TODAY EDUCATION/TEACHERS NEWS 02/10/2022

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

TODAY EDUCATION/TEACHERS NEWS 02/10/2022

*📚✍️ట్రిపుల్ ఐటీలకు 9*
*వరకు దసరా సెలవులు✍️📚*

*🌻నూజివీడు:* రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు 9వ తేదీ వరకు దసరా సెలవులను ప్రకటించారు. దీంతో ట్రిపుల్ ఐటీలకు చెందిన విద్యార్థులందరూ శనివారం ఇంటిబాట పట్టారు. సెలవుల నేపథ్యంలో నూజివీడు ట్రిపుల్ ఐటీలోని విద్యార్థులందరూ నేరుగా వారి ప్రాంతాలకు చేరు కునేందుకు గాను ఆర్టీసీ నూజివీడు అధికారులు ట్రిపుల్ ఐటీ నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశా రు. దాదాపు 8 వేల మంది విద్యార్థులుండగా వారి కోసం రాజమండ్రి, అమలాపురం, రాజోలు, కాకి నాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, ఒంగోలు తదితర ప్రాంతాలకు 56 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. దీంతో ఈ బస్సలు శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు విద్యార్థులను వారి ప్రాంతాలకు తీసుకెళ్లాయి. అయితే దూర ప్రాంతాలకు చెందిన కొందరు విద్యార్థులు విజయవాడ, హనుమాన్ జంక్షన్ రైల్వేస్టేషన్లకు వెళ్లారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

*📚✍️కేజీబీవీ కాంట్రాక్టు*
*టీచర్లకు కనీస పేస్కేల్✍️📚*

*♦️రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం*

*♦️6 వారాల్లో బకాయిలతో సహా చెల్లించాలని స్పష్టీకరణ*

*🌻సాక్షి, అమరావతి* : కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) పనిచేస్తున్న కాం ట్రాక్టు టీచర్లకు కూడా కనీస వేతన స్కేల్ను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 2022 సవరించిన పే స్కేళ్ల ప్రకారం పిటిషనర్లకు కనీస వేతన స్కేల్ను బకాయిలతో సహా ఆరు వారాల్లో చెల్లించాలని స్పష్టం చేసింది. ఇప్పటికే చాలా మంది కేజీబీవీ టీచర్ల బదిలీలు జరిగిపో వడం, కొత్త పోస్టుల్లో చేరిపోవడం జరిగినం దున వారిని అక్కడి నుంచి కదల్చడం. సరికాదంది. బదిలీలపై కొందరే కోర్టుకొచ్చా రని, వారి బదిలీలపై విధించిన స్టే యథాత థంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. పిటిషనర్లు ప్రస్తుతం ఉన్న చోటనే కొనసాగు తారని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కుంభజడల మన్మథరావు ఇటీవల తీర్పు ఇచ్చారు. కనీస వేతన పేస్కేల్ అమలు చేసేలా ఆదేశాలివ్వాలని, బదిలీల విషయం లోనూ జోక్యం చేసుకోవాలని పలువురు కేజీబీవీల్లో కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లు దాఖలు చేసిన వ్యాజ్యాలపై జస్టిస్ మన్మథ రావు విచారణ జరిపారు. పిటిషనర్ల తరపు న్యాయవాదుల్లో ఒకరైన ఎన్వీ సుమంత్ వాదనలు వినిపిస్తూ.. రెగ్యులర్ టీచర్లు, పిటి షనర్ల విధులు ఒకటే అయినప్పటికీ, వేత నాల్లో ఎంతో తేడా ఉందని తెలిపారు. కనీస వేతనం చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా అధికారులు అమలు చేయడం లేదన్నారు. ప్రభుత్వ న్యాయవాది కేవీ రఘు వీర్ వాదనలు వినిపిస్తూ.. కాంట్రాక్టు ఉద్యో గులు కనీస వేతనానికి అర్హులు కారని తెలి పారు. పిటిషనర్లు సొసైటీ ద్వారా ఏడాది కాం ట్రాక్ట్ నియమితులయ్యారని, వారికి గౌర వ వేతనం చెల్లిస్తున్నామని అన్నారు. ఇరుప క్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. కాం ట్రాక్టు టీచర్లకు కనీస వేతన స్కేల్ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

