Today education/teachers top news 02/11/2022
డిఎస్సి’ ఆశలు గల్లంతేనా..!
*♦️ప్రతి జనవరిలో ఉపాధ్యాయ నియామకాలు చేపడతామని వైసిపి హామీ*
*♦️మూడేళ్లు గడిచినా ఒక్క డిఎస్సి కూడా నిర్వహించని వైనం*
*♦️40 వేల మంది బిఇడి, డిఎడ్ అభ్యర్థుల ఎదురుచూపు*
*♦️తరగతుల విలీనం, రేషనలైజేషన్ పేరుతో కుప్పిగంతులు*
*🌻ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి*
ఉపాధ్యాయ ఉద్యోగం సాధించి తమ భవిష్యత్తుకు బంగారుబాటలు వేసుకుందామని భావించిన బిఇడి, డిఎడ్ అభ్యర్థుల ఆశలు ఆవిరైపోతున్నాయి. తాము అధికారంలోకొచ్చాక ప్రతియేటా జనవరిలో డిఎస్‌సి (ఉపాధ్యాయ నియామక పరీక్ష) నిర్వహిస్తామని వైసిపి ఇచ్చిన హామీతో అంతా ఆనందోత్సాహాల్లో మునిగితేలారు. వైసిపి వస్తే తమకు ఉద్యోగం వస్తుందనే ఆశతో ఓట్లు వేసి గెలిపించారు. అధికారంలోకొచ్చి మూడేళ్లు గడిచినా ఒక్క డిఎస్సి కూడా నిర్వహించకుండా నిరుద్యోగుల ఆశలకు వైసిపి సర్కార్ తూట్లు పొడిచింది. ఇటీవల నిర్వహించిన టెట్ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా ఆరులక్షల మంది బిఇడి, డిఎడ్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, ఐదు లక్షల మంది వరకూ టెట్ పరీక్ష రాసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం చూస్తే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బిఇడి, డిఎడ్ చదువుకున్న అభ్యర్థులు దాదాపు 40 వేల మంది వరకూ ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ఏళ్లతరబడి కళ్లుకాయుల కాసేలా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం డిఎస్‌సి ఎప్పుడు నిర్వహిస్తుందా అంటూ కోచింగ్ సెంటర్ల చేరి సిద్ధమయ్యారు. 2018లో టిడిపి ప్రభుత్వం అతితక్కువ పోస్టులతో డిఎస్‌సి నిర్వహించింది. ఆ తర్వాత ఇప్పటి వరకూ డిఎస్‌సి నిర్వహణ అనేది లేకుండాపోయింది. ఈ కాలంలో ఎంతోమంది ఉపాధ్యాయులు ఉద్యోగవిరమణ పొందారు. పెద్దఎత్తున ఖాళీలు ఏర్పడ్డాయి. వాటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం డిఎస్‌సి నిర్వహించలేదు. ప్రభుత్వం నిర్వహించే డిఎస్‌సి కోసం నాలుగేళ్లుగా నిరుద్యోగులంతా ఎదురుచూస్తూనే ఉన్నారు.
*♦️రేషనలైజేషన్ ముసుగులో వెన్నుపోటు*
విద్యావ్యవస్థలో కేంద్రం తీసుకొచ్చిన సంస్కరణలను వైసిపి ప్రభుత్వం వేగంగా అమలు చేస్తోంది. అందులో భాగంగా మూడు, నాలుగు తరగతులను దగ్గర్లోని హైస్కూళ్లలో విలీనం చేసింది. విలీనంపై విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాలు, ప్రజాసంఘాలు వ్యతిరేకించినా బలవంతంగా ముందుకు నడిచింది. విలీనానికి ముందు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రెండు వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ పోస్టులన్నీ డిఎస్‌సి నిర్వహించి భర్తీ చేయాల్సి ఉంది. అలాకాకుండా తరగతుల విలీనం పేరుతో 117 జిఒ ఇచ్చి రేషనలైజేషన్ ప్రక్రియకు తెరలేపింది. దీంతో ఉపాధ్యాయ పోస్టులను కుదించి, ఖాళీలు లేవన్నట్లు ప్రభుత్వం చూపిస్తోంది. తరగతుల విలీనం ముసుగులో ఉపాధ్యాయ నియామకాలు నిర్వహించకుండా చేతులెత్తేసింది. దీంతో బిఇడి, డిఎడ్ అభ్యర్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రయివేటు స్కూళ్లలో చేరినా రూ.ఐదు నుంచి రూ.పది వేలలోపే జీతం ఇస్తున్నారు. ఈ జీతంతో కుటుంబాన్ని నెట్టుకురావడం ప్రస్తుత పరిస్థితుల్లో ఏమాత్రం సాధ్యంకాని పరిస్థితి. ప్రభుత్వ కొలువు సాధించాలని ఎదురుచూస్తున్న బిఇడి, డిఎడ్ అభ్యర్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఉపాధ్యాయ ఉద్యోగానికి వయస్సు గడువు 39 ఏళ్లు వరకూ ఉంది. గడిచిన నాలుగేళ్లుగా డిఎస్‌సి నిర్వహణ లేకపోవడంతో చాలామంది వయస్సు పైబడి అవకాశం కోల్పోతున్నారు. ఎన్నికల్లో వైసిపి ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకోవాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. తమ భవిష్యత్తును బుగ్గిపాలు చేయవద్దని కోరుతున్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
విద్యపైనా విషమా?
