Categories: CBSESTUDENTS CORNER

CBSE COMPARTMENT 10th,12th HALLTICKETS 2022 Released

WhatsApp Group       Join Now
Telegram Group Join Now

CBSE Admitcard: సీబీఎస్‌ఈ కంపార్ట్‌మెంట్ పరీక్షల హాల్‌టికెట్లు రిలీజ్, ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి!

సంబంధిత పాఠశాలల యాజమాన్యాలు వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, ఇతర వివరాలను నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలి.

సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల కంపార్ట్‌మెంట్ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. సంబంధిత పాఠశాలల యాజమాన్యాలు వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, ఇతర వివరాలను నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలి. విద్యార్థులు తమ అడ్మిట్ కార్డులను సంబంధిత పాఠశాలల నుంచి పొందవచ్చు. ప్రస్తుతం రెగ్యులర్ విద్యార్థులకు సంబంధించిన అడ్మిట్ కార్డులను మాత్రమే సీబీఎస్‌ఈ విడుదల చేసింది. ప్రైవేటు విద్యార్థుల అడ్మిట్ కార్డులను త్వరలోనే విడుదల చేయనుంది.
Download CBSE Compartment Exam 2022 Admit Card

 

సీబీఎస్‌ఈ కంపార్ట్‌మెంట్ పరీక్షల తేదీలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెల్లడించింది. సీబీఎస్‌ఈ 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలకు సంబంధించిన పరీక్షల తేదీలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ప్రకటించిన ప్రకటించిన షెడ్యూలు ప్రకారం 10వ తరగతి కంపార్ట్‌మెంట్ పరీక్షలను ఆగస్టు 23 నుంచి 29 వరకు, 12వ తరగతి కంపార్ట్‌మెంట్ పరీక్షలను ఆగస్టు 23న నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు సీబీఎస్‌ఈ ప్రకటించింది. విద్యార్థులు ప్రశ్నపత్రం చదవడానికి అదనంగా 15 నిమిషాల సమయం కేటాయించారు.

సీబీఎస్‌ఈ కంపార్ట్‌మెంట్ 2022 పరీక్షలను దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నిర్వహించనున్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మాస్కులు ధరించాలి. శానిటైజర్ వాడాలి. సోషల్ డిస్టెన్స్ నిబంధనల పాటించాల్సి ఉంటుంది. వీటితోపాటు అడ్మిట్‌కార్డులో ఇచ్చిన సూచనలను తప్పనిసరిగా పాటించాలి.

సీబీఎస్‌ఈ 10, 12వ తరగతులు ఫలితాలను జులై 22న వెల్లడించిన సంగతి తెలిసిందే. 10వ తరగతిలో 92.71% ఉత్తీర్ణులు కాగా, 12వ తరగతిలో 94.40% ఉత్తీర్ణత సాధించారు. అధికారిక వెబ్‌సైట్ ద్వారా విద్యార్థులు పరీక్షలకు సంబంధించిన తాజాసమాచారం తెలుసుకోవచ్చు.  

Related Post

 

CLASS-X DATE SHEET

CLASS-XII DATE SHEET 


పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా పాటించాల్సిన సూచనలివే..

  • అభ్యర్థులు శానిటైజర్ తప్పనిసరిగా వెంటతీసుకెళ్లాలి.
  • అభ్యర్థులు ముక్కు, నోరు కవర్ అయ్యేలా మాస్కులు ధరించాలి.
  • అభ్యర్థులు సోషల్ డిస్టెన్స్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.
  • కోవిడ్-19 వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తల్లిదండ్రులు తమ పిల్లలకు మార్గనిర్దేశం చేయాలి.
  • తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలాంటి అనారోగ్యం కలగకుండా జాగ్రత్తలు పాటించాలి.
  • పరీక్షా కేంద్రాలకు హాజరైనప్పుడు జారీ చేయబడిన అన్ని సూచనలను అభ్యర్థులు కచ్చితంగా పాటించాలి.
  • అభ్యర్థులు అడ్మిట్ కార్డ్‌లో ఇచ్చిన అన్ని సూచనలను పాటించాలి.
  • ప్రతి పరీక్షకు మధ్య వ్యవధి టైమ్ టేబుల్, అడ్మిట్ కార్డ్‌లో ఇచ్చిన విధంగా ఉంటుంది.
  • విద్యార్థులు ప్రశ్నపత్రం చదవడానికి వీలుగా అదనంగా 15 నిమిషాల సమయం కేటాయిస్తారు.
  • తాజా సమాచారం కోసం విద్యార్థులు ఎప్పటికప్పుడు www.cbse.gov.in చూస్తుండాలి.
sikkoluteachers.com

Recent Posts

ఎవరికి వారుగా ఉద్దరించు కోవటం ఎలా?

ఎవరికి వారుగా ఉద్ధరించుకోవటానికి పూర్తిగా #చదవండి.700 శ్లోకముల భగవధ్గీతను చదవడానికి సమయం సహనం రెండు ఉండవు కనీసం రెండు నిమిషాల… Read More

September 7, 2024

NMMS ONLINE TESTS-7TH SCIENCE-‘Forests Our Lifeline’-EM

NMMS ONLINE TESTS-7TH SCIENCE-'Forests Our Lifeline'-EM: Are you preparing for the NMMS exam? Do you… Read More

September 7, 2024

NMMS ONLINE TESTS-7TH SCIENCE-‘Forests Our Lifeline’-TM

NMMS ONLINE TESTS-7TH SCIENCE-'Forests Our Lifeline'-TM: Are you preparing for the NMMS exam? Do you… Read More

September 7, 2024

NMMS ONLINE TESTS-7TH SCIENCE-‘LIGHT’-EM

NMMS ONLINE TESTS-7TH SCIENCE-'LIGHT'-EM: Are you preparing for the NMMS exam? Do you want to… Read More

September 6, 2024

NMMS ONLINE TESTS-7TH SCIENCE-‘Light’-TM

NMMS ONLINE TESTS-7TH SCIENCE-'Wonders of Light'-TM: Are you preparing for the NMMS exam? Do you… Read More

September 6, 2024

NMMS ONLINE TESTS-7TH SCIENCE-‘Electric Current and it’s effect’-EM ‘

NMMS ONLINE TESTS-7TH SCIENCE-'Electric Current and it's effect'-EM: Are you preparing for the NMMS exam?… Read More

September 5, 2024

NMMS ONLINE TESTS-7TH SCIENCE-‘Electric current and it’s effect’-TM

NMMS ONLINE TESTS-7TH SCIENCE-'Electricity '-TM: Are you preparing for the NMMS exam? Do you want… Read More

September 5, 2024

NMMS ONLINE TESTS-7TH SCIENCE-‘Reproduction in Plants’

NMMS ONLINE TESTS-7TH SCIENCE-'Reproduction in Plants'-EM: Are you preparing for the NMMS exam? Do you… Read More

September 4, 2024

NMMS ONLINE TESTS-7TH SCIENCE-‘Reproduction in Plants’-TM

NMMS ONLINE TESTS-7TH SCIENCE-'Reproduction in Plants'-TM: Are you preparing for the NMMS exam? Do you… Read More

September 4, 2024

NMMS MAT ONLINE MOCK TESTS-ODD MAN OUT

NMMS MAT ONLINE MOCK TESTS-ODD MAN OUTNMMS MAT ONLINE MOCK TESTS-ODD MAN OUT: If you… Read More

September 3, 2024