*📚✍️మళ్లీ తడ ‘బడి✍️📚’*

*♦️ఏకంగా 1.73 లక్షల మంది పిల్లలు డ్రాపౌట్*

*♦️ప్రభుత్వ పాఠశాలల్లో ఆందోళనకర పరిస్థితి*

*♦️పిల్లలను గుర్తించాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖకు లేఖ*

🔺పేదరికం కారణంగా ఏ తల్లీ తన పిల్లలను బడికి పంపలేని దుస్థితి రాకూడదని, పాఠశాలల్లో డ్రాపౌట్స్ ను తగ్గించాలనే ఉద్దేశంతోనే అమ్మఒడి అమలు చేస్తున్నాం.

*▪️-సీఎం జగన్మోహన్రెడ్డి*

🔺గతేడాదితో పోల్చితే ఈసారి 2.25 లక్షల మంది విద్యార్థులు బడి మానేశారు (డ్రాపౌట్), ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖలోని ఇతర ఉద్యోగుల ప్రయత్నాలతో 52 వేల మంది తిరిగి చేరారు. మిగతా 1.73 లక్షల మందిని గుర్తించి, బడికి తీసుకురావాలని పాఠశాల విద్య కమిషనర్ కోరారు’

*▪️-కలెక్టర్లకు రాసిన లేఖలో గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్*

*🌻ఈనాడు, అమరావతి*: అమ్మబడి, విద్యా కానుక పథ కాల కారణంగా బడి మానేసే విద్యార్థుల సంఖ్య తగ్గిం దని, సర్కారు బడులకు వచ్చే వారు పెరిగారని ప్రభుత్వం ఇంతవరకు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని తేలిపోయింది. 2021-22 విద్యా సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది 2.25 లక్షల మంది బడి మానేసి నట్లు పాఠశాల విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి. కొందరు ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు చేసిన కృషితో 52 వేల మంది వెనక్కి వచ్చారు. ఇంకా1.73 లక్షల మంది వివరాలు తెలియరాలేదు. వీరిలో ప్రాథమిక పాఠశాల నుంచి పదో తరగతి వరకు ఉన్నారు. జులై 5వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారం.. భమయ్యాయి. ఈ లెక్కన 80 రోజులకు పైగా ఇన్ని లక్షల మంది బడులకు రావడం లేదు. దాంతో ఇలాంటి పిల్ల లను గుర్తించి, వారిని తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవా లంటూ గ్రామ, వార్డు సచివాలయాల శాఖకు పాఠశాల విద్యాశాఖ లేఖ రాసింది. ఈ మేరకు విద్య, సంక్షేమ సహాయకులు, గ్రామ, వార్డు వాలంటీర్ల సాయం తీసుకో వాలని కలెక్టర్లకు సంబంధిత డైరెక్టర్ శన్మోహన్ ఆదే శాలు జారీ చేశారు. బడిమానేసిన పిల్లల ఇళ్లకు వాలం టీర్లు వెళ్లి వారి తల్లిదండ్రులకు ప్రేరణ కల్పించాలని ఆదే శించారు. 4-14 ఏళ్ల వయస్సులోపున్న పిల్లలందర్నీ బడిలో చేర్పించాలని కలెక్టర్లకు సూచించారు.