*♦️కొన్ని మీడియా సంస్థలు రాజకీయ నేతల పాత్ర పోషిస్తున్నాయి: మంత్రి బొత్స*
*♦️విద్య వ్యాపారమైతే భవిష్యత్తే లేదు*
*♦️పేదింట్లో ప్రతి బిడ్డా ఉన్నత చదువు చదవాలన్నదే సీఎం తపన*
*♦️3, 4, 5 తరగతులు మాత్రమే సమీప హైస్కూళ్లతో అనుసంధానం*
*♦️సర్కారు చర్యలతో ప్రభుత్వ పాఠశాలల్లో 37 లక్షల నుంచి 40 లక్షలకు పెరిగిన చేరికలు*
*🌻సాక్షి, అమరావతి*: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేదింటి బిడ్డల ఉజ్వల భవిష్యత్తు కోసం తపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ అనుకూల మీడియా దుష్ప్రచారం చేస్తోందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కొన్ని మీడియా సంస్థలు రాజకీయ నేతల పాత్ర పోషిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పాఠశాలలపై విషం చిమ్ముతూ తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేసేలా వ్యవహరించడం సరికాదన్నారు. విద్యా సంస్కరణలతో విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లకు తరలిపోతున్నట్లు ఓ పత్రికలో వచ్చిన కథనంపై మంత్రి బొత్స స్పందించారు.
వాస్తవానికి టీడీపీ అధికారంలో ఉండగా 2,900 ప్రభుత్వ స్కూళ్లను మూసివేస్తే తాము వచ్చాక అన్నింటినీ పునరుద్ధరించినట్లు గుర్తు చేశారు. విద్య ద్వారానే పేదరిక నిర్మూలన సాధ్యమని బలంగా విశ్వసిస్తూ సీఎం జగన్ ప్రైవేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు కల్పించారని గుర్తు చేశారు. విద్యారంగం వ్యాపారం అయితే భవిష్యత్ ఉండదని, అందుకే 95 శాతం మంది పేదింటి బిడ్డలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలను నాడు – నేడు ద్వారా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామన్నారు. తన నియోజకవర్గంలో ఎన్ని స్కూళ్లు మూతబడ్డాయో టీడీపీ నేత యనమల రామకృష్ణుడు చెప్పాలని సవాల్ విసిరారు.
*♦️రాష్ట్రంలో మూడేళ్ల క్రితమే శ్రీకారం*
దివంగత వైఎస్సార్ ఆశయాల నుంచి ఆవిర్భవించిన వైఎస్సార్ సీపీకి విద్య, వైద్యం, వ్యవసాయం తొలి ప్రాధాన్య అంశాలని మంత్రి బొత్స తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జాతీయ నూతన విద్యా విధానాన్ని అనుసరించి విద్యా సంస్కరణలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. సీఎం జగన్ 2019లోనే ఐఐఎస్ ప్రొఫెసర్ ఎన్.బాలకృష్ణన్ అధ్యక్షతన విద్యా సంస్కరణల కమిటీని నియమించారని గుర్తు చేశారు.
