PREPARATION TIPS FOR AGNIVEER RECRUITMENT APPLIED CANDIDATES

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

దేశ రక్షణ శాఖలోని త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లలో చేరి దేశ సేవలో పాలు పంచుకోవాలన్న యువత కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా అగ్నిపథ్‌ స్కీమ్‌ (Agnipath Scheme) ను తీసుకువచ్చింది. అగ్నిపథ్‌లో భాగంగా నియమించే సైనికులను అగ్నివీర్ అంటారు. ఇందులో భాగంగా ఎయిర్‌ఫోర్స్‌, నేవీల్లో ఇప్పటికే అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది.  దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున యువత అగ్నిపథ్ నోటిఫికేషన్ (Agnipath Notification) కోసం ఎదురు చూసి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాల కోసం రిజిస్ట్రేషన్‌ (Job Registration) చేసుకున్నారు. మన తెలుగు రాష్ట్రాల నుండి అగ్నివీర్ ఉద్యోగాల కోసం అప్లయ్ చేసిన వారికి రిక్రూట్మెంట్ ర్యాలీ తేదీలను కూడా రక్షణ శాఖ ప్రకటించింది.

అసలు అగ్నిపథ్ పథకం అంటే?రక్షణ శాఖ చెప్పిన వివరాల ప్రకారం సైన్యంలోని మూడు ప్రధాన విభాగాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లలో యువతకు అవకాశం ఇచ్చేందుకు కేంద్రం తీసుకొచ్చిన పథకం ఇది. అగ్నిపథ్‌లో భాగంగా నియమించే సైనికులను అగ్నివీర్ అంటారు. వీరు నాలుగేళ్ల పాటు సైన్యంలో ఆయా విభాగాలలో పని చేయొచ్చు. ఆ తర్వాత వారి పనితీరును సమీక్షిస్తారు. ప్రతిభ ఉన్న వారిని సెలెక్ట్ చేసి, మొత్తం అగ్నివీరుల్లో 25 శాతం మందిని రిటెయిన్ చేస్తారు. అంటే ప్రతి 100 మందిలో 25 మందిని రెగ్యులరైజ్ చేస్తారు. వాళ్లు 15 సంవత్సరాల పాటు వివిధ విభాగాలలో నాన్ ఆఫీసర్ హోదాలో పని చేయవచ్చు…

జీతం ఎంత ఉంటుంది.? నాలుగేళ్లలో ఎంత సంపాదించవచ్చు.?

అగ్నిపథ్‌ కింద సైన్యంలోని మూడు విభాగాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లలో చేరేవారికి మొదటి ఏడాది నెలకు 30 వేల రూపాయల జీతం ఇస్తారు. ఇందులో చేతికి 21 వేలు వస్తాయి. మిగిలిన 9 వేల రూపాయలు అగ్నివీర్ కార్పస్ ఫండ్‌లో జమచేస్తారు. రెండో ఏడాది నెలకు 33 వేల రూపాయల జీతం వస్తుంది. అందులో 30 శాతం అంటే 9900 రూపాయలు కార్పస్ ఫండ్‌లో జమ చేస్తారు. మూడో ఏడాదిలో ప్రతి నెలా ఇచ్చే 36,500లో 10,980 కార్పస్ ఫండ్‌లో జమ చేస్తారు. నాలుగో ఏడాది నెలకు 40 వేలు జీతం ఇస్తారు. ఇందులో 12,000 కార్పస్ ఫండ్‌కి వెళ్తుంది. ఇలా నాలుగేళ్లలో మొత్తం 5లక్షల రెండు వేల రూపాయలు కార్పస్‌ ఫండ్‌లో జమ అవుతాయి.

దీనికి మరో 5 లక్షల 2 వేల రూపాయలు అదనంగా కేంద్రం జమ చేస్తుంది. ఈ మొత్తానికి వడ్డీ కలుపుకుని నాలుగేళ్ల తర్వాత 11.71 వేల రూపాయలు చెల్లిస్తారు. ఈ మొత్తంపై ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. ఈ నాలుగేళ్ల కాలంలో ఆర్మీ నిబంధనల ప్రకారం ఇతర రాయితీలు, సౌకర్యాలు ఉంటాయి. నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి సమగ్ర ఆర్థిక ప్యాకేజ్ ఉంటుంది. అంటే 18 వయసులో చేరితే 22 ఏళ్లకి రిలీవ్ అయితే నాలుగేళ్ల కాలంలో నెలకి కనీసం 30 వేల జీతం అనుకున్నా 14,44,000 వస్తుంది అదనంగా రిలీవ్ అయ్యే సమయానికి 11,70,000 చేతికి వస్తుంది అంటే మొత్తం 4 ఏళ్ల లో 26 లక్షల 10 వేలు సంపాదించగలుగుతారు.