*♦️వద్దు… వద్దంటున్నా విలీనం*

రవాణా సమస్యతో కొందరు విద్యార్థులు బడి మానేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. పిల్ల లకు బడి దూరంగా ఉంటే రావడం మానేస్తారనే విషయం తెలిసినా ప్రభుత్వం ఈ ఏడాది తరగతుల
విలీనం చేసింది. ఇలా చేస్తే డ్రాపౌట్లు పెరుగుతారని ఎంతమంది చెప్పినా వినలేదు. ఇప్పుడదే జరిగింది. మొత్తం 1,79,416 మంది పిల్లల పేర్లు, వారి తల్లిదం డ్రుల ఫోన్ నంబర్లు, వారి పాఠశాలల వివరాలతో సహా విద్యాశాఖ అందించింది. వీటి ఆధారంగా విద్యా ర్డులను గుర్తించాలని వార్డు, గ్రామ సచివాలయాల శాఖను కోరింది. కొందరు సీజనల్ పనుల కోసం వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారని, తల్లిదండ్రులు చదువుకో కపోవడం, విద్యార్థులకు ఆసక్తి లేకపోవడం, కుటుంబ పనులు, ఆరోగ్య సమస్యలతో కొందరు విద్యార్థులు బడి మానేశారని వెల్లడించింది.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

*📚✍️సచివాలయ ఉద్యోగుల*
*కుటుంబాలకు ఊరట✍️📚*

*♦️ప్రొబేషన్ కు ముందు చనిపోయినా కారుణ్యం*

*♦️ఫైల్ పై సీఎం జగన్ ఆమోదముద్ర*

*♦️త్వరలో ఉత్తర్వులు*

*🌻అమరావతి, ఆంధ్రప్రభః* గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం ఊరట కల్పించింది. ప్రొబేషన్ డిక్లరేషన్కు ముందు చనిపోయిన ఉద్యోగుల కుటుంబాల్లో వారి వారసులకు కారుణ్య నియామకాలు కల్పించటం ద్వారా ఆ కుటుంబాలను ఆదుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సంబంధిత ఫైల్పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి శనివారం ఆమోదముద్ర వేశారు. నియామకాలకు సంబంధించిన మార్గదర్శకాలతో త్వరలో ఉత్తర్వులు జారీ కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఈ ఏడాది జూలైలో ప్రభుత్వం ప్రొబేషనన్ను వర్తింప చేసింది. అయితే సచివాలయాల్లో ఉద్యోగాలు పొందిన కొందరు ఉద్యోగులు సుమారు 200 మంది వరకు కోవిడ్ సమయంలో ప్రజలను కాపాడే ప్రయత్నంలో విధి నిర్వహణలో మృతిచెందారు. ప్రొబేషన్ డిక్లరేషన్ లేనం దున సర్వీస్ నిబంధనల ప్రకారం వారి కుటుంబాల్లో ఒకరి కి కారుణ్య నియామకాలు ఇచ్చేందుకు అవకాశంలేదు. సామాజిక సేవలో మృతిచెందిన గ్రామ, వార్డు సచివాల య ఉద్యోగుల కుటుంబాలకు భద్రత కల్పించాలనే భావం తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి నిబంధనల సడలించాల్సిందిగా అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు సడలిస్తూ రూపొందించిన ఫైలుపై సీఎం జగన్ సంతకం చేశారు. సచివాలయ ఉద్యోగులపై కారుణ్యం చూపిన ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. గ్రామ, వార్డ సచివాలయాల ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి, అధ్యక్షుడు భీమ్డ్డి అంజన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమ్మరావు, కార్యనిర్వాహక అధ్యక్షు డు విప్పర్తి నిఖిల్ కృష్ణ భార్గవ్ తేజ్, ఉపాధ్యక్షులు బీఆర్ఆర్ కిషోర్ తదితరులు ముఖ్యమంత్రి జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. మానవతా దృక్పథంతో ఆలోచించి చనిపో యిన ఉద్యోగుల కుటుంబాల్లో సీఎం జగన్ వెలుగులు నింపారని ప్రస్తుతించారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

*📚✍️బడిబయట పిల్లలను*

*పాఠశాలల్లో చేర్పించాలి✍️📚*

*🌻మచిలీపట్నం కార్పొరేషన్ :* బడిబయట ఉన్న పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని జిల్లా కలెక్టర్ రంజిత్బాషా అధికారులను ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది వాలంటీర్లతో కలిసి హెచ్ఎంలను సమన్వయం చేసుకుని పాఠశాలల్లో చేర్పించా లన్నారు. జిల్లాలో 5,410మంది పిల్లలు బడి మానేసినట్లు గుర్తించామని, వారి వివరాలు మండలాల వారీగా ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు పంపించామన్నారు. వారంద రినీ బడిలోనే చేరేలా చర్యలు తీసుకోవాలని ఒక ప్రకటనలో ఆదేశించారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