ఉపాధ్యాయులు ఒకేసారి వివిధ స్థాయిల్లో బోధన చేయడం వల్ల ఒత్తిడి పెరిగి అనుకున్న ఫలితాలు రావడం లేదని, ప్రభుత్వ విద్య చిన్నాభిన్నమైందని గుర్తించిందన్నారు. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను మాత్రమే అత్యంత సమీపంలో ఉన్న హైస్కూల్ తరగతులతో విలీనం చేశామని, మిగిలిన తరగతులతో ప్రాథమిక పాఠశాలలు ఎప్పటిలాగే కొనసాగుతాయన్నారు.
*♦️కళ్లున్న కబోదులు..*
తాము అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రంలో 44,570 ప్రభుత్వ పాఠశాలలు, 16 వేల ప్రైవేట్ స్కూళ్లున్నాయని బొత్స తెలిపారు. అయితే 55 శాతానికి పైగా విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లలో చదువుతుండగా ప్రభుత్వ పాఠశాలల్లో 45 శాతం కంటే తక్కువగా ఉన్నారని చెప్పారు. టీడీపీ 2014లో అధికారంలోకి వచ్చేనాటికి 40 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతుండగా 2018 నాటికి 37 లక్షలకు తగ్గిపోయిందని వెల్లడించారు.
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా రంగ కార్యక్రమాలు, కార్పొరేట్ స్థాయి వసతుల కల్పనతో ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య 41 లక్షలకు పెరిగిందని వివరించారు. నాడు – నేడు ద్వారా రూ.16 వేల కోట్లతో ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దడంతో వచ్చిన మార్పులు కళ్లెదుట స్పష్టంగా కనిపిస్తున్నా విపక్షాలు కబోదుల్లా దిగజారి మాట్లాడటాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు చెప్పారు. తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే స్కూళ్ల మ్యాపింగ్ చేపట్టి 250 మీటర్ల దూరంలో ఉన్న వాటిని విలీనం చేసినట్లు తెలిపారు.
*♦️సబ్జెక్టు టీచర్లతో బోధన*
జాతీయ నూతన విద్యా విధానాన్ని అనుసరిస్తూ ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ (ఈసీసీఈ), ఫౌండేషన్ లిటరసీ, నర్సరీ విధానాన్ని అమలు చేస్తున్నట్లు పాఠశాల విద్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 5+3+3+4 బోధనా విధానాన్ని సూచించిందన్నారు. మూడు నుంచి ఆరేళ్ల పిల్లలకు ప్రీ-స్కూల్/అంగన్‌వాడీ/బాలవాటిక, 6 – 8 ఏళ్ల పిల్లలకు ఒకటి, రెండో తరగతి విద్యను సూచించిందన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు ఇదే విధానాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు.
ఐదో తరగతి లోపు పిల్లలకు కూడా సబ్జెక్టు నిపుణులైన బీఈడీ ఉపాధ్యాయులతో బోధన నిర్వహించడం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. ఈమేరకు చర్యలు తీసుకున్నామని, నిపుణులు లేనిచోట ఎస్‌జీటీల్లో అర్హులను అందుకు నియమిస్తామన్నారు. 2021-22లో పక్కపక్కనే ఉన్న 2,943 ప్రాథమిక పాఠశాలల తరగతులను 2,808 ఉన్నత పాఠశాల తరగతులతో అనుసంధానం చేశామన్నారు. తరగతి గదులు, మౌలిక సదుపాయాలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత 4,943 స్కూళ్లల్లో 3, 4, 5 తరగతులను సమీపంలోని ప్రీ హైస్కూల్, హైస్కూళ్లకు అనుసంధానించామన్నారు.
