🙏 *వంగపండు వెళ్ళిపోయి అప్పుడే*
*రెండేళ్ళయి పోయిందా?*🙏
*ఏం పిల్లడో ఎల్దా మొస్తవా …!!*
*శ్రీకాకుళం సీమ కొండలో ఒరిగిన వంగపండు.!!*.
*పార్వతీ పురంలో పొద్దు గుంకింది..ఇక తెల్లారనే లేదు…*
*విప్లవ సూరీడు ఇక నిద్ర లేవనేలేదు.ఎర్రజెండా* *రెపరెపలు ఒక్కసారి గా నిలిచి పోయాయి.ఉత్తరాంధ్ర జనపదం నోరు పెగలడం లేదు.కవి,వాగ్గేయ* *కారుడువంగపండు ప్రసాద*
*రావు ఇక లేరన్న నిజం జీర్ణం కావడానికి కొంత సమయం పట్టొచ్చు. కానీ..ఆయన* *మాటా..పాటా.చిందు మాత్రం శాశ్వతం.అనితర సాధ్యం ఆయన మార్గం*
*ఏం పిల్లడో ఎల్దామొస్తవా*
*శ్రీకాకుళంలో సీమకొండకి*
*ఏం పిల్లడో ఎల్దమొస్తవా*
*అరె చిలకలు కత్తులు* *దులపరిస్తయట*
*ఏం పిల్లడో ఎల్దామొస్తవా*
*అరె సాలూరవతల* *సవర్లకొండకు*
*చెమర పిల్లులే* *శంఖమూదేనట*
*నల్లగొండ నట్టడవిలోనికి*
*పాముని పొడిచిన* *చీమలున్నయట*
*తెలంగాణ కొమురయ్యకొండకీ*
*అరెరరె అరె హహూ హహూహ*
*అరె గద్దని తన్నిన* *చేతులున్నయట*
*ఆకులు మేసిన మేకలకొండకు*
*పులుల్ని మింగిన* *గొర్రెలున్నయట*
*రాయలసీమ రాలుకొండకీ*
*రక్తం రాజ్యం ఏలుతుందట*
*అరె తూరుపు..*
*తూరుపు దిక్కున దోర కొండకీ*
*అరెరరెరరె హహూ హాహూహ*
*అరె తుపాకీ పేల్చిన* *తూనీగలున్నయట*
*కలకత్తా కొద కారుకొండకీ*
*ఎలుకలు పిల్లిని ఎంటా* *తగిలెనట*
*ఏం పిల్లడో ఎల్దామొస్తవా…!!*
*ఎక్కడి శ్రీకాకుళం నక్సల్ భారీ ఉద్యమం.ఎక్కడి తెలంగాణ*
*సాయుధ సమరం..ప్రాంతాల మధ్య విభజన రేఖను చెరిపే*
*శాడు.ఉద్యమమే ఊపిరి గా బతికాడు.అది ఉత్తరాంధ్రా ?..*
*తెలంగాణా.? .లేక మరో ప్రాంతమా..? అన్నది లేకుండా అవసరాన్ని బట్టి విప్లవ స్ఫూర్తి* *తగిలించాడు.తానే ఓపాట*
*య్యాడు.జనపదాన్ని విప్లవ సందేశంతో ముడిపెట్టి చిందే*
*శాడు.చివరి శ్వాస వరకు* *విప్లవమే ఊపిరిగా బతికాడు.*
*పాటను బతుకు బాటగా* *మార్చుకొని సమాజాన్ని* *చైతన్య*
*పరిచాడు.*
*”సికాకులంలో సీమలకొండకి.. ఏం పిలడో ఎల్దమొస్తవా..*
*చిలకలు కత్తులు* *దులపరిస్తయట..* *సాలూరవతల సవర్ల*
*కొండకి.. ఏం పిలడో ఎల్దమొస్తవా.. సెవల పిల్లులే శంఖమూ*
*దెనట…” తెలంగాణా* *కొమరయ్య కొండకి అంటూ” విప్లవ నేపథ్యంలో రాసిన పాటలు బాగా ప్రజాదరణ పొందాయి ఆయన రాసిన* *పాటల్లో ఉత్తరాంధ్ర నుడికారం, యాసా, ఊపూ మిళితమై* *వుంటాయి.పాడటంలో* *చిందేయడంలో*
*చేతుల మధ్య గజ్జల్ని* *మోగించడంలో ఆయన పంథా ప్రత్యేకమైనది అమెరికా, ఇంగ్లాండ్ తదితర దేశాల్లోఈ పాటను ఇంగ్లిష్‌లోకి అనువదించి పాడుకున్నా* *రంటే….వంగపండు పాటలకున్న పాపులారిటీని అర్థం చేసుకోవచ్చు..!!*
*కమ్యూనిస్టు ఉద్యమానికి ఆయన పాటలు ఊతమయ్యా*
*యి.తన జానపద గేయాల* *ద్వారా ప్రజా చైతన్యం తీసు*
*కొచ్చేందుకు* *ప్రయత్నించాడు.గద్దర్ వంటి వారితో కలిసి* *జననాట్యమండలి కోసం పనిచేశాడు. ఆయన* *సుమారుగా 400 వరకు పాటలు రాశారు. అవి వివిధ భాషల్లోకి కూడా అనువాదం కావడం విశేషం*.