పోస్టుల వివరాలు 1) ఇండియన్ ఆర్మీ (INDIAN ARMY) అగ్నివీర్ పోస్టుల్లో వివిధ రకాల పోస్టులు ఉన్నాయి. వాటిలో క్వాలిఫికేషన్ బట్టి, మెరిట్ ను బట్టి రకరకాలల ఉద్యోగాలలో నియమిస్తారు. General Duty (All Arms), Agniveer (Tech), Agniveer Technical (Aviation/Ammunition Examiner), Agniveer Clerk /Store Keeper Technical (All Arms), Agniveer Tradesmen (All Arms) 10th pass, Agniveer Tradesmen (All Arms) 08th pass వంటి పోస్టులు ఉన్నాయి. ఇలా రకరకాల పోస్టులలో సుమారు 25 వేల మందిని ఆర్మీ అగ్నివీర్ పోస్టుల కోసం సెలక్ట్ చేయనున్నారు. ఇక ఇండియన్ ఆర్మీ(మహిళా మిలిటరీ పోలీస్) 2022 కు సంబంధించి 1000కి పైగా అగ్నివీర్ ఆర్మీ మహిళా (జనరల్ డ్యూటీ) పోస్టుల కోసం కూడా నోటిఫికేషన్ విడుదల చేసారు.

2) ఇండియన్ నేవీ (INDIAN NAVY)లో ఇండియన్ నేవీలో అగ్నివీర్‌ స్కీం (Indian Navy Agniveer MR), ఇండియన్ నేవీ అగ్నివీర్‌ స్కీం (Indian Navy Agniveer SSR) నోటిఫికేషన్లను విడుదల చేసి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నారు. అగ్నివీర్ MR పోస్ట్‌లకు 2OO ఖాళీలు, SSR పోస్ట్‌లకు 2800 ఖాళీలు ఉన్నాయి.

3) ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (INDIAN AIRFORCE)లో సుమారు 3500 పోస్టులు ఉన్నాయి. అవసరాన్ని బట్టి రకరకాల విభాగాలలో, రకరకాల ఉద్యోగాలలో నియమిస్తారు 

ఎవరు అర్హులు?

పదిహేడున్నర ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు అగ్నిపథ్‌ పథకం ద్వారా సైన్యంలో చేరవచ్చు. పదవ తరగతి లేదా ఇంటర్ పాసైన యువతీ యువకులు అర్హులు. అర్హతలను బట్టి ఆర్మీ, వైమానిక దళం, నేవీలో పని చేయవచ్చు. 4 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసుకొని రెగ్యులర్ కాని వాళ్లకి CRPF, పారా మిలటరీ ఫోర్సెస్ లలో చేరడానికి ప్రాధాన్యతని ఇస్తారు. అంటే వీళ్లు ఇదివరకే శిక్షణ పూర్తి చేసుకొని ఉంటారు కనుక ఈ రెండు విభాగాలలో చేరడానికి ఎలాంటి పరీక్ష లేకుండానే అనుమతి ఇస్తారు కానీ ఫిట్నెస్ విషయంలో మరలా పరీక్ష ఉంటుంది. ఇక సైన్యంలో ఉండగా ఎలా చనిపోయినా 48 లక్షల జీవిత బీమా ఉంటుంది. ఈ ఇన్సూరెన్స్ కోసం అభ్యర్థులు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. విధి నిర్వహణలో చనిపోతే మరో 44 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా అదనంగా చెల్లిస్తారు.

ఇప్పటికే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ లకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. రాత పరీక్షల తేదీలు కూడా ప్రకటించారు. అందుచేత విద్యార్ధులంతా రకరకాల ఎగ్జామ్ లకు సంబంధించిన షెడ్యూల్ ను ఫాలో అవుతూ పరీక్షలకు అటెండ్ అవుతూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. సో అభ్యర్ధులందరికీ ఆల్ ది బెస్ట్.

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!