మిగిలిన తరగతులతో ప్రాథమిక పాఠశాలలు యథావిథిగా కొనసాగుతాయని, ఏ ఒక్క స్కూలూ మూతపడలేదని వివరించారు. నిబంధనల ప్రకారం మ్యాపింగ్ చేసిన ఉన్నత పాఠశాలల్లో 3 నుంచి 10 తరగతుల బోధనకు 44,010 మంది సబ్జెక్టు నిపుణులు అవసరం కాగా ప్రస్తుతం 37,113 మంది అందుబాటులో ఉన్నారన్నారు. 5,713 సబ్జెక్టు ఉపాధ్యాయులను మాత్రమే మండలాల నుంచి సర్దుబాటు చేయనున్నట్లు తెలిపారు. త్వరలోనే అర్హత కలిగిన 4,067 మంది ఎస్‌జీటీలకు పదోన్నతులు కల్పించనున్నట్లు చెప్పారు. అవసరానికి అనుగుణంగా నాడు-నేడు రెండో దశ కింద ై35,025 తరగతి గదులను సైతం నిర్మిస్తున్నట్లు తెలిపారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
గురుకులాల్లో గెస్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి
*♦️మంత్రి చెల్లుబోయిన వేణుకు పీడీఎఫ్ ఎమ్మెల్సీల వినతి*
*🌻సాక్షి, అమరావతి*: మహాత్మ జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాలల్లో పనిచేసే క్వాలిఫైడ్ ఫుల్ టైమ్ గెస్ట్ టీచర్లను కాంట్రాక్టు టీచర్లుగా మార్పు చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృ ష్ణకు పీడీఎఫ్ ఎమ్మెల్సీలు విజ్ఞప్తి చేశారు. ఎమ్మె ల్సీలు కేఎస్ లక్ష్మణరావు, సాబ్ది, వి.బాలసుబ్ర మణ్యం నేతృత్వంలో పుల్టైమ్ గెస్ట్ టీచర్స్ అసోసియేషన్ నేతలు దాసు, ఆదర్శ ఆధ్వ ర్యంలో మంగళవారం మంత్రిని కలిసి వినతిప త్రం అందజేశారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
‘జగనన్నకు చెబుదాం’ పై…విధివిధానాల తయారీకి ఉన్నతస్థాయి కమిటీ
*🌻ఈనాడు, అమరావతి*: రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించే ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం విధివిధానాల రూపకల్పనకు ఉన్నతాధికారులతో కూడిన కార్యనిర్వాహక కమిటీని ప్రభుత్వం మంగళవారం నియమిం చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) నేతృత్వంలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 12 మంది ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ నెల 15లోగా విధి విధానాలు ఖరారు చేయాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. ప్రజలు తమ సమస్యలను ముఖ్యమంత్రికి ఫోన్ లో నేరుగా చెప్పేలా ఉన్నతస్థాయి కమిటీ ప్రణాళిక సిద్ధం చేయ నుంది. జగనన్నకు చెబుదాం కార్యక్రమ పర్యవేక్షక ఇన్ఛార్జిగా సీనియర్ ఐఏఎస్ అధికారి కాటంనేని భాస్కర్ వ్యవహరించనున్నారు. సభ్య కన్వీ నర్గా ప్రణాళిక సంఘం కార్యదర్శి ఉంటారు. రెవెన్యూ, గ్రామ, వార్డు సచివాలయాలు, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, వైద్య ఆరోగ్యం, హోం, పాఠశాల విద్యశాఖతోపాటు సీఎంవోలోని మరో ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఏర్పాటైన కార్యనిర్వహక కమిటీ బుధ వారం సమావేశం కానుంది. డిసెంబరు 21న జగనన్నకు చెబుదాం కార్య క్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
◾◾◾◾◾◾◾◾◾◾◾
అంగన్వాడీలకు తాత్కాలిక సూపర్వైజర్ల నియామకానికి ప్రభుత్వ చర్యలు
*🌻ఈనాడు డిజిటల్, అమరావతి:* అంగన్వాడీ కేంద్రాల్లోని గ్రేడ్-2, గ్రేడ్ 1 సూపర్వైజర్ల ఖాళీలను తాత్కాలిక విధానంలో అంగన్వాడీ కార్యకర్తల ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రేడ్-2 సూపర్వైజర్ల నియామకానికి సంబంధించి ప్రభుత్వం నిర్వహించిన భర్తీ విధానంలో అక్ర మాలు చోటుచేసుకున్నాయంటూ అంగన్వాడీ కార్యకర్తలు కోర్టును ఆశ్ర యించడంతో నియామకంపై న్యాయస్థానం స్టే విధించింది. తాజాగా ఆ 619 గ్రేడ్-2 పోస్టులతోపాటు 66 గ్రేడ్-1 సూపర్ వైజర్ల పోస్టులను తాత్కా లిక విధానంలో భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
10లోగా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలి
*🌻అమరావతి, నవంబరు 1(ఆంధ్రజ్యోతి)*: రెండు, మూడు సెమిస్టర్ల పుస్తకాలను 10లోగా అన్ని పాఠశాలలకు పంపిణీ చేయాలని పాఠశాల విద్య కమిషనర్ సురేష్ కుమార్ ఎంఈవోలకు ఆదేశాలు జారీచేశారు. సెమిస్టర్ 1 పుస్తకాల పంపిణీలో కొన్ని లోటుపాట్లు ఏర్పడ్డాయని, ఈసారి అలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి విద్యార్థికీ అన్ని పుస్తకాలు అందాలని, ఏ ఒక్కటీ తగ్గకూడదని స్పష్టంచేశారు. పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్య వహించిన అధికారులు, ప్రధానోపాధ్యాయులపై క్రమశి క్షణ చర్యలుంటాయని హెచ్చరించారు.
