ఈ ఫలితాలను తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మధ్యాహ్నం 3.30 గంటలకు మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి విడుదల చేశారు. మూడేళ్లు, అయిదేళ్ల పీజీ లాసెట్ జూలై 21, 22 తేదీల్లో జరిగిన విషయం తెల్సిందే. LAWCET 3 YEARS (LLB Course)లో 24938 మంది దరఖాస్తు చేసుకోగ.. వీరిలో పరీక్షకు 20107 మంది హాజరయ్యారు. LAWCET 3 YEARS ఫలితాల్లో 74 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. LAWCET 5 YEARSలో 7506 మంది దరఖాస్తు చేసుకోగ.. వీరిలో పరీక్షకు 6207 మంది హాజరయ్యారు. ఈ LAWCET 5 YEARS ఫలితాల్లో 68.57% మంది ఉత్తీర్ణత సాధించారు. PGLCET (LL.M. Course)కు 3094 మంది దరఖాస్తు చేసుకోగ.. వీరిలో పరీక్షకు 2607 మంది హాజరయ్యారు. PGLCET (LL.M. Course) ఫలితాల్లో 91.10% మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ మూడు విభాగాలకు మొత్తం 35538 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షకు మాత్రం 28921 మంది హాజరయ్యారు. మొత్తం 74.90% మంది ఉత్తీర్ణత సాధించారు.