APRS 5TH CLASS & APRS BACKLOG VACANCIES (6th,7th & 8th) & APRJC AND APRDC Phase-III Results Released..
గురుకులాల్లో ప్రవేశాలకు మూడో జాబితా విడుదల
ఏపీ గురుకుల విద్యాలయముల సంస్థ నిర్వహిస్తున్న ఏపీఆర్ జూనియర్ కళాశాలల్లో, డిగ్రీ కళాశాల 2022-23 విద్యా సంవత్సరానికి గాను మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించిన ఏపీఆర్ జేసీ – ఏపీఆర్డీసీ సెట్ – 2022లో అర్హులైన అభ్యర్థుల మూడో విడత జాబితాను విడు దల చేసినట్లు కన్వీనర్ జె.సోమదత్త తెలిపారు. హెచ్ టీటీపీఎస్: //ఏపీ ఆర్ఎస్ డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ వెబ్సైట్లో ఫలితాలను ఉంచినట్లు తెలిపారు. ప్రవేశ పరీక్షకు హాజరైన విద్యార్థులు పై వెబ్సైట్ నుందు తమ హాల్ టిక్కెట్, పుట్టిన తేదీ ఆధారంగా ఎంపికను పరిశీలించుకోవచ్చని సూచించారు. కళాశాలల్లో ప్రవే శాలకు సంబంధించి మూడవ విడతలో ఎంపికైన విద్యార్థులు, వారి ప్రొవిజినల్ సెలక్షన్ ఉత్తర్వులను డౌన్లోడ్ చేసుకొని ఈనెల 7వ తేదీ లోపు సంబంధిత ఒరిజి నల్ ధృవ పత్రాలు, ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలతో ఆయా కళాశాలల ప్రధానాచార్యులకు రిపోర్ట్ చేయాలన్నారు. ఏడో తేదీ తరువాత సంబంధిత క్యాట గిరీలల్లో మిగిలిన ఖాళీల ఆధారంగా జాబితాను విడుదల చేయనున్నారు.