◾◾◾◾◾◾◾◾◾◾◾
‘అగ్రి’ మేనేజ్మెంట్ కోటా సీట్ల తగ్గింపు
🌻రాష్ట్రంలోని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ వ్యవసాయ, ఉద్యాన కళాశాలల్లో బీ క్యాటగిరిలోని మేనేజ్మెంట్ కోటా సీట్ల శాతాన్ని తగ్గిస్తూ ప్రభుత్వం మంగ ళవారం గెజిట్ జారీ చేసింది. 2021-22 నుంచి 30శాతాన్ని తగ్గించింది. ఇదే శాతం ఇతర వృత్తి విద్యా కోర్సులకూ వర్తిస్తుందని పేర్కొంది.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
అంగన్వాడీల్లో సూపర్వైజర్ల భర్తీ
*♦️తాత్కాలిక నియామకాలు షురూ.. సీనియర్ అంగన్వాడీలకు చాన్స్*
*♦️అదనంగా 5 వేల అలవెన్సు.. రెగ్యులర్ నియామకాలపై కోర్టులో కేసు*
*🌻అమరావతి, నవంబరు 1(ఆంధ్రజ్యోతి):* రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల్లో గ్రేడ్-1, గ్రేడ్-2, కాంట్రాక్టు సూపర్వైజర్ పోస్టులను తాత్కాలిక విధానంలో ప్రభుత్వం భర్తీ చేయనుంది. దీనికిగాను అర్హత ఉన్న అంగన్వాడీ సీనియర్ కార్యకర్తలను తాత్కాలిక సూపర్ వైజర్లుగా ఆ పోస్టుల్లో నియమించాలని నిర్ణ యించింది. ఇలా నియమితులైన సూపర్వైజర్లకు వారికి ప్రస్తుతం ఇస్తున్న గౌరవ వేతనంతోపాటు నెలకు మరో రూ.5 వేలు అలవెన్సుగా ఇవ్వనున్నారు. ఈ మేరకు మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర మంగళవారం మెమో జారీ చేశారు. రాష్ట్రంలో 619 గ్రేడ్-2 అంగన్వాడీ సూపర్ వైజర్లు, 66 గ్రేడ్-1 సూపర్వైజర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు మెమోలో పేర్కొ న్నారు. ఈ నియామకాల కోసం అర్హులైన సీనియర్ అంగన్వాడీ కార్యకర్తలను సీడీపీవోలే గుర్తించాలని పేర్కొన్నారు. సీనియారిటీ, విద్యార్హత, వయసు వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని మెమోలో స్పష్టం చేశారు. విలీ నమైన అంగన్వాడీల్లో సీనియర్ కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించాలని ఆదే శించారు. రెగ్యులర్ విధానంలో పోస్టులు భర్తీ అయ్యే వరకు ఈ తాత్కాలిక విధానం కొనసాగుతుందని తెలిపారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
ప్రవేశాలు రద్దు చేసుకున్న వారికిపూర్తి ఫీజు చెల్లించాలి
*♦️ఉన్నత విద్యా సంస్థలకు యూజీసీ సూచన*
*🌻ఈనాడు, దిల్లీ:* ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవే శాలు పొంది అక్టోబరు 31లోపు రద్దు చేసుకున్న వారికి, ఇతర ప్రాంతానికి మారిపోయిన వారికి విద్యా సంస్థలు ఫీజును పూర్తిగా తిరిగి చెల్లించా లని విశ్వవిద్యాలయ నిధుల సంఘం (యూజీసీ) పేర్కొంది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీయూ ఈటీ, జేఈఈ మెయిన్, అడ్వాన్సుడ్ లాంటి పరీక్షల నిర్వహణలో జాప్యం జరిగినందున ఈ ఏడాది అక్టోబరు వరకు వివిధ విద్యాసంస్థల్లో ప్రవేశాలు కొనసాగినట్లు గుర్తుచే సింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రుల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి అక్టోబరు 31 వరకు ప్రవేశాలను రద్దు చేసుకున్న విద్యార్థులంద రికీ ఉన్నత విద్యాసంస్థలు అన్ని ఛార్జీలతో కలుపు కొని పూర్తి ఫీజును తిరిగి చెల్లించాలని ఆదేశిం చింది. సీటు రద్దు చేసుకున్నందుకు పైసా కూడా మినహాయించుకోవడానికి వీల్లేదని స్పష్టంచేసింది.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
