JEE MAINS SESSION 2 RESULT?

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

జేఈఈ మెయిన్‌ రెండో విడత పరీక్షా ఫలితాలు ఆగస్టు 6న విడుదల కానున్నాయి. ఆగస్టు 6న ఈ ఫలితాలను ప్రకటించనున్నట్లు నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వెల్లడించింది. ఈ పరీక్షల ప్రొవిజినల్‌ ఆన్సర్‌ కీ ఆగస్టు 3న వెలువడే అవకాశాలున్నాయి. ఈ ఆన్సర్‌ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే అభ్యర్థులు ఆగస్టు 5లోగా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఇందుకోసం అభ్యర్థులు ఒక్కో ప్రశ్నకు రూ.200 చొప్పున ఫీజు చెల్లించాలి. ఈ ఫీజు నాన్‌ రిఫండబుల్‌. ‘‘ప్రొవిజనల్‌ ఆన్సర్‌ కీపై అభ్యంతరాలను ఆగస్టు 5లోగా తెలపచ్చు. ఆ తర్వాత తుది ఆన్సర్‌ కీ, వ్యక్తిగత స్కోరు కార్డు, మెరిట్‌ లిస్ట్‌ను విడుదల చేస్తాం’’ అని ఎన్‌టీఏ అధికారులు తెలిపారు. జేఈఈ మెయిన్‌ 2022 ఫలితాలు, ఆన్సర్‌ కీని jeemain.nta.nic.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. జేఈఈ మెయిన్‌ రెండో విడత పరీక్షలు జులై 25 నుంచి 30వ తేదీ వరకు జరిగాయి. మొత్తం 6.29లక్షల మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు. అంతకుముందు జేఈఈ మెయిన్‌​ తొలి విడత పరీక్షలు జూన్ 23 నుంచి 29 వరకు నిర్వహించగా.. ఫలితాలను జులై 11న ప్రకటించిన విషయం తెలిసిందే.

error: Content is protected !!