*వంగపండు కేవలం విప్లవ గీతాలను మాత్రమే రాయలేదు.*
*జానపదంలో శృంగారాన్ని* *కూడా ఒలికించాడు*
*ఆవులు తోలుకొని*
*అలుగెల్లి నువ్వొస్థే*
*ఇలగెల్లి నేనొస్తే…*
*మద్దెల కింది చేను*
*ఇద్దరినీ కలిపింది.”!!*
*వంటి పాటలు కూడా వంగపండు కలం నుంచి*
*జాలు వారాయి.*
*రెండు నెలల ముందు తానా అంతర్జాతీయ తెలుగు సాహితీ వేదికలో రెండున్నర గంటల పాటు సోలోగా*
*తన పాటతో మురిపించాడు.వీనుల విందు చేశాడు.*
*మాధురి స్మృతి చెరగనే లేదు.ఆ పాట ఇంకాచెవుల్లో*
*మార్మోగుతునే వుంది.ఇప్పుడేమో. చెప్పాపెట్టకుండా*
*తన పాటల పిలగాడ్ని మనకొదిలేసీ తాను వెళ్ళి*
*పోయాడు.*
*విశాఖపట్నం షిప్ యార్డులో పనిచేస్తూ, పాటలు రాసి పాడుతూ, విప్లవోద్యమానికీ చేదోడయ్యాడు. తర్వాత* *కాలంలో ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి జన నాట్యమండలి* *కళాకారుడిగా అనేక విప్లవ, ప్రజా గీతా*
*లు రచించి గానం చేశాడు*
*1974 అక్టోబర్ లో విశాఖలో జరిగిన విరసం సాహిత్య పాఠశాలతో వంగపండు ప్రస్థానం మొదలైంది.అప్పుడే*
*వంగపండనే ఓ కొత్త* *గాయకుడు గొంతెత్తి పాడిన వైనాన్ని జనం కథలు కథలుగా చెప్పుకున్నారు. విరసం విశాఖ ప్రచురణ ఏరువాక, వంగపండు ప్రసాద్ పాటలు పుస్తకం* *వెలువడిసాహితీ లోకంలో కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టింది*.
*జనం నోళ్లలో జజ్జనకరి జనారే, ఏం పిల్లడో ఎల్దామొస్తావా జీపీ వత్తంది రండిరా, యంత్రమెట్లా నడుస్త ఉందంటే, సుత్తీకొడవలి గుర్తుగ ఉన్నా ఎర్రని జెండ ఎగురుతున్నదీ*
*వంటి .పాటలు జనం నోళ్ళలో నానాయి.*
*సికాకులం, ఇజీనారం జిల్లాలో ఎం ఎల్ ఎ అనే ఇంగ్లిష్ మాటకు రూపాంతరపదం…అమ్మోలె గానీ “అనేది ఆరోజుల్లో అందరూ చెప్పుకునే వారు. ఆయన పాటల్లోని మాటల్లో ఉత్తరాంధ్ర* *సొగసుఎగిసిపడేది.ఎమర్జన్సీలో ఆయన బహిరంగ పాటకు కొంత విరామం.ఎమర్జెన్సీ తర్వాత మళ్ళీ* *గొంతుపెగిలింది.వంగపండు పాట జనం గుండెల్ని తాకింది*
*1978లో ఆయన రాసిన “భూమి భాగోతం” సృజనలో*
*అచ్చైంది.తర్వాత సృజన ప్రచురణ పుస్తకంగా వచ్చింది. భూమి భాగోతం కొన్ని వేల ప్రదర్శనలు జరిగాయి..* *1990లో విరసం ఇరవైయేళ్ళ మహాసభల సందర్భంగా ఆయన పాటల సంపుటం, ఎంపిక చేసిన పాటల ఆడియో కాసెట్ వచ్చాయి*
*పార్వతీపురం దగ్గర పెదబొండపల్లిలో 1943 జూన్ లో*
*జగన్నాధం, చినతల్లి దంపతులకు వంగపండుజన్మించారు*.
*జానపద కళాకారుడిగా మూడు దశాబ్ధాల ప్రయాణంలో… ఆయన* *పాటతెలుగువారి గుండెల్లో గూడు కట్టుకుందంటే* *అతిశయోక్తి కాదు.*
*అనేక మంది కళాకారులకు ఆయతర్ఫీదునిచ్చారు.ఆయన*
*కు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. గత కొన్ని రోజు*
*లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.జానపద వాగ్గేయ*
*కారుడు, గాయకుడు, జననాట్యమండలిఅధ్యక్షుడు.హేతు*
*వాది, ఉత్తరాంధ్ర గద్దర్గా పేరుతెచ్చుకున్నాడు. 2017 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే* *కళారత్న పురస్కారం అందు*
*కున్నాడు.*
*2008, నవంబరు 23 న తెనాలిలో ఈయనకు బొల్లిముంత శివరామకృష్ణ సాహితీ అవార్డును బి.నరసింగరావు చేతుల*
*మీదుగా ప్రధానం చేశారు.ప్రజలకోసం బ్రతికిన నాజర్లాంటి*
*కళాకారుడని వంగపండును నాజర్ తో పోలుస్తారు. వంగ*
*పండు ప్రసాదరావు, గద్దర్ తో కలిసి 1972లో పీపుల్స్ వార్ సాంస్కృతిక విభాగం జన నాట్యమండలిని స్థాపించా*
*డు.వంగపండు రాసిన 12 పాటలు అన్ని గిరిజన మాండలి*
*కాలతో పాటు తమిళం, బెంగాళీ, కన్నడ, హిందీ వంటి పది భారతీయ భాషల్లోకి అనువదించబడ్డాయి..* *”యంత్రమెట్టా నడుస్తు ఉందంటే” అనే పాటఆంగ్లంలో కూడా అనువదించ*
*బడి అమెరికా, ఇంగ్లాండులో అభిమానం చూరగొన్నది.విప్ల*
*వ కవిత్వంలో పాటకు పెద్ద* *పీట వేసిన సుబ్బారావు పాణి*
*గ్రాహి, గద్దర్ తో పాటు* *వంగపండు ప్రసాదరావు పేరు కూడా ముడిపడిపోయింది*.
*కమ్యూనిస్టు ఉద్యమాలకు కుల స్పృహ లేని రోజుల్లోనే…. ‘ఉందర్రా మాల పేటా ఊరి చివరా/కష్టాలున్నచోటా ఊరి* *చివర కాష్టాలున్న చోటా’ అని ఈ దేశ కులవాస్తవికతను*
*ప్రకటించిన…అభ్యుదయవాది వంగపండు*
*వంగపండు ప్రసాదరావు వంటి వాగ్గేయకారులు బహు అరుదుగా పుడతారు…మళ్ళీ మన కోసంఆయనే తిరిగి పుడతారేమో ఎదురు చూద్దాం..!!*
*వంగపండు ప్రసాదరావుగారికి లాల్ సలామ్..!!*
ఎ.రజాహుస్సేన్ !!