వార్తలు రాసేవారి పిల్లలు ఎక్కడ చదువుతున్నారు.:పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్
*🌻ఈనాడు అమరావతి:*’వార్తలు రాసే పాత్రికేయుల పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? వారు ఆంగ్ల మాధ్యమంలో చదవాలి. వారి మొదటి విమానం సిలికాన్ వ్యాలీ వెళ్లాలి. వార్తలు రాసే వ్యక్తి మా ముందు నిలబడి మాట్లాడితే బాగుంటుంది’ అంటూ పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పాత్రికేయులపై విరు చుకుపడ్డారు. రాష్ట్రంలో 96 % మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్య మాన్ని కోరుకుంటున్నారని, ఆంగ్ల మాధ్యమం కోసం 10 కిలోమీటర్ల దూరం లోని ప్రైవేటు పాఠశాలలకు వెళ్తున్నారని గుర్తు చేశారు. 3-10 తరగతి వరకు సబ్జెక్టు ఉపాధ్యాయుడితో బోధన చేయిస్తున్నామని చెప్పిన ఆయన… 98 మంది కంటే తక్కువ విద్యార్థులున్న ప్రీహైస్కూల్ లో ఎస్జీటీలతో ఎలా బోధన చేయిస్తారనే దానికి సమాధానం చెప్పలేదు. విజయవాడ సమీపం లోని పెనమలూరు ప్రభుత్వ పాఠశాలకు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు మధ్య తేడా ఏం లేదని వెల్లడించారు. పాఠశాల ఇంటి పక్కన ఉందో లేదో చూడకూడ దని, ఉత్తమ పాఠశాలగా ఉందో లేదో చూడాలని సూచించారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
యాప్లో విద్యార్థుల హాజరు తప్పనిసరి
*🌻విజయవాడ సిటీ, న్యూస్ టుడే:* జిల్లాలోని అన్ని పాఠశా లల్లో విద్యార్థుల హాజరు యాప్ ద్వారా ఆఫ్లైన్లో తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా విద్యా శాఖాధికారిణి సి.వి. రేణుక ఆదే శించారు. ప్రభుత్వ యాజమా న్యంలోని 5 పాఠశాలలు, గుంటు పల్లిలోని కేంద్రీయ విద్యాలయం, 33 ప్రైవేటు పాఠశాలలకు సంబంధించి విద్యార్థుల హాజరు ఇంత వరకూ యాప్ నుంచి చేయడం లేదని పేర్కొన్నారు. ఆయా ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసు జారీ చేస్తామని తెలిపారు. నిబంధనలు అతిక్ర మించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, పాఠశాలలు గుర్తింపు రద్దు చేస్తా మని హెచ్చరించారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
బధిరుల పాఠశాలలో ప్రవేశానికి 15లోపు దరఖాస్తులు
*🌻ఒంగోలు(విద్య), నవబరు 1:* ఒంగోలులోని ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాల లో 1నుంచి 10 వతరగతి వరకు ప్రవేశాలకు అర్హులైన వారు ఈనెల 15వ తేదీలో పు దరఖాస్తులు చేసుకోవాలని పాఠశాల ప్రిన్సిపాల్ టి. వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. ప్రతి తరగతిలో 20 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు. అర్హులైన మూగ, చెవిటి విద్యార్థులు ప్రవేశానికి దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. పాఠశా లలో ఆధునిక వసతులతో పాటు విద్యాబోధన చేసేందుకు అన్ని వసతులు ఉన్నా యన్నారు. డిజిటల్ తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, బాలబాలికలకు వేర్వేరు హాస్టల్ వసతి ఉందన్నారు. పాఠశాలలో ప్రవేశానికి కనీస వయస్సు 6నుంచి 8 సం వత్సరాలు, బదిలీ సర్టిఫికెట్పై ఏ తరగతిలోనైనా ప్రవేశం కల్పిస్తామన్నారు. ఈ అ వకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
2, 3 సెమిస్టర్ల పాఠ్యపుస్తకాలు సిద్ధం
*♦️10వ తేదీలోపుపంపిణీ పూర్తి చేయాలి*
*♦️పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు*
*🌻సాక్షి, అమరావతి*: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అవసరమైన 2, 3 సెమిస్టర్ల పాఠ్య పుస్తకాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని పాఠ శాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్కుమార్ తెలిపారు. జగనన్న విద్యా కానుక కింద అందిస్తున్న ఈ పుస్తకాల పంపిణీకి సంబంధిం చిన షెడ్యూల్, మార్గదర్శకాలతో ఆయన మంగళ వారం సర్క్యులర్ విడుదల చేశారు. 2022- 23 విద్యా సంవత్సరానికి జగనన్న విద్యా కానుక -3 కింద సెమిస్టర్-2, 3కు సంబంధించిన పాఠ్య పుస్తకాలు అక్టోబర్ 15 నుంచి 31 వరకు పూర్వపు 13 జిల్లాల గోడౌన్లకు సరఫరా చేసినట్లు తెలిపారు. జిల్లా బుక్ డిపో మేనేజర్లు మండల పాయింట్లకు వీటిని పంపిణీ చేసేందుకు వీలుగా షెడ్యూల్ను కూడా సిద్ధం చేస్తున్నారు.
*♦️విద్యార్థులకు ప్రతి పుస్తకం చేరేలా….*
సెమిస్టర్-1 పాఠ్యపుస్తకాల సరఫరాలో కొన్ని లోపాలు తలెత్తాయి. ఇప్పుడు అటువంటి సమ స్యలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లాల అధికారులకు కమిషనర్ సూచించారు. అన్ని జిల్లాల బుక్ డిపోల మేనేజర్లు సెమిస్టర్-2, 3 పాఠ్యపుస్తకాల అన్ని టైటిళ్లను ఒకే షెడ్యూల్లో అందించాలి. అన్ని మండలాల విద్యాశాఖాధి కారులు సెమిస్టర్-2, 3ల అన్ని పాఠ్యపుస్తకాలను తమ పరిధిలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయు లకు సరఫరా చేయాలి. ప్రతి టైటిల్ బుక్ ప్రతి విద్యార్థికి చేరేలా చూసుకోవాలి. ప్రధానోపాధ్యా యులు అందరూ తమ స్కూలులో ప్రస్తుత నమోదు ప్రకారం మండల పాయింట్ల నుంచి అన్ని పాఠ్యపుస్తకాల శీర్షికలను తీసుకోవాలి. ఏ పాఠశాలలో అయినా ఆంగ్ల మాధ్యమంలో నమోదు పెరిగి, తెలుగు మాధ్యమంలో తగ్గితే మండల విద్యాధికారి ద్విభాషా పాఠ్యపుస్తకాలను ఆంగ్ల మాధ్యమం విద్యార్థుల కోసం సరఫరా చేయాలి. ఇంకా, మండలాల్లో చేరికలు పెరిగి ఏదై నా కొరత ఏర్పడితే మండల విద్యాధికారి సంబంధిత పత్రాలతో జిల్లా విద్యాధికారికి, జిల్లా బుక్ డిపో మేనేజర్కు తెలియజేసి అవసరమైన శీర్షికలను పొందాలి. ఉర్దూ, తమిళం, కన్నడ, ఒడియా మాధ్యమాల పాఠ్యపుస్తకాలు, సంస్కృతం పాఠ్యపుస్తకాలు కూడా ప్రింట్ అయి జిల్లా పాఠ్యపుస్తకాల మేనేజర్లకు సరఫరా అయ్యాయి. జిల్లా విద్యాధికారి, జిల్లా బుక్ డిపో మేనేజర్ ఈ పుస్తకాలను అవసరమైన