బడికిరాని పిల్లల వివరాల సేకరణ బాధ్యత వాలంటీర్లకు
*🌻ఈనాడు, అమరావతి*: బడికి రాని పిల్లల వివరాల సేకరణ బాధ్యతలను వాలంటీర్లకు అప్పగించనున్నారు. 2, 3 రోజులు వరుసగా విద్యార్థి బడికి రాక పోతే ఇంటికి వెళ్లి వివరాలు సేకరించే పనిని వాలంటీర్లతో చేయించను న్నారు. ఆన్లైన్లో హాజరు తీసుకుంటున్న పాఠశాల విద్యాశాఖ.. పిల్లలు ఎక్కువ రోజులు బడికి రాకపోతే ఆ వివరాలను నేరుగా గ్రామ, వార్డు సచి వాలయాలకు అందిస్తుంది. అక్కడి నుంచి వాలంటీర్లకు వెళుతుంది. పిల్లల ఇంటికెళ్లి వివరాలను కనుక్కొని ప్రధానోపాధ్యాయుడికి చెప్పాల్సి ఉంటుంది.