INDIAN NAVY: AGNIVEER PREPARATION TIPS

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

దేశ రక్షణ శాఖలోని త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లలో చేరి దేశ సేవలో పాలు పంచుకోవాలన్న యువత కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా అగ్నిపథ్‌ స్కీమ్‌ (Agnipath Scheme) ను తీసుకువచ్చింది. అగ్నిపథ్‌లో భాగంగా అగ్నివీర్ లను నియమించనుంది. ఇక రక్షణ శాఖలోని మూడు విభాగాల్లో ఒకటైన ఇండియన్ నేవీలో ఇండియన్ నేవీలో అగ్నివీర్‌ స్కీం (Indian Navy Agniveer MR), ఇండియన్ నేవీ అగ్నివీర్‌ స్కీం (Indian Navy Agniveer SSR) నోటిఫికేషన్లను విడుదల చేసి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. అగ్నివీర్ MR పోస్ట్‌లకు 2OO ఖాళీలు,  SSR పోస్ట్‌లకు 2800 ఖాళీలు ఉన్నాయి. ఇండియన్ నేవీ అగ్నీవీర్ ఎమ్ఆర్ (Indian Navy Agniveer MR) రిక్రూట్‌మెంట్ కింద సైన్యం మూడు డొమైన్‌లలో తాత్కాలికంగా 200 ఖాళీలను భర్తీ చేయనుంది. వీటిలో చెఫ్ (MR), స్టీవార్డ్ (MR), హైజీనిస్ట్ (MR) విభాగాలు ఉన్నాయ.

ఎంపిక చేసే మొత్తం 200 పోస్టుల్లో 40 పోస్టులకు మహిళలకు కేటాయించారు. గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. 10వ తరగతిలో పొందిన మొత్తం శాతం ఆధారంగా అభ్యర్థుల షార్ట్‌లిస్ట్‌తో ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇక నేవీ అగ్నివీర్ ఎస్ఎస్ఆర్ (Indian Navy Agniveer SSR)లో 2800 ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇప్పటికే రిలీజ్ అయింది. పోస్టులకు సంబంధించిన కావాల్సిన అర్హతలను చూస్తే..  గుర్తింపు పొందిన విద్యా బోర్డు నుండి గణితం, భౌతికశాస్త్రం మరియు వీటిలో కనీసం ఒక సబ్జెక్ట్‌తో 10 2 పరీక్షలో అర్హత సాధించాలి. అభ్యర్థుల వయస్సు నమోదు రోజున 17½ – 21 సంవత్సరాల మధ్య ఉండాలి. 

ఇండియన్ నేవీ ప్రిపరేషన్ టిప్స్.. ఈ ప్రణాళిక ఫాలో అయితే కొలువు మీ సొంతం..

అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన ఒరిజినల్ సర్టిఫికెట్లు, మార్క్ షీట్‌లు, డొమిసైల్ సర్టిఫికేట్ మరియు NCC సర్టిఫికేట్ (ఉంటే) అభ్యర్థులు అప్‌లోడ్ చేసిన ఒరిజినల్ డాక్యుమెంట్‌లను రిక్రూట్‌మెంట్ యొక్క అన్ని దశలలో చూపించాల్సి ఉంటుంది. అధికారిక వెబ్‌సైట్ www.joinindiannavy.gov.in నుండి కాల్ అప్ లెటర్స్ కమ్ అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. కాల్ అప్ లెటర్ మరియు అడ్మిట్ కార్డ్ పోస్ట్ ద్వారా పంపబడదు. అభ్యర్థులను సంప్రదించేటప్పుడు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ మోడ్ మాత్రమే ఉపయోగించబడుతుంది.

ఈ ఇండియన్ నేవీ అగ్నివీర్ MR, అగ్నివీర్ SSRల ఎంపిక ప్రక్రియ ఐదు దశలలో ఉంటుంది. 1) షార్ట్‌లిస్టింగ్ 2)ఆన్ లైన్ రాత పరీక్ష 3) ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (PFT) 4) మెడికల్ ఎగ్జామినేషన్‌ లలో ఫిట్‌నెస్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇలా అన్నీ టెస్టుల్లో క్వాలిఫై అయితే.. నవంబర్ లో మెరిట్ జాబితా తయారు చేయబడుతుంది. అభ్యర్ధికి సంబంధించిన డాక్యుమెంట్స్, అర్హతలను చూసి మొదటి రౌండ్ షార్ట్ లిస్టింగ్ పూర్తవుతుంది.

