AP FA 1_CBA GUIDELINES AND SCEDULE
CBA పరీక్షల నిర్వహణ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులకు సూచనలు
పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులకు సూచనలు
పరీక్షలకు ముందు చేయవలసిన పనులు
1. మొదటగా మీ పాఠశాలలోని విద్యార్థుల యొక్క తరగతి వారీ లిస్టులను వారి child ID లతో తయారుచేసుకుని సిద్ధంగా ఉంచుకొనవలెను.
2. 28.10.2022 వ తేదీ MRC నుండి మీ పాఠశాలకు సంబంధించిన Variable OMR లను తీసుకొని సరి చూసుకొనవలెను. Variable OMR లు కేటాయించబడని విద్యార్థుల కొరకు Buffer OMR లను MRC వద్దనుండి 01.11.2022 తేదీ తీసుకొని విద్యార్థుల పేరు, child ID లను రాసుకొని సిద్ధముగా ఉంచుకొనవలెను.
పరీక్షల సమయంలో చేయవలసిన పనులు
3. 6 నుండి పదవ తరగతి విద్యార్థుల యొక్క ప్రశ్నాపత్రాలను ఏ రోజుకు ఆ రోజు MRC నుండి పరీక్షకు ఒక గంట ముందు తీసుకొని పాఠశాలకు రావలెను.
4. పరీక్షకు ముందు విద్యార్థులను క్రమంగా సరైన దూరములో కూర్చుండబెట్టి వారి వారి OMR లను వారికి అందజేయాలి, పేరు, child ID లు సరిపోయినవి/లేదు అని సరి చూసుకొనమని విద్యార్థులకు తెలియజేయాలి.
5. తరువాత ప్రశ్నాపత్రాలను అందజేయాలి. CBA పరీక్షా పత్రంలో రెండు రకముల ప్రశ్నలు ఉంటాయి
• బహుళైచ్ఛిక ప్రశ్నలు – 2 నుండి 4 ఎంపికలు ఉంటాయి వాటిలో ఒకటి మాత్రమే సరైన సమాధానం. సరియైన ఎంపికను ప్రశ్నాపత్రం పై గుడ్ గుర్తించాలి మరియు OMR పై సరి అయిన వృత్తములో బబుల్ చేయాలి.
• ఎంపిక లేని ప్రశ్నలు – ఈ ప్రశ్నలకు జవాబులను ప్రశ్నాపత్రం పైనే రాయాలి ( ఓఎంఆర్ లపై గుర్తించవలసిన అవసరం లేదు)
6. విద్యార్థులు OMR లపై బహుళైచ్ఛిక ప్రశ్నలకు మాత్రమే జవాబులు గుర్తించాలని, ఎంపిక లేని ప్రశ్నలకు జవాబులను OMR పై రాయవలసిన అవసరం లేదని విద్యార్థులకు తెలియజేయాలి
7. అన్ని తరగతుల వారికి ఏ సబ్జెక్ట్ పేపర్ కు అయినా పరీక్షా సమయం ఒక్క గంట మాత్రమే అనుమతించాలి.
8. ఒకే OMR పై అన్ని సబ్జెక్టులకు సంబంధించిన బబుల్ ఉంటాయి కాబట్టి ఏ పరీక్షకు ఆ సబ్జెక్టుకు సంబంధించిన బబుల్స్ మాత్రమే విద్యార్థి నింపాలని తెలియజేయాలి, పర్యవేక్షించాలి
9. ప్రతిరోజూ పరీక్ష పూర్తైన వెంటనే విద్యార్ధులనుండి ప్రశ్నా పత్రంతో పాటు OMR షీట్ కూడా వెనుకకు తీసుకోవాలి.
10. ప్రతి విద్యార్థి యొక్క OMR ను పరిశీలించి, విద్యార్థి ఏదైనా ప్రశ్నకు ఎంపికను గుర్తించని చొ ఆ ప్రశ్నకు ఉపాధ్యాయుడు E అనే ఎంపికను bubble చేయాలి.