పాఠశాల లకు సరఫరా చేయాలి. సెమిస్టర్-2, 3ల పాఠ్యం పుస్తకాలు మొత్తం నవంబర్ 10వ తేదీలోపు పంపిణీ చేయాలి. ప్రాంతీయ జాయింట్ డైరె క్టర్లు, జిల్లా విద్యాధికారులు, జిల్లా బుక్ డిపో మేనే జర్లు పాఠ్యపుస్తకాల పంపిణీని పర్యవేక్షించాలి. ఏదైనా మండల విద్యాధికారి. ప్రధానోపాధ్యా యుడు నిర్లక్ష్యంగా ఉన్నట్లు గుర్తిస్తే విద్యాశాఖ కఠినచర్యలు తీసుకుంటుందని కమిషనర్ స్పష్టం చేశారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
సీపీఎస్ ఉద్యోగులపై కేసుల ఉపసంహరణ
*🌻ఈనాడు, అమరావతి:* అరెస్టు వారెంట్ జారీ అయిన ఏపీ సీపీఎస్ ఉద్యోగులపై ఉన్న కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకుందని ఏపీ సీపీ ఎస్ ఉద్యోగుల సంఘం (ఏపీసీపీఎస్ యూస్) అధ్యక్షుడు దాస్ తెలిపారు. సీపీఎస్ ను రద్దు చేసి, పాత పింఛనును అమలు చేయాలని ఏపీసీపీఎస్ యూఎస్ ఆధ్వర్యంలో విజయవాడలోని ధర్నా చౌక్ లో 2018 అక్టోబరు 2న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. దీన్ని భగ్నం చేసిన పోలీసులు 26 మందిపై సత్యనారాయణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారించిన కోర్టు 19 మందిపై కేసులను కొట్టివేయగా… మిగిలిన ఏడు గురిలో ఒకరు చనిపోగా ఆరుగురు మిగిలారు. ఈ కేసులో అరెస్టు వారెం ట్లు జారీ కాగా… ప్రభుత్వం ఇప్పుడు కేసులు వెనక్కి తీసుకుందని తెలి పారు. వీటితోపాటు ఈ ఏడాది సెప్టెంబరు 1న సీపీఎస్ ఉద్యోగులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️సీపీఎస్ ఉద్యోగుల సంఘంనేతలపై కేసుల ఉపసంహరణ✍️📚*
*♦️ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మరియదాసు*
*🌻సాక్షి, అమరావతి*: సీపీఎస్ ను రద్దు చేయాలని 2018 అక్టోబర్లో నిర్వహించిన ఆందోళనల సమయంలో తమ సంఘం నేతలపై పెట్టిన కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకు న్నట్లు ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మరియదాసు తెలిపారు. తమ సంఘం ఆధ్వర్యంలో 2018, అక్టోబర్ 2న విజయవాడ ధర్నా చౌక్ వద్ద చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను అప్పటి ప్రభుత్వం భగ్నం చేసి 26 మందిపై కేసులు పెట్టిందని తెలిపారు. కేసును విచారించిన కోర్టు 19 మందిపై కేసులు కొట్టివేసిందన్నారు. మిగి లిన ఏడుగురిలో గురుగుబెల్లి సరస్వతి రావు (76) గత సంవత్సరం మృతి చెందారని, ఇంకా ఆరుగురిపై కేసులు ఉన్నట్లు పేర్కొ న్నారు. ఆ కేసులో తనతోపాటు మిగిలిన నేత లపై గత నెల 27వ తేదీన అరెస్టు వారెంట్ జారీ చేసిందని తెలిపారు. దీనిపై ప్రభుత్వం తక్షణం స్పందించి కోర్టు ఫార్మాట్లో కేసులను ఉపసంహరిస్తూ విజయవాడ ఒకటవ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ పిటిషన్ వేసిందని తెలిపారు. దీంతో కేసును కోర్టు డిస్పోజ్ చేసిందన్నారు. కేసు లను ఎత్తివేసినందుకు ప్రభుత్వానికి, మద్దతుగా నిలిచిన వివిధ సంఘం నాయకులకు మరియదాసు ధన్యవాదాలు తెలిపారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