తెలంగాణ ఎంసెట్ (TS EAMCET 2022) ఫలితాలు ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని యోచిస్తోంది తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (TSCHE). ఈ మేరకు కౌన్సెలింగ్ కు సంబంధించిన డిటైల్డ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం మూడు ఫేజ్ లలో ఈ కౌన్సెలింగ్ లను నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ముఖ్యమైన తేదీల వివరాలు ఇలా ఉన్నాయి.
FIRST PHASE TS EAMCET 2022 COUNSELLING:
బేసిక్ ఇన్ఫర్మేషన్ నమోదు, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్: 21-08-2022 నుంచి 29-08-2022
సర్టిఫికేట్ల వెరిఫికేషన్: 23-08-2022 నుంచి 30-08-2022
వెబ్ ఆప్షన్ల నమోదు: 23-08-2022 నుంచి 02-09-2022
సీట్ల కేటాయింపు: సెప్టంబర్ 6
ట్యూషన్ ఫీజు చెల్లింపు, వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్: 06-09-2022 నుంచి 13-09-2022
సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్: సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 10 వరకు..
ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్: అక్టోబర్ 11 నుంచి 21 వరకు
-అనంతరం మిగిలిపోయిన సీట్లకు అక్టోబర్ 20న స్పాట్ అడ్మిషన్లను నిర్వహిస్తారు.
ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు ఎలా..?
-ఎంసెట్ కౌన్సెలింగ్ లో పాల్గొనడానికి అభ్యర్థులు ముందుగా ప్రాసెసింగ్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.
– ప్రాసెసింగ్ ఫీజును చెల్లించడానికి నిర్ణీత తేదీల్లో అధికారిక వెబ్ సైట్ https://tseamcet.nic.in ను ఓపెన్ చేయాలి.
– అనంతరం “PAYMENT OF PROCESSING FEE” ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
తర్వాత ఎంసెట్ హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఇంటర్ హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రస్ నమోదు చేయాల్సి ఉంటుంది. కుల, ఆదాయ సర్టిఫికేట్ కు సంబంధించిన వివరాలను సైతం నమోదు చేయాల్సి ఉంటుంది. మొబైల్ నంబర్ ను ఒక సారి నమోదు చేసిన తర్వాత మార్చుకోవడం కుదరదు.
-అనంతరం అప్లికేషన్ ఫీజుగా 1200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది.