*📚✍️ఈహెచ్ఎస్ కార్డులతో*
*ఉపయోగం ఏంటి?✍️📚*
*🌻ఈనాడు, అమరావతి:* ఎంప్లాయీస్ హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్) కార్డులున్న వారికి వైద్యం చేయడానికి.. కార్పొరేట్ ఆసుపత్రులు అంగీకరించట్లేదని, ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడమే దీనికి కారణమని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు వెంకటేశ్వరరావు, లక్ష్మణరావు శాసన మండలిలో గురువారం ప్రస్తావించారు. రాష్ట్రంతోపాటు, పొరుగు రాష్ట్రాల్లోని కార్పొరేట్ ఆసుపత్రు ల్లోనూ వైద్య సేవలు పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని, గత ఫిబ్రవరి 16 వరకు ఉన్న బకాయిలను ప్రైవేటు ఆసుపత్రులకు చెల్లించామని మంత్రి విడదల రజిని సమాధానం చెప్పారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