అనంతరం 2వ రౌండ్ లో ఆన్ లైన్ రాత పరీక్ష (Written exam) ఉంటుంది. ఎంపిక చేసిన సెంటర్ల లో కంప్యూటర్‌ను ఉపయోగించి నిర్వహించబడుతుంది. ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. హిందీ, ఇంగ్లీషు రెండు భాషల్లోనూ నిర్వహించబడతాయి. నేవీ అగ్నివీర్ MR లో ప్రశ్నపత్రం ‘సైన్స్ & మ్యాథమెటిక్స్’ మరియు ‘జనరల్ అవేర్‌నెస్’ అనే రెండు విభాగాలను కలిగి ఉంటుంది. పరీక్ష వ్యవధి 30 నిమిషాలు. పదవ తరగతి స్థాయి సిలబస్ నుండే ప్రశ్నలు ఉంటాయి. ఇండియన్ నేవీ అగ్నివీర్(SSR) అభ్యర్థుల రాత పరీక్షలో ఇంగ్లీష్ (English), మేధమేటిక్స్ (Mathematics), సైన్స్(Science), జనరల్ నాలెడ్జ్(General Knowledge) సబ్జెక్ట్ లలో రాత పరీక్ష ఉంటుంది. పరీక్ష 60 నిమిషాల పాటు ఉంటుంది.

ఇండియన్ నేవీ అగ్నివీర్ MR, అగ్నివీర్ SSR రిటన్ ఎగ్జామ్ కు ప్రిపరేషన్ టిప్స్..

1)పరీక్ష ఆకృతి మరియు స్కోరింగ్ విధానాన్ని అర్థం చేసుకోవడానికి, అధికారిక వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన ఇండియన్ నేవీ అగ్నిపథ్ సిలబస్ మరియు పరీక్షా విధానాన్ని తెలుసుకోవాలి. గతంలో నిర్వహించబడిన నేవీ ఎగ్జామ్ లలోని ప్రశ్నలు ఎలా వుంటాయో పరిశీలించండి. తద్వారా ప్రిపరేషన్ లో ఉపయోగపడుతుంది. 2)మెరుగైన ఫలితాల కోసం, అత్యధిక మార్కులు, వెయిటేజీలను పరిశీలించి ఆ టాపిక్స్ ను టైమ్ ఎక్కువ కేటాయించండి. టాపిక్స్ కు అనుగుణంగా వాటికి మరింత శ్రద్ధ పెట్టి ప్రిపేర్ అవ్వండి.

3)మీ పరీక్ష సన్నద్ధత స్థాయిని పెంచడానికి, మునుపటి సంవత్సరం నుండి ప్రాక్టీస్ పరీక్షలు మరియు ప్రశ్నలను తీసుకోండి.

4)ఎక్కువ కాలం విషయాలను గుర్తుంచుకోవడానికి, వారు ఎప్పటికప్పుడు మాక్ టెస్ట్ లకు అటెండ్ అవ్వండి. తద్వారా రాత పరీక్షలో టైమ్ మేనేజ్ మెంట్ చేసుకోవడానికి వీలుంటుంది. 

అభ్యర్థులు తప్పనిసరిగా ఇండియన్ నేవీ అగ్నివీర్ సిలబస్‌తో క్షుణ్ణంగా ఉండాలి, తద్వారా వ్రాత పరీక్షలో ఇండియన్ నేవీ అగ్నివీర్ కట్-ఆఫ్ మార్కుల కంటే ఎక్కువ మార్కులు సాధించడానికి ఇది వారికి సహాయపడుతుంది. ఇలా ఒక ప్లాన్ ప్రకారం, ప్రిపరేషన్ టిప్స్, ఎగ్జామ్ రాసే సమయంలో తీసుకోవాల్సిన టిప్స్ ను పాటిస్తే.. ఇండియన్ నేవీ అగ్నివీర్ పరీక్షలో సులభంగా గట్టెక్కవచ్చు. ఎక్కువ మార్కులు సాధించి మిగిలిన రౌండ్లకు క్వాలిఫై కావచ్చు.

