TS DSC 2023 RECRUITMENT POSTPONED

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

TS DSC 2023 RECRUITMENT POSTPONED NOTE: “In view of General Assembly Elections on 30th November 2023, it is decided to postpone the DSC (Teacher Recruitment) Examinations scheduled from 20th to 30th November, 2023. For further exam dates will be announced in due course : Director of school Education”

ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ) వాయిదా పడింది. ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. మొత్తం 5,089 ఉపాధ్యాయ కొలువులకు వచ్చే 20 నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌ పరీక్షలు జరగాల్సి ఉంది. అదే నెల 30న పోలింగ్‌ ఉండటంతో ఆన్‌లైన్‌ పరీక్షలైనందున సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ (ఎస్‌జీటీ) పరీక్షల్లో రెండు రోజులపాటు లేదా నవంబరు 25 నుంచి 30 వరకు జరిగే ఎస్‌జీటీ పరీక్షల వరకు వాయిదా వేస్తారని విద్యాశాఖ వర్గాలు ఇటీవల పేర్కొన్నాయి. తాజాగా కొందరు అభ్యర్థులు టీఆర్‌టీ మొత్తాన్ని వాయిదా వేయాలని, టీఎస్‌పీఎస్‌సీ సైతం గ్రూపు-2ను వాయిదా వేసిందని విన్నవించినా ఇవి ఆన్‌లైన్‌ పరీక్షలు అయినందున పూర్తిగా వాయిదా వేసేది లేదని పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు వారికి తేల్చిచెప్పారు. తాజాగా టీఆర్‌టీ మొత్తాన్ని వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన శుక్రవారం (అక్టోబర్‌ 13) సాయంత్రం వెల్లడించారు.

మళ్లీ ఎప్పుడు?

టీఆర్‌టీ ఆన్‌లైన్‌ పరీక్షల నిర్వహణ బాధ్యత టీసీఎస్‌ అయాన్‌ చేపట్టింది. టీసీఎస్‌ సంస్థ జాతీయ స్థాయి ప్రవేశ, ఉద్యోగ పరీక్షలు కూడా నిర్వహిస్తుంది. డిసెంబరు, జనవరిలో పలు జాతీయస్థాయి పరీక్షలు ఉన్నాయని ముందుగానే ఆ సంస్థ ప్రతినిధులు విద్యాశాఖకు చెప్పినట్లు సమాచారం. మళ్లీ ఫిబ్రవరిలోనే స్లాట్లు దొరుకుతాయని సెప్టెంబరులోనే ఆ సంస్థ స్పష్టం చేసినట్లు తెలిసింది. జనవరి 24వ తేదీ నుంచి జేఈఈ మెయిన్‌ పరీక్షలున్నాయి. అందువల్ల ఫిబ్రవరి మొదటి, రెండో వారాల్లో టీఆర్‌టీ జరగవచ్చని భావిస్తున్నారు. ఒకవేళ జేఈఈ మెయిన్‌ కంటే ముందుగా స్లాట్లు దొరికితే జనవరి రెండో వారం నుంచి జనవరి 24వ తేదీ లోపు జరపాలన్న యోచనలో కూడా విద్యాశాఖ ఉన్నట్లు తెలిసింది. విద్యాశాఖ మాత్రం పరీక్షల తేదీలను తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది. టీఆర్‌టీకి దరఖాస్తు గడువు అక్టోబర్‌ 21వ తేదీకి ముగియనుంది. ఇప్పటివరకు సుమారు 80 వేల దరఖాస్తులు అందాయి. పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో ఆ గడువును కూడా పొడిగించే అవకాశం ఉంది. 

Join Our WhatsApp Group

Join Our Groups

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!