అఖిల భారత సర్వీసుల్లో అధికారులను భర్తీ చేసేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏటా నిర్వహించే సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్ష ఈ-అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. మొత్తం 1,105 సివిల్ సర్వీస్ ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్ పరీక్ష నిర్వహించేందుకు అడ్మిట్ కార్డుల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. సెప్టెంబరు 15 నుంచి జరుగనున్న ఈ పరీక్ష ఈ-అడ్మిట్ కార్డులను కమిషన్ జారీ చేసింది. ఆగస్టు 28నుంచి సంబంధిత వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ ఐడీ లేదా రోల్ నంబర్‌తో పాటు పుట్టినతేదీ వివరాలను నమోదు చేయడం ద్వారా అడ్మిట్‌కార్డును పొందొచ్చు.
ఈ-అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి