622 posts in AP Govt Medical Colleges.. Here are the complete details..

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

Andhra Pradesh Govt Jobs: ఏపీ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 622 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

 
DME AP Recruitment

ఏపీ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో డైరెక్ట్, లేటరల్‌ ఎంట్రీ ప్రాతిపదికన 622 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 622
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(డైరెక్ట్‌) 375, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(లేటరల్‌ ఎంట్రీ) 247
అర్హత: సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, ఎంఎస్, ఎండీ, ఎండీఎస్, డీఎం, ఎంహెచ్, ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
విభాగాలు: క్లినికల్, సూపర్‌ స్పెషాలిటీ, అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ.
స్పెషాలిటీలు: జనరల్‌ మెడిసిన్, జనరల్‌ సర్జరీ, గైనకాలజీ, అనెస్తీషియా, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఈఎన్‌టీ, పల్మనాలజీ, సైకియాట్రీ, రేడియో డయాగ్నోసిస్, రేడియాలజీ, రేడియోథెరపీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ట్రాన్స్‌ప్యూజన్‌ మెడిసిన్, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్, న్యూక్లియర్‌ అడ్మినిస్ట్రేషన్‌ తదితరాలు.
వయసు: 04.08.2022 నాటికి జనరల్‌ అభ్యర్థులు 42ఏళ్లు, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు 47ఏళ్లు, దివ్యాంగులు 52 ఏళ్లు, మాజీ సైనికులు 50 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: పీజీ డిగ్రీ, సూపర్‌ స్పెషాలిటీ ఉత్తీర్ణత మార్కులు, అర్హత పరీక్ష ఉత్తీర్ణులైన సంవత్సరం, ప్రభుత్వ సంస్థల్లో కాంట్రాక్టు సర్వీసు తదితరాలకు వెయిటేజి ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 20.08.2022

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://dme.ap.nic.in/

error: Content is protected !!