*📚✍️Iన కొందరు*
*ఉద్యోగులకు అందని జీతాలు✍️📚*

*🌻ఈనాడు, అమరావతి*: రాష్ట్రంలో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులకు అక్టోబర్ ఒకటో తేదీన జీతాలు అందలేదు. రెండున గాంధీ జయంతి, ఆదివారం కావ డంతో మూడో తేదీ వరకు వేచి చూడాల్సిందే. ఈనెల 5న దసరా పండుగ ఉన్నందున ముందుగానే జీతాలు వస్తే వస్తు కొనుగోళ్లకు వీలుండేదని ఉద్యోగులు చెబు తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒకటో తేదీనే జీతాలివ్వకపోవడం కొన్నాళ్లుగా పరిపాటిగా మారిందని పేర్కొన్నారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

*📚✍️నార్మలైజేషన్లో గరిష్ఠం కంటే ఎక్కువ మార్కులు : జేడీ✍️📚*

*🌻ఈనాడు, అమరావతి*: ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో నార్మలైజేషన్ చేసినందున నిర్దిష్ట మార్కులు 150కంటే ఎక్కువ వస్తాయని టెట్ సంయుక్త సంచాలకురాలు చంద్రిక తెలిపారు. బహుళ సెషన్స్ పరీక్షలు నిర్వహించే రైల్వే నియామక మండలి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, జేఈఈ మెయిన్స్ ల్లోనూ ఈ విధానం అవలంబిస్తున్నారని, నార్మలైజేష న్లో అభ్యర్థులకు గరిష్ఠ మార్కులకంటే ఎక్కువ వచ్చే అవకాశముందని వెల్లడించారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

*📚✍️9 వరకు ఇంటర్*
*కళాశాలలకు సెలవులు✍️📚*

*🌻పెడన గ్రామీణం, న్యూస్టుడే:* కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఇంటర్ కళాశాలలకు ఈనెల 2 నుంచి 9వ తేదీవరకు దసరా సెలవులు ప్రకటించినట్లు ఆర్ఎస్ఐవో పి.రవికుమార్ తెలిపారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. గత నెల 22 తో 2022-23 ఇంటర్ ప్రవేశాల ప్రక్రియ పూర్తయిందని, కళాశాలల యాజమాన్యాలు అన్ని రకాల రికార్డులు సిద్ధం చేసుకోవాలని వివరించారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

*📚✍️కారుణ్య నియామకాలకు సీఎం అనుమతి✍️📚*

*♦️ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం వెల్లడి*

*🌻ఈనాడు, అమరావతి*: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల కింద ఉపాధి కల్పించాలని సీఎం జగన్ నిర్ణయించారని ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు కె. వెంకట్రామిరెడ్డి, అధ్యక్షుడు అంజన్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రొబేషన్ ఖరారు చేయక ముందే చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలకు అవకాశం లేకపోయినా… సీఎం మానవతా దృక్పథంతో ఆలోచించి వెసులుబాటు కల్పించారని వారు పేర్కొన్నారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

*📚✍️డిజిటల్ చదువులెలా*
*ఉన్నాయ్?✍️📚*

*♦️విద్యార్థులతో ప్రధాని మోడీ చిట్ చాట్*

*🌻న్యూఢిల్లీ*: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం పాఠశాల విద్యార్థినీ, విద్యార్థుల తోనూ, మెట్రో కన్స్ట్రక్షన్ వర్కర్లతోనూ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ముచ్చటించారు. ఆధునిక టెక్నాలజీని ఏ విధంగా వాడుకుంటారని విద్యార్థులను ప్రశ్నించారు. దీనిని నేర్చుకోవడం ఇబ్బందిగా ఉందా? అని వర్కర్లను అడిగారు. దీనికి వాళ్ల నుంచి సానుకూల సమాధానం వచ్చింది. ఇబ్బందేమీ లేదు సార్.. ఈ టెక్నాలజీని మాకు సులువైన విధా నంలో నేర్పిస్తున్నారు అని బదులిచ్చారు. అనంతరం సొరంగాన్ని వర్చువల్ విధానంలో పరిశీలించారు. 5జీ స్పెక్ట్రమ్ సేవలను ప్రారంభించిన అనంతరం విద్యార్థినీ, విద్యార్థులతో వర్చువల్ విధానంలో మాట్లాడారు. అహ్మదాబాద్లోని రూపా ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థినితో ముచ్చటించారు. వారిద్దరి సంభాషణ ఏమిటంటే….