పైన చెప్పిన టిప్స్ ఉపయోగించి, ఆన్ లైన్ రాత పరీక్ష పూర్తి చేసి క్వాలిఫై అయిన వారికి Agniveer MR, Agniveer SSR లలో తరువాత శారీరక పరీక్ష (PFT) ఉంటుంది. అగ్నివీర్ కు సెలక్ట్ కావాలంటే.. ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (పీఎఫ్‌టీ)లో అర్హత సాధించడం తప్పనిసరి. Agniveer MR, Agniveer SSR రెండింటికీ ఒకే రకమైన ఫిజికల్ టెస్ట్ లు ఉంటాయి. పురుష అభ్యర్ధులకు (male) అయితే 157 సెంమీ, ఆడ(Female) అయితే 152 సెం.మీ లు ఉండాలి. పురుష అభ్యర్ధులు 6.30 నిమిషాలలో1.6 కి.మీ పరుగు పూర్తి చేయాలి. 20 స్క్వాట్‌లు (ఉతక్ బైఠక్),12 పుష్-అప్‌లు చేయాలి. ఆడ అభ్యర్ధులయితే (female)అయితే 8 నిమిషాలలో1.6 కి.మీ పరుగు పూర్తి చేయాలి. 15స్క్వాట్‌లు (ఉతక్ బైఠక్), 10 పుష్-అప్‌లు చేయాలి. ఫిజికల్ పూర్తయిన వారికి మెడికల్ టెస్ట్ ఉంటుంది.

అగ్నివీర్ MR, అగ్నివీర్ (SSR)లకు వర్తించే ప్రస్తుత నిబంధనల ప్రకారం వైద్య పరీక్షలు ఉంటాయి. డాక్టర్లు కోరితే, గరిష్టంగా 21 రోజుల వ్యవధిలో మెడికల్ టెస్ట్ లకు అటెండ్ కావాల్సి ఉంటుంది. అభ్యర్థి మంచి శారీరక, మానసిక ఆరోగ్యంతో ఉండాలి. ఎలాంటి వ్యాధి/వైకల్యం లేకుండా ఉండాలి. యుద్దం లేనప్పుడు, యుద్ధ పరిస్థితుల్లోనూ.. ఇలా అన్ని పరిస్థితుల్లో విధులను సమర్థవంతంగా నిర్వహించాల్సి ఉంటుంది కాబట్టి అభ్యర్థి మంచి శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని కలిగి ఉండాలి. కంటి చూపు (ద్ళశ్య ప్రమాణాలు) (eye vision) అద్దాలు లేకుండా బెటర్ ఐ 6/6, వర్స్ ఐ 6/9 ఉండాలి. అద్దాలతో అయితే బెటర్ ఐ 6/6, వర్స్ ఐ 6/6 ఉండాలి.

ఇలా Agniveer MR, Agniveer SSR లలో ఐదు రకాల పరీక్షలైన షార్ట్ లిస్టింగ్, ఆన్ లైన్ రిటన్ ఎగ్జామ్, ఫిజకల్, మెడికల్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ రౌండ్లను పూర్తి చేసిన వారికి .. వాటిలో వచ్చిన ఫలితాలను ప్రకటిస్తారు. షార్ట్‌లిస్ట్ లో ఎంపిక చేయబడిన అభ్యర్థులను డిసెంబర్ లో ప్రొవిజన్ సెలక్ట్ లిస్ట్ (PSL) రౌండ్‌కు పిలుస్తారు. ఇక్కడ సెలక్ట్ చేసిన వారితో ఈ ఏడాది డిసెంబర్ చివరి వారం లో ప్రకటించి, డిసెంబరు చివరి నాటికి మొదటి బ్యాచ్ నమోదును సిద్దం చేసి (Indian Navy Agniveer MR), (Indian Navy Agniveer SSR)ల శిక్షణ ప్రారంభిస్తారు. సో.. అభ్యర్ధులందరికీ ఆల్ ది బెస్ట్.

.

.

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!