BECIL Jobs: Jobs in Broadcast Engineering Consultants

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియన్ లిమిటెడ్ వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 54 పోస్టులను భర్తీచేయనున్నారు. వీటిలో మెడికల్ ఆఫీసర్, పీఆర్వో, స్టాఫ్ నర్స్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆగస్టు 31లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారిని న్యూఢిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలో ఉద్యోగాల్లో నియమిస్తారు.

పోస్టుల సంఖ్య: 54

1) మెడికల్ ఆఫీసర్: 06

2) మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేదం): 02

3) సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ (టెక్నికల్): 01

4) పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (PRO): 01

5) జూనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ (టెక్నికల్): 02

6) ప్రోగ్రామ్ మేనేజర్ (అడ్మినిస్ట్రేటివ్): 01

7) యోగా థెరపిస్ట్: 02

8) స్టాఫ్ నర్స్: 12

9) పంచకర్మ టెక్నీషియన్: 13

10) ఆడియాలజిస్ట్: 01

11) ఆప్తాల్మిక్ టెక్నీషియన్/ ఆప్టోమెట్రిస్ట్: 01

12) ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ (ఆఫ్తాల్మిక్): 01

13) అసిస్టెంట్ లైబ్రరీ ఆఫీసర్: 01

14) పంచకర్మ అటెండెంట్: 10

అర్హత:
మెడికల్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేదం), సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ (టెక్నికల్), పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (PRO), జూనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ (టెక్నికల్), ప్రోగ్రామ్ మేనేజర్ (అడ్మినిస్ట్రేటివ్), యోగా థెరపిస్ట్, స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధిత సబ్జెక్ట్ లో డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసి ఉండాలి. 

వయోపరిమితి: 
45 సంవత్సరాలు. ఆడియాలజిస్ట్, ఆప్తాల్మిక్ టెక్నీషియన్/ ఆప్టోమెట్రిస్ట్ మరియు OT టెక్నీషియన్ (ఆఫ్తాల్మిక్) పోస్టులకు వయోపరిమితి 35 సంవత్సరాలుగా నిర్ణయించారు. పంచకర్మ టెక్నీషియన్, అసిస్టెంట్ లైబ్రరీ ఆఫీసర్ మరియు పంచకర్మ అటెండెంట్ పోస్టులకు వయోపరిమితి 30 సంవత్సరాలు.

దరఖాస్తు విధానం: 
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఎంపిక విధానం:
పోస్టులవారీగా నిబంధనలకు అనుగుణంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: 
జనరల్/ఓబీసీ/ఎక్స్-సర్వీస్‌మెన్/మహిళా అభ్యర్థులు రూ.750 దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్/పీహెచ్ అభ్యర్థులు రూ.450 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

జీతం:

* మెడికల్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేదం), సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ (టెక్నికల్) – రూ.75,000. 

* పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ – రూ. 70,000. 

* జూనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ (టెక్నికల్), ప్రోగ్రామ్ మేనేజర్ (అడ్మినిస్ట్రేటివ్), యోగా థెరపిస్ట్‌ – రూ.50,000. 

* స్టాఫ్ నర్స్ – రూ.37,500

* పంచకర్మ టెక్నీషియన్ – రూ.24,000

* ఆడియాలజిస్ట్ – రూ.21,756

* ఆప్తాల్మిక్ టెక్నీషియన్/ ఆప్టోమెట్రిస్ట్, OT టెక్నీషియన్ (ఆఫ్తాల్మిక్) –  రూ.21,756

* అసిస్టెంట్ లైబ్రరీ ఆఫీసర్ – రూ.30,000

* పంచకర్మ అటెండెంట్ – రూ.16,000.
 
Notification

Online Application

Website

error: Content is protected !!