*▪️మోడీ*: ఈ వయసులో నీకు కళ్లజోడు ఉంది! నువ్వు చాలా శ్రద్ధగా చదువుతున్నట్లుంది.
సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఏ సబ్జెక్ట్ చదవాలని కోరుకుంటున్నావు?.

*విద్యార్థిని*: సైన్స్

*▪️మోడీ*: మీ ఎదుట టీచర్ లేకపోవడం వల్ల సబ్జెక్ట్ను గ్రహించడానికి ఇబ్బందిగా ఉందా?

*విద్యార్థిని:* లేదు

*▪️మోడీ:* ఎదురుగా టీచర్ లేకుంటే బయటికెళ్ళి ఆడుకోవాలని అనిపించదా?

*విద్యార్థిని:* ఔను.. అంటూ తల ఊపింది. విద్యార్థినీ, విద్యార్థులతో మాట్లాడిన తర్వాత మోదీ ఢిల్లీ మెట్రో కన్స్ట్రక్షన్ వర్కర్లతోవర్చువల్ విధానంలో మాట్లాడారు. అనంతరం సొరంగాన్ని కూడా వర్చువల్ విధానంలోపరిశీలించారు. కన్స్ట్రక్షన్ వర్కర్తో మోదీ సంభాషణ ఎలా సాగిందంటే….

*▪️మోదీ* కొత్త టెక్నాలజీ ఎలా ఉంది? దీన్ని నేర్చుకోవడం కష్టమా?

*వర్కర్* : లేదు సార్. ఈ టెక్నాలజీని మాకు సులువైన విధానంలో నేర్పిస్తున్నారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

*📚✍️ఉపాధ్యాయులపై అక్రమ కేసులను ఉపసంహరించాలి✍️📚*

*♦️యుటియఫ్ రాష్ట్ర మధ్యంతర కౌన్సిల్ డిమాండ్*

*🌻అమరావతి, ఆంద్రప్రభ:* ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగానికి లోబడి ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమాలను చేయడం సహజ విధానమని, దీనికి భిన్నంగా హక్కుల రక్షణకు ఉద్యమాలను చేస్తున్న ఉపాధ్యాయులపై అక్రమ కేసులు < పెట్టడాన్ని యుటియఫ్ మధ్యంతర కౌన్సిల్ వ్యతిరేకిస్తూ తీర్మానం చేసినట్లు > యుటియఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఎస్.వెంకటేశ్వర్లు, కె.ఎస్.ఎస్. ప్రసాద్ తెలిపారు. యుటియఫ్ రాష్ట్ర మధ్యంతర కౌన్సిల్ ఎం.బి.వి.కె. విజయ వాడలో అక్టోబర్ 1,2 తేదీలలో జరుగుతున్నాయి. మొదటి రోజు పలు అంశాలపై చర్చించారు. పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం సిపిఎస్ రద్దుచేసి ఓపిఎస్ ని అమలు చేయాలని పోరాటం చేస్తే ఉద్యోగ, ఉపాధ్యా యులపై అక్రమ కేసులు పెట్టడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేసారు. ఉద్యమ చరిత్రలో వేలాది మంది ఉపాధ్యాయుల మీద ఇలా కేసులు పెట్టిన చరిత్ర లేదని విమర్శించారు. కేసులు పెట్టడం ద్వారా, నిర్బంధాలను ప్రయోగించడం ద్వారా ఉద్యమాలను అణిచివే “యడం అసాధ్యమనే విషయం ప్రభుత్వం గమనించాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యమాలపై నిర్బంధాలను ఆపి, ఉపాధ్యాయులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించాలని డిమాండ్ చేసారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