11. ఒక్కొక్క విద్యార్థికి అన్ని పరీక్షలకు కలిపి ఒకే OMR షీట్ ఇవ్వబడుతుంది. కనుక ప్రతిరోజు అదే OMR ను ఇచ్చి ఆ సబ్జెక్టు నందు జవాబులను బబుల్ చేయించవలెను
ఉపాధ్యాయుడు ప్రతి ప్రశ్నను గట్టిగా చదివి విద్యార్థులు ఆ ప్రశ్నకు జవాబును గుర్తించిన తర్వాత మరియొక ప్రశ్న ను గట్టిగా చదువుతూ విద్యార్థుల చే జవాబులను రాయించాలి. పరీక్ష అనంతరం విద్యార్థుల నుండి ప్రశ్నాపత్రం లను సేకరించి వారి OMR లపై ఉపాధ్యాయుడే విద్యార్థి యొక్క జవాబులను బబుల్ చేయాలి.
13. 4, 5 తరగతుల పరీక్ష నిర్వహణలో సూచనలు: OMR లపై విద్యార్థులే జవాబులను గుర్తించాలి. తెలుగు ఇంగ్లీషు పరీక్షలలో ప్యాసేజ్ లను ఉపాధ్యాయుడు గట్టిగా చదివి వినిపించిన తరువాత విద్యార్థులు జవాబులను రాయాలని తెలియజేయాలి.
పరీక్షల అనంతరం చేయవలసిన పనులు
14. పరీక్షలు అన్ని పూర్తైన వెంటనే OMR షీట్స్ అన్నింటిని, తరగతి వారీగా వేరు వేరు పాలిథిన్ కవర్స్ నందు ఉంచి, అన్నింటిని కార్డు బోర్డు బాక్స్ నందు ప్యాక్ చేసి, మండల విద్యాశాఖాధికారి వారి కార్యాలయానికి ఐదవ తేదీ పంపాలి
15. OMR షీట్స్ ను జిల్లా స్థాయిలో స్కాన్ చేయించడం జరుగుతుంది. OMR నందు విద్యార్థులు పొందిన మార్కుల వివరాలు పాఠశాలలకు తెలియజేయబడవు. అవి కేవలం విద్యార్థుల స్థాయిని అంచనావేసి భవిష్యత్తులో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఇవ్వవలసిన శిక్షణా కార్యక్రమాల రూపకల్పనకు మాత్రమే వినియోగించడం జరుగుతుంది
16. CBA పరీక్షల అనంతరం ప్రతి తరగతి (1 నుండి 8 తరగతులకు మాత్రమే), ప్రతి సబ్జెక్టు నకు KEY విడుదల చేయబడుతుంది. దాని ప్రకారం ఉపాధ్యాయులు విద్యార్థుల వద్ద నుండి ప్రతి రోజు పరీక్ష తదనంతరం వెనుకకు సేకరించిన జవాబులతో కూడిన ప్రశ్నా పత్రములలోని జవాబులను దిద్దాలి. విద్యార్థులు పొందిన మార్కులను సంబంధిత రిజిస్టర్లు నందు నమోదు చేయడంతో పాటు, నిర్ణీత సమయం లోపల CSE సైట్ నందు ఎంటర్ చేయాలి. జవాబులతో కూడిన ప్రశ్నా పత్రాలను తనిఖీ అధికారుల పరిశీలనార్థం భద్రపరచాలి.
17. విద్యార్థులు పొందిన మార్కులను ప్రోగ్రెస్ కార్డులందు నమోదుచేసి విద్యార్థుల తల్లిదండ్రులకు పంపాలి. తక్కువ ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. ఉపాధ్యాయులు-తల్లిదండ్రుల సమీక్షా సమావేశంలో FA-I నందు విద్యార్థులు చూపిన ప్రతిభపై చర్చించాలి.
🔵Packaging Instructions:
*1. అన్ని సబ్జెక్టుల అసెస్మెంట్ పూర్తయిన తర్వాత, ఉపయోగించిన OMR షీట్లు తరగతుల వారీగా విడివిడిగా ప్యాక్ చేయండి.
