBI Executive Recruitment 2022: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యూఢిల్లీలోని ఫార్మాసూటికల్స్‌ అండ్‌ మెడికల్‌ డివైజెస్‌ బ్యూరో ఆఫ్‌ ఇండియా (PMBI).. 10 సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌, ఎగ్జిక్యూటివ్‌, డిప్యూటీ మేనేజర్‌, మార్కెటింగ్‌ ఆఫీసర్‌ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఐటీ అండ్‌ ఎంఐఎస్‌, మీడియా, సేల్స్‌, మార్కెటింగ్‌ విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌/బీసీఏ/బీటెక్‌/బీఎస్సీ/బీకామ్‌/బీబీఏ/బీఫార్మసీ/ఎంసీఏ/ఎంటెక్‌/ఎంఎస్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 28 నుంచి 35 యేళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆగస్టు 24, 25 తేదీల్లో కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.25,000ల నుంచి రూ.50,000ల వరకు జీతం చెల్లిస్తారు.

అడ్రస్: Pharmaceuticals & Medical Devices Bureau of India (PMBI) at E-1, 8th Floor, Videocon Tower, Jhandewalan Extn., New Delhi – 110055.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

error: Content is protected !!