*📚✍️కేజీబీవీ టీచర్లకు ఊరట✍️📚*

*♦️కనీస వేతనాలు ఇవ్వాల్సిందే*

*♦️6 వారాల్లో బకాయిలు కూడా చెల్లించాలి*

*♦️ఒకే పనికి వేతన వ్యత్యాసం బానిసత్వాన్ని ప్రోత్సహించటమే: హైకోర్టు తీర్పు*

*🌻అమరావతి, ఆంధ్రప్రభ:* రాష్ట్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల(కేజీబీవీ)లో పనిచేస్తున్న కాంట్రాక్టు టీచర్లకు హైకోర్టులో ఊరట లభించింది. నూతన పీఆర్ సీ (2022) ప్రకారం వారికి కనీస వేతనాలు అమలు చేయాలని తీర్పునిచ్చింది. వేతన బకాయిలను ఆరు వారాల్లో చెల్లించాలని కూడా ఆదేశించింది. కనీస వేతన స్కేల్స్కు తాము అర్హులమైనా అమలు చేయటంలేదని మరోవైపు బదిలీలకు రంగం సిద్ధం చేస్తున్నందున జోక్యం చేసుకుని తగిన న్యాయం చేయాల్సిందిగా కేజీబీవీల్లో పనిచేస్తున్న పలువురు కాంట్రాక్టు రెసిడెన్షియల్ ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే మన్మధరావు విచారణ జరిపిన అనంతరం తీర్పును వెలువరించారు. పిటిషనర్ల తరుపున న్యాయవాది ఎన్వీ సుమంత్ వాదనలు వినిపించారు. వేతన సవరణ ప్రకారం పిటిషనర్లకు కనీసవేతనాలు అమలు చేయటంలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. రెగ్యులర్ టీచర్లు నిర్వహించే విధంగానే వారు విధులు నిర్వర్తిస్తున్నారని అయితే వేతనాల్లో భారీ వ్యత్యాసం ఉందన్నారు. కనీస వేతనాలకు ప్రభుత్వం < ఉత్తర్వులు జారీచేసినా అధికారులు అమలు చేయటంలేదన్నారు. జగ్జిత్ సింగ్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు ఇది విరుద్ధమని వాదించారు. ప్రభుత్వ న్యాయవాది కేవీ రఘువీర్ జోక్యం చేసుకుంటూ జీవో 40 ప్రకారం మంజూరైన పోస్టుల్లో నియమితులైన వారికే కనీస వేతన నిబంధన వర్తిస్తుందన్నారు. పిటిషనర్లు కాంట్రాక్టు ఉద్యోగులైనందున వారికి వర్తించదని చెప్పారు. వివిధ సొసైటీల ద్వారా ఏడాది కాంట్రాక్టు ఒప్పందంతో వారు నియమితులయ్యారని అందుకు ప్రతిగా గౌరవ వేతనం పొందుతున్నారని వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఒకేరకమైన విధులు నిర్వర్తిస్తున్న వారికి వేర్వేరు వేతనాలను అమలు చేయటం సమంజసం కాదన్నారు. ఇది బానిసత్వాన్ని, దోపిడీని ప్రోత్సహించటమే అవుతుందని తీర్పులో వ్యాఖ్యానించారు. ఇది ఉద్యోగుల గౌరవానికి కూడా భంగకరమన్నారు. ఇప్పటికే చాలా మంది కేజీబీవీ టీచర్లు బదిలీ కావటం, కొత్తపోస్టుల్లో చేరినందున వారిని కదల్చరాదని తీర్పునిచ్చారు. బదిలీలపై ఇప్పటికే స్టే మంజూరు చేశామని ఇది యథాతథంగా కొనసాగుతుందని కోర్టుకు వచ్చిన వారి విషయంలో స్పష్టం చేశారు. పీటిషనర్లయిన టీచర్లు ప్రస్తుతం పనిచేస్తున్నచోటే విధులు నిర్వర్తించేలా ఆదేశాలు జారీ చేసింది.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!