IN AP private schools 25% seats should be allotted
*📚✍️ప్రైవేట్ స్కూల్స్ లో*
*25% సీట్లు కేటాయించాలి✍️📚*
*♦️రీయింబర్స్మెంట్ పద్దతిలో ప్రవేశాలు కల్పించాలి.*
*♦️పాఠశాల విద్య కమిషనర్ సురేష్ కుమార్*
*🌻అమరావతి, ఆంధ్రప్రభ:* ఉచిత నిర్భంద విద్యాహక్కు చట్టం సెక్షన్ 12(1) (సీ ) అనుసరించి 2022-23 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ప్రవేశాలు అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించిందని పాఠశాల విద్య కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న వర్గాలకు చెందిన వారు (అనాథ పిల్లలు, హెచ్ఐవీ బాధితులు పిల్లలు, దివ్యాంగులు) కోసం 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం మరియు బలహీన వర్గాలకు (బీసీ, మైనార్టీ, ఓసీ) చెందిన పిల్లలకు 6 శాతం సీట్లు కేటాయించడం జరిగిందని గురువారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలకు వార్షిక ఆదాయం రూ. లక్షా 20 వేలుగా, పట్టణ ప్రాంతంలో నివసించే బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలకు వార్షికాదాయం రూ. లక్షా 40 వేలు ప్రాతిపదికగా తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఈ విద్యా సంవత్సరానికి ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టం, అమలులో భాగంగా సవరణ నోటిఫికేషన్ జారీ చేశారు. అలాగే అడ్మిషన్స్ అందించే విధానంలో భాగంగా విద్యార్థులకు ఫీజు నిర్ణయించి, రీయింబర్స్ చేస్తామని తెలిపారు. ఆన్లైన్లో సీఎస్ఈ.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్సైట్ ద్వారా ఈ నెల 16 నుంచి 26 వరకు దరఖాస్తు చేయాలని సూచించారు. షెడ్యూల్ ఈ నెల పదిన విడుదలవుతుందని, ఆన్లైన్ పోర్టల్లో 16 నుంచి 26 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మొదటి జాబితాను లాటరీ పద్ధతిలో ఈ నెల 30న ఎంపిక చేస్తామని, సెప్టెంబర్ 2న ప్రకటిస్తామని, అదే రోజు నుంచి 9వ తేదీ వరకు ప్రవేశాలు కల్పిస్తా మని వివరించారు. సెప్టెంబర్ 12 నుంచి 30వ తేదీ వరకు రెండో జాబి తా ప్రక్రియ ఉంటుందని కమిషనర్ సురేష్ కుమార్ స్పష్టం చేశారు.
మరింత పూర్తి సమాచారం కోసం _ క్లిక్ చేయండి