*2. పాఠశాల స్థాయిలో, తరగతుల వారీగా ప్యాక్ చేసిన ప్యాకెట్లను ఒక పెట్టెలో ఉంచి, ఈ ప్యాకేజీలను MEOs కి పంపినట్లు నిర్ధారించుకోండి.
*Specific Instructions for Test administration – Classes 1, 2 and 3*
*page-00021. పరీక్ష పత్రంలో ఇచ్చిన లేబుల్ పై UDISE కోడ్, విద్యార్థి ID మరియు విద్యార్థి పేరు వివరాలను పూరించండి.*
*2. ప్రతి సబ్జెక్టులో అన్ని ప్రశ్నలను ఉపాధ్యాయులు గట్టిగా చదివి విద్యార్ధులకి వినిపించాలి.*
*3. ప్రశ్నాపత్రంలోని ఒక్కొక్క ప్రశ్నను గట్టిగా మరియు నిధానంగా చదివినట్లయితే, విద్యార్థులు సులభంగా అర్ధం చేసుకోవచ్చు.*
*4. ఒక ప్రశ్న చదవడం పూర్తయిన తర్వాత, విద్యార్థులు తమ ప్రశ్నాపత్రాల్లో సమాధానాలను గుర్తించడానికి తగినంత సమయం ఇవ్వండి. అవసరమైతే ప్రశ్నను మరలా ఇంకొక్కసారి చదివి వినిపించండి.*
*5. విద్యార్థులు, పరీక్ష పత్రాలలో వారు అనుకున్న సమాధానాలను సరిగ్గా గుర్తిస్తున్నారో లేదో నిర్ధారించుకోండి.*
*6. అదనపు సూచనలు లేదా సహాయం లేదా సమాధానాలకు సంబంధించిన క్లూలు విద్యార్థులకి ఇవ్వకూడదు ఎందుకంటే అది విద్యార్థులకు అదనపు సహాయాన్ని అందించవచ్చు.*
*7. బ్లాక్ బోర్డపై, పరీక్ష పత్రాలపై సమాధానాలను గుర్తించే పద్ధతిని విద్యార్ధులకి చూపండి.*
*8. ఎంపికలు లేని ప్రశ్నలకి, పరీక్ష పత్రాలలో సమాధానాలను స్పష్టంగా రాయమని విద్యార్థులకి తెలియజేయండి. పరీక్ష పూర్తయిన తర్వాత, పరీక్ష పత్రాలను తిరిగి తీసుకోండి. ప్రశ్నలకు సమాధానాలను విద్యార్థులు సరిగ్గా నింపారో లేదో చూసుకోండి.*
*9. సంబంధిత సబ్జెక్టు పరీక్ష పూర్తయిన తర్వాత, ఇన్విజిలేటర్ సంబంధిత సబ్జెక్ట్ కింద బాల్ పెన్నుని ఉపయోగించి OMRలలో విద్యార్థులు ప్రశ్నా పత్రాలలో వ్రాసి ఇచ్చిన బహుళైశ్చిక ప్రశ్నలకు సమాధానాలను గుర్తించాలి.*
*10. 3వ తరగతి EVS పరీక్ష వ్రాస్తున్నవారు, EVS/ సైన్స్ కాలమ్ కింద వారి సమాధానాలను గుర్తించాలి.*
*11. OMR షీట్లో విద్యార్థి సమాధానాలను గుర్తించేటప్పుడు, విద్యార్థి పేరు, విద్యార్థి ID అను వివరాలు పరీక్ష పత్రంపై పేరుతో సరిపోలుతున్నట్లు నిర్ధారించుకోండి.*
*Specific Instructions for Test administration – Classes 4,5,6,7,8:*
*1. బోర్డుపై UDISE కోడ్ వ్రాసి, విద్యార్థి IDలు సిద్ధంగా ఉండేలా చూసుకోండి. అంతేకాకుండా పరీక్షకు ముందుగా విద్యార్ధులకు ఈ IDలు గూర్చి తెలిసేలా నిర్ధారించుకోండి.*
