ఏపీ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో డైరెక్ట్, లేటరల్ ఎంట్రీ ప్రాతిపదికన 622 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 622
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ప్రొఫెసర్(డైరెక్ట్) 375, అసిస్టెంట్ ప్రొఫెసర్(లేటరల్ ఎంట్రీ) 247
అర్హత: సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, ఎంఎస్, ఎండీ, ఎండీఎస్, డీఎం, ఎంహెచ్, ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
విభాగాలు: క్లినికల్, సూపర్ స్పెషాలిటీ, అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ.
స్పెషాలిటీలు: జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, అనెస్తీషియా, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఈఎన్‌టీ, పల్మనాలజీ, సైకియాట్రీ, రేడియో డయాగ్నోసిస్, రేడియాలజీ, రేడియోథెరపీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ట్రాన్స్‌ప్యూజన్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, న్యూక్లియర్ అడ్మినిస్ట్రేషన్ తదితరాలు.
వయసు: 04.08.2022 నాటికి జనరల్ అభ్యర్థులు 42ఏళ్లు, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు 47ఏళ్లు, దివ్యాంగులు 52 ఏళ్లు, మాజీ సైనికులు 50 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: పీజీ డిగ్రీ, సూపర్ స్పెషాలిటీ ఉత్తీర్ణత మార్కులు, అర్హత పరీక్ష ఉత్తీర్ణులైన సంవత్సరం, ప్రభుత్వ సంస్థల్లో కాంట్రాక్టు సర్వీసు తదితరాలకు వెయిటేజి ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 20.08.2022
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://dme.ap.nic.in/