AIRFORCE: AGNIVEER PREPARATION TIPS

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

దేశ రక్షణ శాఖలోని త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లలో చేరి దేశ సేవలో పాలు పంచుకోవాలన్న యువత కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా అగ్నిపథ్‌ స్కీమ్‌ (Agnipath Scheme) ను తీసుకువచ్చింది. అగ్నిపథ్‌లో భాగంగా నియమించే సైనికులను అగ్నివీర్ అంటారు. ఇందులో భాగంగా ఎయిర్‌ఫోర్స్‌, నేవీల్లో ఇప్పటికే అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ మొదటి బ్యాచ్ రిక్రూట్‌మెంట్ (Agnipath Recruitment) కోసం ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసి రిక్రూట్ మెంట్ టెస్ట్ లు, ర్యాలీలు నిర్వహించేందుకు రంగం సిద్దమైంది. ఇలా వివిధ విభాగాలలో రాత పరీక్షలు, ఫిజికల్, మెడికల్ రౌండ్ లలో సెలక్ట్ అయిన వారి నుండి షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులను డిసెంబర్ 11, 2022న ప్రకటించి. అదే నెలలో మొదటి బ్యాచ్ ను శిక్షణ కోసం పిలుస్తారు.ఒకసారి IAFలో చేరిన తర్వాత, అగ్నివీర్స్ ఎయిర్ ఫోర్స్ యాక్ట్ 1950 ప్రకారం నాలుగేళ్లపాటు పనిచేయాల్సి ఉంటుంది. అయితే ఈ అగ్నివీర్ ఎయిర్ ఫోర్స్ (Agniveer Airforce) కు ఎలా సన్నద్దం కావాలి? ప్రిపరేషన్ టిప్స్ ఏంటి?

ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ గా అర్హత సాధించాలంటే మొత్తం 5 రకాల పరీక్షలు ఎదుర్కోవాలి. 1) ఆన్ లైన్ ఎగ్జామ్, 2)డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ రౌండ్, 3)ఫిజికల్ టెస్ట్ 4) అడాప్టబిలిటీ టెస్ట్ 5) మెడికల్ టెస్ట్ ఇలా ఐదు రకాల పరీక్షలు ఎదుర్కోవాలి. ఇలా ఐదు రకాల పరీక్షలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయి. చివరిగా డిసెంబర్ లో సెలక్షన్ లిస్ట్ ప్రకటించి మొదటి బ్యాచ్ ను సిద్దం చేస్తారు. కాగా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ లో సెలక్ట్ అవడం కోసం మొదట వ్రాత పరీక్ష 25 జూలై, 2022న నిర్వహించారు. అగ్నివీర్ ఎయిర్ ఫోర్స్ కు మిగిలిన టెస్ట్ ల కోసం ప్రిపేర్ అవ్వాల్సి ఉంది.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ పరీక్షల్లో ఫేజ్ 1లో ఆన్‌లైన్ రిటన్ పరీక్ష ఉంటుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ పరీక్షలు మూడు విభాగాలుగా జరుగుతాయి. 1)Science, 2)Other than Science, 3)Science and other than Science అనే మూడు గ్రూపులుగా జరుగుతాయి. పరీక్ష ఇంగ్లీష్ మరియు హిందీ భాషలో నిర్వహించారు. పరీక్షలో అడిగే ప్రశ్నలు ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు ఇవ్వబడుతుంది మరియు ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల నెగెటివ్ మార్కు ఉంటుంది. ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ పరీక్ష మూడు గ్రూపులుగా జరిగినా..5 సబ్జెక్ట్ లు ఉంటాయి. అవి ఇంగ్లీష్, మేధమేటిక్స్, ఫిజిక్స్, రీజనింగ్ మరియు జనరల్ అవేర్ నెస్ ఉంటాయి.
Science గ్రూపుకి సంబంధించి, ఇంగ్లీష్ 20, మేధమేటిక్స్ 25, ఫిజిక్స్ 25 మార్కులు కలిపి 70 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 60 నిమిషాలు సమయం ఇస్తారు. Other than Science గ్రూపుకి సంబంధించి రీజనింగ్ అండ్ జనరల్ అవేర్ నెస్ 30 మార్కులు, ఇంగ్లీష్ 20 మొత్తం 50 మార్కులకు పరీక్ష ఉంటుంది. 45 నిమిషాల సమయం ఇస్తారు. Science & Other than Science గ్రూప్ కు సంబంధించి మేధమేటిక్స్ 25, ఇంగ్లీష్ 20, రీజనింగ్ & జనరల్ అవేర్‌నెస్ 30, ఫిజిక్స్ 25 మార్కులు కలిపి 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 85 నిమిషాలు సమయం ఇస్తారు.
స్టడీ మెటీరియల్‌లను సేకరించి, పరీక్షకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడం, వివిధ సబ్జెక్టుల కోసం వేర్వేరు పుస్తకాలను కొనుగోలు చేయకుండా.. అన్ని అంశాలకు సంబంధించి ఉండే మంచి పుస్తకాలను సెలక్ట్ చేసుకోవడం, ప్రిపర్ అయిన అంశాలపై మాక్ టెస్ట్‌లకి హాజరవ్వండి. పరీక్షకు ముందు కనీసం 5 నుండి 6 మాక్ టెస్ట్‌లను ప్రాక్టీస్ చేయడం, పరీక్ష కోసం ఖచ్చితమైన తయారీ కోసం టెస్ట్ నమూనాను సేకరించడం, అధిక వెయిటేజీ అంశాలు, ఎక్కువ మార్కులు వచ్చే ప్రశ్నలు అంశాలపై దృష్టి పెట్టడం వంటి చిట్కాలను పాటిస్తే ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ లో మంచి మార్కులతో ఆన్ లైన్ రిటన్ ఎగ్జామ్ లో క్వాలిఫై కావచ్చు. సులభమైన ప్రశ్నలను ముందుగా ప్రయత్నించి, సమయాన్ని సేవ్ చేసుకోవడం, ఏదైనా ప్రశ్న కష్టంగా అనిపిస్తే, సమయాన్ని వృధా చేయకుండా, చివరిగా ఆన్సర్ చేసేలా పెట్టుకోవడం, మార్కింగ్ స్కీమ్‌తో పాటు పరీక్షలో ముఖ్యమైన అంశాల వెయిటేజీని తెలుసుకోవడం వంటివి చేయాలి. అప్పుడే మంచి మార్కులతో రిటన్ టెస్ట్ లో క్వాలిఫై కావచ్చు. ఇలా ఒక ప్లాన్ ప్రకారం, ప్రిపరేషన్ టిప్స్, ఎగ్జామ్ రాసే సమయంలో తీసుకోవాల్సిన టిప్స్ ను పాటిస్తే.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ పరీక్షలో సులభంగా గట్టెక్కవచ్చు. ఎక్కువ మార్కులు సాధించి తరువాత రౌండ్లకు క్వాలిఫై కావచ్చు. 
ఇలా ఫస్ట్ రౌండ్ లో ఆన్ లైన్ లో పరీక్ష పూర్తి చేసి క్వాలిఫై అయిన తర్వాత, రెండవ టెస్ట్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ రౌండ్‌ ఉంటుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ రౌండ్ అభ్యర్ధులకు సంబంధించిన సర్టిఫికేట్స్, వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలను వెరిఫై చేస్తారు.
రిటన్ టెస్ట్ తర్వాత 3వ రౌండ్ గా ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్(PFT) కు వెళ్లాలి. ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ ఫిజికల్ ఫిట్‌నెస్ ప్రమాణాలు చూస్తే.. 1.6 కిమీ పరుగును కేవలం 6 నిమిషాల 30 సెకన్లలో పూర్తి చేయాలి. అనంతరం నిర్ణీత సమయంలో 10 పుష్-అప్‌లు, 10 సిట్-అప్‌లు, 20 స్క్వాట్‌లు చేయాల్సి ఉంటుంది. ఇలా ఫిజికల్ రౌండ్ కూడా పూర్తవుతుంది. ఇది క్వాలిఫై అయిన వారికి అడాప్టబిలిటీ టెస్ట్- I, అడాప్టబిలిటీ టెస్ట్- II టెస్ట్ లు ఉంటాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగం చేయడం కోసం అభ్యర్థి సూటబిలిటీ ని అంచనా వేయడానికి నిర్వహిస్తారు. ఇది కూడా రాత పరీక్షే. ఆబ్జెక్టివ్ రకం ప్రశ్నలు ఉంటాయి. ఎయిర్ ఫోర్స్ లో ఉన్న వాతావారణాన్ని తనకు అనుకూలంగా అభ్యర్థి అడాప్ట్ చేసుకోగలడా? లేదా? సైనిక జీవన విధానానికి సర్దుబాటు చేసుకోగలడా లేదా, వైమానిక దళం వాతావరణానికి, అక్కడి పరిస్థితులను అర్ధం చేసుకొని పని చేయగలడా? లేదా? అన్నది పరీక్షిస్తారు.
ఇందులో సెలక్ట్ అయినవారికి వైద్య పరీక్ష (Medical test)ను నిర్వహిస్తారు. ఇక్కడ మెడికల్ టెస్ట్ లో నిర్వహించబడే వివిధ వైద్య పరీక్షలు క్రింద వివరించబడ్డాయి. ఎయిర్ ఫోర్స్ లో పనిచేయాలంటే.. అభ్యర్థి మంచి శారీరక మరియు మానసిక ఆరోగ్యంతో ఉండాలి. ఏదైనా అనారోగ్యం లేదా వైకల్యం ఉండకూడదు. యుద్దంలేని సమయంలోనూ, యుద్ధ సమయంలోనూ, రకరకాల పరిస్థితులలో తమ విధులను సమర్థవంతంగా నిర్వహించగలడా లేదా అన్నది మెడికల్ టెస్ట్ లలో తేలుతుంది. రకరకాల పరీక్షలు చేస్తారు. అవసరమైతే.. మెడికల్ ఆఫీసర్ చెబితే ఇతర పరీక్షలు కూడా చేయిస్తారు. కనీస ఎత్తు 152.5 సెం.మీ ఉండాలి. ఛాతీ కనిష్ట విస్తరణ పరిధి: 5 సెం.మీ ఉండాలి. బరువు వయస్సుకు, ఎత్తుకు తగ్గట్టుగా ఉండాలి. దృశ్య అవసరాలు అంటే కంటి చూపుకు సంబంధించిన ప్రమాణాలు, డెంటల్ కు సంబంధించి కనీసం 14 డెంటల్ పాయింట్లు ఉండాలి. వినికిడి ప్రమాణాలు ఉండాలి.

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!