*2. విద్యార్థులు పరీక్ష పత్రంలో UDISE కోడ్, విద్యార్థి ID మరియు విద్యార్థి పేరు వివరాలను సరిగ్గా వ్రాసినట్లు నిర్ధారించుకోండి.*
*3. OMR షీటుపై UDISE కోడ్, విద్యార్థి పేరు మరియు విద్యార్థి ID వివరాలు ఇవ్వబడతాయి. కాబట్టి OMR షీటులను విద్యార్థులకు అందజేస్తున్నప్పుడు, ప్రతి విద్యార్ధి వారి సంబంధిత OMRని పొందారని నిర్ధారించుకోండి.*
*4. విద్యార్థులు, OMR షీటులను జాగ్రత్తగా నలపకుండా ఉంచేలా నిర్ధారించుకోండి.*
*5. విద్యార్థులు ప్రశ్న పత్రాలపై సమాధానాలను టిక్ చేసి, వాటిని సమాధాన పత్రాలపై సరిగ్గా బబుల్ చేస్తున్నారో లేదో నిర్ధారించుకోండి.*
*6. బ్లాక్ బోర్డపై, పరీక్ష పత్రాలపై సమాధానాలను గుర్తించే పద్ధతిని విద్యార్ధులకి చూపండి*
*7. OMRలలో బహుళైశ్చిక ప్రశ్నలకు మాత్రమే సమాధానాలను గుర్తించాలని విద్యార్థులకు సూచించండి.*
*8. ప్రతి బహుళైశ్చిక ప్రశ్నకు 4 ఎంపికలు ఉంటాయని, వాటిలో ఒక ఎంపిక మాత్రమే సరైనదని విద్యార్థులకు సూచించండి*
*9. బ్లాక్ బోర్డపై OMRని బబ్లింగ్ చేసే పద్ధతిని విద్యార్థులకి చూపండి. బబ్లింగ్ సరిగ్గా ఎలా చేయాలో విద్యార్ధులు అ చేసుకోవడం చాలా అవసరం. విద్యార్థులు సమాధానాలను సరిగ్గా బబ్లింగ్ చేస్తున్నారో లేదో తనిఖీ చేయండి.*
*10. ఎంపికలు లేని ప్రశ్నలకి, విద్యార్థులకి అందజేసిన సమాధాన పత్రాలలో సమాధానాలను వ్రాయమని విద్యార్థులకు సూచించండి.*
*11. పరీక్ష పత్రాలను విద్యార్థులకు అందజేసిన తర్వాత, విద్యార్థులు పరీక్షను ప్రారంభించే ముందు, ఒకసారి పరీక్ష పత్రాన్ని నిశ్శబ్దంగా చదవమని వారికి తెలుపండి.*
*12. సంబంధిత సబ్జెక్టు కింద సమాధానాలను గుర్తించాలని విద్యార్థులకు సూచించండి. ఉదాహరణకు: ఇంగ్లీషు సబ్జెక్టు యొక్క సమాధానాలను ఇంగ్లీష్ కాలమ్ క్రింద గుర్తించాలి.*
*13. 4 మరియు 5వ తరగతి విద్యార్థులకు, తెలుగు మరియు ఇంగ్లిష్ సబ్జెక్టులలోని ఉన్న పాసేజ్ లను మాత్రమే గట్టిగా చదివి వినిపించాలి. విద్యార్థులందరికీ అర్థమయ్యేలా పాసేజ్ని గట్టిగా మరియు నిధానంగా చదవాలి. అవసరమైతే ఆ భాగాన్ని మరలా ఇంకోసారి చదవి వినిపించండి.*
*14. పరీక్ష పూర్తయిన తరువాత ప్రశ్నాపత్రాలు, OMR షీట్లను తిరిగి తీసుకోండి. OMR షీట్లను ప్రతి పరీక్ష ముందు అందచేయవలసి ఉంటుంది.*