ఇంటర్నెట్ డెస్క్: నాని, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ‘శ్యామ్‌సింగరాయ్’ ఆస్కార్ నామినేషన్ల రేసులో నిలిచింది. పునర్జన్మల కథాంశంతో రూపొందిన ఈ చిత్రం మూడు విభాగాల్లో నామినేట్ అయ్యే అవకాశం ఉంది. పీరియాడిక్ డ్రామా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, క్లాసికల్ కల్చరల్ డ్యాన్స్ ఈ మూడు విభాగాల్లో శ్యామ్ సింగరాయ్ నామినేషన్ పరిశీలనకు వెళ్లింది. హైదరాబాద్, కోల్‌కతా బ్రాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రానికి రాహుల్ సాంక్రిత్యాన్ దర్శకత్వం వహించగా, వెంకట్ బోయనపల్లి నిర్మించారు. మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూర్చారు. నాని ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్‌లో విడుదలై ఘన విజయం సాధించింది. నానితోపాటు సాయిపల్లవి నటనకు మంచి మార్కులు పడ్డాయి. కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్, రాహుల్ రవీంద్రన్ సైతం తమ నటనతో ఆకట్టుకున్నారు. ఈ చిత్రానికి సంగీతం ప్రధాన బలంగా నిలిచింది.
ఆస్కార్ నామినేషన్ పరిశీలనలో తెలుగు సినిమా
Shyam Singha Roy: ఆస్కార్ నామినేషన్ల పరిశీలన రేసులో ‘శ్యామ్ సింగరాయ్’
You might also check these ralated posts.....